సిడ్నీ: మహిళల టి20 ప్రపంచకప్‌లో ఎంతటి జట్టునైనా ఒత్తిడిలోకి నెట్టే సత్తా భారత్‌కు ఉందని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. సానుకూల దృక్పథమే తమ జట్టు బలమని, నాలుగుసార్లు చాంపియన్ అయిన ఆస్ట్రేలియాను ఎదుర్కొనేందుకు జట్టు సిద్ధంగా ఉందని చెప్పింది. శుక్రవారం జరిగే టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్... ఆతిథ్య ఆసీస్‌తో తలపడనుంది. ‘మా మైండ్‌లో పాజిటివ్ ఎనర్జీ ఉన్నంతవరకు ఏ జట్టు ఎదురైనా బెంగలేదు. ఎంతటి మేటి జట్టునైనా కంగుతినిపించగలం. స్లో వికెట్ స్టేడియాలు మాకు బాగా అనుకూలిస్తాయి.
సిడ్నీ షోగ్రౌండ్ కూడా స్లో ట్రాకే. ఇది మాకు బాగా సరిపోతుంది’ అని హర్మన్ తెలిపింది. భారతీయులంతా క్రికెట్ అభిమానులే కావడంతో ఉత్సాహపరిచే ప్రేక్షకుల మధ్య తప్పకుండా శుభారంభం చేస్తామని చెప్పింది. తొలి మ్యాచ్ కోసం తామంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని పేర్కొంది. మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హర్మన్‌కు అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. ఇది జట్టుకు ఉపయోగపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment