
మెల్‌బోర్న్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియా ప్రత్యర్థి ఎవరో తేలింది. గ్రూప్ ఏలో టాపర్‌గా ఉన్న భారత్ గ్రూప్ బిలో రెండో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్‌తో సెమీస్‌లో తలపడనుంది. మరో సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మంగళవారం గ్రూప్ బిలో టాపర్‌ను డిసైడ్ చేసే వెస్టిండీస్-దక్షిణాఫ్రికా మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో గ్రూప్ బిలో అత్యధిక పాయింట్లతో దక్షిణాఫ్రికా జట్టు ప్రపంచకప్-2014 తర్వాత సెమీస్‌లో అడుగుపెట్టింది. రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు గురువారం జరగనున్నాయి.
ఇప్పటివరకు మహిళల టీ20 ప్రపంచకప్‌లో మూడు సార్లు సెమీస్ వెళ్లిన భారత జట్టు ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరుకోలేదు. అయితే ఈ సారి ఫైనల్‌కు వెళ్లడంతో పాటు కప్‌ను గెలుచుకోవాలని హర్మన్ సేన ఆరాటపడుతోంది. సీనియర్లు, జూనియర్లతో పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌గా ఉందని, ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా తొలిసారి ఫైనల్‌కు చేరుకుంటుందని ఆసీస్ దిగ్గజ బౌలర్ బ్రెట్ లీ జోస్యం చెప్పాడు.
చదవండి:
మైకేల్ క్లార్క్ సంచలన వ్యాఖ్యలు
కోహ్లికి సూచనలివ్వడానికి మీరెవరు?
Comments
Please login to add a commentAdd a comment