ICC Womens T20 World Cup 2020
-
110 కోట్ల మంది చూశారు
దుబాయ్: మహిళల క్రికెట్‌కు మరింత ఆదరణ పెరుగుతోందనడానికి తాజా నిదర్శనమిది. ఈ ఏడాది ఫిబ్రవరి–మార్చిలో ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన మహిళల టి20 ప్రపంచకప్‌ను వివిధ డిజిటల్ వీడియో స్ట్రీమింగ్ వేదికలపై చూసిన వీక్షకుల సంఖ్యను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. దీని ప్రకారం ఈ టోర్నీని మొత్తం 110 కోట్ల మంది వీక్షించారు. 2018 టి20 ప్రపంచకప్‌తో పోలిస్తే ఇది ఏకంగా 20 రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఇంకా చెప్పాలంటే 2017 మహిళల వన్డే వరల్డ్‌కప్‌తో పోలిస్తే ఈసారి వీడియో వ్యూస్ 10 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ రెండు సందర్భాల్లో భారత జట్టు ఫైనల్లో ఆడటం కూడా దీనికి ఒక కారణం. ఓవరాల్‌గా కూడా 2019 పురుషుల వరల్డ్‌కప్ తర్వాత ఎక్కువ వ్యూస్ వచ్చిన ఐసీసీ ఈవెంట్‌గా ఈ వరల్డ్ కప్ రెండో స్థానంలో నిలిచింది. నాకౌట్ మ్యాచ్‌లలో 2018తో పోలిస్తే ఏకంగా 423 శాతం వ్యూయర్షిప్ పెరగడం మరో ఘనత. -
రికార్డు స్థాయి క్రికెట్ మ్యాచ్‌కు కరోనా బాధితుడు
మెల్బోర్న్: ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించిన ఓ అభిమానికి కరోనా వైరస్ సోకింది. అతనికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలడంతో చికిత్స అందిస్తున్నారు.ఆ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో 86 వేల మందికి పైగా ప్రేక్షకులు హాజరైన నేపథ్యంలో ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్దారణ కావడం ఇప్పుడు ఆస్ట్రేలియాను వణికిస్తోంది. మార్చి 8వ తేదీన ఆస్ట్రేలియా-భారత్‌ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ఆసీస్ ఘన విజయం సాధించి ఐదోసారి కప్‌ను ఎగరేసుకుపోయింది.(మహిళల క్రికెట్లో ప్రపంచ రికార్డు!) కాగా, ఆ మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన వ్యక్తికి కరోనా సోకిందని ఆస్ట్రేలియాలోని ఆరోగ్య సేవల విభాగం స్పష్టం చేసింది. దాంతో అక్కడ ఆందోళన మరింత ఎక్కువైంది. కరోనా వైరస్ నిర్దారణ అయిన వ్యక్తి మ్యాచ్‌ను చూసే క్రమంలో నార్త్ స్టాండ్‌లోని లెవల్2లో ఎన్ 42 సీట్లో కూర్చున్నట్లు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ) నిర్వాహకులు గుర్తించారు. దాంతో ఆ పరిసర ప్రాంతాల్లో కూర్చొన్న మిగతా అభిమానులు జాగ్రతగా ఉండాలని సూచించారు. వారికి ఏదైనా అనారోగ్యం సోకితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. (షఫాలీని అలా చూడటం కష్టమైంది: బ్రెట్ లీ) -
షఫాలీని అలా చూడటం కష్టమైంది: బ్రెట్ లీ
మెల్బోర్న్: టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు చివరి మెట్టుపై బోల్తా పడింది. లీగ్ దశలో అప్రతిహతవిజయాలతో దూసుకపోయిన హర్మన్ సేన.. ఫైనల్ పోరులో మాత్రం పూర్తిగా తేలిపోయింది. లీగ్ దశలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత జట్టు.. టైటిల్ పోరులో అట్టర్ ఫ్లాఫ్ షోతో నిరుత్సాహపరిచింది. ముఖ్యంగా లీగ్ దశలో బ్యాటింగ్ భారాన్ని మోసిన యువ సంచలనం షఫాలీ వర్మ తుది పోరులో చేతులెత్తేసింది. ఈ క్రమంలో తను ఔటైన తర్వాత, ఓటమి తర్వాత షఫాలీ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే సారథి హర్మన్‌ప్రీత్ కౌర్, సహచర క్రికెటర్లు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ వెక్కివెక్కి ఏడ్వసాగింది. (మనకూ ఒక రోజు వస్తుంది: గంగూలీ) ఇది సహచర క్రీడాకారిణులతో పాటు ప్రపంచ క్రికెట్‌ను కూడా కదిలించింది. దీనిపై ఆసీస్ దిగ్గజ బౌలర్ బ్రెట్ లీ.. ఐసీసీకి రాసిన తన కాలమ్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ‘ షఫాలీ ఏడ్వడం నాకు బాధనిపించింది. మ్యాచ్ ముగిసిపోయాక ఆమె కన్నీట పర్యంతం కావడం నాకు చాలా కష్టంగా అనిపింది. కానీ గర్వించదగ్గ క్రికెటర్. ఆస్ట్రేలియాలో ఆమె ప్రదర్శన అద్భుతంగా సాగింది. తొలి టోర్నమెంట్ ఆడటానికి ఇక్కడకు వచ్చిన షఫాలీ తన టాలెంట్‌తో ఆకట్టుకున్నారు. మానసికంగా ఆమె చాలా ధృఢంగా అనిపించారు. ఇక్కడ నుంచి ఆమె మరింత పరిణితి సాధిస్తుందని అనుకుంటున్నా. ఈ టోర్నమెంట్లో సాధించిన అనుభవంతో ఆమె మరింత రాటుదేలడం ఖాయం. ఆస్ట్రేలియాలో ఆడే తదుపరి టోర్నీల్లో ఆమె చేసే భారీ స్కోర్లు ఎవ్వర్నీ ఆశ్చర్యపరచకపోవచ్చు. సానుకూల ధోరణితో ముందుకు సాగుతుందనే అనుకుంటున్నా. ఇది భారత్ మహిళలకు తీవ్ర నిరాశను మిగిల్చిన రాత్రి. కానీ వారు మరింత ఆశావాహ ధృక్పథంతో రాటుదేలతారు. దీంతో వారు క్రికెట్ ఏమీ ముగిసిపోలేదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అనుకోండి’ అని బ్రెట్ లీ రాసుకొచ్చాడు. (ఐసీసీ అత్యుత్తమ వరల్డ్‌కప్ జట్టు ఇదే..) -
ఐసీసీ అత్యుత్తమ వరల్డ్‌కప్ జట్టు ఇదే..
దుబాయ్: మహిళల టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీని ఆసీస్ కైవసం చేసుకోగా, భారత్ రన్నరప్‌గా నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆసీస్ మరోసారి కప్‌ను కైవసం చేసుకుని ఐదోసారి విజేతగా నిలిచింది. దీనిలో భాగంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)తమ అత్యుత్తమ వరల్డ్‌కప్ టోర్నమెంట్ జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 12 మంది వుమెన్ క్రికెటర్లను ఎంపిక చేసింది. ఈ జట్టుకు ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన ఐసీసీ.. భారత్ నుంచి ఇద్దరికి మాత్రమే చోటు కల్పించింది.(మనకూ ఒక రోజు వస్తుంది: గంగూలీ) ఇందులో స్పిన్నర్ పూనమ్ యాదవ్ కు ఐసీసీ ఎలెవన్ జాబితాలో చోటు దక్కగా, 12వ క్రీడాకారిణిగా షెఫాలీ వర్మను ఎంపిక చేసుకుంది. ప్రధానంగా వరల్డ్‌కప్ గెలిచిన ఆసీస్ జట్టు నుంచి ఐదుగురు క్రికెటర్లకు తమ జట్టులో చోటిచ్చిన ఐసీసీ.. ఇంగ్లండ్ నుంచి నలుగుర్నీ తీసుకుంది. దక్షిణాఫ్రికా జట్టు నుంచి ఒక క్రీడాకారిణికి మాత్రమే అవకాశం కల్పించింది. ఐసీసీ వరల్డ్‌కప్ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ ఇదే.. మెగ్ లానింగ్(కెప్టెన్)(ఆస్ట్రేలియా), అలెసా హీలీ(వికెట్ కీపర్)(ఆస్ట్రేలియా), బెత్ మూనీ(ఆస్ట్రేలియా), నాట్ స్కీవర్(ఇంగ్లండ్), హీథర్ నైట్(ఇంగ్లండ్), లౌరా వాల్వార్డ్(దక్షిణాఫ్రికా), జెస్ జొనాసేన్(ఆస్ట్రేలియా), సోఫీ ఎక్సలీస్టోన్(ఇంగ్లండ్), అన్యా ష్రబ్సోల్(ఇంగ్లండ్), మెగాన్ స్కట్(ఆస్ట్రేలియా), పూనమ్ యాదవ్(భారత్), షెఫాలీ వర్మ(భారత్, 12వ మహిళ) Introducing your Women's #T20WorldCup 2020 Team of the Tournament 🌟 pic.twitter.com/Eb4wQUc7Ls — T20 World Cup (@T20WorldCup) March 9, 2020 -
‘హర్మన్.. నీ కెప్టెన్సీని సమీక్షించుకో’
న్యూఢిల్లీ: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరినా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు. ఈ మెగా టోర్నీ అంతా కలిపి ఆమె 30 పరుగులు మాత్రమే చేశారు. లీగ్ దశలో 28 పరుగులు చేసిన హర్మన్.. ఆసీస్‌తో జరిగిన తుది పోరులో 2 పరుగులకే నిష్క్రమించారు. దాంతో పాటు మిగతా భారత బ్యాటర్స్ కూడా విఫలం కావడంతో ఘోర ఓటమి తప్పలేదు. అయితే భారత్ ఫైనల్‌కు చేరడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, టీమిండియా కెప్టెన్ కెప్టెన్ విరాట్ కోహ్లి తదితరులు ప్రశంసలు కురిపిస్తుంటే, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి మాత్రం విమర్శలు కురిపించారు. ప్రధానంగా హర్మన్ నాయకత్వాన్ని ఆమె వేలెత్తి చూపారు. ఇక హర్మన్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చేసిందని పరోక్షంగా హెచ్చరించారు. లీడర్‌గా కంటే బ్యాటర్‌గా నిరూపించుకోవడమే ఇప్పుడు హర్మన్‌కు చాలా అవసరమన్నారు. (మన వనిత... పరాజిత) ‘ ఇది నన్ను తీవ్రంగా నిరుత్సాహపరిచింది. ఎంతో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కల్గిన భారత జట్టు పేలవంగా టోర్నీ ముగించడం బాధించింది. స్మృతీ మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్లు విశేషమైన టాలెంట్ ఉన్న క్రీడాకారిణులు. వారు ఈ టోర్నీ మొత్తం విఫలమయ్యారు. ప్రధానంగా హర్మన్ ఫెయిల్యూర్ కావడమైతే నిలకడగా జరిగింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న వేదా కృష్ణమూర్తి కూడా రాణించలేదు. హర్మన్ తన కెప్టెన్సీపై సమీక్షించుకోవాలి. కెప్టెన్సీ ఎప్పుడు తప్పుకోవాలో ఆమెకు తెలుసు. హర్మన్ ఎంతో పరిణితి చెందిన క్రికెటర్. ఇప్పుడు హర్మన్ కెప్టెన్ కంటే కూడా బ్యాటింగ్‌లో నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది’ అని శాంతా రంగస్వామి పేర్కొన్నారు. ఇక భారత మాజీ వుమెన్స్ క్రికెటర్ డయానా ఎడ్జుల్లీ.. ఫైనల్లో భారత క్రీడాకారిణుల ప్రదర్శనపై విమర్శలు గుర్పించారు. ఎవరికి వారు ఆత్మపరిశోధన చేసుకోవాలంటూ సూచించారు. మరొకవైపు భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కోచ్ తుషాన్ ఆర్ధో కూడా విమర్శలు చేశారు. తానియా భాటియాను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై మండిపడ్డారు. (మనకూ ఒక రోజు వస్తుంది: గంగూలీ) -
మహిళల క్రికెట్లో ప్రపంచ రికార్డు!
మెల్బోర్న్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ను ఆసీస్ మరోసారి ముద్దాడింది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భాగంగా ఆదివారం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 85 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మెగా కప్‌ను ఐదోసారి అందుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ అలీసా హీలీ (75; 39 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసానికి తోడు.. మరో ఓపెనర్ బెత్ మూనీ (61 నాటౌట్; 43 బంతుల్లో 9ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించారు. దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 19.1 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటై పరాజయం చెందింది.(మనకూ ఒక రోజు వస్తుంది: గంగూలీ) కాగా, ఈ టీ20 కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఒక ప్రపంచ రికార్డు నమోదైంది. రికార్డు సంఖ్యలో 86,174 మంది ప్రేక్షకులు మ్యాచ్‌కు హాజరయ్యారు. దాంతో ఇది సరికొత్త రికార్డును నమోదు చేసింది. ప్రపంచ మహిళల క్రికెట్ చరిత్రలో రికార్డు వీక్షక్షులు హాజరైన మ్యాచ్‌గా నిలిచింది. ఇక ఆస్ట్రేలియాలో ఇప్పటివరకూ జరిగిన మహిళల స్పోర్ట్స్ ఈవెంట్ పరంగా చూసినా ఎక్కువ మంది హాజరైన మ్యాచ్ ఇదే. అంతర్జాతీయ మహిళల దినోత్సవం రోజున జరిగిన మ్యాచ్‌కు ఇంతటి విశేష ఆదరణ రావడం ఇక్కడ మరో విశేషం. ఓవరాల్‌గా చూస్తే మహిళల స్పోర్ట్స్ ఈవెంట్లో అత్యధిక మంది వీక్షకుల హాజరైన మ్యాచ్ 1999లో కాలిఫోర్నియాలో జరిగిన సాకర్ వరల్డ్‌కప్ ఫైనల్. 21 ఏళ్ల నాటి మహిళల సాకర్ ఫైనల్ మ్యాచ్‌కు 90, 185 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. (మన వనిత... పరాజిత) -
మనకూ ఒక రోజు వస్తుంది: గంగూలీ
న్యూఢిల్లీ: మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాలో చేతిలో ఓటమి పాలైనప్పటికీ భారత జట్టుకు విశేషమైన మద్దతు లభిస్తోంది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, మాజీ బ్యాట్స్‌మన్ గౌతం గంభీర్, సెహ్వాగ్‌లతో పాటు పలువురు క్రికెటర్లు అండగా నిలిచారు. ‘మహిళల క్రికెట్ జట్టుకు అభినందనలు. రెండు బ్యాక్ టు బ్యాక్ వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు వెళ్లాం( 2017లో వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌ను ఉద్దేశించి). కానీ వాటిని కోల్పోయాం. ఈ రెండు మెగా టోర్నీల్లో బాగా ఆకట్టుకున్నాం. మనకు ఏదొక రోజు వస్తుంది.. జట్టుకు, ప్లేయర్స్‌కు అండగా ఉందాం’ అని గంగూలీ ట్వీట్ చేశాడు. (మన వనిత... పరాజిత) ‘ప్రపంచకప్ మొత్తం మీరు పోరాడిన తీరు చూసి గర్వంగా ఉంది. మీరు పుంజుకుని మరింత బలంగా వస్తారన్న నమ్మకం నాకుంది’ అని కోహ్లి ట్వీట్ చేశాడు. ‘ కొన్ని సంవత్సరాల క్రితం మహిళల క్రికెట్ వైపు చూసే వారు ఉండేవారు కాదు. ఇప్పుడు లక్షల్లో అభిమానులు మహిళల క్రికెట్ వైపు చూస్తున్నారు. ఇది మంచి పరిణామం. క్రికెట్ వరల్డ్‌కప్‌లు అనేవి వస్తూ పోతూ ఉంటాయి. కానీ ఈరోజు మన అమ్మాయిలు ఫైనల్‌కు చేరడం ప్రతీ ఇండియన్ గర్ల్ గర్వించే క్షణం’ అని గంభీర్ పేర్కొన్నాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా, మయాంక్ అగర్వాల్ కూడా భారత అమ్మాయిలపై ప్రశంసలు కురిపించారు. (కన్నీళ్లు కనిపించనీయవద్దు!) Well done the Women’s team @bcci @JayShah .. Two back to back World Cup finals .. but we lost .. u we’re super .. we will get there someday .. love the team and players — Sourav Ganguly (@SGanguly99) March 8, 2020 Proud of all the efforts put in by the Indian Women's Cricket Team throughout their #T20WorldCup campaign. I'm confident that you girls will bounce back stronger than ever. 🙌 @BCCIWomen — Virat Kohli (@imVkohli) March 8, 2020 -
ఓటమి విజయానికి తొలిమెట్టు : సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భారత మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు తెలియజేశారు. ‘ మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు పోరాటానికి అభినందనలు. ఓటమి విజయానికి తొలిమెట్టు. మీరు ఇంత దూరం రావటం మాకు ఎంతో గర్వకారణం, మీ పయనం ఇక్కడితో ఆగిపోలేదు. విజేత ఆస్ట్రేలియాకు అభినందనలు’ అని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. కాగా, ఆదివారం మెల్బోర్న్ వేదికగా జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో తలపడ్డ భారత్ ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. చదవండి : కన్నీళ్లు కనిపించనీయవద్దు! Kudos to the Indian Women's Cricket Team for their remarkable performance in @T20WorldCup. Defeat is just one stepping stone away from success. We are immensely proud of how far you have come, & you have a long way to go! Congratulations to the Australian team. #INDvsAUS — YS Jagan Mohan Reddy (@ysjagan) March 9, 2020 -
కన్నీళ్లు కనిపించనీయవద్దు!
సాక్షి క్రీడా విభాగం: మీకు తెలిసిన 16 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయి ఏం చేస్తూ ఉంటుంది? శ్రద్ధగా చదువుకుంటూనో లేక సరదాగా ఆటపాటల్లోనో, ఇంకా చెప్పాలంటే ఏ టిక్‌టాక్‌లోనో బిజీగా ఉంటుంది. కానీ షఫాలీ వర్మ దేశం మొత్తం ఆశలను మోస్తూ 86 వేలకు పైగా జనం మధ్యలో మైదానంలోకి దిగి ‘గార్డ్’ తీసుకుంది. గత మ్యాచ్‌ల తరహాలో ఈసారి ఆమె సఫలం కాలేదు. అంతకుముందు సునాయాస క్యాచ్‌ను వదిలేసి ప్రత్యర్థికి అవకాశం ఇచ్చిన అపరాధ భావం కూడా వెంటాడి ఉంటుంది. అందుకే ఆట ముగిశాక ఆ టీనేజర్ ఓటమి బాధను తట్టుకోలేకపోయింది. కన్నీళ్లపర్యంతమైన షఫాలీని ఓదార్చడం సహచరుల వల్ల కాలేదు. అయితే ఈ పరాజయం ఆమె ఒక్కదానిది కాదు. అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ ఆరు నెలల్లో షఫాలీ ఆశించిన దానికంటే అసాధారణ ప్రదర్శన కనబర్చింది. అసలు షఫాలీ ఆట లేకుండా మన టీమ్ తుది పోరు వరకు చేరేదా అనేది కూడా సందేహమే! ఎందుకంటే 5 ఇన్నింగ్స్‌లలో కలిపి షఫాలీ 163 పరుగులు చేస్తే... జట్టులో టాప్–3 బ్యాటర్లు అనదగ్గ స్మృతి, హర్మన్ కౌర్, జెమీమా కలిసి 14 ఇన్నింగ్స్‌లలో చేసిన పరుగులు 164 మాత్రమే. ►ముఖ్యంగా గత కొంత కాలంగా హర్మన్, స్మృతి ఈ ఫార్మాట్లో అన్నీ తామే అయి జట్టును నడిపిస్తూ వచ్చారు. మిథాలీ రాజ్‌ను అసాధారణ పరిస్థితుల్లో పక్కకు నెట్టేసిన తర్వాత వీరిద్దరే కీలకంగా మారారు. పైగా బిగ్‌బాష్ లీగ్, కియా సూపర్ లీగ్‌లలో ఆడిన అనుభవంతో వరల్డ్‌కప్‌లో వీరిపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఐదు ఇన్నింగ్స్‌లలో నాలుగు సార్లు ‘సింగిల్ డిజిట్’కే పరిమితమైన హర్మన్‌కు పుట్టిన రోజు చేదు అనుభవాన్ని మిగిల్చింది. స్మృతి ఒక్క మ్యాచ్‌లోనూ 20 దాటలేకపోయింది. (చదవండి: మన వనిత... పరాజిత) ►షఫాలీకి ముందు సంచలన టీనేజర్‌గా వెలుగులోకి వచ్చిన జెమీమాకు ఆటపై శ్రద్ధ తగ్గినట్లుంది! బంగ్లాదేశ్‌పై మాత్రమే ఫర్వాలేదనిపించిన ఆమె ఫైనల్లో ఆడిన నిర్లక్ష్యపు షాట్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ ముగ్గురూ విఫలమైన చోట విశ్వ విజేతగా నిలవాలనుకోవడం అత్యాశే అవుతుందేమో. ►బౌలింగ్‌లో భారత్ పూర్తిగా స్పిన్ బలగాన్నే నమ్ముకుంది. ప్లాన్ ‘బి’ లేకుండా మెగా టోర్నీలో ఒకే తరహా వ్యూహానికి కట్టుబడటం ఫైనల్లో నష్టం కలిగించింది. ఎంసీజీలాంటి ఫ్లాట్‌పిచ్‌పై అది పని చేయలేదు. మన పేస్ మరీ బలహీనంగా ఉండటం కూడా సమస్యగా మారింది. ►మ్యాచ్ ఫీజుల పెంపు, కాంట్రాక్ట్‌లు, అలవెన్స్‌లు, ఇతర సౌకర్యాలు అత్యుత్తమ ప్రదర్శనకు హామీ ఇవ్వలేవు. ఇకపై సీరియస్‌గా మహిళల జట్టు ఆటను కూడా సమీక్షించాల్సిన అవసరం ఉంది. మహిళల క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లాలంటే ఫైనల్లో తప్పనిసరి గెలవాలని ఏమీ లేదు. ఇప్పుడు ఉన్న జోష్‌ను, జోరును కొనసాగించేందుకు బీసీసీఐకి ఇదే సరైన సమయం. ఎన్నో కష్టాలు దాటి ఇక్కడి వరకు వచ్చాననే కథలకు ఇక గుడ్‌బై చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మహిళల క్రికెట్‌కు కూడా ప్రపంచ స్థాయి అత్యుత్తమ సౌకర్యాలు ఉన్నాయి. ఆసీస్ విజయానికి కారణంగా చెబుతున్న బిగ్‌బాష్ లీగ్ తరహాలో ఐపీఎల్‌ను నిర్వహించడం అంత సులువు కాదు. సీనియర్ స్థాయిలో కనీసం 40 మంది అగ్రశ్రేణి ప్లేయర్లు కూడా మనకు అందుబాటులో లేరు. అయితే ఇకపై ఎక్కువ విరామం లేకుండా దేశవాళీలో కూడా వీలైనన్ని ఎక్కువ టోర్నీలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. షఫాలీ, రిచా ఘోష్‌లాంటి ప్లేయర్లు చాలెంజర్ ట్రోఫీ నుంచే వెలుగులోకి వచ్చారు. చివరగా... తాజా పరాజయం బాధించవచ్చు. కానీ భవిష్యత్తులో మరింత ఎదిగేందుకు ఈ టోర్నీ ప్రదర్శన స్ఫూర్తిగా నిలవాలి తప్ప నిరాశగా మారిపోకూడదు. ఫైనల్ తర్వాత దిగ్గజ క్రికెటర్ బిషన్ సింగ్ బేడి చెప్పినట్లు... ‘కన్నీళ్లను ఎక్కడా బయటపడనీయవద్దు. ఓడినప్పుడైతే అసలే వద్దు’! -
మన వనిత... పరాజిత
మరో ప్రపంచ కప్ ఫైనల్... మళ్లీ అదే ఓటమి వ్యథ... విశ్వ వేదికపై భారత మహిళల క్రికెట్ జట్టు వేదన పునరావృతమైంది. గత వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో చివరి వరకు పోరాడి పరాజయం వైపు ఉండిపోయిన మన బృందం ఈసారి టి20 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా ఓటమి పక్షానే నిలవాల్సి వచ్చింది. రికార్డు సంఖ్యలో మైదానంలో 86,174 మంది ప్రేక్షకులు, అటు ప్రత్యర్థిగా ఆతిథ్య జట్టు, భారీ లక్ష్యం... అన్నీ కలగలిసి తీవ్ర ఒత్తిడిలో హర్మన్ బృందం కుప్పకూలింది. కనీస పోటీ కూడా ఇవ్వలేక చేతులెత్తేసిన తీరు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. లీగ్ దశలో భారత్ చేతిలో ఓడినా... అసలు పోరులో ఆస్ట్రేలియా జూలు విదిల్చింది. లోపాలు సరిదిద్దుకొని సరైన వ్యూహంతో బరిలోకి దిగి భారత్‌ను దెబ్బ కొట్టింది. సొంతగడ్డపై తిరుగులేని ప్రదర్శనతో ఐదోసారి పొట్టి ప్రపంచ కప్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఓపెనర్లు హీలీ, మూనీ ఇచ్చిన ఆరంభం భారీ స్కోరుకు బాటలు వేయగా, బౌలింగ్‌లో మెగాన్ షూట్, జొనాసెన్ చెలరేగి ప్రత్యర్థి ఆటకట్టించారు. టోర్నీలో ప్రయాణం తడబడుతూనే సాగినా ... చివరకు తమ స్థాయిని ప్రదర్శించి ఆసీస్ ఐదోసారి జగజ్జేతగా నిలిచింది. మెల్బోర్న్: భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచ విజేతగా నిలవాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే! టి20 వరల్డ్ కప్‌లో తొలిసారి ఫైనల్ చేరి అరుదుగా లభించిన అవకాశాన్ని అందుకోవడంలో విఫలమైన మన జట్టు మళ్లీ రన్నరప్‌గానే ముగించింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 85 పరుగుల భారీ తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలీసా హీలీ (39 బంతుల్లో 75; 7 ఫోర్లు, 5 సిక్సర్లు)... ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ బెత్ మూనీ (54 బంతుల్లో 78 నా టౌట్; 10 ఫోర్లు) తొలి వికెట్‌కు 70 బంతుల్లోనే 115 పరుగులు జోడించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత్ 19.1 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. దీప్తి శర్మ (35 బంతుల్లో 33; 2 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. షూట్ (4/18), జొనాసెన్ (3/20) భారత ఇన్నింగ్స్ పతనాన్ని శాసించారు. హీలీ విధ్వంసం... స్పిన్ బలాన్ని నమ్ముకున్న భారత్... దీప్తి శర్మతో తొలి ఓవర్ వేయించింది. అయితే మొదటి బంతిని ముందుకు దూసుకొచ్చి ఆడి బౌండరీగా మలచిన హీలీ తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. అదే ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టిన హీలీ... శిఖా వేసిన తర్వాతి ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టింది. పవర్‌ప్లే తర్వాత కూడా హీలీ దూకుడు తగ్గలేదు. రాజేశ్వరి వేసిన ఓవర్లో ఆమె వరుసగా రెండు సిక్సర్లు కొట్టింది. ఇందులో మొదటిది ఏకంగా 83 మీటర్ల దూరంలో పడింది! అనంతరం 30 బంతుల్లోనే ఆమె అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత శిఖా వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో హీలీ పండగ చేసుకుంది. వరుసగా మూడు బంతుల్లో ఆమె 6, 6, 6 బాదింది. ఈ ఓవర్లో మొత్తం 23 పరుగులు వచ్చాయి. తొలి వికెట్ భాగస్వామ్యం సెంచరీ దాటిన తర్వాత ఎట్టకేలకు రాధ యాదవ్ బౌలింగ్‌లో మరో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో హీలీ అవుట్ కావడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. హీలీకి జతగా మరోవైపు మూనీ చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చింది. ఆమె 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. వీరిద్దరి తర్వాత వచ్చిన ఇతర బ్యాటర్లను నిలువరించడంలో భారత్ సఫలమైంది. ఫలితంగా చేతిలో 9 వికెట్లు ఉన్నా... చివరి 5 ఓవర్లలో ఆసీస్ 42 పరుగులే చేయగలిగింది. దీప్తి మినహా... ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో షూట్ వేసిన మొదటి ఓవర్లో షఫాలీ 4 ఫోర్లతో 16 పరుగులు రాబట్టింది. కానీ ఈసారి షూట్ వంతు! తొలి ఓవర్ మూడో బంతికే హీలీ అద్భుత క్యాచ్‌కు షఫాలీ (2) వెనుదిరిగింది. జొనాసెన్ వేసిన రెండో ఓవర్లో మెడకు బంతి తగలడంతో తానియా (2) రిటైర్డ్‌హర్ట్‌గా నిష్క్రమించగా, జెమీమా (0) పేలవ షాట్‌తో వెనుదిరిగింది. ఆ తర్వాత మాలినెక్స్ కూడా తన మొదటి ఓవర్లోనే స్మృతి (11) పని పట్టింది. జొనాసెన్ తర్వాతి ఓవర్లో డీప్‌లో క్యాచ్ ఇచ్చి కెప్టెన్ హర్మన్ కౌర్ (4) అవుట్ కావడంతో భారత్ గెలుపు ఆశలు సన్నగిల్లాయి. వేద (24 బంతుల్లో 19; 1 ఫోర్), తానియా స్థానంలో కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన రిచా ఘోష్ (18; 2 ఫోర్లు)తో కలిసి దీప్తి కొద్దిసేపు పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఆ రెండు క్యాచ్‌లు... ఆసీస్‌లాంటి జట్టుకు ‘లైఫ్’ ఇస్తే ఎలా ఉంటుందో ఫైనల్ మ్యాచ్ మళ్లీ చూపించింది. రెండుసార్లు తమకు వచ్చిన అవకాశాలను భారత్ జారవిడుచుకొని మూల్యం చెల్లించింది. తొలి ఓవర్ ఐదో బంతికి హీలీ వ్యక్తిగత స్కోరు 9 వద్ద ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను కవర్స్‌లో షఫాలీ వర్మ వదిలేయగా... రాజేశ్వరి తన మొదటి ఓవర్లోనే మూనీ తన వ్యక్తిగత స్కోరు 8 వద్ద ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను నేలపాలు చేసింది. వీరిద్దరే ఆ తర్వాత చెలరేగి భారత్ కథ ముగించారు. ►5 ఆస్ట్రేలియాకు ఇది 5వ ప్రపంచకప్ టైటిల్. 7 సార్లు టోర్నీ జరిగితే ఇంగ్లండ్, వెస్టిండీస్ ఒక్కోసారి నెగ్గాయి. ►30 అలీసా హీలీ అర్ధ సెంచరీకి తీసుకున్న బంతులు. ఏ ఐసీసీ టోర్నీ ఫైనల్లోనైనా (పురుషులతో సహా) ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. ►184 ఫైనల్లో ఆసీస్ స్కోరు. ఏ టి20 ప్రపంచకప్‌లోనైనా (పురుషులతో సహా) ఇదే అత్యధిక స్కోరు. ►85 భారత్‌కు ఇది రెండో (85 పరుగులు) అతి పెద్ద పరాజయం. గతంలో దక్షిణాఫ్రికా చేతిలో 105 పరుగులతో ఓడింది. ►52 శిఖా పాండే ఇచ్చిన పరుగులు. ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఒక బౌలర్ ఇచ్చిన అత్యధిక పరుగులు ఇవే. 86, 174 ఎంసీజీలో ఫైనల్ మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షకుల సంఖ్య. ఒక మహిళల క్రికెట్ మ్యాచ్‌కు ఎక్కడైనా హాజరైన అత్యధిక ప్రేక్షకుల సంఖ్య ఇది కాగా... ఆస్ట్రేలియా గడ్డపై ఏ క్రీడాంశంలోనైనా మహిళల మ్యాచ్‌కు హాజరైన అత్యధిక ప్రేక్షకుల సంఖ్య కూడా ఇదే. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: అలీసా హీలీ (సి) వేద (బి) రాధ 75; బెత్ మూనీ (నాటౌట్) 78; మెగ్ లానింగ్ (సి) శిఖా పాండే (బి) దీప్తి శర్మ 16; గార్డ్నర్ (స్టంప్డ్) తానియా (బి) దీప్తి శర్మ 2; హేన్స్ (బి) పూనమ్ 4; క్యారీ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1–115; 2–154; 3–156; 4–176. బౌలింగ్: దీప్తి శర్మ 4–0–38–2; శిఖా పాండే 4–0–52–0; రాజేశ్వరి 4–0–29–0; పూనమ్ యాదవ్ 4–0–30–1; రాధ యాదవ్ 4–0–34–1. భారత్ ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (సి) అలీసా హీలీ (బి) షూట్ 2; స్మృతి మంధాన (సి) క్యారీ (బి) మాలినెక్స్ 11; తానియా (రిటైర్డ్‌హర్ట్) 2; జెమీమా రోడ్రిగ్స్ (సి) క్యారీ (బి) జొనాసెన్ 0; హర్మన్‌ప్రీత్ కౌర్ (సి) గార్డ్నర్ (బి) జొనాసెన్ 4; దీప్తి శర్మ (సి) మూనీ (బి) క్యారీ 33; వేద కృష్ణమూర్తి (సి) జొనాసెన్ (బి) కిమిన్స్ 19; రిచా ఘోష్ (సి) క్యారీ (బి) షూట్ 18; శిఖా పాండే (సి) మూనీ (బి) షూట్ 2; రాధ (సి) మూనీ (బి) జొనాసెన్ 1; పూనమ్ (సి) గార్డ్నర్ (బి) షూట్ 1; రాజేశ్వరి (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్) 99. వికెట్ల పతనం: 1–2; 1–5 (రిటైర్డ్‌హర్ట్), 2–8; 3–18; 4–30; 5–58; 6–88; 7–92; 8–96; 9–97; 10–99. బౌలింగ్: మెగాన్ షూట్ 3.1–0–18–4; జొనాసెన్ 4–0–20–3; మాలినెక్స్ 4–0–21–1; కిమిన్స్ 4–0–17–1; క్యారీ 4–0–23–1. -
ఓటమిపై స్పందించిన హర్మన్
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2020 ఫైనల్లో భారత్ ఓటమిపై టీం కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ స్పందించింది. మ్యాచ్ అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రపంచకప్‌లో తమ జట్టు ఆటతీరుపై పూర్తిస్థాయిలో సంతృప్తిగా ఉన్నానని ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే టోర్నీఅంతా గొప్పగా రాణించి.. కీలకమైన ఫైనల్లో ఓడటం బాధకరమని పేర్కొంది. ‘ప్రస్తుతమున్న టీంపై ఎంతో నమ్మకముంది. రానున్న ఆరునెలల కాలం తమకు ఎంతో కీలకం. ఆటలో గెలుపోటములు సహజం. కొన్నిసార్లు విజయం సాధిస్తే.. మరికొన్ని సార్లు ఓటమి చవిచూడాల్సి వస్తుంది. అనుభవాల నుంచి ఎంతో నేర్చుకోవాలి. దురదృష్టవశాత్తూ ఫైనల్లో ఓడాం. భవిష్యత్తులో గొప్పగా రాణిస్తామన్న నమ్మకం నాకుంది’ అని వెల్లడించింది. కాగా టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భాగంగా ఆదివారం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 85 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.(ఈసారి కూడా చాంపియన్ ఆస్ట్రేలియానే) -
మహిళల టీ20 ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా
-
ప్రపంచకప్ ఓటమి: షఫాలీ కంటతడి
మెల్బోర్న్: ఎన్నో ఆశలు.. మరెన్నో అంచనాలు.. అంతకుమించిన ఆకాంక్షల మధ్య టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన భారత మహిళల జట్టు చివరి మెట్టుపై బోల్తా పడింది. లీగ్ దశలో అప్రతిహతవిజయాలతో దూసుకపోయిన హర్మన్ సేన.. ఫైనల్ పోరులో మాత్రం పూర్తిగా తేలిపోయింది. లీగ్ దశలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత జట్టు.. టైటిల్ పోరులో అట్టర్ ఫ్లాఫ్ షోతో నిరుత్సాహపరిచింది. ముఖ్యంగా లీగ్ దశలో బ్యాటింగ్ భారాన్ని మోసిన యువ సంచలనం షఫాలీ వర్మ తుది పోరులో చేతులెత్తేసింది. ఆస్ట్రేలియా భారీ లక్ష్యం నిర్దేశించినప్పటికీ షఫాలీ రూపంలో అందరిలోనూ ఓ ధైర్యం ఏర్పడింది. అభిమానులతో పాటు టీమ్ మేనేజ్మెంట్ సైతం పవర్ ప్లే ముగిసే వరకైన హరియాణ క్రికెటర్ క్రీజులో ఉండాలని కోరుకుంది. కానీ తొలి ఓవర్లోనే ఊహించని విధంగా అవుటై తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. షఫాలీ అవుటవ్వడంతోనే టీమిండియా ఓటమికి పునాది రాయి పడిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇక అవుటైన తీరు పట్ల ఈ యువ క్రికెటర్ తీవ్ర అసహనానికి గురై భారంగా క్రీజుల వదిలి వెళ్లింది. ఈ క్రమంలో తను ఔటైన తర్వాత, ఓటమి తర్వాత షఫాలీ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే సారథి హర్మన్‌ప్రీత్ కౌర్, సహచర క్రికెటర్లు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ వెక్కివెక్కి ఏడ్వసాగింది. ప్రస్తుతం షఫాలీ కన్నీరు పెట్టుకున్న ఫోటోలు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు ఆమెకు బాసటగా నిలిచారు. ‘కేవలం పదహారేళ్ల వయసులోనే ప్రపంచ శ్రేణి బౌలర్లను గడగడలాడించావు. నీ ప్రతిభకు అనుభవం తోడైతే టీమిండియాకు మరెన్నో చిరస్మరణీయ విజయాలను అందిస్తావు. టైటిల్ గెలవకున్నా మా హృదయాలను గెలుచుకున్నారు’అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. It's ok Shafali verma, you've achieved more than what a 16 year old can do 🔥🔥 don't be sad 😭😭 We are proud you shafali #T20WorldCup #INDvAUS #TeamIndia #T20WorldCupFinal pic.twitter.com/smd68dEp5s — Official Vikash Kumar Verma (@Officialverma5) March 8, 2020 చదవండి: ఈసారి కూడా చాంపియన్ ఆస్ట్రేలియానే షఫాలీ వర్మ అరుదైన ఘనత -
ఈసారి కూడా చాంపియన్ ఆస్ట్రేలియానే
మెల్బోర్న్: చాంపియన్ ఆట తీరుతో ఆస్ట్రేలియా మరోసారి మెరిసింది.. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2020 విజేతగా నిలిచింది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భాగంగా ఆదివారం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 85 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ అలీసా హీలీ (75; 39 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసానికి తోడు.. మరో ఓపెనర్ బెత్ మూనీ (61 నాటౌట్; 43 బంతుల్లో 9ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించారు. దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 19.1 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. ప్రధాన బ్యాటర్లు షషాలీ (2), మంధాన(11), రోడ్రిగ్స్(0), హర్మన్(4) ఘోరంగా నిరుత్సాహపరిచారు. చివర్లో దీప్తి శర్మ(33) రాణించడంతో టీమిండియా కనీసం గౌరవప్రదమైన స్కోర్‌నైనా సాధించింది. ఆసీస్ బౌలర్లలో మెగాన్ షూట్ నాలుగు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించగా.. జోనాసన్ మూడు వికెట్లు పడగొట్టింది. పోరాటం లేదు.. ఒత్తిడితో చిత్తు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా గెలుపు వైపు పోరాటం సాగించలేదు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో హర్మన్ సేన ఒత్తిడిని కొన్ని తెచ్చుకున్నట్టయింది. దీంతో కనీస ప్రదర్శనను కూడా బ్యాటర్లు ఇవ్వలేకపోయారు. షఫాలీ వర్మ నుంచి ఆరంభమైన వికెట్ల పతనం ఓటమి వరకు సాగుతూ వెళ్లింది. ఆసీస్ బ్యాటర్స్ రెచ్చిపోయిన చోట.. మనోళ్లు తేలిపోయారు. ఏ ఒక్క బ్యాటర్ కూడా కడవరకు క్రీజులో నిలువలేకపోయారు. అనుభవమున్న హర్మన్, మంధాన, వేద కృష్ణమూర్తిలు సైతం ప్రత్యర్థికి దాసోహమయ్యారు. వీరిలో ఏ ఒక్కరు క్రీజులో ఉన్నా యువ ప్లేయర్స్ ధైర్యంగా ఆడేవారు. ఆసీస్ చాంపియన్ ఆట.. ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా చాంపియన్ ఆటను ప్రదర్శించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియాపై అన్ని విభాగాల్లో పై చేయి సాధించింది. తొలుత బ్యాటింగ్‌లో అదరగొట్టిన ఆసీస్ ప్లేయర్స్.. ఆ తర్వాత బౌలింగ్, ఫీల్డింగ్‌లో మెరిసిపోయారు. గెలిచే వరకు ఎక్కడా కూడా అలసత్వం ప్రదర్శించలేదు. దీంతో మహిళల టీ20 ప్రపంచకప్ గెలవడానికి అన్ని విధాల అర్హమైనదిగా నిలిచింది. దీంతో ఐదో సారి టీ20 ఫార్మట్‌లో జగజ్జేతగా నిలిచింది. మరోవైపు తొలి సారి ఫైనల్‌కు చేరిన టీమిండియాకు తీవ్రమైన నిరాశ తప్పలేదు. చదవండి: థ్యాంక్యూ వసీం జాఫర్.. హార్దిక్ నామస్మరణతో మార్మోగిన స్టేడియం -
పెవిలియన్‌కు క్యూ.. సన్నగిల్లిన ఆశలు
మెల్బోర్న్: ఆస్ట్రేలియా నిర్దేశించిన 185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. 30 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. టీమిండియా బ్యాటింగ్ ప్రారంభమైన మూడో బంతికే షఫాలీ వర్మ(2) పెవిలియన్ బాట పట్టింది. మెగాన్ షూట్ వేసిన బంతిని అంచనా వేడంలో విఫమైన షఫాలీ కీపర్ క్యాచ్ ఔట్ వెనుదిరిగారు. ఈ క్రమంలో అనూహ్యంగా క్రీజులోకి వచ్చిన తానియా భాటియా (2 రిటైర్డ్ హర్ట్) గాయం కారణంగా మైదానాన్ని వీడింది. ఈ సమయంలో జట్టను ఆదుకుంటాదనుకున్న జెమీమా రోడ్రిగ్స్ (0) అత్యంత నిర్లక్ష్యపు షాట్‌తో వికెట్ పారేసుకుంది. దీంతో 8 పరుగులకే రెండు కీలక వికెట్లను టీమిండియా చేజార్చుకుంది. అయితే సీనియర్ బ్యాటర్ స్మృతి మంధాన రెండు ఫోర్లతో ఆశలు రేకెత్తించింది. అయితే సోఫియా ఊరిస్తూ వేసిన బంతికి మంధాన (11) బోల్తాపడింది. దీంతో స్టార్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టి టీమిండియా గెలుపు ఆశలపై నీళ్లు చల్లారు. అయితే కీలక సమయంలో ఆదుకుంటాదని భావించిన సారథి హర్మన్ (4) కూడా తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ఇప్పటికే గెలుపుపై ఆశలు సన్నగిల్లినప్పటికీ.. మిగతా బ్యాటర్లు ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి. -
లక్ష్యం పెద్దదే.. గెలిస్తే చరిత్రే
మెల్బోర్న్: స్టార్ బ్యాటర్ అలీసా హీలీ (75; 39 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసానికి తోడు.. మరో ఓపెనర్ బెత్ మూనీ (78 నాటౌట్; 54 బంతుల్లో 10ఫోర్లు) కూల్ హాఫ్ సెంచరీ సాధించడంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ నమోదు చేసింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భాగంగా టీమిండియాకు 185 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆసీస్ నిర్దేశించింది. ఈ భారీ లక్ష్యం పెద్దదయినా గెలిస్తే టీమిండియా నయా చరిత్ర సృష్టిస్తుంది. దీంతో యావత్ భారత్ టీమిండియా గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు ఘనమైన ఆరంభాన్ని అందించారు. టీమిండియా పస లేని బౌలింగ్ చెత్త ఫీల్డింగ్ వారికి కలిసొచ్చింది. దీంతో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. దీంతో ఓ క్రమంలో 200కు పైగా భారీ స్కోర్ నమోదు చేస్తారని భావించారు. అయితే చివర్లో తేరుకున్న భారత బౌలర్లు వరుసగా వికెట్లు పడగొట్టడంతో ఆసీస్‌ను కట్టడి చేయగలిగారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు, రాధా యాదవ్, పూనమ్ యాదవ్‌లు తలో వికెట్ పడగొట్టారు. -
హీలీ విధ్వంసం.. మూనీ హాఫ్ సెంచరీ
మెల్బోర్న్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్నారు. ముఖ్యంగా అలీసా హీలీ విధ్వంసం సృష్టిస్తోంది. ఓవర్‌కు కనీసం ఒకటి రెండు బౌండరీలు సాధిస్తూనే సింగిల్స్ తీస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. టీమిండియా పస లేని బౌలింగ్‌కు తోడు చెత్త ఫీల్డింగ్ ఆసీస్‌కు కలిసొచ్చింది. ఈ క్రమంలో హీలీ 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించింది. హాఫ్ సెంచరీ తర్వాత మరింత రెచ్చిపోయిన హీలో వరుస బౌండరీలతో హోరెత్తించింది. ముఖ్యంగా శిఖా పాండే వేసిన 11వ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్ సాధించింది. దీంతో ఈ ఓవర్లో ఏకంగా 23 పరుగులు పిండుకుంది. అయితే రాధా యాదవ్ వేసిన 12వ ఓవర్లో హీలీ(75; 39 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ షాట్‌కు యత్నించి బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. దీంతో తొలి వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మరోవైపు బెత్ మూనీ కూడా హీలీ అండతో ధాటిగా బ్యాటింగ్ సాగించింది. ఈ క్రమంలో మూనీ కూడా 41 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకుంది. ఆమెకు ఇది తొమ్మిదో టీ20 హాఫ్ సెంచరీ కావడం విశేం. హీలికి 9 పరుగుల వద్ద, మూనీలకు 4 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌లను టీమిండియా ఫీల్డర్లు నేలపాలు చేశారు. -
వరల్డ్‌కప్ ఫైనల్: ఓపెనర్లిద్దరికీ చెరో లైఫ్!
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాకు ఆశించిన శుభారంభం లభించలేదు. చెత్త ఫీల్డింగ్ కారణంగా టీమిండియా ప్లేయర్స్ ఆసీస్ ఓపెనర్లిద్దరికీ అవకాశం ఇచ్చారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే దొరికిన అవకాశంతో అలీసా హీలీ, బెత్ మూనీలు రెచ్చిపోతున్నారు. ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో అలీసా హీలీ, బెత్ మూనీలు బ్యాటింగ్‌కు దిగారు. దీప్తి శర్మ వేసిన తొలి ఓవర్లో హీలీ అటాకింగ్‌కు దిగింది. వరుస ఫోర్లతో రెచ్చిపోయింది. అయితే తొలి ఓవర్ల ఐదో బంతికి హీలీ ఇచ్చిన క్యాచ్‌ను షఫాలీ వర్మ జారవిడిచింది. దీంతో హీలీకి తొలి అవకాశం దక్కింది. హీలి ఇచ్చిన క్యాచ్ నేలపాలు చేసిని సమయంలో ఆమె చెసినవి 9 పరుగులు మాత్రమే. ఇక టీమిండియా మరో చెత్త ఫీల్డింగ్ కారణంగా మరో ఓపెనర్ బెత్ మూనికి కూడా లైఫ్ లభించింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో మూనీ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను రాజేశ్వరి గైక్వాడ్ నేలపాలు చేసింది. ఈ సమయంలో మూని స్కోర్ 4 పరుగులు మాత్రమే. ఇక ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఓ వైపు బౌండరీలు బాదుతూనే మరోవైపు చకచకా సింగ్స్లు తీస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. -
టీ20 ఫైనల్: ఆసీస్‌దే బ్యాటింగ్
మెల్బోర్న్ : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరులో ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీకి సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కీలక ఫైనల్ పోరులో ఛేదనలో ఒత్తిడి ఉంటుందున్న ఉద్ధేశంతో టాస్ గెలిచిన ఆసీస్ సారథి మెగ్ లానింగ్ బ్యాటింగ్ వైపే మొగ్గు చూపింది. ఇక ఇరు జట్లలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఇక ఫైనల్ పోరులో టీమిండియా నయా సంచలనం షఫాలీ వర్మపైనే అందరి దృష్టి ఉంది. ఈ మ్యాచ్‌లో ఈ చిచ్చర పిడుగు ఏ రీతిలో బ్యాటింగ్ చేస్తుందో వేచి చూడాలి. సారథి హర్మన్ ప్రీత్ కౌర్ ఈ రోజు బర్త్‌డే. దీంతో బర్త్‌డే స్పెషల్ ఇన్నింగ్స్ ఆడాలని భావిస్తోంది. మరోవైపు కీలకమైన మ్యాచ్‌కు ముందు తమ స్టార్ ప్లేయర్ ఎలీస్ పెర్రీ గాయంతో దూరం కావడం ఆసీస్‌కు పెద్ద దెబ్బ. అయితే కెప్టెన్ లానింగ్, బెత్ మూనీ, అలీసా హీలీలతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లో ఆ జట్టు ప్రధానంగా జెస్ జొనాసన్, మెగాన్ షూట్లపై ఆధారపడుతోంది. కాగా, మహిళల టీ20 ప్రపంచకప్ గెలిచి భారత మహిళలకు వుమెన్స్ డే కానుక ఇవ్వాలని టీమిండియా ఆటగాళ్లు భావిస్తున్నారు. వరుసగా ఆరోసారి ఫైనల్ చేరిన ఆసీస్ ఇప్పటికే నాలుగుసార్లు విజేతగా నిలవగా, భారత్ మొదటిసారి ఫైనల్ బరిలోకి దిగుతోంది. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో భారత్ గెలిచింది. చదవండి: మన క్రికెట్ మహిళా సైన్యం... ఆసీస్ పేసర్‌కు షఫాలీ భయం! -
మెల్బోర్న్లో.... మహరాణులు ఎవరో?
లక్ష మంది ప్రేక్షకులు... దాదాపు రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల టి20 ప్రపంచ కప్–2020 ఫైనల్ వేదికను మెల్బోర్న్గా ప్రకటించినప్పుడు ఆశించిన సంఖ్య! మహిళా దినోత్సవం రోజున ఈ పోరును నిర్వహిస్తే అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచవచ్చని భావించిన నిర్వాహకుల ఆలోచన ఇప్పుడు సరిగ్గా కార్యరూపం దాలుస్తోంది. రికార్డు స్థాయిలో అభిమానుల హాజరయ్యే అవకాశం ఉన్న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో (ఎంసీజీ) రెండు అత్యుత్తమ జట్లు తుది పోరులో తలపడుతుండటంతో మహిళా క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని క్రేజ్ ఈ ఫైనల్‌కు వచ్చేసింది. ఇక సమరం హోరాహోరీగా సాగడమే తరువాయి. మొదటిసారి ఫైనల్లోకి ప్రవేశించిన జట్టు ఒకవైపు... నాలుగు సార్లు ఇప్పటికే చాంపియన్‌గా నిలిచిన టీమ్ మరోవైపు. సమష్టితత్వంతో వరుస విజయాలు సాధించి భారత్ తుది పోరుకు అర్హత సాధించగా... తొలి మ్యాచ్ ఓటమిని దాటి తమదైన ప్రొఫెషనలిజంతో ఆస్ట్రేలియా ముందంజ వేసింది. తొలి టైటిల్ సాధించే లక్ష్యంతో హర్మన్ సేనపై కాస్త ఒత్తిడి ఉండగా, ఇప్పటికే ఇలాంటి ఫైనల్స్ ఆడిన అనుభవంతో రాటుదేలిన ఆడ కంగారూలు ప్రశాంతంగా కనిపిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా టీవీల ముందే కాదు... ఎంసీజీలో కూడా భారీ సంఖ్యలోనే హాజరయ్యే భారత అభిమానుల ప్రపంచకప్ కల నెరవేరుతుందా! మెల్బోర్న్: క్రికెట్ ప్రపంచంలో అత్యధిక ఆదరణ ఉన్న జట్టుకు, ప్రపంచ నంబర్‌వన్ జట్టుకు మధ్య విశ్వ వేదికపై తుది సమరానికి సమయం వచ్చేసింది. నేడు ఇక్కడి ఎంసీజీలో జరిగే మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడనుంది. వరుసగా ఆరోసారి ఫైనల్ చేరిన ఆసీస్ ఇప్పటికే నాలుగుసార్లు విజేతగా నిలవగా, భారత్ మొదటిసారి ఫైనల్ బరిలోకి దిగుతోంది. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో భారత్ గెలిచింది. గ్రూప్ ‘ఎ’లో భారత జట్టు ఆడిన అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇదే గ్రూప్‌లో భారత్ చేతిలో ఓడిన అనంతరం ఆస్ట్రేలియా మిగిలిన మూడు మ్యాచ్‌లలో నెగ్గింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ వర్షం కారణంగా రద్దు కావడంతో భారత్ ముందంజ వేయగా...సెమీస్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన డిఫెండింగ్ చాంపియన్ ఫైనల్‌కు అర్హత సాధించింది. గత కొన్నేళ్లుగా టి20ల్లో ఆసీస్ ఆధిపత్యం బాగా సాగింది. అయితే వారిని నిలవరించగలిగిన ఏకైక జట్టు భారత్ మాత్రమే. గత ఐదేళ్లలో ఇరు జట్ల మధ్య 10 మ్యాచ్‌లు జరిగితే భారత్ 5 గెలిచి, 5 ఓడింది. ఓడిన మ్యాచ్‌లతో సమాన సంఖ్యలో మరే జట్టు ఆసీస్‌పై గెలవలేకపోయింది. ఇటీవలి ముక్కోణపు టోర్నీతో కలిపి చూస్తే ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌లో భారత్ 3 గెలిచి ఆధిక్యంలో ఉంది. అందుకే సొంత మైదానంలో ఆడుతున్నా సరే... తమకు విజయం అంత సులువు కాదని ఆసీస్‌కూ బాగా తెలుసు. కీలకమైన మ్యాచ్‌కు ముందు తమ స్టార్ ప్లేయర్ ఎలీస్ పెర్రీ గాయంతో దూరం కావడం ఆసీస్‌కు పెద్ద దెబ్బ. అయితే కెప్టెన్ లానింగ్, బెత్ మూనీ, అలీసా హీలీలతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లో ఆ జట్టు ప్రధానంగా జెస్ జొనాసన్, మెగాన్ షూట్లపై ఆధారపడుతోంది. భారత జట్టుకు మరోసారి సంచలన ఓపెనర్ షఫాలీ వర్మ ఇచ్చే ఆరంభం కీలకం కానుంది. ఆమె తనదైన శైలిలో చెలరేగితే ప్రత్యర్థి బౌలర్లకు ఇబ్బందులు తప్పవు. షఫాలీని నిలువరించేందుకు ఆసీస్ అన్ని ప్రయత్నాలు చేయడం ఖాయం. అయితే మిగతా బ్యాటర్ల ప్రదర్శన అంత గొప్పగా లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. తుది పోరులోనైనా తమ స్థాయికి తగినట్లు కెప్టెన్ హర్మన్, స్మృతి, జెమీమా చెలరేగాల్సి ఉంది. లేదంటే గెలుపు ఆశలు నెరవేరడం కష్టం. బౌలింగ్‌లో మరోసారి భారత్ స్పిన్నే నమ్ముకుంది. తమ స్పిన్నర్లు ఈ టోర్నీలో కెప్టెన్ హర్మన్ ఉపయోగించిన తీరు ప్రశంసనీయం. ముఖ్యంగా పూనమ్ యాదవ్ తొలి మ్యాచ్‌లో ఆసీస్‌కు భారీ షాక్ ఇచ్చింది. కాబట్టి ఈసారి ఆమె కోసం వారు మరింత మెరుగ్గా సిద్ధమై రావడం ఖాయం. ఇతర స్పిన్నర్లు కూడా ఒత్తిడి పెంచగలిగితే ప్రత్యర్థిని నిలువరించవచ్చు. వర్షం లేదు! సెమీస్‌లో పోలిస్తే సంతోషకర విషయం ఆదివారం మెల్బోర్న్లో ఎలాంటి వర్ష సూచన లేదు. మ్యాచ్‌కు ఏ సమయంలోనా ఇబ్బంది ఉండకపోవచ్చు. అనూహ్యంగా వర్షం పడినా ఫైనల్‌కు రిజర్వ్ డే ఉంది. పిచ్ కూడా సాధారణ బ్యాటింగ్ వికెట్. మంచి స్కోరింగ్‌కు అవకాశం ఉంది. వరల్డ్ కప్ ఫైనల్ ఒత్తిడి ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. ఫైనల్ చేరారిలా (భారత్) లీగ్ దశలో... ►ఆస్ట్రేలియాపై 17 పరుగులతో విజయం ►బంగ్లాదేశ్‌పై 18 పరుగులతో గెలుపు ►న్యూజిలాండ్‌పై 3 పరుగులతో విజయం ►శ్రీలంకపై ఏడు వికెట్లతో గెలుపు సెమీఫైనల్... ►ఇంగ్లండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. లీగ్ దశలో ఎక్కువ పాయింట్లు సాధించినందుకు భారత్ ఫైనల్ చేరింది. (ఆస్ట్రేలియా) లీగ్ దశలో... ►భారత్ చేతిలో 17 పరుగులతో ఓటమి ►శ్రీలంకపై 5 వికెట్లతో గెలుపు ►బంగ్లాదేశ్‌పై 86 పరుగులతో విజయం ►న్యూజిలాండ్‌పై 4 పరుగులతో గెలుపు సెమీఫైనల్... దక్షిణాఫ్రికాపై 5 పరుగులతో విజయం టోర్నీలో భారత్ టాప్–3 బ్యాటర్లు 1. షఫాలీ వర్మ (161 పరుగులు) 2. జెమీమా (85) 3. దీప్తి శర్మ (84) టాప్–3 బౌలర్లు 1. పూనమ్ యాదవ్ (9 వికెట్లు) 2. శిఖా పాండే (7) 3. రాధా యాదవ్, రాజేశ్వరి (5) టోర్నీలో ఆస్ట్రేలియా టాప్–3 బ్యాటర్లు 1. మూనీ (181 పరుగులు) 2. హీలీ (161) 3. లానింగ్ (116) టాప్–3 బౌలర్లు 1. షూట్ (9 వికెట్లు) 2. జొనాసన్ (7) 3. వేర్హామ్, క్యారీ (3) -
మన క్రికెట్ మహిళా సైన్యం...
భారత మహిళలు గర్జించే రోజు వచ్చేసింది. కంగారూ జట్టును కంగారెత్తించి తొలిసారి విశ్వకిరీటం సొంతం చేసుకునేందుకు భారత బృందం విజయం దూరంలో ఉంది. లీగ్ దశ నుంచి అజేయంగా దూసుకుపోతున్న 15 మంది సభ్యుల భారత్ బృందంలో 9 మంది భారత్ ఆడిన 4 మ్యాచ్‌లలోనూ బరిలోకి దిగారు. స్మృతి మంధాన అనారోగ్యం కారణంగా 3 మ్యాచ్‌లకే పరిమితమవగా, ఆమె స్థానంలో రిచా ఘోష్ ఆడింది. హైదరాబాద్ పేసర్ అరుంధతి రెడ్డి 2 మ్యాచ్‌లు ఆడిన తర్వాత ఆమె స్థానంలో స్పిన్నర్ రాధా యాదవ్‌కు మరో 2 మ్యాచ్‌లలో అవకాశం కల్పించారు. ఇద్దరు ప్లేయర్లు హర్లీన్ డియోల్, పూజ వస్త్రకర్లకు మాత్రం మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. జగజ్జేతగా నిలిచేందుకు గెలుపు దూరంలో ఉన్న భారత బృందానికి సంబంధించిన క్లుప్త సమాచారం... హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్, బ్యాటర్) వయసు: 31 ఏళ్లు స్వస్థలం: మోగా (పంజాబ్) అనుభవం: 113 టి20లు (2009లో అరంగేట్రం) విశేషాలు: 2016 నుంచి జట్టు సారథిగా ఉంది. గత టి20 ప్రపంచ కప్ టోర్నీలో సెమీస్ వెళ్లినప్పుడు కూడా కెప్టెన్‌గా వ్యవహరించింది. స్మృతి మంధాన (బ్యాటర్) వయసు: 23 ఏళ్లు స్వస్థలం: సాంగ్లి (మహారాష్ట్ర) అనుభవం: 74 టి20లు (2013లో అరంగేట్రం) విశేషాలు: జట్టులో టాప్ బ్యాటర్. ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడింది. బిగ్‌బాష్ లీగ్‌లో ఆడిన అనుభవముంది. జెమీమా రోడ్రిగ్స్ (బ్యాటర్) వయసు: 19 ఏళ్లు స్వస్థలం: ముంబై అనుభవం: 43 టి20లు (2018లో అరంగేట్రం) విశేషాలు: జట్టులో ప్రధాన బ్యాటర్. దేశవాళీ వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఘనత. గత ప్రపంచకప్‌లో స్టాండవుట్ ప్లేయర్‌గా ఎంపిక. తానియా భాటియా (వికెట్‌కీపర్) వయసు: 22 ఏళ్లు స్వస్థలం: చండీగఢ్ అనుభవం: 49 టి20లు (2018లో అరంగేట్రం) విశేషాలు: 13 ఏళ్లకే పంజాబ్ సీనియర్ టీమ్‌లో ఆడింది. కీపింగ్ నైపుణ్యంతో జట్టులో రెగ్యులర్ సభ్యురాలు. శిఖా పాండే (పేస్ బౌలర్) వయసు: 31 ఏళ్లు స్వస్థలం: గోవా అనుభవం: 49 టి20లు (2014లో అరంగేట్రం) విశేషాలు: ఈ ప్రపంచకప్‌లో ఓపెనింగ్ బౌలర్‌గా కీలక పాత్ర పోషించింది. ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయిట్ లెఫ్టినెంట్‌గా పని చేస్తోంది. పూనమ్ యాదవ్ (లెగ్‌స్పిన్నర్) వయసు: 28 ఏళ్లు స్వస్థలం: ఆగ్రా (ఉత్తర ప్రదేశ్) అనుభవం: 66 టి20లు (2013లో అరంగేట్రం) విశేషాలు: ఈ ఏడాది బీసీసీఐ అత్యుత్తమ క్రికెటర్‌గా ఎంపిక. గుగ్లీలతో ప్రత్యర్థులను బోల్తా కొట్టించే నైపుణ్యం సొంతం. అరుంధతి రెడ్డి (పేసర్) వయసు: 22 ఏళ్లు స్వస్థలం: హైదరాబాద్ అనుభవం: 20 టి20లు (2018లో అరంగేట్రం) విశేషాలు: తెలుగు రాష్ట్రాలనుంచి భారత జట్టులో ఉన్న ఏకైక ప్లేయర్. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రాణించింది. హర్లీన్ డియోల్ (ఆల్‌రౌండర్) వయసు: 21 ఏళ్లు స్వస్థలం: చండీగఢ్ అనుభవం: 6 టి20లు (2019లో అరంగేట్రం) విశేషాలు: దూకుడులో జూనియర్ హర్మన్‌గా గుర్తింపు ఉంది. దేశవాళీలో హిమాచల్‌కు ఆడుతుంది. వరల్డ్‌కప్‌లో మ్యాచ్ దక్కలేదు షఫాలీ వర్మ (బ్యాటర్) వయసు: 16 ఏళ్లు స్వస్థలం: రోహ్టక్ (హరియాణా) అనుభవం: 18 టి20లు (2019లో అరంగేట్రం) విశేషాలు: సంచలన ప్రదర్శనతో ఐసీసీ నంబర్‌వన్ ర్యాంక్. ఈ టోర్నీలో భారత టాప్ స్కోరర్. దీప్తి శర్మ (ఆల్‌రౌండర్) వయసు: 22 ఏళ్లు స్వస్థలం: ఆగ్రా (ఉత్తరప్రదేశ్) అనుభవం: 47 టి20లు (2014లో అరంగేట్రం) విశేషాలు: వన్డేల్లో ప్రపంచ రికార్డు పార్ట్నర్షిప్లో భాగస్వామి. వన్డేల్లో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు (188) సాధించిన ఘనత. వేద కృష్ణమూర్తి (బ్యాటర్) వయసు: 27 ఏళ్లు స్వస్థలం: చిక్‌మగళూరు (కర్ణాటక) అనుభవం: 75 టి20లు (2011లో అరంగేట్రం) విశేషాలు: దూకుడుగా ఆడగల సమర్థురాలు. మంచి డ్యాన్సర్‌గా గుర్తింపు. కరాటేలో బ్లాక్‌బెల్ట్ కూడా. రాధ యాదవ్ (లెఫ్టార్మ్ స్పిన్నర్) వయసు: 20 ఏళ్లు స్వస్థలం: ముంబై అనుభవం: 34 టి20లు (2018లో అరంగేట్రం) విశేషాలు: నిలకడగా వికెట్లు తీసే బౌలర్. కూరగాయలు అమ్మే తండ్రి ప్రోత్సాహంతో క్రికెటర్‌గా ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. రాజేశ్వరి గైక్వాడ్ (లెఫ్టార్మ్ స్పిన్నర్) వయసు: 28 ఏళ్లు స్వస్థలం: బిజాపూర్, కర్ణాటక అనుభవం: 27 టి20లు (2014లో అరంగేట్రం) విశేషాలు: నాలుగు మ్యాచుల్లోనూ రాణించింది. భారత్ తరఫున వన్డే వరల్డ్ కప్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన రికార్డు. రిచా ఘోష్ (బ్యాటర్) వయసు: 16 ఏళ్లు స్వస్థలం: సిలిగురి (పశ్చిమ బెంగాల్) అనుభవం: 2 టి20లు (ముక్కోణపు టోర్నీలో అరంగేట్రం చేసి, ప్రపంచకప్‌లో ఒకే మ్యాచ్ ఆడింది) విశేషాలు: దూకుడుగా ఆడగల మరో టీనేజర్. పూజ వస్త్రకర్ (పేసర్) వయసు: 20 ఏళ్లు స్వస్థలం: షహ్దోల్ (మధ్య ప్రదేశ్) అనుభవం: 20 టి20లు (2018లో అరంగేట్రం) విశేషాలు: పేసర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నా... వరుస గాయాలతో కెరీర్ నిలకడగా సాగలేదు. గత ప్రపంచకప్ ఆడింది. -
షఫాలీ వర్మ అరుదైన ఘనత
న్యూఢిల్లీ : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన యువ సంచలనం, డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ అరుదైన ఛాన్స్ కొట్టేసింది. అనతి కాలంలోనే అభిమానుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న షఫాలీ వర్మను ప్రముఖ శీతల పానీయాల సంస్థ 'పెప్సీ' తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. టీ 20 ప్రపంచకప్ ప్రదర్శనతో షఫాలీ వర్మ పాపులారిటీ ఒక్కసారిగా పెరిగిపోవడంతో పలు కంపెనీలు ఆమెకు కోట్లు కుమ్మరించడానికి సిద్ధమయ్యాయి. (ఆసీస్ పేసర్‌కు షఫాలీ భయం!) ఈ నేపథ్యంలోనే షఫాలీ వర్మతో పెప్సీ ఒక సంవత్సరం పాటు ఒప్పందం కుదుర్చుకుంది. ప్రముఖ బ్రాండ్‌తో షఫాలీ కి ఇదే తొలి ఒప్పందం.ఒక ఐకానిక్ బ్రాండ్ పెప్సీతో ఒప్పందం చేసుకోవడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. మంచి పేరున్న బ్రాండ్ 'పెప్సీ'తో అనుబంధం పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంతోషాన్ని ఎలా వ్యక్తపరచాలో అర్ధం కావట్లేదు. మహిళలు తమ జీవితానికి సంబంధించి అన్ని విభాగాల్లోనూ దూసుకుపోతున్నారు. ఇది మా కాళ్లపై మేం నిలబడాల్సిన తరుణం' అని షఫాలీ వర్మ అరుదైన ఘనతవర్మ పేర్కొంది. ప్రపంచకప్ ఫైనల్లోనూ షఫాలీ తన ఫామ్‌ను కొనసాగిస్తూ భారత్‌ను విశ్వవిజేతగా నిలపాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మార్చి 8(ఆదివారం) జరిగే పైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాతో తుది పోరుకు సిద్ధమైంది. గతేడాది సెప్టెంబర్ నెలలో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన 16 ఏళ్ల బ్యాటింగ్ సంచలనం షఫాలీ వర్మ ఆరు నెలల కాలంలోనే ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచకప్‌లో మూడు మ్యాచుల్లో 11 బౌండరీలు, 8 సిక్స్‌లతో మొత్తంగా 114 పరుగులు చేసి 172.7 స్టైక్‌రేట్‌ను నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక టీ20 మ్యాచ్‌లలో 146.96 స్ట్రైక్ రేట్‌తో 485 పరుగులు చేసింది. (నంబర్ 1 బ్యాటర్‌గా షఫాలీ.. ఐసీసీ స్పెషల్ ట్వీట్!) -
‘ఫ్రీగా ఫైనల్ వెళ్లడం కంటే ఓడిపోవడమే బెటర్’
సిడ్నీ: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఫైనల్‌కు అర్హత సాధించడాన్ని దక్షిణాఫ్రికా కెప్టెన్ డేన్ వాన్ నీకెర్క్ జీర్ణించుకోలేనట్లే కనబడుతోంది. గురువారం సిడ్నీ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దాంతో గ్రూప్ స్టేజ్‌లో అత్యధిక విజయాలతో భారత్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇక్కడ రిజర్వ్ డే లేకపోవడంతో అత్యధిక లీగ్ పాయింట్లను ప్రామాణికంగా తీసుకోవడంతో భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది. దీనిపై సఫారీ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ వాన్ నీకెర్క్ పరోక్షంగా సెటైర్లు వేశారు. ( ఫైనల్‌కు టీమిండియా తొలిసారి) ఆసీస్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికా ఓడిపోయి టోర్నీ నిష్క్రమించిన తర్వాత నీకెర్క్ వ్యంగ్యంగా మాట్లాడారు. ఫ్రీగా ఫైనల్ చేరడం కంటే సెమీస్‌లో ఓడిపోవడమే బెటర్ అంటూ భారత్ జట్టును ఉద్దేశించి తన మనసులోని అక్కసును వెళ్లగక్కారు. ‘నేను కూర్చొని అబద్ధాలు చెప్పదల్చుకోలేదు. మేము గెలిచి ఫైనల్స్‌కు వెళ్లాలనే ప్రయత్నం చేశాం. వర్షం వల్ల ఆగిపోతే అత్యధిక విజయాలతో మేము ఫైనల్స్ వెళతామనే ఆలోచన లేదు. ఫ్రీగా ఫైనల్ పాస్‌ను సంపాదించడం కంటే ఆడి ఓడిపోవడమే బెటర్’ అని నీకెర్క్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అది మన చేతుల్లో లేదు: హర్హా భోగ్లే నీకెర్క్ వ్యాఖ్యలపై భారత కామెంటేటర్ హర్షాభోగ్లే స్పందించారు. మనం మ్యాచ్ ఆడి ఫైనల్‌కు వెళ్లామా. లేక ఫ్రీ పాస్‌తోనా అనేది మన చేతుల్లో ఏమీ ఉండదన్నారు. ఎవరు ఫైనల్‌కు చేరినా ఫ్రీగా వెళ్లరనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. గ్రూప్ స్టేజ్‌లో బాగా ఆడిన కారణంగానే ఫైనల్స్‌కు అర్హత సాధించారని నీకెర్క్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. (అప్పుడు బౌండరీలు... ఇప్పుడు లీగ్ పాయింట్లు!) -
ఆసీస్ పేసర్‌కు షఫాలీ భయం!
మెల్బోర్న్: మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా జట్లు ఆదివారం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇక్కడ ఆసీస్ డిఫెండింగ్ చాంపియన్ అయితే, భారత్ తొలిసారి ఈ మెగా టోర్నీలో ఫైనల్‌కు చేరింది. దాంతో పోరు ఆసక్తికరమే. కాకపోతే మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో ఆరంభపు మ్యాచ్ భారత్-ఆసీస్ జట్ల మధ్య జరిగితే, ముగింపు మ్యాచ్ కూడా వీరి మధ్య జరగడం ఇక్కడ విశేషం. కాగా, భారత్‌తో ఫైనల్లో తలపడటాన్ని ఒకింత ద్వేషిస్తున్నట్లు ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మెగాన్ స్కట్ పేర్కొన్నారు. ఇందుకు భారత మహిళా ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతీ మంధానాలే కారణమట. వీరిద్దరికి బౌలింగ్ వేయాలంటే తనకు ఒక రకమైన భయం ఏర్పడిందని మెగాన్ స్కట్ స్పష్టం చేశారు. (ఆసీస్ ఆరోసారి...) ‘ భారత మహిళల జట్టుతో ఫైనల్స్ ఆడటాన్ని అసహ్యించుకుంటున్నా. ఎందుకంటే షఫాలీ, స్మృతీల బ్యాటింగ్ నాకు వణుకు పుట్టిస్తోంది. ప్రధానంగా షఫాలీ ఎఫెన్స్‌కు నా వద్ద సమాధానం ఉండకపోవచ్చు. స్మృతీ, షఫాలీలు భారత జట్టుకు వెన్నుముక. వారు బలమైన షాట్లతో దాడి చేస్తున్నారు. ఈ వరల్డ్‌కప్‌కు ముందు జరిగిన ముక్కోణపు సిరీస్‌లో షఫాలీ కొట్టిన సిక్స్.. నా కెరీర్లో నేను చూసిన అత్యుత్తమ సిక్స్. ప్రత్యేకంగా వారికి నేను బౌలింగ్ చేయడం అంత మంచి కాదేమో. ఆ జోడికి నా బౌలింగ్ కూడా సరైన మ్యాచింగ్ కూడా కాకపోవచ్చు. ప్రత్యేకంగా చెప్పాలంటే పవర్ ప్లేలో వారికి నేను జోడిని కాను. వారి కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నా’ అని మెగాన్ స్కట్ పేర్కొన్నారు. నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో స్కట్ రెండు వికెట్లు సాధించడంతో పాటు 17 పరుగులు మాత్రమే ఇచ్చి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే టీమిండియాతో జరుగనున్న ఫైనల్లో మంధాన, షఫాలీలకు కచ్చితమైన బౌలింగ్ వేయకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే ఆందోళనలో ఉన్నారు మెగాన్. ఇందుకు కారణం ఈ టోర్నీ ఆరంభపు మ్యాచ్. ఆ మ్యాచ్‌లో ఆసీస్‌పై భారత్ విజయం సాధించి సిరీస్‌ను ఘనంగా ఆరంభించింది. అయితే ఆసీస్ మ్యాచ్‌లో స్కట్ వేసిన తన వ్యక్తిగత తొలి ఓవర్లో షఫాలీ ధాటికి బెంబేలెత్తిపోయింది. ఆ ఓవర్లో షఫాలీ నాలుగు ఫోర్లు కొట్టి మెగాన్‌కు చుక్కలు చూపించింది. ఇదే భయం ఇప్పుడు ఆమెను మరింత కలవర పెడుతున్నట్లు కనబడుతోంది. (తొలిసారి ఫైనల్లో భారత మహిళలు) -
అప్పుడు బౌండరీలు... ఇప్పుడు లీగ్ పాయింట్లు!
సిడ్నీ: గత ఏడాది పురుషుల వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ జట్టు ‘బౌండరీ కౌంట్’ ద్వారా గెలుచుకున్నప్పుడు న్యూజిలాండ్ జట్టు గుండె బద్దలైంది. ఇదేం నిబంధన అంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)పై క్రికెట్ ప్రపంచం ధ్వజమెత్తింది. అయితే నిబంధనల ప్రకారమే గెలిచాం కాబట్టి మమ్మల్ని తప్పు పట్టవద్దంటూ ఇంగ్లండ్ పదే పదే చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఐసీసీ పెట్టిన ‘నో రిజర్వ్ డే’ నిబంధన అదే ఇంగ్లండ్ మహిళల జట్టు కొంప ముంచింది. టి20 ప్రపంచకప్‌లోనే కాకుండా ఓవరాల్‌గా కూడా భారత్‌పై ఉన్న ఘనమైన రికార్డు, తాజా ఫామ్‌ను బట్టి ఈ మ్యాచ్‌లో గెలవగలమని భావించిన ఇంగ్లండ్‌కు నిరాశ తప్పలేదు. ఈ నిష్క్రమణ అనంతరం టీమ్ కెప్టెన్ హెథర్ నైట్‌తో సహా మాజీ క్రికెటర్లు మైకేల్ వాన్, స్టువర్ట్ బ్రాడ్లు రిజర్వ్ డే లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. రెండు సందర్భాల్లోనూ ఐసీసీ పనితీరుపైనే సందేహాలు రేకెత్తాయి. (అలా అయితే కష్టమయ్యేది: హర్మన్‌ప్రీత్) మన వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ చెప్పినట్లు సగటు భారత అభిమానిగా భారత్ ఫైనల్ చేరడం సంతోషం కలిగిస్తున్నా... ఇలా ఆడకుండా ముందుకు వెళ్లడం మాత్రం నిరాశపర్చే అంశం. అసలు టి20 ప్రపంచ కప్ అంటే తక్కువ వ్యవధిలో ముగిసిపోవాలి కాబట్టి రెండు సెమీస్‌లకు రిజర్వ్ డే అంటే కష్టం అంటూ ఐసీసీ ఇచ్చిన వివరణే హాస్యాస్పదం. ప్రపంచకప్‌లాంటి టోర్నీ రెండు రోజులు పెరిగినా ఎవరికీ అభ్యంతరం ఉండదు. అయితే టోర్నీకి ముందు నిబంధనల గురించి కెప్టెన్ల అంగీకారం తీసుకునే విషయంలోనే అసలు సమస్య ఉంది. మనం ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడో, ఏదైనా వెబ్సైట్లు వీక్షించేందుకు ప్రయత్నించినప్పుడు పైనుంచి కింది వరకు సుదీర్ఘ నిబంధనలు ఉంటే అవేవీ చదవకుండా చివర్లో ‘ఐ అగ్రీ’ అంటూ ఓకే చేయడం అందరికీ అనుభవమే! వరల్డ్ కప్ విషయంలోనూ అలాగే జరిగినట్లు అనిపించింది. వివరాలు ఏమీ తెలియకుండా, ప్రశ్నలు అడగకుండా కెప్టెన్లు సంతకం చేసేశారు. (ఆసీస్ ఆరోసారి...) ఇప్పుడు రిజర్వ్ డే గురించి అడిగితే ఇది చూపించి నిబంధనల్లో లేదని, అందరూ అంగీకరించారని చెబుతూ ఐసీసీ తప్పించుకుంది. మరో మాజీ క్రికెటర్ ఇయాన్ బిషప్ మాత్రం ఇది అందరికీ ఒక పాఠం కావాలంటూ సూచన చేశాడు. ‘ఇకపై ఏదైనా టోర్నీ ప్రారంభానికి ముందు నిబంధనలు పూర్తిగా చదువుకోవాలని ఆటగాళ్లు, క్రికెట్ బోర్డులకు తెలియాలి. అయితే నిజాయితీగా చెప్పాలంటే అదృష్టాన్ని నమ్ముకోకుండా మెగా టోర్నీలో మీ రాతను మీరే రాసుకోమని కూడా ఇది నేర్పించింది. నాకౌట్ మ్యాచ్‌లకే కాదు... టోర్నీ ఆరంభంలోనూ బాగా ఆడాల్సిన అవసరం ఉందని అర్థమైంది. ఇది చూపించి ముందంజ వేసిన భారత్‌కు అభినందనలు’ అని బిషప్ వ్యాఖ్యానించాడు. వర్షం వెంటాడినా సరే... అదృష్టవశాత్తూ కుదించిన మ్యాచ్‌తోనైనా సరే ఆతిథ్య ఆస్ట్రేలియా ఫైనల్ చేరింది. ఆ మ్యాచ్ కూడా రద్దయి ఉంటే ఇంగ్లండ్‌లాగే ఆసీస్ కూడా నిష్క్రమించాల్సి వచ్చేది. -
ఆసీస్ ఆరోసారి...
సిడ్నీ: ప్రపంచకప్‌లలో దురదృష్టాన్ని పక్కన పెట్టుకొని పరుగెత్తే దక్షిణాఫ్రికాకు మరోసారి అలాంటి అనుభవమే ఎదురైంది. టి20 మహిళల ప్రపంచకప్ లీగ్ దశలో అజేయంగా నిలిచిన ఆ జట్టు... సెమీస్‌లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు సన్నద్ధమైన తరుణంలో వర్షం వెంటాడింది. ఫలితంగా ఓవర్లు తగ్గి ఒక్కసారిగా లక్ష్యం మారిపోయింది. ఒత్తిడికి లోనైన సఫారీ టీమ్ చివరకు ఓటమిని ఆహ్వానించింది. ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన సెమీఫైనల్లో 5 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో) ఓడి నిష్క్రమించింది. ఆసీస్ వరుసగా ఆరోసారి ప్రపంచకప్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఇప్పటివరకు వన్డే, టి20 ప్రపంచకప్‌లు అన్నీ కలిపి దక్షిణాఫ్రికా పురుషులు, మహిళలు జట్లు ఒక్కసారి కూడా సెమీఫైనల్ దశను దాటలేకపోయాయి. సిడ్నీలో భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి సెమీస్ రద్దయిన తర్వాత వర్షం తెరిపినివ్వడంతో నిర్ణీత సమయానికి రెండో సెమీస్ ప్రారంభమైంది. ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 134 పరుగులు చేసింది. కెప్టెన్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మెగ్ లానింగ్ (49 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడింది. అనంతరం విరామం సమయంలో మళ్లీ వాన రావడంతో దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 13 ఓవర్లలో 98 పరుగులుగా నిర్దేశించారు. ఐదు ఓవర్లలోపే ఆ జట్టు 3 కీలక వికెట్లు కోల్పోయింది. లారా వోల్వార్ట్ (27 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) చివరి వరకు పోరాడినా లాభం లేకపోయింది. -
వర్షం తెచ్చిన విజయం
అద్భుత ప్రదర్శనతో సాధించిన వరుస విజయాలు అసలు సమయంలో అక్కరకు వచ్చాయి. వర్షంతో మైదానంలో అడుగు పెట్టకపోయినా విజయం మన జట్టును వెతుక్కుంటూ వచ్చింది. ఫలితంగా టి20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు తొలిసారి ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఇంగ్లండ్‌తో జరగాల్సిన సెమీఫైనల్ మ్యాచ్‌లో వాన కారణంగా ఒక్క బంతి పడకపోయినా... లీగ్ దశలో అజేయంగా నిలిచిన హర్మన్ సేన తుది పోరుకు అర్హత సాధించింది. మెగా టోర్నీలో మనపై ఉన్న ఘనమైన రికార్డును కొనసాగించాలనుకున్న ఇంగ్లండ్‌ను వరుణుడు కరుణించకపోవడంతో నిరాశతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఇక లక్ష మంది ప్రేక్షకుల సమక్షంలో ఆదివారం ఆతిథ్య ఆస్ట్రేలియాను ఓడించడమే భారత్ అంతిమ లక్ష్యం కానుంది. సిడ్నీ: టి20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం ఇక్కడి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ)లో ఇంగ్లండ్‌తో జరగాల్సిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా పూర్తిగా రద్దయింది. ఊహించినట్లుగానే సిడ్నీ నగరాన్ని వర్షం ముంచెత్తడంతో ఈ మ్యాచ్‌లో అసలు టాస్ వేయడం కూడా సాధ్యం కాలేదు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అప్పటికీ వాన కురుస్తూనే ఉంది. ఆ తర్వాత సుదీర్ఘ సమయం పాటు ఎదురు చూసినా వాన తగ్గే అవకాశం కనిపించలేదు. దాంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. సెమీఫైనల్ మ్యాచ్‌కు ఎలాంటి రిజర్వ్ డే లేదు. వాన వల్ల ఆట సాధ్యం కాని పక్షంలో లీగ్ దశలో అత్యధిక విజయాలు/ పాయింట్లు సాధించిన జట్టు ముందంజ వేస్తుందని టోర్నీ నిబంధనలు చెబుతున్నాయి. గ్రూప్ ‘ఎ’లో ఆడిన నాలుగు మ్యాచ్‌లు కూడా గెలిచి అజేయంగా నిలిచిన హర్మన్ సేన మొత్తం 8 పాయింట్లు సాధించింది. గ్రూప్ ‘బి’లో మూడు మ్యాచ్‌లు మాత్రమే నెగ్గిన ఇంగ్లండ్ మరో మ్యాచ్‌లో ఓటమి పాలైంది. భారత జట్టు టి20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు అర్హత సాధించడం ఇదే తొలిసారి. గతంలో జరిగిన ఆరు టోర్నీల్లో మూడుసార్లు మన జట్టు సెమీఫైనల్‌కే పరిమితమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. లీగ్ దశలో ఎలాంటి ఉదాసీనతకు తావు లేకుండా ప్రతీ మ్యాచ్‌లో విజయంపై దృష్టి పెట్టడం భారత్‌కు కలిసొచ్చింది. ఈ క్రమంలో శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పాటు పటిష్టమైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను కూడా ఓడించి మన జట్టు తమ సత్తాను ప్రదర్శించింది. అప్పుడు బౌండరీలు... ఇప్పుడు లీగ్ పాయింట్లు! మెగా టోర్నీలలో ఐసీసీ నిర్వహణా వైఫల్యం గత ఏడాది పురుషుల వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ జట్టు ‘బౌండరీ కౌంట్’ ద్వారా గెలుచుకున్నప్పుడు న్యూజిలాండ్ జట్టు గుండె బద్దలైంది. ఇదేం నిబంధన అంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)పై క్రికెట్ ప్రపంచం ధ్వజమెత్తింది. అయితే నిబంధనల ప్రకారమే గెలిచాం కాబట్టి మమ్మల్ని తప్పు పట్టవద్దంటూ ఇంగ్లండ్ పదే పదే చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఐసీసీ పెట్టిన ‘నో రిజర్వ్ డే’ నిబంధన అదే ఇంగ్లండ్ మహిళల జట్టు కొంప ముంచింది. టి20 ప్రపంచకప్‌లోనే కాకుండా ఓవరాల్‌గా కూడా భారత్‌పై ఉన్న ఘనమైన రికార్డు, తాజా ఫామ్‌ను బట్టి ఈ మ్యాచ్‌లో గెలవగలమని భావించిన ఇంగ్లండ్‌కు నిరాశ తప్పలేదు. ఈ నిష్క్రమణ అనంతరం టీమ్ కెప్టెన్ హెథర్ నైట్‌తో సహా మాజీ క్రికెటర్లు మైకేల్ వాన్, స్టువర్ట్ బ్రాడ్లు రిజర్వ్ డే లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. రెండు సందర్భాల్లోనూ ఐసీసీ పనితీరుపైనే సందేహాలు రేకెత్తాయి. మన వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ చెప్పినట్లు సగటు భారత అభిమానిగా భారత్ ఫైనల్ చేరడం సంతోషం కలిగిస్తున్నా... ఇలా ఆడకుండా ముందుకు వెళ్లడం మాత్రం నిరాశపర్చే అంశం. అసలు టి20 ప్రపంచ కప్ అంటే తక్కువ వ్యవధిలో ముగిసిపోవాలి కాబట్టి రెండు సెమీస్‌లకు రిజర్వ్ డే అంటే కష్టం అంటూ ఐసీసీ ఇచ్చిన వివరణే హాస్యాస్పదం. ప్రపంచకప్‌లాంటి టోర్నీ రెండు రోజులు పెరిగినా ఎవరికీ అభ్యంతరం ఉండదు. అయితే టోర్నీకి ముందు నిబంధనల గురించి కెప్టెన్ల అంగీకారం తీసుకునే విషయంలోనే అసలు సమస్య ఉంది. మనం ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడో, ఏదైనా వెబ్సైట్లు వీక్షించేందుకు ప్రయత్నించినప్పుడు పైనుంచి కింది వరకు సుదీర్ఘ నిబంధనలు ఉంటే అవేవీ చదవకుండా చివర్లో ‘ఐ అగ్రీ’ అంటూ ఓకే చేయడం అందరికీ అనుభవమే! వరల్డ్ కప్ విషయంలోనూ అలాగే జరిగినట్లు అనిపించింది. వివరాలు ఏమీ తెలియకుండా, ప్రశ్నలు అడగకుండా కెప్టెన్లు సంతకం చేసేశారు. ఇప్పుడు రిజర్వ్ డే గురించి అడిగితే ఇది చూపించి నిబంధనల్లో లేదని, అందరూ అంగీకరించారని చెబుతూ ఐసీసీ తప్పించుకుంది. మరో మాజీ క్రికెటర్ ఇయాన్ బిషప్ మాత్రం ఇది అందరికీ ఒక పాఠం కావాలంటూ సూచన చేశాడు. ‘ఇకపై ఏదైనా టోర్నీ ప్రారంభానికి ముందు నిబంధనలు పూర్తిగా చదువుకోవాలని ఆటగాళ్లు, క్రికెట్ బోర్డులకు తెలియాలి. అయితే నిజాయితీగా చెప్పాలంటే అదృష్టాన్ని నమ్ముకోకుండా మెగా టోర్నీలో మీ రాతను మీరే రాసుకోమని కూడా ఇది నేర్పించింది. నాకౌట్ మ్యాచ్‌లకే కాదు... టోర్నీ ఆరంభంలోనూ బాగా ఆడాల్సిన అవసరం ఉందని అర్థమైంది. ఇది చూపించి ముందంజ వేసిన భారత్‌కు అభినందనలు’ అని బిషప్ వ్యాఖ్యానించాడు. వర్షం వెంటాడినా సరే... అదృష్టవశాత్తూ కుదించిన మ్యాచ్‌తోనైనా సరే ఆతిథ్య ఆస్ట్రేలియా ఫైనల్ చేరింది. ఆ మ్యాచ్ కూడా రద్దయి ఉంటే ఇంగ్లండ్‌లాగే ఆసీస్ కూడా నిష్క్రమించాల్సి వచ్చేది. వేరే జట్ల సంగతి తెలీదుకానీ మాకైతే వర్షం నిబంధనలపై అవగాహన ఉంది. ఏదైనా కారణంగా సెమీస్ జరగకపోతే లీగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఫైనల్ వెళుతుందని తెలుసు. అందుకే ఆరంభం నుంచి కూడా ప్రతీ మ్యాచ్‌లో గెలవాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగాం. మేం ఫైనల్ చేరడంలో జట్టు సభ్యులందరి పాత్ర ఉంది. సెమీస్ మ్యాచ్ జరగకపోవడం దురదృష్టకరం. అయితే నిబంధనలు అలాగే ఉన్నాయి. మేమేమీ చేయలేం. మున్ముందు రిజర్వ్ డే ఉంచాలనే ఆలోచన మంచిదే. ‘తొలిసారి ఫైనల్’ అనే అనుభూతి గొప్పగా ఉంది. మా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాం. సెమీస్ చూసేందుకు అమ్మా, నాన్న రావడం నా ఆనందాన్ని రెట్టింపు చేసింది. వారు నేను అంతర్జాతీయ క్రికెట్ ఆడగా ఎప్పుడూ చూడలేదు. వారు ఇప్పుడు ఫైనల్ మ్యాచ్‌కు హాజరవుతారు. నా తల్లిదండ్రులే కాదు భారత్‌లో ఎంతో మంది మా విజయాన్ని కోరుకుంటున్నారు. మేం గెలిస్తే అది నిజంగా గొప్ప ఘనత అవుతుంది. –హర్మన్‌ప్రీత్ కౌర్, భారత కెప్టెన్ (ఫైనల్ జరిగే మార్చి 8 హర్మన్ 31వ పుట్టిన రోజు కూడా) హర్మన్ దగ్గర భవిష్యత్తు గురించి చెప్పే మాయా అద్దం ఏదైనా ఉందేమో నాకు తెలీదు. వచ్చే టోర్నమెంట్‌కు ముందు ఆమె దగ్గర నేను తీసుకుంటా. ఎవరూ సెమీస్‌లో వర్షం పడుతుందని ఊహించరు. అలాంటి అరుదైన సందర్భం కోసం ఎవరూ ప్రణాళికలు రూపొందించుకోరు. రిజర్వ్ డే గురించి అసలు చర్చ జరగనే లేదు. ముందుగా సెమీస్‌కు అర్హత సాధించాలని, అక్కడ గెలిచి ఫైనల్ చేరాలని మాత్రమే అనుకున్నాం. ప్రతీ మ్యాచ్ గెలవాలని ఎవరైనా ప్రయత్నిస్తారు. ఈ తరహాలో నిష్క్రమించడం, వరల్డ్ కప్ ముగించడం అసహనం కలిగిస్తోంది. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి మాకు నష్టం కలిగించింది. గత మూడు మ్యాచ్‌లలో బాగా ఆడాక సెమీస్ కోసం ఉత్సాహంగా ఎదురు చూశాం. చివరకు ఇలా జరిగింది. – హెథర్ నైట్, ఇంగ్లండ్ కెప్టెన్ -
చీరకట్టుతో క్రికెట్ ఆడిన మిథాలీ
మహిళా క్రికెట్లో టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. సుదీర్ఘ కాలం భారత మహిళల క్రికెట్‌కు మూలస్థంభంలా నిలిచారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగారు. ఎందరో మహిళా క్రీడాకారులకు స్ఫూర్తిగా మారారు. అలాంటి మిథాలీ.. తొలిసారిగా భారత మహిళల జట్టు టీ20 ప్రపంచకప్ ఫైనల్ చేరిన వేళ సిటీ గ్రూప్‌తో కలిసి ఓ ప్రత్యేక వీడియోను రూపొందించారు. ఆ వీడియోలో మిథాలీ చీరకట్టులో క్రికెట్ ఆడుతూ కనిపిస్తారు. అందులో మిథాలీ అచీవ్‌మెంట్స్‌ను కూడా పేర్కొన్నారు. ఈ వీడియోను మిథాలీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కట్టుబాట్లు తెంచుకుని అమ్మాయిలు ఎదుగుతున్నారని చెప్పడానికి ఆమె చీరకట్టులో క్రికెట్ ఆడారు. ‘కమాన్ టీమిండియా, ప్రపంచకప్‌ను తీసుకురండి’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చాలా మంది నెటిజన్లు మిథాలీని చూస్తే గర్వంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. (చదవండి : ఇంగ్లండ్‌ను చూస్తే బాధేస్తోంది: మిథాలీ) అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజునే(మార్చి 8) టీమిండియా ఆసీస్‌తో ప్రపంచకప్ ఫైనల్లో తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీల్లో ఇప్పటివరకూ మూడు సందర్భాల్లో సెమీస్ వరకే పరిమితమైన భారత మహిళలు.. ఈసారి మాత్రం తుది పోరుకు అర్హత సాధించారు. ఈ రోజు ఇంగ్లండ్‌తో జరగాల్సిన సెమీ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో గ్రూప్-ఎలో అజేయంగా నిలిచిన భారత్ ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. View this post on Instagram Every saree talks more than you and I know! It never tells you to fit in, it makes you stand out. This Women's day, #StartSomethingPriceless and show the world that we can do it too. It's time you start living life #OnYourTerms. Follow @CitiIndia page for more inspiring stories of women living life on their own terms. @mastercardindia A post shared by Mithali Raj (@mithaliraj) on Mar 4, 2020 at 8:07am PST -
'మార్చి 8 కోసం ఎదురుచూస్తున్నా'
న్యూఢిల్లీ : ఐసీసీ మహిళల టీ-20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్, భారత్ మధ్య జరగాల్సిన సెమీఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో గ్రూప్‌లో ప్రథమ స్థానంలో ఉన్న భారత్.. నిబంధనల ప్రకారం ఫైనల్స్‌కు చేరింది. అయితే దీనిపై కొందరు నెటిజన్లతో పాటు పలువురు మాజీ ఆటగాళ్లు ఐసీసీ నిబంధనలను తప్పుబడుతూ విమర్శల కురిపించారు. కానీ, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ టీమిండియా ఫైనల్ వెళ్లిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.(ఇంగ్లండ్‌ను చూస్తే బాధేస్తోంది) Rain played spoilsport when we all wanted to witness a great match and see our girls in blue qualify to the finals ! But nonetheless , we will take this with both hands as well 😁 cannot wait for the 8th of March 🇮🇳🏏👧 — Anushka Sharma (@AnushkaSharma) March 5, 2020 'వర్షం కారణంగా మనం చూడాల్సిన ఇక అద్భుతమైన మ్యాచ్ రద్దైంది. మన అమ్మాయిలు ఫైనల్స్‌కి వెళ్లారు. ఏదేమైనా, దీన్ని మంచిగా భావిద్దాము. మార్చి 8న మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున టీమిండియా కప్పు గెలవాలని కోరుకుంటున్నా'అంటూ ట్వీట్ చేసింది. అనుష్క చేసిన ట్వీట్‌పై అన్ని వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా అనుష్కతో పాటు విరాట్ కోహ్లి కూడా భారత అమ్మాయిలను అభినందిస్తూ ట్వీట్ చేశాడు. ' టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరిన భారత మహిళ జట్టుకు అభినందనలు. అమ్మాయిలు మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది' అంటూ విరాట్ పేర్కొన్నాడు. కాగా మార్చి 8న జరగబోయే ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే గ్రూఫ్ దశలో ఆసీస్‌పై గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత మహిళల జట్టు ఫైనల్లోనూ అదే ప్రదర్శనను పుననావృతం చేయాలని భావిస్తుంది. (టీమిండియా కాచుకో.. ఆసీస్ వచ్చేసింది) Congratulations to the Indian Women's team on qualifying for the @T20WorldCup final. We are proud of you girls and wish you all the luck for the finals. 🇮🇳👏 @BCCIWomen — Virat Kohli (@imVkohli) March 5, 2020 -
టీమిండియా కాచుకో.. ఆసీస్ వచ్చేసింది
సిడ్నీ: ఐసీసీ నిర్వహించే మెగాటోర్నీల్లో దక్షిణాఫ్రికాకు ఏ రీతిలోనూ అదృష్టం కలసి రాదని మరోసారి రుజువైంది. వర్షం పడి మ్యాచ్ రద్దయినా, మ్యాచ్ మధ్యలో వర్షం పడకున్నా దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ వరుణుడు ఆస్ట్రేలియా వైపే నిలిచాడు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై ఐదు పరుగుల తేడాతో(డక్‌వర్త్ లూయిస్) ఆసీస్ విజయం సాధించింది. దీంతో ఆదివారం జరగబోయే ఫైనల్ పోరుకు అర్హత సాధించి టీమిండియాతో అమీతుమీకి సిద్దమైంది. అనుకున్నట్టుగానే ఈ మ్యాచ్ కూడా వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. ఇదే మైదానంలో జరగాల్సిన తొలి సెమీస్ వర్షం కారణంగా రద్దయింది. అయితే రెండో సెమీస్ మ్యాచ్ ప్రారంభసమయానికి మైదానాన్ని సిబ్బంది సిద్దం చేశారు. ఇక టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. సారథి మెగ్ లానింగ్ (49 నాటౌట్) మినహా మరే బ్యాటర్ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఆసీస్ 134 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటింగ్ ముగిసిన వెంటనే వర్షం పడటంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. దీంతో డక్‌వర్త్‌లూయిస్ ప్రకారం సఫారీ లక్ష్యాన్ని 13 ఓవర్లలో 98 పరుగులు నిర్దేశించారు. ఊహించని 98 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టుకు అదిరే ఆరంభం లభించేలేదు. టాపార్డర్ ఫూర్తిగా విఫలమైంది. లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్‌తో ఆసీస్ వరుసగా వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టేసింది. అయితే చివర్లో లారా వోల్వార్డ్ట్(41 నాటౌట్) గెలిపించినంత పనిచేసింది. కానీ సహచర బ్యాటర్ల నుంచి సరైన సహకారం లేకపోవడంతో సఫారీ జట్టును ఫైనల్‌కు చేర్చలేకపోయింది. దీంతో మ్యాచ్ అనంతరం లారా కన్నీటి పర్యంతం అయింది. మరోవైపు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆసీస్ ఫైనల్‌కు చేరుకుంది. నాలుగు సార్లు టీ20 ప్రపంచకప్ చాంపియన్ అయిన ఆసీస్ ఐదో సారి కప్ సాధిస్తుందా? లేక భారత్ తొలి సారి కప్‌ను ముద్దాడుతుందా? అనేది ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌తో తేలనుంది. చదవండి: ఫైనల్‌కు టీమిండియా తొలిసారి ఇంగ్లండ్‌ను చూస్తే బాధేస్తోంది -
ఇంగ్లండ్‌ను చూస్తే బాధేస్తోంది: మిథాలీ
న్యూఢిల్లీ: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ఫైనల్ చేరడంపై మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ హర్షం వ్యక్తం చేశారు. మహిళల టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత్ ఫైనల్‌కు చేరడం కచ్చితంగా అతి పెద్ద ఘనతేనని ఆమె అభివర్ణించారు. ఈ మేరకు తన ట్వీటర్ అకౌంట్లో కంగ్రాట్స్ అంటూ హర్మన్ ప్రీత్ అండ్ గ్యాంగ్‌కు అభినందనలు తెలిపిన మిథాలీ.. ఇంగ్లండ్ మహిళల పట్ల మాత్రం సానుభూతి వ్యక్తం చేశారు. ‘ ఒక భారతీయరాలిగా భారత్ ఫైనల్ చేరడాన్ని థ్రిల్‌గా ఫీలవుతా. కానీ ఒక క్రికెటర్‌గా ఇంగ్లండ్ గర్ల్స్ను చూస్తే జాలేస్తోంది. (ఫైనల్‌కు టీమిండియా తొలిసారి) ఈ తరహా పరిస్థితిని నేను ఎప్పుడూ కోరుకోను. నా జట్టుకి కూడా రాకూడదు. కాకపోతే రూల్స్ ను పాటించాలి కాబట్టి మనం చేసేది ఏమీ ఉండదు. కంగ్రాట్స్ గర్ల్స్. ఇదొక పెద్ద ఘనత’ అని మిథాలీ పేర్కొన్నారు. వర్షం కారణంగా ఇంగ్లండ్‌తో జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో గ్రూప్ స్టేజ్‌లో టాపర్‌గా ఉన్న భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది. కాకపోతే వర్షం రావడం ఇంగ్లండ్‌కు శాపంగా మారింది. రిజర్వ్ డే లేని కారణంగా నాకౌట్ మ్యాచ్ ఆడకుండానే ఇంగ్లండ్ ఇంటి దారి పట్టింది. మహిళల టి20 ప్రపంచ కప్ చరిత్రలో భారత జట్టు తొలిసారి ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీల్లో ఇప్పటివరకూ మూడు సందర్భాల్లో సెమీస్ వరకే పరిమితమైన భారత మహిళలు.. ఈసారి మాత్రం తుది పోరుకు అర్హత సాధించారు. ఈ రోజు ఇంగ్లండ్‌తో జరగాల్సిన సెమీ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో గ్రూప్-ఎలో అజేయంగా నిలిచిన భారత్ ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. భారీ వర్షం కారణంగా కనీసం టాస్ కూడా పడకుండానే గేమ్ రద్దయ్యింది. (ఐసీసీపై మార్క్ వా ఫైర్) -
ఫైనల్లో టీమిండియా ప్రత్యర్థి ఎవరో?
సిడ్నీ: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఒక ఫైనల్ బెర్త్ ఖరారు కాగా మరో బెర్త్ కోసం ఆతిథ్య ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. గురువారం స్థానిక సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. నాలుగు సార్లు టీ20 ఛాంపియన్‌గా నిలిచిన ఆసీస్ జట్టు స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. కాగా, తొలి సారి ఫైనల్ చేరుకోవడంతో పాటు వరల్డ్ కప్‌తో దక్షిణాఫ్రికాకు వెళ్లాలని ఆ జట్టు ఆరాటపడుతోంది. ఇదే వేదికగా టీమిండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన తొలి సెమీస్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. మ్యాచ్ సమయానికి ఔట్ పీల్డ్ చిత్తడి చిత్తడిగా ఉండటంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు తెలిపారు. అయితే గ్రూప్ దశలో అత్యధిక పాయింట్లతో ఉన్న టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. రెండో మ్యాచ్ ప్రారంభ సమయానికి సిబ్బంది మైదానాన్ని సిద్ధం చేశారు. దీంతో మరో సెమీస్ పోరులో పోటీపడుతున్న ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మ్యాచ్ విజేతతో ఫైనల్లో టీమిండియా తలపడనుంది. చదవండి: ఫైనల్‌కు టీమిండియా తొలిసారి దక్షిణాఫ్రికా ఘనమైన ప్రతీకారం -
అలా అయితే కష్టమయ్యేది: హర్మన్‌ప్రీత్
సిడ్నీ: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఇంగ్లండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో గ్రూప్-ఎలో టాపర్‌గా ఉన్న భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. భారీ వర్షం పడటంతో టాస్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దు కావడంతో టాపర్‌గా ఉన్న భారత్ తుది పోరుకు అర్హత సాధించింది. దాంతో ఇక్కడ ఫైనల్‌కు చేరాలన్న ఇంగ్లండ్ ఆశలు నెరవేరలేదు. ఇక తమ టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత మహిళలు తొలిసారి ఫైనల్‌కు చేరారు. ఇప్పటివరకూ మూడుసార్లు సెమీస్‌కు చేరిన భారత జట్టు.. ఈసారి మాత్రం ఆరంభం నుంచి ఇరగదీస్తూ ఫైనల్ ఆశలను నెరవేర్చుకుంది. (వరల్డ్ టీ20: ఫైనల్‌కు టీమిండియా తొలిసారి) ఇంగ్లండ్‌తో మ్యాచ్ రద్దయిన తర్వాత భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ‘ వాతావరణం కారణంగా మ్యాచ్ రద్దు కావడం నిజంగా దురదృష్టకరం. దాంతో రూల్స్ ప్రకారం మేము ఫైనల్‌కు చేరాం. భవిష్యత్తులో మెగా టోర్నీల నాకౌట్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే అనేది కచ్చితంగా ఉండాలి. ఈ టోర్నీ ఆరంభమైన తొలి రోజు నుంచి మేము ఒకే ఆలోచనతో ఉన్నాం. గ్రూప్‌లో మొత్తం మ్యాచ్‌లను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఒకవేళ సెమీ ఫైనల్‌కు ఏమైన ఆటంకాలు వస్తే అప్పుడు గ్రూప్‌లో మ్యాచ్‌లను పరిగణిలోకి తీసుకుంటారని తెలుసు. మేము గ్రూప్-ఎలో టాపర్‌గా నిలవకుండా ఉండి, అదే సమయంలో సెమీ ఫైనల్ రద్దయితే అప్పుడు ఫైనల్‌కు చేరడం కష్టమయ్యేది. మా జట్టు గ్రూప్ స్టేజ్‌లో అన్ని మ్యాచ్‌లు గెలవడానికి సమష్టి ప్రదర్శనే కారణం. ప్రతీ ఒక్కరూ మంచి టచ్‌లో ఉన్నారు. షఫాలీ, స్మృతీ మంధానాలు మంచి ఆరంభాన్ని ఇస్తున్నారు. టీ20 ఫార్మాట్లో ఓపెనింగ్ అనేది కీలకం. ఒకసారి ఒత్తిడిలో పడ్డామంటే తిరిగి తేరుకోవడం కష్టం. మేము నెట్స్‌లో కూడా సానుకూల ధోరణితోనే ప్రాక్టీస్ చేస్తున్నాం. నేను, మంధానాలు ఇంకా గాడిలో పడాల్సి ఉంది. ఇది టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ మహిళలకు తొలి ఫైనల్. మా అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటాం. వరల్డ్‌కప్‌ను గెలవడానికి శాయశక్తులా కృషి చేస్తాం’ అని అన్నారు. -
వరల్డ్ టీ20: ఫైనల్‌కు టీమిండియా తొలిసారి
సిడ్నీ: మహిళల టి20 ప్రపంచ కప్ చరిత్రలో భారత జట్టు తొలిసారి ఫైనల్‌కు చేరింది. ఈ మెగా టోర్నీల్లో ఇప్పటివరకూ మూడు సందర్భాల్లో సెమీస్ వరకే పరిమితమైన భారత మహిళలు.. ఈసారి మాత్రం తుది పోరుకు అర్హత సాధించారు. ఈ రోజు ఇంగ్లండ్‌తో జరగాల్సిన సెమీ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో గ్రూప్-ఎలో అజేయంగా నిలిచిన భారత్ ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. తన గ్రూప్‌లో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడి పోకుండా అజేయంగా నిలిచింది. ఇంగ్లండ్‌తో నాకౌట్ మ్యాచ్‌కు భారీ వర్షం అంతరాయం కల్గించడంతో కనీసం టాస్ కూడా పడకుండానే గేమ్ రద్దయ్యింది. ఉదయం నుంచి ఎడ తెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండటంతో మ్యాచ్‌ను నిర్వహించాలనే ప్రయత్నాలు సాగలేదు. ఈ వరల్డ్‌కప్‌లో నాకౌట్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే లేకపోవడం గమనార్హం. (నంబర్ వన్‌గా షఫాలీ.. ఐసీసీ స్పెషల్ వీడియో!) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటంతో భారత్‌కు ఫైనల్ చాన్స్ దక్కింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన రెండో సెమీస్ కూడా సిడ్నీ మైదానంలోనే జరుగనుంది. ఒకవేళ ఆసీస్-దక్షిణాఫ్రికాల మ్యాచ్ కూడా రద్దయితే సఫారి టీమ్ ఫైనల్‌కు వెళుతుంది. గ్రూప్ ‘బి’లో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో నిలిచింది. మరి టీమిండియా ఫైనల్ ప్రత్యర్థి ఎవరు అనేది ఈరోజు తేలిపోనుంది. డిఫెండింగ్ చాంపియన్ ఆసీస్ ఫైనల్‌కు చేరుతుందా.. లేక సఫారీలు తుది పోరుకు చేరుకుంటారో చూడాలి. టోర్నీ ప్రారంభానికి ముందు అంగీకరించిన నిబంధనల్లో రిజర్వ్ డే ప్రస్తావన లేకపోవడంతో దీన్ని పెట్టలేదు. ఆలస్యంగా మేలుకున్న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) తర్వాత రిజర్వ్ డే గురించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. ముందుగా అనుకున్నదాని ప్రకారం సెమీఫైనల్ మ్యాచ్‌ల కోసం రిజర్వ్ డే లేదని, చివరి నిమిషంలో షెడ్యూల్ మార్చలేమని సీఏకు ఐసీసీ స్పష్టం చేసింది. సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే పెడితే టోర్నీ వ్యవధి మరింత పెరుగుతుందని, ఇది అనవసరపు ఇబ్బందికి దారి తీస్తుందని కూడా ఐసీసీ వెల్లడించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం వర్షం పడితే పిచ్, మైదానం పరిస్థితులను బట్టి రిఫరీ నిర్ణయం తీసుకుంటారు. కనీసం ఒక్కో జట్టు 10 ఓవర్ల చొప్పున ఆడే అవకాశం ఉంటేనే మ్యాచ్ కొనసాగిస్తారు. అంతకంటే తక్కువ ఓవర్లే సాధ్యమైతే మ్యాచ్ రద్దయినట్లే. -
భారీ వర్షం; ఫైనల్లో భారత్!
సిడ్నీ: మహిళల టి20 ప్రపంచ కప్‌లో భాగంగా జరగనున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. సిడ్నీలో భారీ వర్షం కురుస్తుండటంతో టాస్ ఇంకా వేయలేదు. వర్షం తగ్గే సూచనలు కన్పించడం లేదని స్థానిక సమాచారం. కనీసం 10 ఓవర్లు మ్యాచ్ జరిగే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఒకవేళ వర్షం తగ్గితే వెంటనే మ్యాచ్ జరిపేందుకు నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్, భారత జట్లు తలపడనున్నాయి. రిజర్వ్ డే లేకపోవడంతో మ్యాచ్‌ను ఎట్టిపరిస్థితుల్లోనే ఈరోజే నిర్వహించాలి. ఒకవేళ మ్యాచ్ రద్దయితే భారత్ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటంతో భారత్‌కు ఫైనల్ చాన్స్ దక్కుతుంది. మొదటి మ్యాచ్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన రెండో సెమీస్ రద్దయితే సఫారి టీమ్ ఫైనల్‌కు వెళుతుంది. గ్రూప్ ‘బి’లో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో నిలిచింది. (చదవండి: నాలుగో ప్రయత్నం ఫలిస్తుందా..!) రిజర్వ్ డే ఎందుకు లేదు? టోర్నీ ప్రారంభానికి ముందు అంగీకరించిన నిబంధనల్లో రిజర్వ్ డే ప్రస్తావన లేకపోవడంతో దీన్ని పెట్టలేదు. ఆలస్యంగా మేలుకున్న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) తర్వాత రిజర్వ్ డే గురించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. ముందుగా అనుకున్నదాని ప్రకారం సెమీఫైనల్ మ్యాచ్‌ల కోసం రిజర్వ్ డే లేదని, చివరి నిమిషంలో షెడ్యూల్ మార్చలేమని సీఏకు ఐసీసీ స్పష్టం చేసింది. సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే పెడితే టోర్నీ వ్యవధి మరింత పెరుగుతుందని, ఇది అనవసరపు ఇబ్బందికి దారి తీస్తుందని కూడా ఐసీసీ వెల్లడించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం వర్షం పడితే పిచ్, మైదానం పరిస్థితులను బట్టి రిఫరీ నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ కూడా రద్దయితే రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. -
నాలుగో ప్రయత్నం ఫలిస్తుందా..!
మహిళల టి20 ప్రపంచ కప్ చరిత్రలో భారత జట్టు ఒక్కసారి కూడా ఫైనల్లోకి అడుగు పెట్టలేదు. మూడుసార్లు సెమీఫైనల్‌కే పరిమితమైంది. ఇప్పుడు నాలుగో ప్రయత్నంలో ఆ గీత దాటాలని పట్టుదలగా ఉంది. తాజా ఫామ్, టోర్నీలో అజేయ ప్రదర్శన అందుకు కావాల్సిన స్ఫూర్తిని అందిస్తున్నాయి. ఇది హర్మన్ సేనపై ఉన్న అంచనాలకు సంబంధించి ఒక పార్శ్వం. కానీ అటువైపు చూస్తే ప్రత్యర్థి ఇంగ్లండ్... టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో తలపడిన ఐదు సార్లూ భారత్‌కు పరాజయమే ఎదురైంది. 2018 టోర్నీ సెమీఫైనల్లో కూడా ఇదే జట్టు చేతిలో మన టీమ్ ఓడింది. అప్పుడు కూడా సరిగ్గా ఇలాగే లీగ్ దశలో నాలుగు మ్యాచుల్లోనూ గెలిచి సెమీస్‌లోనే వెనుదిరిగింది. ఇప్పుడు గత రికార్డును మన అమ్మాయిలు సవరిస్తారా, లెక్క సరి చేస్తారా వేచి చూడాలి. సిడ్నీ: లీగ్ దశలో నాలుగు వరుస విజయాలతో సత్తా చాటిన భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌లో అసలు పోరుకు సన్నద్ధమైంది. నేడు జరిగే తొలి సెమీఫైనల్లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. ఈ టోర్నీలో భారత్ ఓటమి లేకుండా అజేయంగా నిలవగా... ఇంగ్లండ్ మాత్రం దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. ఇరు జట్ల మధ్య ముఖాముఖీ పోరులో మాత్రం మన ప్రత్యర్థిదే పైచేయి. అయితే ఎక్కువ మంది యువ ప్లేయర్లతో నిండిన మన జట్టు తాజా ఫామ్ మాత్రం ఫైనల్ చేరడంపై ఆశలు రేపుతోంది. హర్మన్ ఫామ్‌తో ఇబ్బంది! లీగ్ దశలో భారత జట్టు వరుస విజయాల్లో 16 ఏళ్ల షఫాలీ వర్మ కీలక పాత్ర పోషించింది. బుధవారం ప్రకటించిన తాజా ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా కూడా మారిన షఫాలీ 4 ఇన్నింగ్స్‌లలో కలిపి 161 పరుగులు చేసింది. అదీ 166 స్ట్రయిక్ రేట్‌తో కావడం విశేషం. మరోసారి షఫాలీ ఇచ్చే ఆరంభం జట్టుకు కీలకం కానుంది. జెమీమా రోడ్రిగ్స్ (85 పరుగులు), దీప్తి శర్మ (83 పరుగులు) కొంత వరకు ఫర్వాలేదనిపించారు కానీ తొలి స్థానంలో ఉన్న షఫాలీకి వీరిద్దరికి మధ్య పరుగుల్లో చాలా అంతరం ఉంది. అయితే అన్నింటికి మించి భారత్‌ను ఆందోళనకు గురి చేస్తున్న అంశం ఇద్దరు టాప్ బ్యాటర్లు స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ల ఆట. మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో అద్భుతంగా ఆడిన అనుభవంతో స్మృతి ఈసారి వరల్డ్ కప్‌లో భారత్‌ను నడిపిస్తుందని భావిస్తే ఆమె పూర్తిగా నిరాశపర్చింది. 3 మ్యాచ్‌లలో కలిపి 38 పరుగులే చేసింది. ఇక హర్మన్ కౌర్ మరీ ఘోరం. అటు వన్డేలు, ఇటు టి20ల్లో పలు చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన హర్మన్ ఈ మెగా టోర్నీలో పూర్తిగా చేతులెత్తేసింది. ఆమె వరుసగా 2, 8, 1, 15 పరుగులు మాత్రమే చేయగలిగింది. సెమీఫైనల్లోనైనా వీరిద్దరు తమ స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చాల్సి ఉంది. కేవలం షఫాలీ బ్యాటింగ్‌పైనే ఆధారపడితే కీలక మ్యాచ్‌లో భారత్‌కు ఎదురు దెబ్బ తగలవచ్చు. బౌలింగ్‌లో స్పిన్నర్లే భారత్‌కు బలం. తుది జట్టులో శిఖా పాండే రూపంలో ఏకైక పేసర్ ఉన్నా విభిన్న శైలి గల స్పిన్నర్లే ఆటను శాసిస్తున్నారు. లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్, లెఫ్టార్మ్ స్పిన్నర్లు రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మలతో బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పూనమ్ స్పిన్‌ను ఎదుర్కోవడం ప్రత్యర్థులకు శక్తికి మించిన పనిగా మారింది. శిఖా పాండే కూడా చక్కటి ప్రదర్శన కనబర్చింది. ఈ ఐదుగురు బౌలర్ల ఎకానమీ ప్రపంచకప్‌లో 6 దాటకపోవడం విశేషం. గాయాల సమస్య లేదు కాబట్టి శ్రీలంకతో చివరి లీగ్ ఆడిన తుది జట్టునే మార్పుల్లేకుండా భారత్ కొనసాగించనుంది. 2018 ప్రపంచకప్ సెమీస్‌లో ఓడిన జట్టులో ఆడిన ఏడుగురు ప్లేయర్లు ఇప్పుడు భారత జట్టు తరఫున మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. జోరు మీదున్న సివెర్.. వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌ను సెమీఫైనల్ చేర్చడంలో ఇద్దరు బ్యాటర్లు కీలక పాత్ర పోషించారు. నటాలీ సివెర్ 4 మ్యాచ్‌లలో కలిపి 202 పరుగులు చేసింది. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆమెకు కెప్టెన్ హెథర్ నైట్ (193)నుంచి మంచి సహకారం లభించింది. నైట్ ఖాతాలో ఒక శతకం కూడా ఉండటం విశేషం. మరోసారి ఇంగ్లండ్ జట్టు ఈ ఇద్దరి బ్యాటింగ్‌పైనే ఆధారపడుతోంది. వీరిని నిలువరించగలిగితేనే ప్రత్యర్థి పని సులువవుతుంది. అమీ జోన్స్, డానియెలా వ్యాట్ వరుసగా విఫలమవుతున్నారు. అయితే ఇంగ్లండ్ కూడా తమ బౌలింగ్‌ను బాగా నమ్ముకుంది. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్న ఎకెల్‌స్టోన్ పాత్ర మరోసారి కీలకం కానుంది. ఈ బౌలర్ టోర్నీలో ఇప్పటి వరకు కేవలం 3.23 ఎకానమీతో 8 వికెట్లు పడగొట్టింది. ష్రబ్సోల్ కూడా 8 వికెట్లతో అండగా నిలవగా, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను సారా గ్లెన్ కట్టడి చేసింది. ఈ నేపథ్యంలో సెమీస్ పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. వర్షం పడితే ఫైనల్‌కు భారత్.. రిజర్వ్ డే అభ్యర్థనను తిరస్కరించిన ఐసీసీ ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌ల కోసం రిజర్వ్ డే ఉంచాలంటూ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) చేసిన విజ్ఞప్తిని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తోసి పుచ్చింది. స్థానిక వాతావరణ శాఖ సూచన ప్రకారం గురువారం రోజంతా వర్ష సూచన ఉంది. దాంతో కీలకమైన పోరు కాబట్టి రిజర్వ్ డే ఉంటే బాగుంటుందని సీఏ భావించింది. ‘టోర్నీ ప్రారంభానికి ముందు అంగీకరించిన నిబంధనల్లో రిజర్వ్ డే ప్రస్తావన లేదు కాబట్టి ఇప్పుడు కుదరదు’ అని ఐసీసీ తేల్చి చెప్పింది. సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే పెడితే టోర్నీ వ్యవధి మరింత పెరుగుతుందని, ఇది అనవసరపు ఇబ్బందికి దారి తీస్తుందని కూడా ఐసీసీ వెల్లడించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం వర్షం పడితే పిచ్, మైదానం పరిస్థితులను బట్టి రిఫరీ నిర్ణయం తీసుకుంటారు. కనీసం ఒక్కో జట్టు 10 ఓవర్ల చొప్పున ఆడే అవకాశం ఉంటేనే మ్యాచ్ కొనసాగిస్తారు. అంతకంటే తక్కువ ఓవర్లే సాధ్యమైతే మ్యాచ్ రద్దయినట్లే. ఇదే జరిగితే గ్రూప్‌లో పాయింట్ల పరంగా అగ్రస్థానంలో నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరుకుంటాయి. రెండో సెమీస్ కూడా.. తొలి మ్యాచ్ ముగిసిన తర్వాత డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీస్ జరుగుతుంది. గ్రూప్ ‘బి’లో సఫారీ జట్టు అజేయంగా నిలవగా... ఆసీస్ మాత్రం భారత్ చేతిలో ఓడింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం. 1.30 నుంచి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), షఫాలీ, స్మృతి, జెమీమా, దీప్తి, వేద, తానియా, శిఖా పాండే, రాధ, పూనమ్, రాజేశ్వరి. ఇంగ్లండ్: హెథర్ నైట్ (కెప్టెన్), వ్యాట్, బీమాంట్, సివెర్, విల్సన్, అమీ జోన్స్, బ్రంట్, ష్రబ్సోల్, మ్యాడీ విలియర్స్, ఎకెల్‌స్టోన్, సారా గ్లెన్. పిచ్, వాతావరణం స్పిన్‌కు అనుకూలం. వర్షం పడితే పిచ్ స్వభావంలో మార్పు రావచ్చు. మ్యాచ్ సమయంలో వర్ష సూచన ఉంది. ఆటకు అంతరాయం కలిగించడం ఖాయం. 4 - భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య ఇప్పటి వరకు 19 టి20 మ్యాచ్‌లు జరగ్గా... భారత్ 4 గెలిచి, 15 ఓడింది. ఇటీవల ముక్కోణపు టోర్నీలో భాగంగా రెండు సార్లు తలపడగా, ఇరు జట్లు చెరో మ్యాచ్ నెగ్గాయి. -
మ్యాచ్ రద్దయితే.. ఫైనల్‌కు టీమిండియా
సిడ్నీ: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. గ్రూప్ ఏ నుంచి టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు, గ్రూప్ బి నుంచి దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. ఫైనల్ బెర్త్ కోసం తొలి సెమీస్‌లో ఇంగ్లండ్‌తో టీమిండియా, మరో సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆసీస్‌తో దక్షిణాఫ్రికా తలపడనుంది. కాగా, ఈ రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు గురువారం సిడ్నీ వేదికగా జరగనున్నాయి. అయితే సిడ్నీలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ జరగాల్సిన రెండు లీగ్ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. అయితే గురువారం సిడ్నీలో వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ అధికారులు తెలిపారు. మ్యాచ్ సజావుగా సాగే అవకాశం లేదని, మ్యాచ్‌కు పలమార్లు వర్షం అంతరాయం కలిగించే సూచనలు ఉన్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ వర్షం కారణంగా సెమీఫైనల్ మ్యాచ్‌లు రద్దయితే గ్రూప్ దశలో ఆగ్రస్థానంలో ఉన్న జట్లు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటాయని ప్రపంచకప్ నిర్వాహకులు తెలిపారు. దీంతో గ్రూప్-ఏలో టాపర్ టీమిండియా, గ్రూప్-బి టాపర్ దక్షిణాఫ్రికా జట్లు మార్చి 8న మెల్బోర్న్ వేదికగా జరిగే ఫైనల్లో తలపడతాయి. ఇక సెమీఫైనల్లో రిజర్వ్‌డే పెట్టాలన్న ఆసీస్ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించిన విషయం తెలిసిందే. ప్రపంచకప్ షెడ్యూల్ రూపొందాక మార్పులు చేర్పులు సాధ్యం కాదని స్పష్టం చేసింది. అంతేకాకుండా అక్టోబర్‌లో జరగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్ సెమీస్ రిజర్వ్‌డే లేదని వివరించింది. చదవండి: మళ్లీ టాప్‌టెన్‌లోకి వచ్చాడు 'కోహ్లిని చూస్తే నవ్వొస్తుంది' -
నంబర్ వన్‌గా షఫాలీ.. ఐసీసీ స్పెషల్ వీడియో!
మెల్బోర్న్: భారత మహిళా క్రికెటర్, యువ సంచలనం షఫాలీ వర్మ కెరీర్లో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. మహిళల టీ20 ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో పదహారేళ్ల షఫాలీ అగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నారు. రెండేళ్లుగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న న్యూజిలాండ్ బ్యాటర్ సుజీ బేట్స్‌ను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించారు. కాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళా జట్టు సెమీ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్న విషయం తెలిసిందే. గ్రూప్ ఏలో టాపర్‌గా నిలిచిన భారత్... గ్రూప్ బీలో రెండో స్థానంలో ఉన్న మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌తో సెమీస్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా ఢీకొట్టనుంది. (జుట్టు కత్తిరించాల్సి వచ్చింది: క్రికెటర్ తండ్రి) ఇక ఈ మెగా టోర్నమెంట్ ఆరంభం నుంచి అదరగొడుతున్న షఫాలీ... గురువారం ఇంగ్లండ్‌తో జరుగునున్న సెమీస్ మ్యాచ్‌కు ముందే నంబర్ వన్ ర్యాంక్‌కు చేరుకోవడం విశేషం. నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 161 పరుగులు చేసిన.. ఈ యంగ్ బ్యాటర్ భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తర్వాత టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్కు చేరిన రెండో మహిళా క్రికెటర్‌గా నిలిచారు. కాగా తాజా టీ20 వరల్డ్‌కప్‌లో మూడు మ్యాచుల్లో 11 బౌండరీలు, 8 సిక్స్‌లతో మొత్తంగా 114 పరుగులు చేసి172.7 స్టైక్‌రేట్‌ను నమోదు చేసిన షఫాలీ.. ఒక టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక స్టైక్‌రేట్‌ను నమోదు చేసిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ షఫాలీ ప్రత్యేక ఇంటర్వ్యూతో కూడిన వీడియోను షేర్ చేసింది. ‘‘ క్రికెట్ ఆడేందుకు చిన్నతనంలో అబ్బాయిగా నటించిన షఫాలీ వర్మ.. ఇప్పుడు పదహారేళ్ల వయస్సులో టీ20ల్లో ప్రపంచంలోనే నంబర్ వన్ బ్యాటర్‌గా ఎదిగింది! తన స్ఫూర్తివంతమైన ప్రయాణం గురించి ప్రత్యేక ఇంటర్వ్యూ’’ అని ట్వీటర్లో పేర్కొంది. (సచిన్ స్ఫూర్తితో బ్యాట్ పట్టి... ఆయన రికార్డునే సవరించిన చిచ్చర పిడుగు) ఇక మహిళా టీ20 ర్యాంకింగ్స్‌లో బౌలింగ్ విభాగంలో ఇంగ్లండ్ బౌలర్ సోఫీ ఎక్లేస్టోన్ టాప్‌లో నిలిచారు. ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచులు ఆడిన సోఫీ.. మొత్తంగా 8 వికెట్లు తీశారు. కాగా భారత మహిళా బౌలర్లు దీప్తీ శర్మ, రాధా యాదవ్ ర్యాంకులు కోల్పోయి.. వరుసగా ఐదు, ఏడో స్థానాల్లో నిలిచారు. ఇక టోర్నమెంట్లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పేరొందిన భారత లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ నాలుగు స్థానాలు ఎగబాకి.. ఎనిమిదో స్థానానికి చేరుకున్నారు. As a young girl, Shafali Verma pretended to be a boy just so she could play cricket. Now, the 16-year-old has risen to be the No.1 T20I batter in the world! She sat down with us for an exclusive chat about her inspiring journey 📽️ pic.twitter.com/40I8E60u4F — ICC (@ICC) March 4, 2020 -
టీ20 ప్రపంచకప్: సెమీస్ బెర్తులు ఖరారు
మెల్బోర్న్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియా ప్రత్యర్థి ఎవరో తేలింది. గ్రూప్ ఏలో టాపర్‌గా ఉన్న భారత్ గ్రూప్ బిలో రెండో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్‌తో సెమీస్‌లో తలపడనుంది. మరో సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మంగళవారం గ్రూప్ బిలో టాపర్‌ను డిసైడ్ చేసే వెస్టిండీస్-దక్షిణాఫ్రికా మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో గ్రూప్ బిలో అత్యధిక పాయింట్లతో దక్షిణాఫ్రికా జట్టు ప్రపంచకప్-2014 తర్వాత సెమీస్‌లో అడుగుపెట్టింది. రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు గురువారం జరగనున్నాయి. ఇప్పటివరకు మహిళల టీ20 ప్రపంచకప్‌లో మూడు సార్లు సెమీస్ వెళ్లిన భారత జట్టు ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరుకోలేదు. అయితే ఈ సారి ఫైనల్‌కు వెళ్లడంతో పాటు కప్‌ను గెలుచుకోవాలని హర్మన్ సేన ఆరాటపడుతోంది. సీనియర్లు, జూనియర్లతో పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌గా ఉందని, ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా తొలిసారి ఫైనల్‌కు చేరుకుంటుందని ఆసీస్ దిగ్గజ బౌలర్ బ్రెట్ లీ జోస్యం చెప్పాడు. చదవండి: మైకేల్ క్లార్క్ సంచలన వ్యాఖ్యలు కోహ్లికి సూచనలివ్వడానికి మీరెవరు? -
సెమీస్‌లో అడుగుపెట్టిన ఆసీస్
మెల్బోర్న్: మహిళల టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు సత్తా చాటింది. న్యూజిలాండ్‌తో జరిగిన హోరాహోరి మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే గ్రూప్ ‘ఎ’ నుంచి భారత్ సెమీస్ వెళ్లగా.. రెండో బెర్త్ కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు పోటీ పడ్డాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పోరాటం వృథా అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో ఓపెనర్ బీఎల్ మూనీ 50 బంతుల్లో 60 పరుగులు సాధించగా, బౌలింగ్‌లో వేర్హామ్, షుట్‌లు మూడేసి వికెట్లు తీసి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు గ్రూప్ ‘బి’ నుంచి దక్షిణాఫ్రికా, ఇంగ్లడ్ జట్లు సెమీస్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. (చదవండి : సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్) -
సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్
సిడ్నీ: ‘హ్యాట్రిక్’ విజయంతో దక్షిణాఫ్రికా... మూడో గెలుపుతో ఇంగ్లండ్ జట్లు మహిళల టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఆదివారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా 17 పరుగుల ఆధిక్యంతో పాకిస్తాన్‌పై... ఇంగ్లండ్ 46 పరుగుల ఆధిక్యంతో వెస్టిండీస్‌పై గెలుపొందాయి. గ్రూప్ ‘బి’లో తమ నాలుగు లీగ్ మ్యాచ్‌లను పూర్తి చేసుకున్న ఇంగ్లండ్ మూడు విజయాలతో ఆరు పాయింట్లు సంపాదించింది. దక్షిణాఫ్రికా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఆరు పాయింట్లతో ఇంగ్లండ్‌తో సమఉజ్జీగా ఉంది. అయితే మెరుగైన రన్‌రేట్ కారణంగా ఇంగ్లండ్ ఈ గ్రూప్‌లో టాప్ ర్యాంక్‌లో ఉంది. మంగళవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడిస్తే దక్షిణాఫ్రికా గ్రూప్ టాపర్‌గా నిలుస్తుంది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 136 పరుగులు చేసింది. లారా వోల్వార్ట్ (36 బంతుల్లో 53 నాటౌట్; 8 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. మారిజన్ కాప్ (32 బంతుల్లో 31; 2 ఫోర్లు, సిక్స్) కూడా రాణించింది. 137 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 119 పరుగులు చేసి ఓడిపోయింది. జవేరియా ఖాన్ (31; 4 ఫోర్లు), అలియా రియాజ్ (39 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) రాణించినా ఫలితం లేకపోయింది. మాజీ చాంపియన్ వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 143 పరుగులు చేసింది. నటాలీ షివెర్ (56 బంతుల్లో 57; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకుంది. అనంతరం వెస్టిండీస్ 17.1 ఓవర్లలో 97 పరుగులకు ఆలౌటైంది. సోఫీ ఎకిల్‌స్టోన్ 7 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి విండీస్‌ను దెబ్బతీసింది. నేటి గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్‌తో శ్రీలంక; ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ విజేత ఈ గ్రూప్ నుంచి రెండో జట్టుగా సెమీఫైనల్ చేరుకుంటుంది. గ్రూప్ ‘ఎ’లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ అజేయంగా నిలిచి భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్ చేరుకున్న సంగతి తెలిసిందే. -
అమ్మాయిలు అజేయంగా...
మెల్బోర్న్: టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌లో తమ విజయయాత్ర కొనసాగిస్తోంది. వరుసగా నాలుగో విజయం సాధించిన భారత్ గ్రూప్ ‘ఎ’ టాపర్‌గా తమ లీగ్ మ్యాచ్‌లను ముగించింది. శ్రీలంకతో శనివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండిమా ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 113 పరుగులు చేసింది. భారత్ 14.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ షఫాలీ వర్మ (34 బంతుల్లో 47; 7 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత స్పిన్నర్ రాధా యాదవ్ (4/23)కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ గెలుపుతో భారత్ 8 పాయిం ట్లతో గ్రూప్ ‘ఎ’లో అగ్రస్థానం సంపాదించింది. స్పిన్ మ్యాజిక్... టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌కు ఉపక్రమించింది. మూడో ఓవర్ తొలి బంతికే స్పిన్నర్ దీప్తి శర్మ లంక ఓపెనర్ థిమాషినిని అవుట్ చేసింది. ఆ తర్వాత జయాంగని, హర్షిత కొంచెంసేపు వికెట్లను కాపాడుకున్నారు. అయితే హర్షితను బౌల్డ్ చేసి స్పిన్నర్ రాజేశ్వరి ఈ జోడిని విడగొట్టింది. అనంతరం మరో స్పిన్నర్ రాధా యాదవ్ తన మాయాజాలాన్ని ప్రదర్శించింది. శ్రీలంక పతనాన్ని శాసించింది. మరో స్పిన్నర్ పూనమ్ యాదవ్ ఒక వికెట్ తీసింది. మొత్తం శ్రీలంక కోల్పోయిన తొమ్మిది వికెట్లలో ఎనిమిది వికెట్లు స్పిన్నర్లకే రావడం విశేషం. ఆడుతూ... పాడుతూ... 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ షఫాలీ వర్మ మరోసారి మెరిసింది. లంక బౌలర్ల భరతం పట్టింది. ఏడు బౌండరీలు కొట్టింది. మరోవైపు స్మృతి (12 బంతుల్లో 17; 3 ఫోర్లు) కూడా తన జోరు కొనసాగించింది. తొలి వికెట్‌కు 34 పరుగులు జోడించాక స్మృతి పెవిలియన్‌కు చేరింది. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (14 బంతుల్లో 15; 2 ఫోర్లు, సిక్స్)తో షఫాలీ రెండో వికెట్‌కు 47 పరుగులు జత చేసింది. హర్మన్‌ప్రీత్, షఫాలీ అవుటయ్యాక... జెమీమా (15 నాటౌట్; ఫోర్), దీప్తి శర్మ (15 నాటౌట్; 2 ఫోర్లు) నాలుగో వికెట్‌కు అజేయంగా 28 పరుగులు జోడించి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. స్కోరు వివరాలు శ్రీలంక ఇనింగ్స్: థిమాషిని (సి) రాజేశ్వరి (బి) దీప్తి శర్మ 2; జయాంగని (సి) శిఖా పాండే (బి) రాధా యాదవ్ 33; హర్షిత (బి) రాజేశ్వరి 12; హన్సిమ (సి) వేద (బి) రాధా యాదవ్ 7; హాసిని (సి) తానియా (బి) రాధా యాదవ్ 7; శశికళ సిరివర్దనె (సి) వేద (బి) రాజేశ్వరి 13; నీలాక్షి డిసిల్వా (సి) హర్మన్ (బి) పూనమ్ 8; అనుష్క (ఎల్బీడబ్ల్యూ) (బి) రాధా యాదవ్ 1; దిల్హారీ (నాటౌట్) 25; సత్య (బి) శిఖా పాండే 0; ప్రబోధని (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు) 113. వికెట్ల పతనం: 1–12, 2–42, 3–48, 4–58, 5–75, 6–78, 7–80, 8–104, 9–104. బౌలింగ్: దీప్తి శర్మ 4–0–16–1; శిఖా పాండే 4–0–35–1; రాజేశ్వరి 4–1–18–2; పూనమ్ యాదవ్ 4–0–20–1; రాధా యాదవ్ 4–0–23–4. భారత్ ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (రనౌట్) 47; స్మృతి (సి) దిల్హారీ (బి) ప్రబోధని 17; హర్మన్‌ప్రీత్ (సి) హన్సిమ (బి) శశికళ 15; జెమీమా (నాటౌట్) 15; దీప్తి శర్మ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (14.4 ఓవర్లలో మూడు వికెట్లకు) 116 వికెట్ల పతనం: 1–34, 2–81, 3–88. బౌలింగ్: ప్రబోధని 4–0–13–1; శశికళ 4–0–42–1; సత్య సాందీపని 1–0–11–0; జయాంగని 2–0–21–0; దిల్హారీ 3–0–18–0; థిమాషిని 0.4–0–7–0. -
మహిళల టీ20 వరల్డ్‌కప్ శ్రీలంకపై భారత్ ఘన విజయం
-
వరల్డ్ టీ20: భారత్ జైత్రయాత్ర
మెల్బోర్న్: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్రూప్-ఎలో భాగంగా శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించి తమ చివరి గ్రూప్ మ్యాచ్‌ను అజేయంగా ముగించింది. ఫలితంగా గ్రూప్-ఎలో టాప్ ప్లేస్‌ను ఖాయం చేసుకుంది. ఈ రోజు మ్యాచ్‌లో శ్రీలంక మహిళలు నిర్దేశించిన 114 పరుగుల టార్గెట్‌ను భారత జట్టు 14.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దాంతో ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక మహిళలు నిర్ణీత ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేశారు. చమిరా ఆటపట్టు(33), కవిషా దిల్హరి(25)లు మాత్రమే మోస్తరుగా ఆడటంతో లంక సాధారణ స్కోరుకే పరిమితమైంది. (కెప్టెన్ అయినంత మాత్రాన అలా చేస్తావా?) భారత బౌలర్లలో స్పిన్నర్ రాధా యాదవ్ నాలుగు వికెట్లు సాధించగా, మరో స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ రెండు వికెట్లు తీశారు. దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, శిఖా పాండేలకు తలో వికెట్ దక్కింది. స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ జట్టులో ఓపెనర్ స్మృతీ మంధాన(17) మరోసారి నిరాపరిచారు. కాగా, మరో ఓపెనర్ షఫాలీ వర్మ తన ఫామ్‌ను కొనసాగించారు. 34 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 47 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. హాఫ్ సెంచరీకి చేరువగా వచ్చిన షఫాలీ అనవసర పరుగు కోసం యత్నంచి రనౌట్ అయ్యారు. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(15) విఫలం కాగా, రోడ్రిగ్స్( 15 నాటౌట్), దీప్తి శర్మ(15 నాటౌట్)లు చివరి వరకూ క్రీజ్‌లో ఉండి మ్యాచ్‌ను గెలిపించారు. ఈ టోర్నీలో భారత్‌కు వరుసగా నాల్గో విజయం. గత మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయంతో సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్న భారత జట్టు.. తమ ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో కూడా గెలుపును అందుకుని తమ తిరుగులేదని నిరూపించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టీమిండియా టార్గెట్ 114 పరుగులు
మెల్బోర్న్ : టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక టీమిండియాకు 114 పరుగుల స్వల్ప విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేయడంతో లంక 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. లంక బ్యాట్స్వుమెన్లలో చమారి ఆతపత్తు 33 పరుగులు, కవిషా దిల్హరి 25* పరుగులతో రాణించగా మిగతావారు పూర్తిగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రాదా యాదవ్ 4 వికెట్లతో సత్తా చాటగా, రాజేశ్వరి గైక్వాడ్ 2, శిఖా పాండే, పూనమ్ యాదవ్, దీప్తి శర్మ తలా ఒక వికెట్ తీశారు. ఇన్నింగ్స్ ఆసాంతం భారత బౌలర్ల దాటికి లంక బ్యాట్స్‌వుమెన్ పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కాగా ఇప్పటికే హాట్రిక్ విజయాలతో సెమీస్ కు దూసుకెళ్లిన టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి గ్రూఫ్ టాపర్‌గా నిలవనుంది. ప్రసుత్తమున్న టీమిండియా బ్యాటింగ్ లైనఫ్ చూస్తే 114 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించడంలో పెద్దగా కష్టపడనక్కర్లేదనిపిస్తుంది. -
సఫారీ భారీ విజయం
కాన్బెర్రా: మహిళల టి20 ప్రపంచకప్‌లో థాయ్‌లాండ్ కూనపై దక్షిణాఫ్రికా 113 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. సఫారీ ఓపెనర్ లిజెల్లీ లీ (60 బంతుల్లో 101; 16 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగింది. ఆమె సెంచరీలో 82 పరుగులు ఫోర్లు, సిక్సర్లతోనే వచ్చాయి. మొదట దక్షిణాఫ్రికా అమ్మాయిల జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగులు చేసింది. సున్ లూస్ (41 బంతుల్లో 61 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించింది. లీ, లూస్ రెండో వికెట్‌కు 13 ఓవర్లలో 131 పరుగులు జోడించారు. కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన థాయ్‌లాండ్ కూన 19.1 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటైంది. కంచోంఫు (26), సుతిరంగ్ (13)లు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. షబ్నిమ్, లూస్ చెరో 3 వికెట్లు తీశారు. పాక్‌పై ఇంగ్లండ్ జయభేరి మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళలు 42 పరుగుల తేడాతో పాకిస్తాన్ అమ్మాయిలపై గెలిచారు. ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది. హీథెర్ నైట్ (62), సీవెర్ (36) ధాటిగా ఆడారు. ఐమన్కు 3 వికెట్లు దక్కాయి. లక్ష్యఛేదనకు దిగిన పాక్ 19.4 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌటైంది. అలియా (41) ఒంటరి పోరాటం చేసింది. ష్రబ్సోల్, గ్లెన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. -
అజేయంగా ముందుకెళ్తారా..!
మెల్బోర్న్: భారత అమ్మాయిల జట్టు అందరికంటే ముందుగానే సెమీస్ చేరింది. ఇప్పుడు అజేయంగా ముందుకెళ్లడంపై దృష్టిపెట్టింది. మహిళల టి20 ప్రపంచకప్‌లో నేడు గ్రూప్‘ఎ’లో జరిగే తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది. భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో వరుస విజయాలతో ఊపు మీదుంది. మొదట డిఫెండింగ్ చాంపియన్ ఆసీస్‌పై, తర్వాత బంగ్లా, కివీస్‌లను ఓడించిన భారత్ ఇప్పుడు గ్రూప్ టాపర్‌గా ఉంది. ఇలాంటి జట్టు లంకను ఓడించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. పైగా హర్మన్ సేన అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో దుర్భేద్యంగా ఉంది. అందుకేనేమో సారథి హర్మన్ వరుసగా విఫలమవుతున్నా ఆ ప్రభావం జట్టుపై ఏమాత్రం లేదు. 16 ఏళ్ల షఫాలీ వర్మ ప్రత్యర్థుల పాలిట సింహ స్వప్నమవుతోంది. జెమీమా రోడ్రిగ్స్‌తో పాటు మిడిలార్డర్లో తానియా, వేద కృష్ణమూర్తిలు చక్కగా రాణిస్తున్నారు. ఇక బౌలింగ్ అయితే బ్యాటింగ్‌కు దీటుగా ఉంది. గత మూడు మ్యాచ్‌ల్లో మనం చేసిన స్కోర్లను నిలబెట్టిందే బౌలర్లు. స్పిన్నర్ పూనమ్ యాదవ్, పేసర్ శిఖా పాండేలను ఎదుర్కొనేందుకు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఆపసోపాలు పడుతున్నారు. పేలవ ఫామ్‌ను కనబరుస్తున్న హర్మన్‌ప్రీత్ గనక ఈ మ్యాచ్‌తో గాడిన పడితే భారత్ తిరుగులేని జట్టుగా మారడం ఖాయం. మరోవైపు శ్రీలంక అమ్మాయిలది పూర్తిగా భిన్నమైన పరిస్థితి. భారత్ ఆడినవన్నీ గెలిస్తే... లంకేమో ఓడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ లక్ష్యాల్ని బౌలర్లు కాపాడితే... లంక లక్ష్యాలన్నీ చెదిరిపోయాయి. బ్యాటింగ్‌లో కెప్టెన్ జయాంగని ఫామ్‌లో ఉంది. హర్షిత మాధవి, హాసిని పెరీరాలు కూడా మెరుగ్గా ఆడారు. కానీ బౌలింగ్ వైఫల్యం లంకను పరాజయం పాలు చేసింది. రెండు మ్యాచ్‌ల్లో లంక బౌలర్లు తీసింది 7 వికెట్లే కావడం గమనార్హం. దీనివల్లే లంక లక్ష్యాలు నీరుగారిపోతున్నాయి. ఇప్పటికే సెమీస్‌ను కష్టం చేసుకున్న లంక... పరువుకోసమైనా గెలిచేందుకు ఆరాటపడుతోంది. ఉదయం 9.30 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌ను స్టార్‌స్పోర్ట్స్–2 చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది -
రెక్కలు తొడిగి... రివ్వున దూసుకెళ్లి
చిన్నప్పుడు ఆ అమ్మాయి క్రికెటర్ కావాలనుకుంది... మామూలుగా క్రికెట్ ఆడటమే కాదు దేశానికే ప్రాతినిధ్యం వహించింది...ఆమెను ఇంజనీర్‌గా చూడాలని అమ్మానాన్న అనుకున్నారు... సీరియస్‌గా చదువుపై దృష్టి పెట్టి ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆ అమ్మాయి తల్లిదండ్రులకిచ్చిన మాటను నిలబెట్టుకుంది... ఎప్పటికైనా ఎయిర్‌ఫోర్స్‌లో పని చేయాలనేది ఆమె కల... అర్హత పరీక్షలో సత్తా చాటి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌గా ఎంపికైంది... ఒకే అమ్మాయిలో ఇన్ని విభిన్న కోణాలు కలగలిస్తే ఆమె శిఖా పాండే అవుతుంది. ప్రస్తుతం టి20 ప్రపంచకప్‌లో భారత్ వరుస విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న పేస్ బౌలర్. ప్రపంచ కప్ గెలిచిన జట్టులో భాగం కావాలనేది శిఖా బలమైన కోరిక. 2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో తన రనౌట్‌తోనే ఆమె కల చెదిరింది. ఈ సారైనా అది నెరవేరుతుందా అనేది ఆసక్తికరం. (సాక్షి క్రీడా విభాగం): ప్రొఫెషనల్‌గా ఆటలో సత్తా చాటుతూ మరో వైపు సమాంతరంగా ఉన్నత చదువులను కొనసాగించేవారు క్రికెట్ ప్రపంచంలో అతి తక్కువ మంది కనిపిస్తారు. అనిల్ కుంబ్లే, అశ్విన్, అంజుమ్ చోప్రాలాంటి వారు కూడా ఇంజినీరింగ్‌లు చదివినా దానిని పేరుకు, డిగ్రీ పట్టా అందుకోవడం వరకే పరిమితం చేశారు. మరో వైపు ఆటగాళ్లకు ప్రోత్సాహంగా కొన్ని సంస్థలు ఇచ్చే మేనేజర్ తరహా ఉద్యోగాలు కూడా ఉంటాయి. కానీ భారత మహిళా క్రికెటర్ శిఖా సుభాశ్ పాండే మాత్రం వీటికి భిన్నం. తన సామర్థ్యానికి తగినట్లుగా పోటీల్లో నిలిచి తాను అనుకున్న ఉద్యోగంలో చేరింది. ఒక వైపు క్రికెటర్‌గా భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూనే ఎయిర్‌పోర్ట్‌లో కూడా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఆసక్తి, ప్రతిభ ఉంటే ఎన్ని విజయాలైనా సాధించవచ్చని చేతల్లో చూపించిన శిఖా కెరీర్ ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తిదాయకం. జూనియర్ క్రికెట్ నుంచి... శిఖా క్రికెట్ కెరీర్ గోవాలో మొదలైంది. గల్లీల్లో కుర్రాళ్లతో కలిసి ఆడిన ఆమె స్కూల్ క్రికెట్లో సత్తా చాటడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. రాష్ట్ర స్థాయిలో అండర్–17, అండర్–19 స్థాయిలో వరుసగా మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించింది. అప్పుడప్పుడే ఎదుగుతున్న గోవా క్రికెట్లో పెద్దగా పోటీ కూడా లేని సమయం కావడంతో వేగంగా దూసుకుపోవడం సులువైంది. అదే సమయంలో బీసీసీఐ కూడా మహిళా క్రికెట్‌ను గుర్తించడంతో శిఖా ప్రదర్శన అందరి దృష్టినీ ఆకర్షించింది. దాంతో ఉమెన్ చాలెంజర్ టోర్నీ, సౌత్‌జోన్ అండర్–19 జట్లలో అవకాశాలు దక్కాయి. అనంతరం గోవా సీనియర్ టి20 టీమ్‌లో వచ్చేందుకు కూడా ఎక్కువ సమయం పట్టలేదు. 2011లో భారత పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ జట్టుతో టూర్ మ్యాచ్ ఆడిన భారత ‘ఎ’ జట్టులో, ఇంగ్లండ్‌పై ఆడిన బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టులో కూడా చోటు దక్కింది. వరుస వికెట్లతో శిఖా ఈ పోటీల్లో సత్తా చాటింది. ఆపై భారత జట్టులో స్థానం లభించడం లాంఛనమే అయింది. గోవా తరఫున భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తొలి క్రికెటర్‌గా పాండే అరుదైన ఘనత అందుకుంది. ప్రధానంగా పేస్ బౌలరే అయినా...లోయర్ ఆర్డర్లో ధాటిగా ఆడుతూ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. చదువులో తగ్గకుండా... ఆటలో ఎదగాలనుకునేవారికి అందరికంటే ముందుగా కోచ్‌లు, సన్నిహితులు చెప్పే మాట ఒకటే. రెండు పడవల ప్రయాణం మంచిది కాదని, ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని పూర్తిగా దానిపైనే దృష్టి పెట్టాలని సూచిస్తుంటారు. కానీ శిఖా అలా అనుకోలేదు. ఆటలో పడి చదువును ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదు. స్కూల్నుంచి కాలేజీ వరకు మంచి మార్కులతో నంబర్‌వన్‌గా ఉంటూ తనపై నమ్మకాన్ని నిలబెడుతూ వచ్చింది. అప్లయిడ్ మ్యాథమెటిక్స్ అంటే ఆమెకు చాలా ఇష్టం. తల్లిదండ్రుల కిచ్చిన మాట ప్రకారం గోవా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్నుంచి ‘ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్’లో పట్టా అందుకుంది. ఆ అర్హతతో పలు పెద్ద కంపెనీలు ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధమైనా... క్రికెట్లో ముందుకు వెళ్లటమే లక్ష్యంగా పెట్టుకుంది. 2011లో ఎయిర్‌ఫోర్స్‌లోకి ఎంపికైన శిఖా ఏడాది శిక్షణ అనంతరం ఫ్లయింగ్ ఏటీసీ ఆఫీసర్‌గా నియమితురాలైంది. అటు క్రికెట్ ఆడుతూ, ఇటు సీరియస్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆమె తన కెరీర్‌ను కొనసాగించిన తీరు నిజంగా అద్భుతం. గత టి20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టులో చోటు కోల్పోయినా...పట్టుదలతో పోరాడి తిరిగొచ్చిన శిఖా పునరాగమనంలో మరింత పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను పడగొడుతోంది. కరీంనగర్ నుంచి... శిఖా తండ్రి సుభాశ్ పాండే కేంద్రీయ విద్యాలయ(కేవీ) పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో పని చేసిన ఆయన చివరకు గోవాలో స్థిరపడ్డారు. గతంలో తెలంగాణలోని రామగుండంలో ఆయన పని చేశారు. అదే సమయంలో శిఖా కరీంనగర్‌లోనే పుట్టింది. కేవీ కారణంగానే స్పోర్ట్స్‌పై ఆమెకు ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలోని పాలమ్ విమానాశ్రయంలో ఆమె ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. 31 ఏళ్ల శిఖాను పేస్ బౌలర్‌గా, యార్కర్ స్పెషలిస్టుగా తీర్చిదిద్దడంలో భారత మాజీ పేసర్ సుబ్రతో బెనర్జీ కీలక పాత్ర పోషించారు. -
తొలుత కుమ్మేసి.. ఆపై కూల్చేశారు!
కాన్బెర్రా: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా మరో ఘన విజయాన్ని సాధించింది. గ్రూప్-బిలో భాగంగా శుక్రవారం థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా దక్షిణాఫ్రికా మహిళలు తమ టీ20 చరిత్రలో రెండో అతిపెద్ద విజయాన్ని(పరుగుల పరంగా) నమోదు చేశారు. కాగా, మహిళల టీ20 వరల్డ్‌కప్ చరిత్రలోనే ఇది అతి పెద్ద విజయంగా నమోదైంది. మరొకవైపు మహిళల ఈ మెగా ఈవెంట్ చరిత్రలో అత్యధిక పరుగుల రికార్డును కూడా సఫారీలు లిఖించారు. ఈ క్రమంలోనే 2018లో న్యూజిలాండ్‌పై భారత్ సాధించిన 194 పరుగుల రికార్డు బ్రేక్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ మహిళలు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగా, థాయ్‌లాండ్‌ను 19.1 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌట్ చేశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఆరంభంలోనే ఓపెనర్ నీకెర్క్(2) వికెట్‌ను కోల్పోయింది. (ఇక్కడ చదవండి: టీ20ల్లో షఫాలీ వర్మ నయా రికార్డు) ఆ తరుణంలో మరో ఓపెనర్ లిజెల్లీ లీకి జత కలిసిన ఫస్ట్ డౌన్ క్రీడాకారిణి సున్ లూస్ ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఈ క్రమంలోనే లీ శతకంతో మెరిశారు. 60 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 101 పరుగులు చేశారు. ఇది లిజెల్లీకి తొలి టీ20 సెంచరీ. ఈ క్రమంలోనే లూస్‌తో కలిసి 131 పరుగులు భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత లీ పెవిలియన్ చేరారు. ఇక చివరి వరకూ లూస్((61 నాటౌట్; 41 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆకట్టుకోగా చివర్లో ఖోలే ట్రయాన్(24; 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) బ్యాట్ ఝుళిపించారు. దాంతో సఫారీలు 196 పరుగుల టార్గెట్‌ను థాయ్‌లాండ్‌కు నిర్దేశించారు. (ఇక్కడ చదవండి: హ్యాట్రిక్ విజయంతో సెమీస్‌లోకి..) పసికూన అయిన థాయ్‌లాండ్ ఊహించనట్టుగానే ఘోరంగా ఓడిపోయింది. థాయ్‌లాండ్ జట్టులో ఒమిచా కామ్చొంపు(26),సుతిరుయాంగ్(13)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటగా మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ఆ జట్టుకు భారీ ఓటమి ఎదురైంది. సఫారీ బౌలర్లలో షబ్నిమ్ ఇస్లాయిల్, సున్ లూస్‌లు తలో మూడు వికెట్లతో రాణించి థాయ్‌లాండ్ పతనాన్ని శాసించారు. ఎమ్‌లాబా, నీకెర్క్, డీక్లెర్క్‌లు వికెట్ చొప్పున తీశారు. ఇది సఫారీలకు వరుసగా రెండో విజయం. తమ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే. దాంతో గ్రూప్-బి పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా టాప్‌లో కొనసాగుతోంది. -
హ్యాట్రిక్‌తో సెమీస్
భారత మహిళలకు ‘హ్యాట్రిక్’ విజయమైతే దక్కింది. అందరికంటే ముందే సెమీస్‌కు వెళ్లింది. కానీ ఆట ఆఖరి పోరాటమే అందరినీ మునికాళ్లపై నిలబెట్టింది. క్రికెటర్ల వెన్నుల్లో వణుకుపుట్టించింది. ఆఖరి బంతి పడక ముందు ఇరుజట్లకు సమాన అవకాశాలున్నాయి. పడ్డాక భారత్ గెలిచింది... కానీ కివీస్ పోరాటం అదిరింది. ఈ మెగా ఈవెంట్‌కే హైలైట్ అయిన మ్యాచ్‌తో అందరికీ క్రికెట్ మజా దక్కింది. మెల్బోర్న్: ఔరా... మన అమ్మాయిల జట్టు సైరా! న్యూజిలాండ్‌తో ఆడి గెలిచింది. పోరాడి సెమీస్ చేరింది. ఉన్నపళంగా ఉత్కంఠ పెంచిన ఈ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 3 పరుగుల తేడాతో కివీస్‌పై నెగ్గింది. ఈ టి20 ప్రపంచకప్‌కే కిక్కెక్కించే ఈ మ్యాచ్‌లో కివీస్ చివరి బంతిదాకా గెలుపోటముల త్రాసులో నిలిచింది. చివరకు శిఖా యార్కర్‌కు ఓడింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేసింది. ఓపెనింగ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షఫాలీ వర్మ (34 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మళ్లీ దంచేసింది. 14 ఓవర్ల దాకా ఇన్నింగ్స్‌ను ఆమెనే నడిపించింది. జ్వరం నుంచి కోలుకున్న స్మృతి మంధాన (11) విఫలం కాగా, తానియా (25 బంతుల్లో 23; 3 ఫోర్లు) మిగతా వారి కంటే మెరుగ్గా ఆడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (1) విఫలయాత్ర కొనసాగింది. కివీస్ కెప్టెన్ సోఫీ డివైన్ ఏకంగా ఏడుగురు బౌలర్లను రంగంలోకి దించి భారత ఇన్నింగ్స్‌ను చక్కగా కట్టడి చేసింది. మార్చి మార్చి ప్రయోగించిన బౌలర్లతో ఇబ్బంది పడిన జెమీమా రోడ్రిగ్స్ (10), దీప్తి శర్మ (8), వేద (6) పరుగులు చేయలేకపోయారు. రోజ్మేరి మెయిర్, అమెలియా కెర్ చెరో 2 వికెట్లు తీశారు. తహుహు, సోఫీ ఒక్కో వికెట్ పడేశారు. తర్వాత కివీస్ ముందరి కాళ్లకు ముందే బంధం వేశారు భారత బౌలర్లు. ఓపెనర్లు ప్రియెస్ట్ (12), సోఫీ (14), వన్‌డౌన్‌లో సుజీ బేట్స్ (6) అవుట్ కావడంతో 34 పరుగులకే ‘టాప్’ లేచింది. ఈ దశలో మ్యాడీ గ్రీన్ (23 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్), కేటీ మార్టిన్ (28 బంతుల్లో 25; 3 ఫోర్లు) న్యూజిలాండ్‌ను ఓ దారికి తెచ్చారు. చివర్లో అమెలియా కెర్ (19 బంతుల్లో 34 నాటౌట్; 6 ఫోర్లు) శివమెత్తడంతో సాఫీగా సాగుతున్న మ్యాచ్ ఉత్కంఠకు తెరలేపింది. భారత బౌలర్లు దీప్తి, శిఖా, రాజేశ్వరి, పూనమ్, రాధ తలా ఒక వికెట్ తీశారు. షఫాలీ వర్మ 34 బంతుల్లో 46, 4 ఫోర్లు, 3 సిక్స్‌లు టెన్షన్... టెన్షన్... 18వ ఓవర్ ముగిసే సరికి కివీస్ స్కోరు 100/2. గెలిచేందుకు ఇంకా 12 బంతుల్లో 34 చేయాలి. ఈ సమీకరణం భారత అమ్మాయిల జట్టుకే అనుకూలం. ఇక సెమీస్ బాటలో హ్యాట్రిక్ విజయమే అనుకుంటే... అమెలియా కెర్ బౌండరీలతో జూలు విదిల్చింది. పూనమ్ వేసిన 19 ఓవర్లో 18 పరుగులు పిండేసింది. ఆఖరి ఓవరే మిగిలింది. 16 పరుగులు కావాల్సివుంది. మారిన సమీకరణం మన అమ్మాయిల్ని ఒత్తిడిలోకి నెట్టింది. శిఖాపాండే ఆఖరి ఓవర్లో తొలి బంతి బౌండరీకెళ్లింది. 12 చేస్తే గెలుపే. 3 సింగిల్స్ తర్వాత 2 బంతుల్లో 9 చేయాలి. ఇక్కడ మరో ఫోర్. ఆఖరి బంతికి 5 పరుగులు కావాలి. ఫోర్ వస్తే మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళుతుంది. ఉత్కంఠ అమాంతం పెరిగింది. ప్రేక్షకులు ఒళ్లంతా కళ్లు చేసుకున్నారు. శిఖా యార్కర్ కెర్ మతిపోగొట్టింది. అంతే ఓ పరుగొచ్చాక ఇంకో సింగిల్ తీసేలోపే జెన్సన్ రనౌటైంది. ఆఖరిదాకా చెమటలు కక్కిన భారత మహిళలు 3 పరుగులతో గెలిచి ఊపిరిపీల్చుకున్నారు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (సి) జెన్సన్ (బి) కెర్ 46; మంధాన (బి) తహుహు 11; తానియా (సి) కెర్ (బి) మెయిర్ 23; జెమీమా (సి) కెర్ (బి) మెయిర్ 10; హర్మన్‌ప్రీత్ (సి) అండ్ (బి) కాస్పెరెక్ 1; దీప్తి (సి) జెన్సన్ (బి) డివైన్ 8; వేద ఎల్బీడబ్ల్యూ (బి) కెర్ 6; శిఖా నాటౌట్ 10; రాధ రనౌట్ 14; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 133. వికెట్ల పతనం: 1–17, 2–68, 3–80, 4–93, 5–95, 6–104, 7–111, 8–133. బౌలింగ్: తహుహు 2–0–14–1, మెయిర్ 3–0–27–2, డివైన్ 2–0–12–1, పీటర్సన్ 2–0–19–0, జెన్సన్ 3–0–20–0, కెర్ 4–0–21–2, కాస్పెరెక్ 4–0–19–1. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: ప్రియెస్ట్ (సి) రాధ (బి) శిఖా 12; డివైన్ (సి) రాధ (బి) పూనమ్ 14; సుజీ బేట్స్ (బి) దీప్తి 6; మ్యాడీగ్రీన్ (సి) తానియా (బి) రాజేశ్వరి 24; మార్టిన్ (సి) రోడ్రిగ్స్ (బి) రాధ 25; కెర్ నాటౌట్ 34; జెన్సన్ రనౌట్ 11; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 130. వికెట్ల పతనం: 1–13, 2–30, 3–34, 4–77, 5–90, 6–130. బౌలింగ్: దీప్తిశర్మ 4–0–27–1, శిఖాపాండే 4–0–21–1, రాజేశ్వరి 4–0–22–1, పూనమ్ 4–0–32–1, రాధ 4–0–25–1. -
టీ20ల్లో షఫాలీ వర్మ నయా రికార్డు
మెల్బోర్న్: భారత మహిళా క్రికెటర్ షఫాలీ వర్మ నయా రికార్డు నెలకొల్పారు. తాజా టీ20 వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లు ఆడిన షఫాలీ 11 బౌండరీలు, 8 సిక్స్‌లతో మొత్తంగా 114 పరుగులు సాధించారు. ఈ క్రమంలోనే 172.7 స్టైక్‌రేట్‌ను నమోదు చేశారు. ఫలితంగా ఒక టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక స్టైక్‌రేట్‌ను నమోదు చేసిన క్రీడాకారిణిగా షఫాలీ రికార్డును లిఖించారు. ఇక ఓవరాల్‌గా టీ20ల్లో 147. 97 స్టైక్ రేట్‌ను నమోదు చేసి మరో రికార్డును ఖాతాలో వేసుకున్నారు. అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్లో కనీసం 200 పరుగులు సాధించిన జాబితా ప్రకారం అత్యధిక స్టైక్‌రేట్ రికార్డును 16 ఏళ్ల షఫాలీ సొంతం చేసుకున్నారు. దక్షిణాఫ్రికాకు చెంది ఖోల్ టైరోన్, ఆస్ట్రేలియాకు చెందిన అలీసా హేలీ వరుసగా తర్వాత స్థానాల్లో ఉన్నారు. (ఇక్కడ చదవండి: పదే పదే అవే తప్పులు: కెప్టెన్) ఈ రోజు న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో షఫాలీ 34 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు కొట్టి 46 పరుగులు సాధించే క్రమంలో 135.29 స్టైక్‌రేట్‌ను నమోదు చేశారు. ఫలితంగా మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక స్టైక్‌రేట్ రికార్డును సాధించారు. కివీస్‌తో మ్యాచ్‌లో భారత్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 133 పరుగులు చేయగా, కివీస్ 129 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో భారత్ సెమీస్‌లోకి ప్రవేశించింది. తాజా వరల్డ్‌కప్‌లో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. (ఇక్కడ చదవండి: హ్యాట్రిక్ విజయంతో సెమీస్‌లోకి..) ఆమె ఒక రాక్‌స్టార్ మహిళల క్రికెట్ జట్టు సెమీస్‌కు చేరడంపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆనందం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్‌పై విజయం నిజంగా అద్భుతమని కొనియాడాడు. ఒత్తిడిని జయించి కివీస్‌పై పైచేయి సాధించడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ఇక షఫాలీ వర్మను ప్రశంసల్లో ముంచెత్తాడు. ఆమెకు రాక్‌స్టార్ అంటూ ప్రశంసించాడు. -
పదే పదే అవే తప్పులు: కెప్టెన్
మెల్బోర్న్: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో అందరి కంటే ముందుగా సెమీస్ చేరడంపై భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సంతోషం వ్యక్తం చేశారు. తాము సాధారణ స్కోర్లే చేస్తున్నా దాన్ని కాపాడుకుని వరుస విజయాలు సాధించడం ఒకటైతే, సెమీస్‌కు చేరడం ఇంకా కొత్త అనుభూతిని తీసుకొచ్చిందన్నారు. కాకపోతే ముందుగా బ్యాటింగ్ చేసే క్రమంలో తొలి 10 ఓవర్ల పాటు తమ స్కోరు బాగానే ఉంటున్నా, దాన్ని కడవరకూ కొనసాగించకపోవడం నిరాశను మిగులుస్తుందన్నారు. తాము పదే పదే ఒకే తరహా తప్పులు చేయడంతో వికెట్లను చేజార్చుకుంటున్నామన్నారు. తనతో పాటు టాపార్డర్‌లో పలువురు విఫలం కావడంతో భారీ స్కోర్లను చేయలేకపోతున్నామని హర్మన్ ప్రీత్ అన్నారు. రాబోవు టోర్నీలో గాడిలో పడతామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రధానంగా తమ బౌలింగ్ మెరుగ్గా ఉండటంతోనే స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లను కాపాడుకుంటున్నామన్నారు.(ఇక్కడ చదవండి: హ్యాట్రిక్ విజయంతో సెమీస్‌లోకి..) ఇక న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ సోఫీ డివైన్ మాట్లాడుతూ.. ‘ మేము చాలా బాగా ఆడాం. భారత్‌ను 133 పరుగులకే కట్టడి చేయడం నిజంగా గొప్ప విషయం. షెఫాలీ వర్మ ధాటిగా బ్యాటింగ్ చేసినా మిగతా వారిని కట్టడి చేసి సాధారణ స్కోరుకే పరిమితం చేశాం. కానీ ఇంకా ఇక్కడ పరిస్థితులకు అలవాట పడలేదు. బంతి నుంచి మరింత పేస్ మరింత బౌన్స్ వస్తుందని అనుకుంటే అలా జరగలేదు. మేము లైన్ లెంగ్త్‌పైన ఆధారపడి బౌలింగ్ చేశాం. మేము కడవరకూ వచ్చి ఓడిపోవడంతో పెద్దగా బాధనిపించలేదు. ఈ మ్యాచ్ ద్వారా మేము అనేక పాఠాలు నేర్చుకున్నాం’ అని ఆమె అన్నారు. (ఇక్కడ చదవండి: నైట్ సెంచరీ: ఇంగ్లండ్ భారీ విజయం) -
హ్యాట్రిక్ విజయంతో సెమీస్‌లోకి..
మెల్బోర్న్: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు సెమీస్‌లోకి ప్రవేశించింది. గ్రూప్-ఎలో భాగంగా గురువారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకున్న టీమిండియా సెమీస్ బెర్తును అందరికంటే ముందుగా ఖాయం చేసుకుంది. కివీస్‌తో మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. దాంతో 134 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 6 వికెట్ల నష్టానికి 129 పరుగులకే పరిమితమైంది. ఆఖరి ఓవర్ వరకూ కివీస్ పోరాడినా విజయాన్ని సాధించలేకపోయింది. చివరి ఓవర్లో కివీస్ విజయానికి 16 పరుగులు కావాల్సిన తరుణంలో ఆ జట్టు 11 పరుగులకే పరిమితమై ఓటమి చవిచూసింది.. కివీస్ బ్యాటింగ్ లైనప్‌లో అమేలియా కెర్(34 నాటౌట్; 19 బంతుల్లో 6 ఫోర్లు) చివరి వరకూ పోరాటం కొనసాగించగా, మ్యాడీ గ్రీన్(24), క్యాటీ మార్టిన్(25)లు ఫర్వాలేదనిపించారు. భారత బౌలింగ్‌లో శిఖా పాండే, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్, రాధా యాదవ్‌లు తలో వికెట్ తీశారు.( ఇక్కడ చదవండి: నైట్ సెంచరీ: ఇంగ్లండ్ భారీ విజయం) ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో షపాలీ(34 బంతుల్లో46; 4ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. టాస్ గెలిచిన కివీస్.. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో ఓపెనర్ స్మృతి మంధాన (11) వచ్చి వెళ్లగా.. అనూహ్యంగా క్రీజులోకి వచ్చిన తానియా భాటియా కాసేపు మెరుపులు మెరిపించారు. అయితే అదే ఊపులో రోజ్మెరి బౌలింగ్‌లో తానియా(23) క్యాచ్ ఔటాయ్యారు. అయితే మరోవైపు షఫాలీ తనదైన రీతిలో బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో పదిఓవర్లు ముగిసేసరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులతో పటిష్టస్థితిలో నిలిచింది. అయితే పదకొండో ఓవర్ నుంచి కివీస్ గేమ్ ప్లాన్ మార్చింది. భారత బ్యాటర్స్‌కు ఊరించే బౌలింగ్ వేస్తూ వికెట్లను పడగొట్టింది. అయితే కీవీస్ ప్లేయర్స్ అనే క్యాచ్‌లను జారవిడచడంతో టీమిండియా బ్యాటర్‌కు అనేక అవకాశాలు లభించాయి. కానీ వాటిని అందిపుచ్చుకోవడంలో విఫలమ్యారు. ఈ క్రమంలో రోడ్రిగ్స్(10) నుంచి ప్రారంభమైన వికెట్ల పతనం ఇన్నింగ్స్ చివరి బంతి వరకు సాగింది. హర్మన్(1), దీప్తి శర్మ(8), వేదా కృష్ణమూర్తి(6) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దాంతో భారత్ భారీ స్కోరు చేయలేకపోయింది. అయినప్పటికీ ఆ స్కోరును కాపాడుకుని మరో గెలుపును అందుకోవడంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. గ్రూప్ స్టేజ్‌లో భారత మహిళలు తమ చివరి మ్యాచ్‌ను శనివారం శ్రీలంకతో ఆడనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టీ20 ప్రపంచకప్ : ఉత్కంఠ పోరులో భారత్ విజయం
-
నైట్ సెంచరీ: ఇంగ్లండ్ భారీ విజయం
కాన్బెర్రా: కెప్టెన్ హెథర్ నైట్ (66 బంతుల్లో 108 నాటౌట్; 13 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీ... నటాలీ షివెర్ (52 బంతుల్లో 59 నాటౌట్; 8 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీ చేయడంతో మహిళల టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టు తొలి విజయం నమోదు చేసింది. థాయ్‌లాండ్ జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 98 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత ఇంగ్లండ్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 176 పరుగులు చేసింది. హెథర్ నైట్, షివెర్ మూడో వికెట్‌కు అజేయంగా 169 పరుగులు జోడించి ఇంగ్లండ్‌కు భారీ స్కోరు అందించారు. ప్రపంచకప్ చరిత్రలో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన థాయ్‌లాండ్ 20 ఓవర్లు ఆడి 7 వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసి ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. -
‘భారీగా అనుకుంటే.. 133 పరుగులే కొట్టారు’
మెల్బోర్న్: పది ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు. క్రీజులో టీనేజర్ సంచలనం షఫాలీ వర్మ, నమ్మదగ్గ బ్యాటర్ రోడ్రిగ్స్. ఇంకా హర్మన్ ప్రీత్ కౌర్, వేదా కృష్ణమూర్తి, దీప్తి శర్మలు బ్యాటింగ్‌కు సిద్దంగా ఉన్నారు. దీంతో టీమిండియా అవలీలగా 150 పరుగులు దాటుతుందనుకున్నారు. కానీ చివరకి 8 వికెట్లు కోల్పోయి 133 పరుగులకే పరిమితమయ్యారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో షపాలీ(34 బంతుల్లో46; 4ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ముఖ్యంగా మిడిలార్డర్ కివీస్ బౌలింగ్‌కు తడబడి వెనుదిరిగారు. బౌలింగ్‌లో అమెలియా కెర్(2/21), రోజ్మెరీ మెయిర్(2/27) కీలక సమయంలో వరుసగా వికెట్లు పడగొట్టారు. ఫస్టాఫ్ మనది.. సెకండాఫ్ వారిది టాస్ గెలిచిన కివీస్ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఐసీసీ టోర్నమెంట్లలలో తన ఫేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ స్మృతి మంధాన (11) వచ్చి వెళ్లగా.. అనూహ్యంగా క్రీజులోకి వచ్చిన తానియా భాటియా కాసేపు మెరుపులు మెరిపించారు. అయితే అదే ఊపులో రోజ్మెరి బౌలింగ్‌లో తానియా(23) క్యాచ్ ఔటాయ్యారు. అయితే మరోవైపు షఫాలీ తనదైన రీతిలో బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో పదిఓవర్లు ముగిసేసరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులతో పటిష్టస్థితిలో నిలిచింది. అయితే పదకొండో ఓవర్ నుంచి కివీస్ గేమ్ ప్లాన్ మార్చింది. భారత బ్యాటర్స్‌కు ఊరించే బౌలింగ్ వేస్తూ వికెట్లను పడగొట్టింది. అయితే కీవీస్ ప్లేయర్స్ అనే క్యాచ్‌లను జారవిడచడంతో టీమిండియా బ్యాటర్‌కు అనేక అవకాశాలు లభించాయి. కానీ వాటిని అందిపుచ్చుకోవడంలో విఫలమ్యారు. ఈ క్రమంలో రోడ్రిగ్స్(10) నుంచి ప్రారంభమైన వికెట్ల పతనం ఇన్నింగ్స్ చివరి బంతి వరకు సాగింది. హర్మన్(1), దీప్తి శర్మ(8), వేదా కృష్ణమూర్తి(6) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దీంతో స్కోర్ బోర్డు మందగించింది. ఓ క్రమంలో కనీసం వంద పరుగులైన టీమిండియా క్రాస్ చేస్తుందా అనే అనుమానం తలెత్తింది. కానీ చివర్లో రాధా యాదవ్(14), శిఖా పాండే(10 నాటౌట్)లు ధాటిగా ఆడటంతో టీమిండియా ఓ మోస్తారు స్కోర్‌ను సాధించింది. చదవండి: రెండు అవకాశాలు.. నో యూజ్ ‘డ్యాన్స్ బాగుంది.. ట్రోఫీ తెస్తే ఇంకా బాగుంటుంది’ -
రెండు అవకాశాలు.. నో యూజ్
మెల్బోర్న్: శ్రీలంకతో జరిగిన వన్డేలో నాలుగు పరుగుల వద్ద వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏకంగా 264 పరుగులు సాధించాడు టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ప్రత్యర్థిజట్టు ఆటగాళ్ల తప్పిదాలతో బ్యాటర్లకు అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి. కానీ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే భారీ స్కోర్లు నమోదు చేసి చరిత్ర లిఖించవచ్చు. అయితే సంచలన బ్యాట్స్‌వుమెన్ షఫాలీ వర్మ తనకు రెండు అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ టీనేజర్‌కు 25,32 పరుగుల వద్ద రెండు జీవనాధారాలు లభించాయి. కానీ భారీ స్కోర్ చేయడంలో విఫలమై 46 పరుగులకే వెనుదిరిగింది. హయ్‌లీ జెన్సెన్ బౌలింగ్‌లో షఫాలీ 25 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను మాడీ గ్రీన్ జారవిడవగా, 32 పరుగుల వద్ద రోజ్మెరీ మెయిర్ బౌలింగ్‌లో మరో లైఫ్ లభించింది. అయితే వరుసగా వికెట్లు పడుతుండటం, రెండు అవకాశాలు లభించడంతో షఫాలీపై అందరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే అప్పటికీ పలు నిర్లక్ష్యపు షాట్లు ఆడిన షఫాలీ అమెలియా కెర్ బౌలింగ్‌లో అనవసరపు భారీ షాట్ ఆడి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగి ఫ్యాన్స్‌ను ఘోరంగా నిరుత్సాహపరిచారు. కీలక సమయంలో జట్టును ఆదుకునే అవకాశం లభించినా షఫాలీ నిర్లక్ష్యంగా ఆడటంపై విమర్శకులు మండిపడుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన(11), రోడ్రిగ్స్(10), హర్మన్‌ప్రీత్ కౌర్(1), వేద కృష్ణమూర్తి(6)లు కివీస్ బౌలింగ్ దాటికి పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో టీమిండియా భారీ స్కోర్ సాధిస్తుందనుకోగా వరుస వికెట్లతో ఓ మోస్తారు స్కోర్‌కే పరిమితమైంది. చదవండి: ‘డ్యాన్స్ బాగుంది.. ట్రోఫీ తెస్తే ఇంకా బాగుంటుంది’ ‘ఆమెకు మేనేజ్మెంట్ లైసెన్స్ ఇచ్చింది’ -
టీమిండియాదే తొలుత బ్యాటింగ్
మెల్బోర్న్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా నేడు న్యూజిలాండ్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ బౌలింగ్ ఎంచుకుంది. జ్వరం కారణంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు దూరమైన స్టార్ ఓపెనర్ సృతి మంధాన తిరిగి జట్టులోకి చేరారు. అదేవిధంగా రాధా యాదవ్‌ను కూడా తుదిజట్టులోకి తీసుకున్నారు. వీరిద్దరి జట్టులో చేరడంతో అరుంధతి, రిచాలపై వేటు పడింది. టాస్‌లో భాగంగా హర్మన్ మాట్లాడుతూ.. టాస్ గెలిచినా తాము తొలుత బ్యాటింగ్ తీసుకుందామనుకున్నామని తెలిపారు. గత రెండు మ్యాచ్‌ల్లో తాను అంతగా రాణించలేదని, కివీస్‌పై మంచి ప్రదర్శన చేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా మంచి ప్రదర్శన ఇవ్వడానికి తమ ప్లేయర్స్ సిద్దంగా ఉన్నట్లు హర్మన్ వివరించారు. ఇక ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లపై అద్భుత విజయాలు సాధించిన టీమిండియా హ్యాట్రిక్‌పై కన్నెసింది. కివీస్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచి గ్రూప్ ఏలో టాప్ ప్లేస్‌తో పాటు సెమీస్‌కు మార్గం సుగుమం చేసుకోవాలని హర్మన్ సేన ఆరాటపడుతోంది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి 16 ఏళ్ల టీనేజ్ సంచలనం షఫాలీ వర్మ, నిలకడైన ఆటతీరుతో రాణిస్తున్న రోడ్రిగ్స్లపైనే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరికి స్మృతి మంధాన, హర్మన్లు జతకలిస్తే కివీస్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించవచ్చు. ఇక బౌలింగ్‌లో పూనమ్ యాదవ్ బెబ్బులిలా రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. తన స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యిర్థి బ్యాటర్ల్ను ముప్పుతిప్పలు పెడుతుండగా.. శిఖా పాండే తన అనుభవంతో కీలక సమయంలో వికెట్లు సాధిస్తున్నారు. తుది జట్లు: టీమిండియా: హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, తానియా భాటియా, జెమీమా రోడ్రిగ్స్, వేదా కృష్ణమూర్తి, దీప్తి శర్మ, శిఖా పాండే, రాధా యాదవ్, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్ న్యూజిలాండ్: సోఫీ డివైన్(కెప్టెన్), రేచల్ ప్రీస్ట్, సుజీ బేట్స్, మాడీ గ్రీన్, కాటీ మార్టన్, అమెలియా కెర్, హయ్‌లీ జెన్సెన్, అన్నా పీటర్సన్, లీ కాస్పెరెక్, లియా తహుహు, రోజ్మెరీ మెయిర్ చదవండి: ‘డ్యాన్స్ బాగుంది.. ట్రోఫీ తెస్తే ఇంకా బాగుంటుంది’ ‘ఆ విషయంలో ఆమెకు ఫుల్ లైసెన్స్’ -
‘డ్యాన్స్ బాగుంది.. ట్రోఫీ తెస్తే ఇంకా బాగుంటుంది’
హైదరాబాద్: వయసు 20 ఏళ్లు కూడా లేవు.. జట్టులోకి వచ్చి రెండేళ్లు కూడా కాలేదు.. కానీ ఆమె క్రీజులో ఉందంటే అటు అభిమానులకు.. ఇటు సారథికి కొండంత విశ్వాసం. క్లిష్ట సమయాలలో నిలకడగా, ఎంతో బాధ్యతాయుతంగా ఆడుతూ అందరి మన్ననలను పొందుతోంది టీమిండియా బ్యాట్స్‌వుమెన్ జెమీమా రోడ్రిగ్స్. అయితే మైదానంలో ప్రొఫెషనల్ ఆటతీరును ప్రదర్శించే రోడ్రిగ్స్.. మైదానం వెలుపల చేసే సందడి మామూలుగా ఉండదు. సహచర క్రికెటర్లు, ఫ్యాన్స్‌తో చేసే సందడి, అల్లరిని అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా రోడ్రిగ్స్‌కు ఐసీసీ కూడా ఫిదా అయింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈ రోజు న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడనుంది. ఈ క్రమంలో ప్రాక్టీస్ ముగించుకుని డ్రెస్సింగ్ రూమ్‌కు బయల్దేరిన రోడ్రిగ్స్ సెక్యూరిటీ గార్డుతో కలిసి సరదాగా డ్యాన్స్ చేసింది. చాలా ఫన్‌గా ఉన్న ఆ వీడియోను ఐసీసీ తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం రోడ్రిగ్స్ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెక్యూరిటీతో కాలు కదిపిన రోడ్రిగ్స్‌కు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. వరుస మ్యాచ్‌లు, ప్రాక్టీస్ సెషన్లు, వ్యూహప్రతివ్యూహాలతో ఆటగాళ్లపై ఒత్తిడి ఉంటుందని ఇలాంటి వాటితో కాస్త ఉపశమనం పొందుతారని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇక ‘డ్యాన్స్ బాగుంది.. ప్రపంచకప్ ట్రోఫీ తెస్తే ఇంకా బాగుంటుందని’మరో నెటిజన్ కామెంట్ చేశాడు. Yes, @JemiRodrigues! 💃💃 Busting moves with an off-duty security guard at the #T20WorldCup pic.twitter.com/ehUdGQc3QV — ICC (@ICC) February 27, 2020 More like JeMEMEah Rodrigues 😏pic.twitter.com/D3u7J0ET3T — ICC (@ICC) February 22, 2020 చదవండి: హ్యాట్రిక్‌పై భారత్ గురి అతడు బౌలర్ కెప్టెన్: ఓజా -
హ్యాట్రిక్‌పై భారత్ గురి
మెల్బోర్న్: టోర్నీ మొదలైన రోజే నాలుగుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియాను కంగుతినిపించిన భారత మహిళలు... అదే జోరుతో బంగ్లాదేశ్‌నూ చిత్తు చేశారు. ఇప్పుడు హ్యాట్రిక్‌పై కన్నేసిన హర్మన్‌ప్రీత్ సేన అందరికంటే ముందుగా సెమీస్ చేరాలని తహతహలాడుతోంది. మహిళల టి20 ప్రపంచకప్‌లో గ్రూప్ ‘ఎ’లో ఇప్పటిదాకా ఎదురులేని భారత జట్టు గురువారం జరిగే పోరులో న్యూజిలాండ్‌తో తలపడనుంది. గత రెండు మ్యాచ్‌ల్లో మన అమ్మాయిలు ఇటు బ్యాటింగ్‌లోనూ, అటు బౌలింగ్‌లోనూ అదరగొట్టారు. 16 ఏళ్ల టీనేజ్ సంచలనం షఫాలీ వర్మ మెరుపుదాడి... టాపార్డర్ బ్యాట్స్‌మన్ జెమీమా రోడ్రిగ్స్ బాధ్యతాయుత బ్యాటింగ్ భారత ఇన్నింగ్స్‌కు బలంకాగా... బౌలింగ్‌లో పూనమ్ యాదవ్ తన స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతోంది. అయితే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నుంచే ఇంకా అవసరమైన మెరుపులు రాలేదు. బహుశా కివీస్‌తో నేడు జరిగే మ్యాచ్‌లో ఆ లోటు తీర్చుకునే అవకాశముందేమో చూడాలి. జ్వరంతో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమైన డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన జట్టులోకి రావడం భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను మరింత పటిష్టం చేసింది. మిడిలార్డర్లో దీప్తి శర్మతో పాటు వేద కృష్ణమూర్తి మెరుపులు మెరిపించగలరు. స్పిన్నర్ పూనమ్‌తో పాటు పేసర్ శిఖా పాండే వెటరన్ స్టార్ జులన్ గోస్వామి లేని లోటును సమర్థంగా భర్తీ చేస్తోంది. గత రెండు మ్యాచ్‌ల్లో భారత విజయానికి బౌలింగ్ దళం ఎంతగానో దోహదపడింది. ఇక కివీస్ విషయానికొస్తే... భారత్‌పై ఆ జట్టుకు మంచి రికార్డు ఉంది. గత మూడు ముఖాముఖి పోటీల్లో న్యూజిలాండే గెలిచింది. కెప్టెన్, ఆల్‌రౌండర్ సోఫీ డివైన్, సుజీ బేట్స్... బౌలింగ్‌లో లియా తహుహు, అమెలియా కెర్ జట్టుకు ప్రధాన బలం కాగా... ఫామ్‌లో ఉన్న భారత్‌ను కివీస్ ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి. -
‘ఆ విషయంలో ఆమెకు ఫుల్ లైసెన్స్’
పెర్త్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అదరగొడుతోంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించిన హర్మన్ సేన.. రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను బొల్తా కొట్టిచ్చింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిసిన టీమిండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా భారత టీనేజ్ ఓపెనర్ షఫాలీ దూకుడైన బ్యాటింగ్‌కు విమర్శకులు సైతం ఫిదా అవుతున్నారు. ప్రపంచకప్ వంటి మెగాటోర్నీలో పదహారేళ్ల షఫాలీ ఏ మాత్రం భయం బెరుకు లేకుండా ఆడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో ఆమెపై సీనియర్ క్రికెటర్ శిఖా పాండే ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ‘పదహారేళ్ల షఫాలీ నిజంగా ఓ అద్భుతం. ఆ వయసులో నేను క్రికెట్లో పూర్థి స్థాయి శిక్షణ తీసుకోలేదు. కానీ ఆమె ఏకంగా టీమిండియా తరుపున ప్రపంచకప్‌లో ఆడుతోంది. అంతేకాకుండా మా జట్టులో యంగ్ అండ్ ఫియర్లెస్ క్రికెటర్ షఫాలీనె. ఇక మేము ఆమె ఆటలో ఎలాంటి మార్పు కోరుకోవడం లేదు. అలాగే స్వేచ్ఛగా, నిర్భయంగా ఆడాలి. ఈ విషయంలో షఫాలీ వర్మకు టీమ్‌మేనేజ్‌మెంట్ పూర్తి స్థాయిలో లైసెన్స్ ఇచ్చింది. మరో యంగ్ క్రికెటర్ రోడ్రిగ్స్ ఎంతో అనుభవం కలిగిన బ్యాటర్‌గా రాణాస్తోంది. కష్టకాలంలో ఆమె పోరాటం అద్వితీయం’అంటూ శిఖా పాండే పేర్కొన్నారు. జ్వరంతో బంగ్లాదేశ్ మ్యాచ్‌కు దూరమైన టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన గురువారం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటుందని సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: అమ్మాయిలు అదరగొట్టేశారు ట్రంప్‌ను ట్రోల్ చేసిన పీటర్సన్, ఐసీసీ సిగ్గు పడాల్సిందేమీ లేదు: కోహ్లి -
అమ్మాయిలు అదరగొట్టేశారు
డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాపై శుభారంభం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో భారత మహిళలు గ్రూప్ ‘ఎ’లో టాప్ గేర్‌లో దూసుకెళ్తున్నారు. బంగ్లాదేశ్‌తో జరిగిన పోరులో బ్యాటింగ్‌లో షఫాలీ మెరిపించగా... బౌలింగ్‌లో పూనమ్ యాదవ్ మళ్లీ ప్రత్యర్థిని తిప్పేసింది. దీంతో భారత అమ్మాయిల జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సెమీఫైనల్ దిశగా అడుగు ముందుకేసింది. పెర్త్: ఆల్‌రౌండ్ ప్రతాపంతో భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌లో వరుసగా రెండో విజయాన్ని సాధించింది. సోమవారం హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 18 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ (17 బంతుల్లో 39; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగింది. తర్వాత బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 124 పరుగులకే పరిమితమైంది. నిగర్ సుల్తానా (26 బంతుల్లో 35; 5 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ (3/18) మళ్లీ ఆకట్టుకుంది. షఫాలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. దాంతో షఫాలీ టి20 ప్రపంచకప్ చరిత్రలో పిన్న వయస్సులో (16 ఏళ్ల 27 రోజులు) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో ఈనెల 27న మెల్బోర్న్లో న్యూజిలాండ్ జట్టుతో ఆడుతుంది. షఫాలీ సిక్సర్లు... భారత టీనేజ్ ఓపెనర్ షఫాలీ వర్మ సిక్సర్లతో దంచేసింది. దీంతో స్కోరు శరవేగంగా కదిలింది. జ్వరం కారణంగా రెగ్యులర్ ఓపెనర్ స్మృతి మంధాన ఈ మ్యాచ్‌కు దూరమైంది. తానియా భాటియా ఓపెనర్‌గా వచ్చినా 2 పరుగులే చేసి అవుటైంది. అయితే షఫాలీ, జెమీమా రోడ్రిగ్స్ (37 బంతుల్లో 34; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి మెరుపులు మెరిపించింది. భారత్ 5.1 ఓవర్లోనే 50 పరుగులను చేరుకుంది. ఆమె అవుటయ్యాక స్కోరు మందగించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (8), దీప్తి శర్మ (11)లు పెద్దగా స్కోర్లేమీ చేయలేదు. కానీ చివర్లో వేద కృష్ణమూర్తి (11 బంతుల్లో 20 నాటౌట్; 4 ఫోర్లు) ధాటిగా ఆడింది. దీంతో ప్రత్యర్థి ముందు సవాల్‌తో కూడిన లక్ష్యాన్ని ఉంచగలిగింది. క్రమం తప్పని పతనం... తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాదేశ్ ఆరంభం నుంచే వికెట్లను పారేసుకుంది. దీంతో ఏ దశలోనూ లక్ష్యంవైపు కన్నెత్తి చూడలేదు. ఓపెనర్ ముర్షిదా ఖాతున్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు), మిడిలార్డర్లో నిగర్ సుల్తానా (26 బంతుల్లో 35; 5 ఫోర్లు) మెరుగ్గా ఆడగలిగారు. మిగతా వాళ్లను భారత బౌలర్లు సులభంగానే బోల్తా కొట్టించడంతో క్రమం తప్పకుండా బంగ్లాదేశ్ వికెట్లు పతనమయ్యాయి. శిఖా పాండే, హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి తలా 2 వికెట్లు తీశారు. రాజేశ్వరి గైక్వాడ్‌కు ఒక వికెట్ దక్కింది. సోమవారమే జరిగిన మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: తానియా (స్టంప్డ్) నిగర్ (బి) సల్మా 2; షఫాలీ వర్మ (సి) షమీమా (బి) పన్నా ఘోష్ 39; రోడ్రిగ్స్ (రనౌట్) 34; హర్మన్‌ప్రీత్ (సి) రుమానా (బి) పన్నా ఘోష్ 8; దీప్తి శర్మ (రనౌట్) 11; రిచా (సి) నహీదా అక్తర్ (బి) సల్మా 14; వేద (నాటౌట్) 20; శిఖా పాండే (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1–16, 2–53, 3–78, 4–92, 5–111, 6–113. బౌలింగ్: జహనారా 4–0–33–0, సల్మా 4–0–25–2, నహీదా అక్తర్ 4–0–34–0, పన్నా ఘోష్ 4–0–25–2, రుమానా 2–0–8–0, ఫాహిమా 2–0–16–0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: షమీమా సుల్తానా (సి) దీప్తి (బి) శిఖా 3; ముర్షిదా (సి) రిచా (బి) అరుంధతి రెడ్డి 30; సంజిదా ఇస్లామ్ (సి) తానియా (బి) పూనమ్ యాదవ్ 10; నిగర్ సుల్తానా (సి) అరుంధతి (బి) రాజేశ్వరి 35; ఫర్జానా హక్ (సి) తానియా (బి) అరుంధతి రెడ్డి 0; ఫాహిమా (సి) షఫాలీ (బి) పూనమ్ యాదవ్ 17; జహనార (స్టంప్డ్) తానియా (బి) పూనమ్ యాదవ్ 10; రుమానా (బి) శిఖా 13; సల్మా (నాటౌట్) 2; నహీదా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 124. వికెట్ల పతనం: 1–5, 2–44, 3–61, 4–66, 5–94, 6–106, 7–108, 8–121. బౌలింగ్: దీప్తి శర్మ 4–0–32–0, శిఖా పాండే 4–0–14–2, రాజేశ్వరి 4–0–25–1, అరుంధతి 4–0–33–2, పూనమ్ 4–0–18–3. -
అరుంధతి మెరిస్తే.. పూనమ్ తిప్పేసింది..!
పెర్త్: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-ఎలో భాగంగా సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. ఆసీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్ పూనమ్ యాదవ్ మరోసారి తన మ్యాజిక్‌ను ప్రదర్శించింది. మూడు వికెట్లు సాధించి బంగ్లాదేశ్ కష్టాల్లోకి నెడితే, హైదరాబాద్ పేసర్ అరుంధతి రెడ్డి రెండు వికెట్లతో మెరిసింది. ఇక శిఖా పాండే కూడా రెండు వికెట్లతో ఆకట్టుకోవడంతో భారత్ సునాయాసంగా విజయం సాధించింది. రాజేశ్వరి గైక్వాడ్‌కు వికెట్ లభించింది. భారత్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ ఐదు పరుగుల వద్ద ఓపెనర్ షమీనా సుల్తానా(3) వికెట్‌ను కోల్పోయింది. రెండో ఓవర్ తొలి బంతికి షమీనాను ఔట్ చేసి శిఖా పాండే మంచి బ్రేక్ ఇచ్చింది. ఆపై ముర్షిదా ఖతున్(30)ను అరుంధతి రెడ్డి ఔట్ చేయడంతో బంగ్లాదేశ్ 44 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయింది. ఆ తరుణంలో పూనమ్ యాదవ్ తన స్పిన్ మాయాజాలంతో బంగ్లాదేశ్‌ను వణికించింది. ఈ క్రమంలోనే సంజిదా ఇస్లామ్(10)ను పూనమ్ ఔట్ చేయగా, ఫర్గానా హాక్‌ను అరుంధతి డకౌట్‌గా పెవిలియన్‌కు పంపడంతో బంగ్లాపై ఒత్తిడి పెరిగింది. అటు తర్వాత ఫహిమా ఖతున్(17), జహనారా అలామ్(10)లను వరుస విరామాల్లో పూనమ్ ఔట్ చేయగా నిగార్ సుల్తానా(35) ప్రమాదకరంగా మారిన తరుణంలో రాజశ్వేరి వికెట్‌ను తీసింది. ఇలా బంగ్లాదేశ్‌ను కడవరకూ ఒత్తిడిలోకి నెట్టడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 124 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. (ఇక్కడ చదవండి:10కే మూడు వికెట్లు.. కానీ ఈసారి వదల్లేదు!) ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. యువ క్రీడాకారిణి షెషాలీ వర్మ(39; 17 బంతుల్లో 2 ఫోర్లు, 4సిక్స్‌లు) ధాటిగా ఆడితే, రోడ్రిగ్స్(34; 37 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకుంది. చివర్లో వేదా కృష్ణమూర్తి( 20 నాటౌట్;11 బంతుల్లో 4 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(8) మరోసారి నిరాశపరిచింది. -
10కే మూడు వికెట్లు.. కానీ ఈసారి వదల్లేదు!
పెర్త్: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా బోణి కొట్టింది. భారత్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఓటమి పాలైన ఆసీస్.. ఈసారి మాత్రం కడవరకూ పోరాడి గెలుపును ఖాతాలో వేసుకుంది. సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 123 పరుగుల సాధారణ లక్ష్య ఛేదనలో 10 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఆసీస్‌ను కెప్టెన్ మెగ్ లానింగ్- రాచెల్ హేన్స్‌లు ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి నాల్గో వికెట్‌కు 95 పరుగులు జోడించి పరిస్థితిని గాడిలో పెట్టారు. ఈ క్రమంలోనే రాచెల్ హేన్స్(60;47 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) సొగసైన ఇన్నింగ్స్ ఆడగా, లానింగ్(41 నాటౌట్; 44 బంతుల్లో 4 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడింది. కడవరకూ క్రీజ్‌లో ఉండి గెలుపులో కీలక పాత్ర పోషించింది. ఇంకా మూడు బంతులు ఉండగా ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్ విజయం సాధించింది. (ఇక్కడ చదవండి: సఫారీ అమ్మాయిల చరిత్ర) ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. లంక కెప్టెన్ చమారి ఆటపట్టు(50) హాఫ్ సెంచరీ సాధించగా,అనుష్క సంజీవని(25), ఉమేషా తిమాష్ని(20)లు మోస్తరుగా ఆడారు. మిగతా టాపార్డర్ విఫలం కావడంతో లంక జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. అలెసా హీలే డకౌట్ కాగా, బెత్ మూనీ(6), గార్డనర్(2)లు తీవ్రంగా నిరాశపరిచారు. ఆ దశలో లానింగ్ సమయోచితంగా ఆడింది. రాచెల్ హేన్స్ ఎఫెన్స్‌కు దిగితే, లానింగ్ మాత్రం కుదరుగా ఆడింది. దాంతో మంచి భాగస్వామ్యం రావడంతో ఆసీస్ గెలుపును అందుకుంది. -
సఫారీ అమ్మాయిల చరిత్ర
పెర్త్: టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా మహిళలు చరిత్రకెక్కే విజయాన్ని సాధించారు. తొలిసారి ఇంగ్లండ్‌లాంటి మేటి జట్టుపై గెలుపొందారు. మహిళల టి20 మెగా ఈవెంట్లో సఫారీ జట్టు తమ తొలి మ్యాచ్‌లోనే బోణీ కొట్టింది. ఆదివారం ఉత్కంఠ రేపిన ఈ పోరులో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై గెలుపొందింది. మొదట ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగులు చేసింది. సీవర్ (41 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించింది. ఓపెనర్ జోన్స్ (20 బంతుల్లో 23; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. సఫారీ బౌలర్లు అయబొంగ (3/25), వాన్ నికెర్క్ (2/20), మరిజనె (2/19) సమష్టిగా దెబ్బతీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 19.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్, కెప్టెన్ వాన్ నికెర్క్ (51 బంతుల్లో 46; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మరిజనె (33 బంతుల్లో 38; 6 ఫోర్లు) రాణించారు. ఇంగ్లిష్ బౌలర్ ఎకిల్‌స్టోన్ 2 వికెట్లు తీసింది. ఆఖరి ఓవర్లో 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా... బ్రంట్ వేసిన ఆ ఓవర్లోని 3, 4 బంతుల్ని డు ప్రీజ్ వరుసగా 6, 4 బాదడంతో 2 బంతులు మిగిలుండగానే దక్షిణాఫ్రికా విజయం సాధించింది. -
మరో విజయమే లక్ష్యంగా...
ప్రపంచ కప్ వేటలో భారత మహిళల జట్టు మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆరంభ పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను బోల్తా కొట్టించిన భారత్... నేడు బంగ్లాదేశ్‌తో తలపడనుంది. రెండు జట్ల బలాబలాలు పరిశీలిస్తే మనదే పైచేయిగా కనిపిస్తున్నా... ఆదమరిస్తే మాత్రం 2018 ఆసియా కప్ ఫైనల్ పునరావృతం అయ్యే అవకాశం ఉంది. బౌలింగ్‌లో భారత్ బలంగా కనిపిస్తున్నా బ్యాటింగ్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించడంలేదు. ముఖ్యంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫామ్ కలవరపెడుతోంది. వీటిని అధిగమించి నేటి మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే తర్వాత జరిగే కీలకమైన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవచ్చు. పెర్త్: పూనమ్ యాదవ్ మ్యాజిక్ స్పెల్‌తో టి20 ప్రపంచ కప్ వేటను ఘనంగా ఆరంభించిన భారత మహిళల జట్టు నేడు ఆసియా కప్ చాంపియన్ బంగ్లాదేశ్‌ను ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలో దిగనున్న హర్మన్ సేన నాకౌట్‌కు మరింత చేరువ అవ్వడంతోపాటు గత ఆసియా కప్ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన మూడు వికెట్ల పరాభవానికి బదులు తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు సల్మా ఖాతూన్ సారథ్యంలోని బంగ్లాదేశ్ సంచలనాన్ని ఆశిస్తోంది. ఈ ఫార్మాట్లో భారత్‌పై ఆడిన చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ బంగ్లాదేశ్ గెలవడం వారికి కలిసొచ్చే అంశం. నేడు జరిగే మరో మ్యాచ్‌లో శ్రీలంకతో ఆస్ట్రేలియా తలపడుతుంది. హర్మన్‌పైనే దృష్టి... స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్, దీప్తి శర్మలతో భారత బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తున్నా... గత కొంతకాలంగా స్మృతి మాత్రమే నిలకడ చూపుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో షఫాలీ 15 బంతుల్లో 29 పరుగులు సాధించినా... తనకు లభించిన ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయింది. జెమీమా రోడ్రిగ్స్ కెరీర్ ఆరంభంలో ఆడినంత దూకుడును ప్రస్తుతం ప్రదర్శించలేకపోతుంది. ముఖ్యంగా ఫినిషర్‌గా పేరున్న హర్మన్‌ప్రీత్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. తన చివరి ఐదు ఇన్నింగ్స్‌లలో 75 స్ట్రయిక్ రేట్‌తో 78 పరుగులు మాత్రమే చేసింది. దాంతో భారత్‌కు మంచి ఆరంభం లభిస్తున్నా... డెత్ ఓవర్లలో ధనాధన్ ఫినిష్ లభించడంలేదు. దీప్తి శర్మ నిలకడ ప్రదర్శిస్తున్నా వికెట్ల మధ్య పరుగెత్తడంలో మరింత చురుకుగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే బౌన్సీ వికెట్‌గా పిలువబడే ‘వాకా’ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుండటంతో పేసర్ శిఖా పాండే మరోసారి కీలకం కానుంది. ఈమెతో పాటు పూనమ్ యాదవ్ మరోసారి చెలరేగితే భారత్‌కు విజయం అంత కష్టమేమీ కాదు. మరోవైపు సల్మా ఖాతూన్, ఫర్జానా హక్, జహనర ఆలమ్‌లతో కూడిన బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేయలేం. భారత్‌పై గెలిచి టోర్నీలో బోణీ కొట్టాలనే ఉద్దేశంతో బంగ్లా బరిలో దిగనుంది. ఇప్పటి వరకు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య 11 టి20లు జరిగాయి. భారత్ తొమ్మిది మ్యాచ్‌ల్లో గెలిచింది. రెండింటిలో బంగ్లాదేశ్ నెగ్గింది. -
కివీస్‌ను గెలిపించిన డివైన్
పెర్త్: కెప్టెన్ సోఫీ డివైన్ (55 బంతుల్లో 75 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్‌తో టి20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో కివీస్ 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. ముందుగా లంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. కెప్టెన్ చమరి అటపట్టు (41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, జెన్సెన్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం న్యూజిలాండ్ 17.4 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు సాధించింది. కెప్టెన్‌కు తోడుగా మ్యాడీ గ్రీన్ (20 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడింది. వీరిద్దరు మూడో వికెట్‌కు 37 బంతుల్లోనే 61 పరుగులు జోడించారు. డివైన్ 46 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. అంతర్జాతీయ టి20ల్లో డివైన్ వరుసగా ఆరో మ్యాచ్‌లో కనీసం అర్ధసెంచరీ సాధించడం విశేషం. విండీస్ చేతిలో థాయ్‌లాండ్ ఓటమి... తొలిసారి ప్రపంచకప్ బరిలోకి దిగిన థాయ్‌లాండ్‌కు మొదటి మ్యాచ్‌లో చుక్కెదురైంది. కెప్టెన్ స్టెఫానీ టేలర్ (3/13, 37 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శతో వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో థాయ్‌లాండ్‌ను ఓడించింది. ముందుగా థాయ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 78 పరుగులే చేయగలిగింది. అనంతరం విండీస్ 16.4 ఓవర్లలో 3 వికెట్లకు 80 పరుగులు చేసింది. -
అదిరే ఆరంభంతో...
పూనమ్ యాదవ్ లెగ్ స్పిన్ ఉచ్చు కంగారూ మెడకు బలంగా బిగుసుకుంది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా సొంతగడ్డపై చేష్టలుడిగి తలవంచితే... భారత్ ఘనవిజయంతో టి20 ప్రపంచకప్‌కు తెరలేపింది. పేస్‌తో శిఖా పాండే, గూగ్లీలతో పూనమ్ మన మహిళల జట్టుకు అద్భుత గెలుపు అందించారు. పూనమ్ యాదవ్ సిడ్నీ: ఆసీస్ మహిళల జట్టు భారత్ కంటే ఎంతో మెరుగైంది. మరెంతో పటిష్టమైంది. ప్రత్యేకించి పొట్టి ప్రపంచకప్‌లో ఎదురే లేని జట్టు ఆస్ట్రేలియా. ఇప్పటికే నాలుగుసార్లు చాంపియన్. ఇప్పుడు జరిగేది వారి సొంతగడ్డపైనే! దీంతో ప్రత్యర్థులకు డిఫెండింగ్ చాంపియన్ అంటే ఒకింత ‘కంగారూ’. అలాంటి జట్టునే భారత మహిళలు కంగు తినిపించారు. 11 మంది బ్యాటింగ్‌కు దిగితే తొమ్మిది మంది బ్యాట్స్‌మెన్‌ను 6 పరుగులలోపే అవుట్ చేశారు. ఇదంతా జరిగింది సిడ్నీలో అయితే... మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత్ అదిరే ఆరంభానికి ఆసీస్ చెదిరిపోయింది. ముఖ్యంగా స్పిన్నర్ పూనమ్ యాదవ్ (4/19) బౌలింగ్ వారిపట్ల సింహ స్వప్నమైంది. అందుకేనేమో క్రీజులో నిలబడే సాహసం, పరుగులు చేసే ప్రయత్నం వదిలి తలవంచేశారంతా! శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 17 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 132 పరుగులు చేసింది. దీప్తి శర్మ (46 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు) రాణించింది. జెస్ జొనసెన్కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో 115 పరు గుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ హీలీ (35 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో ఆకట్టుకుంది. పూనమ్ యాదవ్ వైవిధ్యమైన బౌలింగ్‌తో భారత్‌ను గెలిపించింది. శిఖా (3/14) నిప్పులు చెరిగింది. రాణించిన దీప్తి షఫాలీ (15 బంతుల్లో 29; 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులతో భారత్ ఇన్నింగ్స్ ధాటిగా మొదలైంది. ఓవర్‌కు 10 పరుగుల చొప్పున 4 ఓవర్లలో 41 పరుగులు చేశాక స్మృతి (10), షఫాలీ, హర్మన్‌ప్రీత్ (2) స్వల్పవ్యవధిలో అవుటయ్యారు. దీంతో ఏడో ఓవర్ ముగియకముందే భారత్ స్కోరు 47/3. ఈ దశలో జెమీమా రోడ్రిగ్స్ (33 బంతుల్లో 26) షాట్ల జోలికి వెళ్లకుండా దీప్తి శర్మతో కలిసి పరుగుల పోరాటం చేసింది. దీంతో మరో వికెట్ పడకుండా భారత్ 15.5వ ఓవర్లలో వందకు చేరుకుంది. అయితే మరుసటి బంతికే జెమీ మా... కిమిన్స్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయింది. ఈ దశలో దీప్తికి వేద (9 నాటౌట్) జతయ్యింది. హీలీ శ్రమ వృథా ఫామ్, ర్యాంకింగ్, సొంతగడ్డపై మ్యాచ్ ఇలా ఏ రకంగా చూసిన భారత్ నిర్దేశించిన లక్ష్యం ఆసీస్‌కు కష్టమైందేమీ కాదు. అలాగే 5.3 ఓవర్లదాకా ఆస్ట్రేలియా స్కోరు 32/0. ఇక గెలిచేందుకు 101 చేస్తే సరిపోతుంది. కానీ మూనీ (6)ని శిఖా పాండే అవుట్ చేశాకా ఆట ఒక్కసారిగా మారిపోయింది. ఓపెనర్ హీలీ పోరాటం చేస్తున్నా... గార్డ్నర్ (34) అండగా నిలిచినా... లక్ష్యానికి దూరంగానే నిలిచిపోయింది. వాళ్లిద్దరిని పెవిలియన్‌కు చేర్చిన పూనమ్ యాదవ్ తన స్పిన్ ఉచ్చును బిగించడంతో ఆసీస్ చెదిరిపోయింది. పూనమ్‌కు తోడు శిఖా పాండే నిప్పులు చెరుగుతుంటే ఆసీస్ ఇన్నింగ్స్ కూలిపోయింది. లానింగ్ (5), హేన్స్ (6), పెర్రీ (0), జొనసెన్ (2), అన్నబెల్ (2), కిమిన్స్ (4), స్ట్రానో (2), షట్ (1 నాటౌట్) ఇలా ఏ ఒక్కరు నిలువలేకపోయారు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: షఫాలీ (సి) అన్నబెల్ (బి) పెర్రీ 29; మంధాన ఎల్బీడబ్ల్యూ (బి) జెస్ జొనసెన్ 10; జెమీమా ఎల్బీడబ్ల్యూ (బి) కిమిన్స్ 26; హర్మన్‌ప్రీత్ (స్టంప్డ్) హీలీ (బి) జెస్ జొనసెన్ 2; దీప్తి శర్మ నాటౌట్ 49; వేద కృష్ణమూర్తి నాటౌట్ 9; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు)132. వికెట్ల పతనం: 1–41, 2–43, 3–47, 4–100 బౌలింగ్: స్ట్రానో 2–0–15–0, పెర్రీ 3–0–15–1, షట్ 4–0–35–0, జెస్ జొనసెన్ 4–0–24–2, కిమిన్స్ 4–0–24–1, గార్డ్నర్ 3–0–19–0. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: హీలీ (సి) అండ్ (బి) పూనమ్ 51; మూనీ (సి) గైక్వాడ్ (బి) శిఖా 6; లానింగ్ (సి)భాటియా (బి) గైక్వాడ్ 5; హేన్స్ (స్టంప్డ్) భాటియా (బి) పూనమ్ 6; గార్డ్నర్ (సి) అండ్ (బి) శిఖా 34; పెర్రీ (బి) పూనమ్ 0; జెస్ (సి) భాటియా (బి) పూనమ్ 2; అన్నబెల్ (స్టంప్డ్) భాటియా (బి) శిఖా 2; కిమిన్స్ రనౌట్ 4; స్ట్రానో రనౌట్ 2; షట్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 115. వికెట్ల పతనం: 1–32, 2–55,3–67, 4–76, 5–76, 6–82, 7–101, 8–108, 9–113, 10–115. బౌలింగ్: దీప్తి శర్మ 4–0–17–0, రాజేశ్వరీ గైక్వాడ్ 4–0–31–1, శిఖా పాండే 3.5–0–14–3, అరుంధతి 4–0–33–0, పూనమ్ 4–0–19–4. -
ఆసీస్‌ను హడలెత్తించిన పూనమ్
సిడ్నీ: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన ఆరంభపు మ్యాచ్‌లో భారత జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసి 132 పరుగులే చేసినా, దాన్ని కాపాడుకుని చిరస్మరణీయమైన గెలుపును అందుకుంది. ఆసీస్‌ను తన స్పిన్ మ్యాజిక్‌తో పూనమ్ యాదవ్ హడలెత్తించింది. పూనమ్ యాదవ్ బౌలింగ్ దెబ్బకు ఆసీస్ దాసోహమైంది. ఆమె బౌలింగ్‌లో ఎదురుదాడి చేయడాన్ని పక్కన పెడితే అసలు వికెట్లను ఎలా కాపాడుకోవాలో తెలియక నానా తంటాలు పడింది. పూనమ్ నాలుగు ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి నాలుగు కీలక వికెట్లను సాధించి భారత్ విజయంలో ముఖ్య భూమిక పోషించింది. ఓపెనర్ అలైసా హీలే(51), రాచెల్ హెయిన్స్(6), ఎలీసె పెర్రీ(0), జొనాసెన్(2)లను స్వల్ప విరామాల్లో ఔట్ చేసి ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. పూనమ్‌కు జతగా పేసర్ శిఖా పాండే మూడు వికెట్లు సాధించగా, రాజేశ్వరి గైక్వాడ్‌కు వికెట్ దక్కింది. మరో ఇద్దరు రనౌట్ కావడంతో ఆసీస్ 19.5 ఓవర్లలో 115 పరుగులకే పరిమితమై పరాజయం చెందింది. అంతకుముందు భారత జట్టు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. దీప్తి శర్మ(49 నాటౌట్; 46 బంతుల్లో 3 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడగా, షెఫాలీ వర్మ(29; 15 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడగా, ఆపై జెమీయా రోడ్రిగ్స్(26)లు ఫర్వాలేదనిపించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరును చేసింది. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఓపెనర్లుగా బరిలోకి దిగిన మంధాన, షెఫాలీ వర్మ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. షెఫాలీ వర్మ ధాటిగా ఆడటంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 4 ఓవర్లలో 41 పరుగులతో టీమిండియా ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో జోనాసెన్ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి మంధాన ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. అనంతరం పెర్రీ ఊరిస్తూ వేసిన బంతిని షెఫాలీ వర్మ భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔట్ అవుతుంది. ఇక ఏడో ఓవర్లో టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. జోనాసెన్ వేసిన ఏడో ఓవర్ నాలుగో బంతిని భారీ షాట్ ఆడటానికి ముందుకు వచ్చిన హర్మన్ ప్రీత్ స్టంపౌటై తీవ్రంగా నిరుత్సాహపరిచింది. ఆ సమయంలో రోడ్రిగ్స్- దీప్తి శర్మల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది.వీరిద్దరూ నాల్గో వికెట్‌కు 53 పరుగులు జోడించిన తర్వాత రోడ్రిగ్స్ వెనుదిరిగింది. కిమ్మిన్సె వేసిన 16 ఓవర్ ఆఖరి బంతికి వికెట్లు ముందు దొరికిపోయింది. దాంతో భారత స్కోరు 100 పరుగుల వద్ద ఉండగా నాల్గో వికెట్‌ను కోల్పోయింది. కాగా, దీప్తి శర్మ స్టైక్ రొటేట్ చేస్తూ కుదురుగా ఆడి అజేయంగా నిలిచింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టీ20 వరల్డ్‌కప్: ఆసీస్ టార్గెట్ 133
సిడ్నీ: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు 133 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. భారత జట్టులో షెఫాలీ వర్మ(29; 15 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడగా, ఆపై జెమీయా రోడ్రిగ్స్(26) ఫర్వాలేదనిపించింది. ఇక దీప్తి శర్మ(49 నాటౌట్; 46 బంతుల్లో 3 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడటంతో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఓపెనర్లుగా బరిలోకి దిగిన మంధాన, షెఫాలీ వర్మ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. షెఫాలీ వర్మ ధాటిగా ఆడటంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 4 ఓవర్లలో 41 పరుగులతో టీమిండియా ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో జోనాసెన్ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి మంధాన ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. అనంతరం పెర్రీ ఊరిస్తూ వేసిన బంతిని షెఫాలీ వర్మ భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔట్ అవుతుంది. ఇక ఏడో ఓవర్లో టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. జోనాసెన్ వేసిన ఏడో ఓవర్ నాలుగో బంతిని భారీ షాట్ ఆడటానికి ముందుకు వచ్చిన హర్మన్ ప్రీత్ స్టంపౌటై తీవ్రంగా నిరుత్సాహపరిచింది. ఆ సమయంలో రోడ్రిగ్స్- దీప్తి శర్మల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది.వీరిద్దరూ నాల్గో వికెట్‌కు 53 పరుగులు జోడించిన తర్వాత రోడ్రిగ్స్ వెనుదిరిగింది. కిమ్మిన్సె వేసిన 16 ఓవర్ ఆఖరి బంతికి వికెట్లు ముందు దొరికిపోయింది. దాంతో భారత స్కోరు 100 పరుగుల వద్ద ఉండగా నాల్గో వికెట్‌ను కోల్పోయింది. కాగా, దీప్తి శర్మ స్టైక్ రొటేట్ చేస్తూ కుదురుగా ఆడటంతో భారత్ గౌరవప్రదమైన స్కోరును చేయగల్గింది. ఆసీస్ బౌలర్లలో జొనాసెన్ రెండు వికెట్లు సాధించగా, పెర్నీ, కెమ్మిన్సెలు తలో వికెట్ తీశారు. -
టాపార్డర్ విఫలం.. కష్టాల్లో టీమిండియా
సిడ్నీ: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. దీంతో 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది హర్మన్ ప్రీత్ సేన. షెఫాలీ వర్మ(29; 15 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్) ఓ మోస్తారుగా మెరుపులు మెరిపించగా.. సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ (2)తో పాటు స్మృతి మంధాన(10) దారుణంగా విఫలమయ్యారు. దీంతో కనీసం ఏడు ఓవర్లు ముగియకముందే టాపార్డర్ వికెట్లను టీమిండియా చేజార్చుకుంది. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఓపెనర్లుగా బరిలోకి దిగిన మంధాన, షెఫాలీ వర్మ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. షెఫాలీ వర్మ ధాటిగా ఆడటంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 4 ఓవర్లలో 41 పరుగులతో టీమిండియా ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో జోనాసెన్ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి మంధాన ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. అనంతరం పెర్రీ ఊరిస్తూ వేసిన బంతిని షెఫాలీ వర్మ భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔట్ అవుతుంది. ఇక ఏడో ఓవర్లో టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. జోనాసెన్ వేసిన ఏడో ఓవర్ నాలుగో బంతిని భారీ షాట్ ఆడటానికి ముందుకు వచ్చిన హర్మన్ ప్రీత్ స్టంపౌటై తీవ్రంగా నిరుత్సాహపరిచింది. -
ఫీల్డింగ్ తీసుకుందామనుకున్నా, కానీ ..!
సిడ్నీ : మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న ఆరంభపు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచి ఆసీస్ మహిళా కెప్టెన్ మెగ్ లానింగ్.. ముందుగా భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. టాస్ గెలిస్తే తాను కూడా తొలుత ఫీల్డింగ్ తీసుకుందామని అనుకున్నానని, కానీ అది మన చేతుల్లో లేని అంశమని భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తెలిపింది. తాము మంచి క్రికెట్ ఆడటానికి ఇక్కడకు వచ్చామని, ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగుతున్నామని హర్మన్ పేర్కొంది. తమ సహజసిద్ధమైన గేమ్‌ను ఆడతామని తెలిపిన హర్మన్.. మ్యాచ్‌లో గెలుపు ధీమా వ్యక్తం చేసింది. విశ్వ వేదికపై ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయినా... మళ్లీ పొట్టి ప్రపంచ కప్‌లో భారత్ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఆరు టి20 వరల్డ్ కప్‌లలో ఒక్కసారి కూడా మన జట్టు తుది పోరుకు అర్హత సాధించలేకపోయింది. మూడుసార్లు సెమీస్‌లోనే ప్రస్థానం ముగిసింది. గతంతో పోలిస్తే ఈసారి మన టీమ్ కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. సరిగ్గా చెప్పాలంటే ఫార్మాట్‌కు తగిన విధంగా దూకుడు పెరిగింది. కోచ్ డబ్ల్యూవీ రామన్ మార్గనిర్దేశనంలో అమ్మాయిలు మరింతగా రాటుదేలారు. గత టోర్నీలాగే ఇప్పుడూ హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోనే జట్టు బరిలోకి దిగుతోంది. ఆతిథ్య జట్టు, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌లతో పోలిస్తే ఇంకా కొంత వెనుకబడినట్లు అనిపిస్తున్నా... ఈ ఫార్మాట్లో సంచలనానికీ అవకాశం ఉంది. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి శుభారంభం చేయాలని భారత్ పట్టుదలగా ఉంది. ఇక టి20ల్లో ఆరు సార్లు ప్రపంచ కప్ జరిగితే నాలుగుసార్లు ఆస్ట్రేలియానే విజేతగా నిలిచింది. మంధాన, హర్మన్‌లపైనే ఆశలు.. 2018 నుంచి చూస్తే స్మృతి మంధాన అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌వుమన్‌గా నిలిచింది. 42 ఇన్నింగ్స్‌లలో ఆమె 1,243 పరుగులు చేసింది. స్ట్రయిక్ రేట్ కూడా దాదాపు 130 ఉంది. బిగ్‌బాష్ లీగ్‌లోనూ ఆడిన అనుభవం ఉన్న స్మృతి ఇచ్చే ఆరంభంపైనే జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మూడో స్థానంలో ఉన్న కెప్టెన్ హర్మన్ కూడా 933 పరుగులు సాధించింది. వీరిద్దరి బ్యాటింగ్, అనుభవం జట్టుకు పెద్ద బలం. ఇక జెమీమా రోడ్రిగ్స్, ఇటీవల సంచలన బ్యాటింగ్ ప్రదర్శన కనబరుస్తున్న షఫాలీ వర్మ కూడా దూకుడుగా ఆడితే భారత్‌కు బ్యాటింగ్‌లో తిరుగుండదు. భారీ షాట్లు ఆడగల వేద కృష్ణమూర్తి తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. ఈ ఫార్మాట్లో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ కూడా కీలకం కానుంది. పేస్ బౌలింగ్‌లో శిఖా పాండే ఓవరాల్ రికార్డు గొప్పగా లేకపోయినా... ఇటీవల పునరాగమనం తర్వాత ఆమె చాలా మెరుగ్గా ఆడుతోంది. అన్నింటికి మించి స్పిన్ బలగంపై కూడా భారత్ నమ్మకం పెట్టుకుంది. భిన్నమైన శైలి గల పూనమ్ యాదవ్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్ల ప్రదర్శన జట్టు గెలుపోటములను ప్రభావితం చేయవచ్చు. -
నారీ... ధనాధన్ భేరి
మహిళల క్రికెట్‌కు మళ్లీ ప్రపంచ కప్ కళ వచ్చింది. ఏడాది పాటు ఎన్ని టోర్నీలు, ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగినా ఆకర్షణలో విశ్వ సమరం తర్వాతే ఏదైనా! పొట్టి ఫార్మాట్లో తమ సత్తా చాటేందుకు అగ్రశ్రేణి ఆస్ట్రేలియా నుంచి ఆటలో తప్పటడగులు వేస్తున్న థాయ్‌లాండ్ వరకు 10 జట్లు సన్నద్ధమయ్యాయి. తొలి నాలుగు టి20 ప్రపంచ కప్‌లు పురుషుల టోర్నీలతో సమాంతరంగా జరగడంతో స్త్రీ శక్తికి రావాల్సిన గుర్తింపు దక్కలేదు. రెండేళ్ల క్రితం విడిగా నిర్వహించినా తగినంత ప్రచారం లభించలేదు. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా వేదికగా జరుగుతుండటంతో ఒక్కసారిగా టోర్నీకు ఊపు వచ్చేసింది. ఇక 17 రోజుల పాటు నారీమణుల బ్యాట్ల నుంచి గర్జనలు ఖాయం. టి20ల్లో ఆరు సార్లు ప్రపంచ కప్ జరిగితే నాలుగుసార్లు ఆస్ట్రేలియానే విజేతగా నిలిచింది. ఒకసారి వెస్టిండీస్ మహిళలు గెలుపు కిరీటం దక్కించుకోగా, మొదటి టోర్నీలో చాంపియన్ అయిన ఇంగ్లండ్ మళ్లీ ఆ ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. మన భారత్ మాత్రం మూడుసార్లు సెమీఫైనల్ దశలోనే ఆగిపోయింది. ప్రతీసారి బలమైన పోటీదారుగా కనిపిస్తున్నా టైటిల్ మాత్రం న్యూజిలాండ్‌కు అందని ద్రాక్షే అయింది. ఈసారి కూడా సొంత గడ్డపై లేడీ కంగారూలు ఫేవరెట్లు అనడంలో సందేహం లేదు. పురుషుల క్రికెట్‌కు ఏమాత్రం తగ్గని రీతిలో ప్రతిష్టాత్మక మెల్బోర్న్ మైదానంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన మార్చి 8న జరిగే ఫైనల్లో తుది విజేత ఎవరో వేచి చూడాలి. 2009: తొలి టి20 ప్రపంచ కప్ జరిగిన ఏడాది. పురుషులతో పాటు వరుసగా నాలుగు టోర్నీలు జరిగాయి. 2018లో మాత్రం పురుషుల వరల్డ్ కప్ జరగకపోగా, మహిళల ఈవెంట్‌ను విడిగా నిర్వహించారు. ఈసారి ఇదే ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియాలోనే పురుషుల ప్రపంచ కప్ ఉన్నా... మహిళల టోర్నీ ప్రత్యేకత నిలబెట్టేందుకు, ప్రేక్షకుల, ప్రసారకర్తల దృష్టి మళ్లకుండా ఉండేందుకు ముందుగానే నిర్వహిస్తున్నారు. ఇందు కోసం ఐసీసీ పెద్ద మొత్తంలోనే ఖర్చు చేసింది. ‘ఉమెన్ ఇన్ బ్లూ’ ఆశలు! విశ్వ వేదికపై ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయినా... మళ్లీ పొట్టి ప్రపంచ కప్‌లో భారత్ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఆరు టి20 వరల్డ్ కప్‌లలో ఒక్కసారి కూడా మన జట్టు తుది పోరుకు అర్హత సాధించలేకపోయింది. మూడుసార్లు సెమీస్‌లోనే ప్రస్థానం ముగిసింది. గతంతో పోలిస్తే ఈసారి మన టీమ్ కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. సరిగ్గా చెప్పాలంటే ఫార్మాట్‌కు తగిన విధంగా దూకుడు పెరిగింది. కోచ్ డబ్ల్యూవీ రామన్ మార్గనిర్దేశనంలో అమ్మాయిలు మరింతగా రాటుదేలారు. గత టోర్నీలాగే ఇప్పుడూ హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోనే జట్టు బరిలోకి దిగుతోంది. ఆతిథ్య జట్టు, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌లతో పోలిస్తే ఇంకా కొంత వెనుకబడినట్లు అనిపిస్తున్నా... ఈ ఫార్మాట్లో సంచలనానికీ అవకాశం ఉంది. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి శుభారంభం చేయాలని భారత్ పట్టుదలగా ఉంది. ఫామ్ ప్రకారం చూస్తే 2019 నుంచి భారత్ 10 టి20లు మ్యాచ్‌లు గెలిచి మరో 10 ఓడింది. ఇది కాస్త నిలకడలేమిని చూపిస్తోంది. ఇటీవల జరిగిన ముక్కోణపు టోర్నీలోనూ ఇది కనిపించింది. 2018 నుంచి చూస్తే స్మృతి మంధాన అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌వుమన్‌గా నిలిచింది. 42 ఇన్నింగ్స్‌లలో ఆమె 1,243 పరుగులు చేసింది. స్ట్రయిక్ రేట్ కూడా దాదాపు 130 ఉంది. బిగ్‌బాష్ లీగ్‌లోనూ ఆడిన అనుభవం ఉన్న స్మృతి ఇచ్చే ఆరంభంపైనే జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మూడో స్థానంలో ఉన్న కెప్టెన్ హర్మన్ కూడా 933 పరుగులు సాధించింది. వీరిద్దరి బ్యాటింగ్, అనుభవం జట్టుకు పెద్ద బలం. ఇక జెమీమా రోడ్రిగ్స్, ఇటీవల సంచలన బ్యాటింగ్ ప్రదర్శన కనబరుస్తున్న షఫాలీ వర్మ కూడా దూకుడుగా ఆడితే భారత్‌కు బ్యాటింగ్‌లో తిరుగుండదు. భారీ షాట్లు ఆడగల వేద కృష్ణమూర్తి తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. ఈ ఫార్మాట్లో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ కూడా కీలకం కానుంది. పేస్ బౌలింగ్‌లో శిఖా పాండే ఓవరాల్ రికార్డు గొప్పగా లేకపోయినా... ఇటీవల పునరాగమనం తర్వాత ఆమె చాలా మెరుగ్గా ఆడుతోంది. అన్నింటికి మించి స్పిన్ బలగంపై కూడా భారత్ నమ్మకం పెట్టుకుంది. భిన్నమైన శైలి గల పూనమ్ యాదవ్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్ల ప్రదర్శన జట్టు గెలుపోటములను ప్రభావితం చేయవచ్చు. అంచనా... జట్టు కూర్పు, ఫామ్, కీలక ఆటగాళ్ల రికార్డులను బట్టి చూస్తే కనీసం ఫైనల్ చేరాల్సిందే. అంతకంటే తక్కువ ఫలితాన్ని సాధిస్తే అది ఏ రకమైన ఘనతా అనిపించుకోదు. ఇంతకంటే మెరుగైన అవకాశం కూడా మళ్లీ రాకపోవచ్చు. ఇక తుది పోరులో కూడా గెలవగలిగితే చరిత్ర సృష్టించినట్లే. జట్టు వివరాలు హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్, దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి, రిచా ఘోష్, తానియా, పూనమ్ యాదవ్, రాధ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, పూజ, అరుంధతి రెడ్డి. ఎవరికెంత ప్రైజ్‌మనీ... విజేత: 10 లక్షల డాలర్లు (రూ. 7 కోట్ల 18 లక్షలు) రన్నరప్: 5 లక్షల డాలర్లు (రూ. 3 కోట్ల 59 లక్షలు) సెమీఫైనల్స్‌లో ఓడిన రెండు జట్లకు: 2 లక్షల 10 వేల డాలర్ల చొప్పున (రూ. కోటీ 50 లక్షలు) గ్రూప్ మ్యాచ్‌లో ఒక్కో విజయానికి: 15 వేల డాలర్ల చొప్పున (రూ. 10 లక్షల 77 వేలు) గ్రూప్ దశలోనే నిష్క్రమించిన ఆరు జట్లకు: 30 వేల డాలర్ల చొప్పున (రూ. 21 లక్షల 54 వేలు) ►టోర్నీలో భారత్ మూడు సార్లు 2009, 2010, 2018లలో సెమీఫైనల్ వరకు చేరగలిగింది. ఒక్కసారి కూడా ఫైనల్లోకి అడుగు పెట్టలేదు. ►వరుసగా ఏడో వరల్డ్ కప్ బరిలోకి దిగుతున్న అమ్మాయిలు 9 జట్లలో కలిపి 14 మంది ఉన్నారు. థాయ్‌లాండ్‌కు మాత్రం ఇదే తొలి వరల్డ్ కప్. ►ఫైనల్ జరిగే మెల్బోర్న్ ఎంసీజీ మైదానం సామర్థ్యం. తుది పోరుకు స్టేడియం నిండితే ఒక అంతర్జాతీయ మహిళల మ్యాచ్‌కు అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరైన రికార్డు నమోదవుతుంది. అమెరికాలోని రోజ్‌బౌల్‌లో జరిగిన 1999 మహిళల ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఫైనల్‌కు 90, 185 వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. టీవీ అంపైర్ ‘నోబాల్స్’ను పర్యవేక్షించనున్న తొలి ఐసీసీ టోర్నీ ఇదే గత విజేతలు 2009: ఇంగ్లండ్ 2010, 2012, 2014, 2018: ఆస్ట్రేలియా 2016: వెస్టిండీస్ -
మా బలం... సానుకూల దృక్పథం
సిడ్నీ: మహిళల టి20 ప్రపంచకప్‌లో ఎంతటి జట్టునైనా ఒత్తిడిలోకి నెట్టే సత్తా భారత్‌కు ఉందని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. సానుకూల దృక్పథమే తమ జట్టు బలమని, నాలుగుసార్లు చాంపియన్ అయిన ఆస్ట్రేలియాను ఎదుర్కొనేందుకు జట్టు సిద్ధంగా ఉందని చెప్పింది. శుక్రవారం జరిగే టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్... ఆతిథ్య ఆసీస్‌తో తలపడనుంది. ‘మా మైండ్‌లో పాజిటివ్ ఎనర్జీ ఉన్నంతవరకు ఏ జట్టు ఎదురైనా బెంగలేదు. ఎంతటి మేటి జట్టునైనా కంగుతినిపించగలం. స్లో వికెట్ స్టేడియాలు మాకు బాగా అనుకూలిస్తాయి. సిడ్నీ షోగ్రౌండ్ కూడా స్లో ట్రాకే. ఇది మాకు బాగా సరిపోతుంది’ అని హర్మన్ తెలిపింది. భారతీయులంతా క్రికెట్ అభిమానులే కావడంతో ఉత్సాహపరిచే ప్రేక్షకుల మధ్య తప్పకుండా శుభారంభం చేస్తామని చెప్పింది. తొలి మ్యాచ్ కోసం తామంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని పేర్కొంది. మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హర్మన్‌కు అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. ఇది జట్టుకు ఉపయోగపడుతుంది. -
‘హర్మన్, మంధాన ఉన్నారు.. కాబట్టి’
సిడ్నీ: మహిళా క్రికెట్లో ఆస్ట్రేలియా- ఇండియా జట్లు అత్యుత్తమమైనవని.. వుమెన్ క్రికెట్‌ను ఉన్నతస్థాయికి తీసుకువెళ్లగల సత్తా ఇరుజట్లకు ఉందని ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు. మహిళల టీ20 ప్రపంచకప్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. 17 రోజులపాటు జరిగే ఈ మెగా ఈవెంట్‌కు ఆస్ట్రేలియా వేదిక కానుంది. టైటిల్ వేట కోసం ఇప్పటికే 10 జట్లు అక్కడికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ అధికారిక వెబ్సైట్లో ఈ టోర్నమెంట్ గురించి బ్రెట్ లీ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఆసీస్- భారత వంటి మేటి జట్ల మధ్య సిడ్నీలో జరిగే తొలి మ్యాచ్‌తో మెగా ఈవెంట్ ప్రారంభం కానుందని బ్రెట్ లీ పేర్కొన్నాడు.(భారత్‌ను గెలిపించిన పూనమ్ ) ‘‘ఆస్ట్రేలియాలోని క్రికెట్ మైదానాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవి. ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి మైదానాల్లో మహిళా క్రికెట్ వరల్డ్‌కప్ జరగడం ఎంతో బాగుంది. ముఖ్యంగా నాకెంతో ఇష్టమైన, టెస్టుల్లో అరంగేట్రం చేసిన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఫైనల్ మ్యాచ్ జరగబోతుండటం ఇంకా అద్భుతంగా ఉంది. మహిళా క్రికెటర్లు ఎదుగుతున్న తీరు నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మెగా ఈవెంట్ ఎన్నెన్నో మధురానుభూతులకు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుంది. ఇక ఇండియా విషయానికొస్తే హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ వంటి బ్యాట్‌వుమన్లతో జట్టు దృఢంగా ఉంది. కాబట్టి భారత జట్టు ఆటతీరుపై కన్నేసి ఉంచాలి. ఎప్పటికప్పుడు వారిని గమనించాలి. ఊహించిన స్థాయిలో మహిళా క్రికెటర్లు రాణిస్తే.. వారికి ఆకాశమే సరిహద్దు అనే మాట నిజమవుతుంది’’ అని బ్రెట్ లీ రాసుకొచ్చాడు. (చదవండి : ఆల్ ద బెస్ట్ హర్మన్) కాగా, ప్రస్తుతం జరగబోయేది ఏడో మహిళా టి20 ప్రపంచకప్. ఈ టోర్నమెంట్లో ఆస్ట్రేలియా జట్టు అత్యధికంగా నాలుగుసార్లు (2010, 2012, 2014, 2018) చాంపియన్‌గా నిలవగా.. ఇంగ్లండ్ (2009), వెస్టిండీస్ (2018) ఒక్కోసారి విజేతగా నిలిచాయి. గత ఆరు టి20 ప్రపంచకప్‌లలో కలిపి ఓవరాల్‌గా భారత్ మొత్తం 26మ్యాచ్‌లు ఆడింది. 13 మ్యాచ్‌ల్లో గెలిచి, 13 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇక ఈ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన జట్టుకు 10 లక్షల అమెరికన్ డాలర్లు (రూ. 7 కోట్ల 14 లక్షలు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి. రన్నరప్ జట్టుకు 5 లక్షల డాలర్లు (రూ. 3 కోట్ల 57 లక్షలు) అందజేస్తారు. -
2 పరుగులతో గెలిచిన భారత్
బ్రిస్బేన్: విమెన్స్ టి20 వరల్డ్ కప్‌లో భాగంగా మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. షఫాలి వర్మ 12, దీప్తి శర్మ 21, శిఖా పాండే 24, పూజ వస్త్రకర్ 13, హర్మన్‌ప్రీత్ కౌర్ 11 పరుగులు సాధించారు. జెమీమా రోడ్రిగ్స్ పరుగులేమి చేయకుండానే వెనుదిరిగింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లు 105 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టింది. శిఖా పాండే, దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ తలో వికెట్ దక్కించుకున్నారు. (చదవండి: ఆల్ ద బెస్ట్ హర్మన్) అదరగొట్టిన ఆటపట్టు ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు బ్యాటింగ్‌తో అదరగొట్టింది. 50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 78 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమెకు హాసిని పెరీరా(29) అండగా నిలిచింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. శ్రీలంక 12.3 ఓవల్‌లో వికెట్ కోల్పోకుండా 123 పరుగులు సాధించి విజయాన్ని అందుకుంది. ఎక్స్‌ట్రాల రూపంలో 16 పరుగులు రావడం విశేషం. మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో గెలిచింది.