
బ్రిస్బేన్: విమెన్స్ టి20 వరల్డ్ కప్‌లో భాగంగా మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. షఫాలి వర్మ 12, దీప్తి శర్మ 21, శిఖా పాండే 24, పూజ వస్త్రకర్ 13, హర్మన్‌ప్రీత్ కౌర్ 11 పరుగులు సాధించారు. జెమీమా రోడ్రిగ్స్ పరుగులేమి చేయకుండానే వెనుదిరిగింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లు 105 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టింది. శిఖా పాండే, దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ తలో వికెట్ దక్కించుకున్నారు. (చదవండి: ఆల్ ద బెస్ట్ హర్మన్)
అదరగొట్టిన ఆటపట్టు
ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు బ్యాటింగ్‌తో అదరగొట్టింది. 50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 78 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమెకు హాసిని పెరీరా(29) అండగా నిలిచింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. శ్రీలంక 12.3 ఓవల్లో వికెట్ కోల్పోకుండా 123 పరుగులు సాధించి విజయాన్ని అందుకుంది. ఎక్స్‌ట్రాల రూపంలో 16 పరుగులు రావడం విశేషం. మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment