సిడ్నీ: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. దీంతో 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది హర్మన్ ప్రీత్ సేన. షెఫాలీ వర్మ(29; 15 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్) ఓ మోస్తారుగా మెరుపులు మెరిపించగా.. సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ (2)తో పాటు స్మృతి మంధాన(10) దారుణంగా విఫలమయ్యారు. దీంతో కనీసం ఏడు ఓవర్లు ముగియకముందే టాపార్డర్ వికెట్లను టీమిండియా చేజార్చుకుంది.
టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఓపెనర్లుగా బరిలోకి దిగిన మంధాన, షెఫాలీ వర్మ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. షెఫాలీ వర్మ ధాటిగా ఆడటంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 4 ఓవర్లలో 41 పరుగులతో టీమిండియా ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో జోనాసెన్ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి మంధాన ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. అనంతరం పెర్రీ ఊరిస్తూ వేసిన బంతిని షెఫాలీ వర్మ భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔట్ అవుతుంది. ఇక ఏడో ఓవర్‌లో టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. జోనాసెన్ వేసిన ఏడో ఓవర్ నాలుగో బంతిని భారీ షాట్ ఆడటానికి ముందుకు వచ్చిన హర్మన్ ప్రీత్ స్టంపౌటై తీవ్రంగా నిరుత్సాహపరిచింది.
Comments
Please login to add a commentAdd a comment