
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2020 ఫైనల్‌లో భారత్ ఓటమిపై టీం కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ స్పందించింది. మ్యాచ్ అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రపంచకప్‌లో తమ జట్టు ఆటతీరుపై పూర్తిస్థాయిలో సంతృప్తిగా ఉన్నానని ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే టోర్నీఅంతా గొప్పగా రాణించి.. కీలకమైన ఫైనల్‌లో ఓడటం బాధకరమని పేర్కొంది. ‘ప్రస్తుతమున్న టీంపై ఎంతో నమ్మకముంది. రానున్న ఆరునెలల కాలం తమకు ఎంతో కీలకం. ఆటలో గెలుపోటములు సహజం. కొన్నిసార్లు విజయం సాధిస్తే.. మరికొన్ని సార్లు ఓటమి చవిచూడాల్సి వస్తుంది. అనుభవాల నుంచి ఎంతో నేర్చుకోవాలి. దురదృష్టవశాత్తూ ఫైనల్‌లో ఓడాం. భవిష్యత్తులో గొప్పగా రాణిస్తామన్న నమ్మకం నాకుంది’ అని వెల్లడించింది. కాగా టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భాగంగా ఆదివారం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 85 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.(ఈసారి కూడా చాంపియన్ ఆస్ట్రేలియానే)