నైట్‌ సెంచరీ: ఇంగ్లండ్‌ భారీ విజయం | Knight Hits Century As England Crush Thailand | Sakshi
Sakshi News home page

నైట్‌ సెంచరీ: ఇంగ్లండ్‌ భారీ విజయం

Published Thu, Feb 27 2020 11:57 AM | Last Updated on Thu, Feb 27 2020 12:09 PM

Knight Hits Century As England Crush Thailand - Sakshi

కాన్‌బెర్రా: కెప్టెన్‌ హెథర్‌ నైట్‌ (66 బంతుల్లో 108 నాటౌట్‌; 13 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీ... నటాలీ షివెర్‌ (52 బంతుల్లో 59 నాటౌట్‌; 8 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీ చేయడంతో మహిళల టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ జట్టు తొలి విజయం నమోదు చేసింది. థాయ్‌లాండ్‌ జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 98 పరుగుల తేడాతో గెలిచింది. 

తొలుత ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 2 వికెట్లకు 176 పరుగులు చేసింది. హెథర్‌ నైట్, షివెర్‌ మూడో వికెట్‌కు అజేయంగా 169 పరుగులు జోడించి ఇంగ్లండ్‌కు భారీ స్కోరు అందించారు. ప్రపంచకప్‌ చరిత్రలో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన థాయ్‌లాండ్‌ 20 ఓవర్లు ఆడి 7 వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసి ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ జట్టు 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement