Women Cricket team
-
టీ20 మ్యాచ్‌లో హైదరాబాద్‌ను గెలిపించిన ధృతి
బీసీసీఐ ఆధ్వర్యంలోని మహిళల అండర్–19 టీ20 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు ‘హ్యాట్రిక్’ విజయం అందుకుంది. రాజ్‌కోట్‌లో కేరళ జట్టుతో శుక్రవారం జరిగిన గ్రూప్ ‘సి’ మూడో లీగ్ మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో గెలుపొందింది. కేరళతో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులు సాధించింది. కావ్య (35; 6 ఫోర్లు), నిధి (25; 4 ఫోర్లు) రాణించారు. అనంతరం.. 149 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కేరళ జట్టు 18.4 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా 23 రన్స్ తేడాతో ఓటమిని చవిచూసింది.హైదరాబాద్ బౌలర్ కేసరి ధృతి 3.4 ఓవర్లు వేసి 22 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. మరో బౌలర్ వైష్ణవి యాదవ్ 2 వికెట్లు తీసుకుంది. ఇక ఆరు జట్లున్న గ్రూప్ ‘సి’లో హైదరాబాద్ 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. తదుపరి ఆదివారం జరిగే నాలుగో లీగ్ మ్యాచ్‌లో పంజాబ్‌తో హైదరాబాద్ తలపడనుంది.చదవండి: WT20 WC Ind vs NZ: కివీస్ ముందు తలవంచారు -
జింబాబ్వే క్రికెట్లో తీవ్ర విషాదం.. దంపతుల హఠాన్మరణం
Sinikiwe Mpofu: జింబాబ్వే మహిళా క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ సినికివె ఎంపోఫు హఠాన్మరణం చెందింది. 37 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది. తన నివాసంలో శనివారం కుప్పకూలిన సినికివె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. జింబాబ్వే ఫీల్డింగ్ కోచ్ కూడా మృతి సినికివె భర్త, జింబాబ్వే క్రికెట్ పురుషుల జట్టు ఫీల్డింగ్ కోచ్ షెఫర్డ్ మకునురా మరణించిన రోజుల వ్యవధిలోనే ఆమె కూడా శాశ్వతంగా ఈ లోకాన్ని వీడటం విషాదకరం. షెఫర్డ్ డిసెంబరు 15న చనిపోయాడు. కాగా ఇద్దరు కీలక వ్యక్తులు ఇలా అకస్మాత్తుగా దూరం కావడంతో జింబాబ్వే క్రికెట్ శోకసంద్రంలో మునిగిపోయింది. PC: Zimbabwe Cricket కఠిన శ్రమకోర్చి కెరీర్లో మంచి స్థాయికి చేరుకున్న ఈ సినికివెను చావు తమ నుంచి దూరం చేసిందంటూ జింబాబ్వే మేనేజింగ్ డైరెక్టర్ గివ్మోర్ మకోని విచారం వ్యక్తం చేశారు. జింబాబ్వే మహిళా క్రికెట్లో ఆదర్శనీయమైన వ్యక్తిగా ఎంతో మంది ఆదరాభిమానాలు చూరగొన్న ఆమె ఇలా అర్ధంతరంగా వెళ్లిపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని సంతాపం వ్యక్తం చేశారు. PC: Zimbabwe Cricket రోజుల వ్యవధిలో దంపతులు హఠాన్మరణం సినికివె, షెఫర్డ్ దంపతుల హఠాన్మరణం వారి కుటుంబాలతో పాటు తమకు కూడా తీరని లోటు అని భావోద్వేగానికి లోనయ్యారు. వీరి పిల్లలు, తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. జాతీయ జట్టులో కీలకమైన ఇద్దరు సభ్యులను కోల్పోయామని.. ఇంతటి విషాదం మరెక్కడా ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సినికివె 2006లో జింబాబ్వే తరఫున క్రికెట్ ఆడిన తొలి మహిళా జట్టులో సభ్యురాలు. ప్లేయర్‌గా కెరీర్ ముగిసిన తర్వాత ఆమె కోచింగ్ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించింది. మహిళా జట్టు అసిస్టెంట్ కోచ్ స్థాయికి ఎదిగింది. మౌంటనీర్స్ వుమెన్‌ను ఫిఫ్టీ50 చాలెంజ్‌లో విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించింది. చదవండి: Suryakumar Yadav: సూర్య కెరీర్‌పై గంభీర్ ట్వీట్! నీకు అతడు మాత్రమే కనిపిస్తున్నాడా? ఫ్యాన్స్ ఫైర్ Suryakumar Yadav: సూర్య ఇండియన్ కాబట్టి సరిపోయింది.. అదే పాకిస్తాన్లో ఉంటేనా: పాక్ మాజీ కెప్టెన్ -
మహిళల క్రికెట్ జట్టు ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు!
విశాఖపట్నం: మహిళల సీనియర్ టీ20 మ్యాచ్‌లు ముగించుకుని వెళ్తున్న బరోడా క్రికెటర్లు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు.. ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో దానిని ఢీకొంది. ఈ ఘటనలో నలుగురికి గాయాలైనట్లు సమాచారం. విశాఖపట్నంలోని తాటిచెట్లపాలెం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా విశాఖ వేదికగా మహిళా సీనియర్ టీ20 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. చదవండి: West Indies: 'హెట్‌మైర్ శాపం తగిలింది.. అందుకే విండీస్‌కు ఈ దుస్థితి' -
చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు
-
ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ సమరం
-
హైదరాబాద్ మహిళల వన్డే క్రికెట్ జట్టు ఇదే..
సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే హైదరాబాద్ జట్టును ప్రకటించారు. 27 మంది సభ్యులతో కూడిన హైదరాబాద్ జట్టుకు డి. రమ్య కెప్టెన్‌గా వ్యవహరించనుందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) తెలిపింది. జట్టులో ఐదుగురు స్టాండ్‌బైగా ఉన్నారు. బెంగళూరులో శనివారం నుంచి ఈ టోర్నీ మొదలయింది. టీమ్ ఇదే.. డి. రమ్య (కెప్టెన్), ప్రణవి చంద్ర (వైస్ కెప్టెన్), అనూరాధ నాయక్, ఎం.మమత (వికెట్ కీపర్లు), కీర్తి రెడ్డి, కె.అనిత, జి.త్రిష, యశశ్రీ, త్రిషా పూజిత, బి.శ్రావణి, బి.అంజలి, తెహ్నియాత్ ఫాతిమా, పి.పార్వతి, సాయిలేహ, క్రాంతి రెడ్డి, ప్రణతి రెడ్డి, వంకా పూజ, కోడూరి ఇషిత, ఆలపాటి ప్రణతి, పూజాశ్రీ, ఆశ్రిత రెడ్డి, సి.ఎస్.సాధ్వి. స్టాండ్‌బై: ఎం.అనిత, జి.కె.శ్రావ్య, టి.చందన, శివాని గౌడ్, మెర్లిన్ జాన్. విద్యుత్ జైసింహ (కోచ్), హర్ష హరినారాయణ (అసిస్టెంట్ కోచ్), స్రవంతి నాయుడు (ఫీల్డింగ్ కోచ్), గజానంద్ రెడ్డి, సునీతా ఆనంద్ (ట్రైనర్), హర్ష గంగ్వాల్ (ఫిజియో), మానస (మేనేజర్). -
అంతర్జాతీయ క్రికెట్‌కు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గుడ్ బై!
Anna Peterson retires from international cricket: న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ అన్నా పీటర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. అయితే, దేశవాళీ క్రికెట్లో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ మంగళవారం ధ్రువీకరించింది. రిటైర్మెంట్ నేపథ్యంలో అన్నా మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ.. వైట్ ఫెర్న్స్(మహిళా టీమ్) జట్టుకు ప్రాతినిథ్యం వహించిన నేను.. ఆటలో ప్రతీ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించాను. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన నా కుటుంబం, స్నేహితులు, కోచ్‌లు, సహచర క్రికెటర్లు, ఇతర సిబ్బంది.. అందరికీ ధన్యవాదాలు. వైట్ ఫెర్న్స్‌కు ఆడటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో క్రికెటర్లను కలుసుకునే అవకాశం దక్కింది. దేశవాళీ క్రికెట్లో ఇంకా ఆడగలననే నమ్మకం ఉంది. ఈ సీజన్లో అక్లాండ్ హర్ట్స్ తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్నా’’ అని పేర్కొంది. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా 2012లో వన్డేల్లో అడుగుపెట్టిన అన్నా పీటర్సన్...మొత్తంగా 32 వన్డేలు ఆడింది. ఇక 33 టీ20 మ్యాచ్‌లలో న్యూజిలాండ్ తరఫున ఆడిన ఈ ఆల్‌రౌండర్.. పరిమిత ఓవర్ల(వన్డే, టీ20) క్రికెట్లో మొత్తం 45 వికెట్లు తీసింది. ఇక 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో అన్నా.. హ్యాట్రిక్ నమోదు చేసింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి న్యూజిలాండ్ మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఇక 31 ఏళ్ల వయస్సులో ఇంటర్నేషనల్ క్రికెట్‌కు అన్నా రిటైర్మెంట్ ప్రకటించింది. చదవండి: MS Dhoni: బంతులన్నీ వృథా చేశావు.. అవుటైనా బాగుండేది.. కనీసం.. -
Mithali Raj: వ్యక్తిగతం కాదు... సమష్టితత్వం ముఖ్యం
న్యూఢిల్లీ: దేశానికి ఆడేటప్పుడు వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు ఎలాంటి ప్రాధాన్యం ఉండదని మహిళల జట్టు టెస్టు, వన్డే సారథి మిథాలీ రాజ్ పేర్కొంది. చాన్నాళ్ల తర్వాత మహిళల జట్టు పూర్తిస్థాయి సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ వెళుతోంది. వచ్చేనెల 16 నుంచి బ్రిస్టల్‌లో ఏకైక టెస్టు జరుగుతుంది. ఈ నేపథ్యం లో మిథాలీ మాట్లాడుతూ... ‘కోచ్ రమేశ్ పొవార్‌తో వివాదం గతంతో సమానం. నేను ఎన్నో ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నా. ఇక్కడ వ్యక్తిగతం పనికి రాదు. సమష్టితత్వమే కావాలి. 21 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో నేనెప్పుడూ వ్యక్తిగత ఇష్టాలకు విలువ ఇవ్వలేదు. జట్టు కోసమే ఆడాను. ఇకమీదట కూడా అంతే’ అని పేర్కొంది. ‘నా కెరీర్లో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. చేదు అనుభవాలూ ఉన్నాయి. కానీ అవన్నీ వెంట మోసుకెళ్లలేదు. వర్తమానమే జట్టుకు అవసరం. ఇప్పుడు కోచ్‌తో జట్టు ప్రయోజనాలపైనే చర్చించుకుంటాం. మిగతావి అప్రస్తుతం. ఇక్కడ మా ఇద్దరి లక్ష్యం జట్టును ముందుకు తీసుకెళ్లడమే. ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు ఆడాక... ఆస్ట్రేలియాతో మరో టెస్టు ఆడనున్నాం. తొలిసారి డే–నైట్ టెస్టు ఆడనున్నాం. కెరీర్ ముగిసేలోపు డే–నైట్ టెస్టు ఆడతానని ఊహించలేదు. నా కల నిజమవుతున్నందుకు ఆనందంగా ఉంది’ అని మిథాలీ తెలిపింది. (చదవండి: ఖరీదైన ఇంటిని సొంతం చేసుకున్న టీమిండియా మాజీ సారధి) -
ఏడేళ్ల విరామం తర్వాత... తొలి టెస్టు..
లండన్: భారత మహిళల క్రికెట్ జట్టు ఏడేళ్ల నిరీక్షణ ముగిసింది. సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు భారత జట్టుకు టెస్టు మ్యాచ్ ఆడే భాగ్యం లభించింది. ఈ ఏడాది జూన్–జూలైలలో భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత జట్టు ఏకైక టెస్టు మ్యాచ్ సహా మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడుతుంది. అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా మార్చి 8న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా ఈ ఏడాది భారత మహిళల జట్టు ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడుతుందని ప్రకటించారు. అయితే ఆ రోజు ఆయన వేదిక, తేదీని వెల్లడించలేదు. కాగా సోమవారం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) భారత మహిళల పర్యటన వివరాలను ప్రకటించింది. జూన్ 16 నుంచి 19 వరకు (నాలుగు రోజులు) బ్రిస్టల్ మైదానంలో ఇంగ్లండ్, భారత మహిళల జట్ల మధ్య ఏకైక టెస్టు జరుగుతుందని ఈసీబీ తెలిపింది. భారత మహిళల జట్టు టెస్టు మ్యాచ్ ఆడి ఏడేళ్లయింది. చివరిసారి భారత జట్టు 2014 నవంబర్‌లో స్వదేశంలో దక్షిణాఫ్రికా జట్టుతో టెస్టు ఆడి ఇన్నింగ్స్ 34 పరుగుల తేడాతో గెలిచింది. ఇక ఇంగ్లండ్ జట్టుతో భారత్ 2014 ఆగస్టులో చివరిసారి టెస్టు ఆడింది. ఆ మ్యాచ్‌లో మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ గడ్డపై భారత మహిళల జట్టు మొత్తం ఎనిమిది టెస్టులు ఆడి ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. రెండు టెస్టుల్లో నెగ్గిన టీమిండియా, మిగతా ఆరు టెస్టులను ‘డ్రా’ చేసుకోవడం విశేషం. ఓవరాల్‌గా భారత జట్టు 1976 నుంచి 2014 వరకు మొత్తం 36 టెస్టులు ఆడి 5 మ్యాచ్‌ల్లో గెలిచి, ఆరింటిలో ఓడి, 25 మ్యాచ్‌లను ‘డ్రా’గా ముగించింది. చదవండి: మరోసారి విలియమ్సన్‌కే... ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా భువీ.. -
దక్షిణాఫ్రికాతో సిరీస్: భారత జట్టు ఇదే
ముంబై: దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్‌కు భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐదు వన్డేల సిరీస్‌కు కెప్టెన్ మిథాలీ రాజ్, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని సభ్యుల పేర్లను శనివారం వెల్లడించింది. కాగా ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో గల భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా అంతర్జాతీయ స్టేడియంలో భారత- సౌతాఫ్రికా మహిళా జట్లు తలపడనున్నాయి. మొత్తంగా 8 మ్యాచ్‌లను ఇక్కడే నిర్వహించనున్నారు. మార్చి 7 నుంచి 17 వరకు వన్డే సిరీస్, మార్చి 20-23 వరకు టీ20 సిరీస్ జరుగనుంది. కాగా తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి టీ20 జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. వన్డే సిరీస్ జట్టు: మిథాలీ రాజ్(కెప్టెన్), స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగస్, పూనం రౌత్, ప్రియా పునియా, యస్తిక భాటియా, హర్మన్‌ప్రీత్ కౌర్(వైస్ కెప్టెన్), డి. హేమలత, దీప్తి శర్మ, సుష్మా వర్మ(వికెట్ కీపర్), శ్వేత వర్మ(వికెట్ కీపర్), రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, ఝులన్ గోస్వామి, మాన్సి జోషి, పూనం యాదవ్, సి. ప్రత్యూష, మోనికా పటేల్. టీ20 జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), షఫాలి వర్మ, జెమీమా రోడ్రిగస్, దీప్తి శర్మ, రిచా ఘోష్, హర్లీన్ డియోల్, సుష్మా వర్మ(వికెట్ కీపర్), నుజత్ పర్వీన్(వికెట్ కీపర్), ఆయుషి సోని, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, పూనం యాదవ్, మాన్సి జోషి, మోనికా పటేల్, సి. ప్రత్యూష, సిమ్రన్ దిల్ బహదూర్. చదవండి: కీలకమైన నాల్గో టెస్టు నుంచి వైదొలిగిన బుమ్రా -
ఇంగ్లండ్‌దే సిరీస్
డెర్బీ: ఆరు నెలల తర్వాత పునః ప్రారంభమైన మహిళల అంతర్జాతీయ క్రికెట్లో తొలి సిరీస్‌ను ఇంగ్లండ్ జట్టు గెలుచుకుంది. వెస్టిండీస్ జట్టుతో జరుగుతోన్న 5 మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఇంగ్లండ్ 3–0తో కైవసం చేసుకుంది. ఈ రెండు జట్ల మధ్య శనివారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ 20 పరుగుల తేడాతో నెగ్గింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నటాలీ స్కీవర్ (61 బంతుల్లో 82; 9 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగింది. హీథెర్‌నైట్ (29; 3 ఫోర్లు) రాణించింది. అనంతరం వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 134 పరుగులే చేసి ఓడిపోయింది. డాటిన్ (56 బంతుల్లో 63; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించింది. హీలీ మాథ్యూస్ (23 బంతుల్లో 21; 2 ఫోర్లు), స్టెఫానీ టేలర్ (13 బంతుల్లో 14 నాటౌట్; 2 ఫోర్లు), షినెల్లీ హెన్రీ (12 బంతుల్లో 12 నాటౌట్; 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. కేథరిన్ బ్రంట్, సారా గ్లెన్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. -
చీఫ్ సెలక్టర్‌గా నీతూ డేవిడ్
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ కార్యకలాపాల్లో కదలిక మొదలైంది. యూఏఈ వేదికగా మూడు జట్లతో మహిళల చాలెంజర్ సిరీస్ జరుగనున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మహిళల క్రికెట్ జట్టుకు నూతన సెలక్షన్ కమిటీని నియమించింది. ఈ కమిటీకి 90వ దశకంలో విశేషంగా రాణించిన భారత మాజీ క్రికెటర్, మేటి లెఫ్టార్మ్ స్పిన్నర్ నీతూ డేవిడ్ చైర్మన్‌గా వ్యవహరించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా శనివారం ప్రకటించారు. మొత్తం ఐదుగురు సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో నీతూతో పాటు మిథు ముఖర్జీ, రేణు మార్గరెట్, ఆరతి వైద్య, వెంకటాచెర్ కల్పన ఇతర సభ్యులు. హేమలత కళ ఆధ్వర్యంలోని గత సెలక్షన్ కమిటీ నాలుగేళ్ల పదవీకాలం ఈ ఏడాది మార్చితో ముగిసింది. కరోనాతో క్రికెట్ కార్యకలాపాలు ఆగిపోవడంతో కొత్త కమిటీని ఎంపిక చేసేందుకు ఆలస్యమైందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ‘సీనియారిటీ ప్రాతిపదికగా నీతూ డేవిడ్‌ను కొత్త ప్యానల్ చైర్మన్‌గా ఎంపిక చేశాం. మహిళల క్రికెట్లో ఆమె దిగ్గజం. ఆమె నెలకొల్పిన ఘనతల ప్రకారం చూస్తే ఈ ఎంపికను ఎవరూ ప్రశ్నించరనే అనుకుంటున్నాం. నీతూ మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ కాగా, భారత్ తరఫున 100 వికెట్లు దక్కించుకున్న తొలి క్రికెటర్’ అని జై షా ఆమె ఘనతల్ని గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 43 ఏళ్ల నీతూ భారత్ తరఫున 10 టెస్టుల్లో 41 వికెట్లు, 97 వన్డేల్లో 141 వికెట్లు పడగొట్టింది. 1995 జంషెడ్‌పూర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు పడగొట్టి భారత్ తరఫున ప్రపంచ రికార్డును నెలకొల్పింది. కమిటీలోని ఇతర సభ్యులైన ఆరతి వైద్య (మహారాష్ట్ర; 50 ఏళ్లు) 3 టెస్టులు, 6 వన్డేలు... రేణు (పంజాబ్; 45 ఏళ్లు) 5 టెస్టులు, 23 వన్డేలు... కల్పన (కర్ణాటక; 59 ఏళ్లు) 3 టెస్టులు, 8 వన్డేలు... మిథు ముఖర్జీ (బెంగాల్; 55 ఏళ్లు) 4 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. -
ఓటమి విజయానికి తొలిమెట్టు : సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భారత మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు తెలియజేశారు. ‘ మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు పోరాటానికి అభినందనలు. ఓటమి విజయానికి తొలిమెట్టు. మీరు ఇంత దూరం రావటం మాకు ఎంతో గర్వకారణం, మీ పయనం ఇక్కడితో ఆగిపోలేదు. విజేత ఆస్ట్రేలియాకు అభినందనలు’ అని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. కాగా, ఆదివారం మెల్బోర్న్ వేదికగా జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో తలపడ్డ భారత్ ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. చదవండి : కన్నీళ్లు కనిపించనీయవద్దు! Kudos to the Indian Women's Cricket Team for their remarkable performance in @T20WorldCup. Defeat is just one stepping stone away from success. We are immensely proud of how far you have come, & you have a long way to go! Congratulations to the Australian team. #INDvsAUS — YS Jagan Mohan Reddy (@ysjagan) March 9, 2020 -
సఫారీ భారీ విజయం
కాన్బెర్రా: మహిళల టి20 ప్రపంచకప్‌లో థాయ్‌లాండ్ కూనపై దక్షిణాఫ్రికా 113 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. సఫారీ ఓపెనర్ లిజెల్లీ లీ (60 బంతుల్లో 101; 16 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగింది. ఆమె సెంచరీలో 82 పరుగులు ఫోర్లు, సిక్సర్లతోనే వచ్చాయి. మొదట దక్షిణాఫ్రికా అమ్మాయిల జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగులు చేసింది. సున్ లూస్ (41 బంతుల్లో 61 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించింది. లీ, లూస్ రెండో వికెట్‌కు 13 ఓవర్లలో 131 పరుగులు జోడించారు. కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన థాయ్‌లాండ్ కూన 19.1 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటైంది. కంచోంఫు (26), సుతిరంగ్ (13)లు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. షబ్నిమ్, లూస్ చెరో 3 వికెట్లు తీశారు. పాక్‌పై ఇంగ్లండ్ జయభేరి మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళలు 42 పరుగుల తేడాతో పాకిస్తాన్ అమ్మాయిలపై గెలిచారు. ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది. హీథెర్ నైట్ (62), సీవెర్ (36) ధాటిగా ఆడారు. ఐమన్కు 3 వికెట్లు దక్కాయి. లక్ష్యఛేదనకు దిగిన పాక్ 19.4 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌటైంది. అలియా (41) ఒంటరి పోరాటం చేసింది. ష్రబ్సోల్, గ్లెన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. -
2 పరుగులతో గెలిచిన భారత్
బ్రిస్బేన్: విమెన్స్ టి20 వరల్డ్ కప్‌లో భాగంగా మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. షఫాలి వర్మ 12, దీప్తి శర్మ 21, శిఖా పాండే 24, పూజ వస్త్రకర్ 13, హర్మన్‌ప్రీత్ కౌర్ 11 పరుగులు సాధించారు. జెమీమా రోడ్రిగ్స్ పరుగులేమి చేయకుండానే వెనుదిరిగింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లు 105 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టింది. శిఖా పాండే, దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ తలో వికెట్ దక్కించుకున్నారు. (చదవండి: ఆల్ ద బెస్ట్ హర్మన్) అదరగొట్టిన ఆటపట్టు ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు బ్యాటింగ్‌తో అదరగొట్టింది. 50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 78 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమెకు హాసిని పెరీరా(29) అండగా నిలిచింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. శ్రీలంక 12.3 ఓవల్‌లో వికెట్ కోల్పోకుండా 123 పరుగులు సాధించి విజయాన్ని అందుకుంది. ఎక్స్‌ట్రాల రూపంలో 16 పరుగులు రావడం విశేషం. మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో గెలిచింది. -
భారత మహిళల శుభారంభం
కాన్బెర్రా: ముక్కోణపు టి20 టోర్నీలో భారత మహిళల జట్టు విజయంతో బోణీ చేసింది. శుక్రవారం ఇక్కడ జరిగిన తొలి పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, కెప్టెన్ హీతర్ నైట్ (44 బంతుల్లో 67; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీతో చెలరేగగా, ట్యామీ బీమాంట్ (27 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మ, శిఖా పాండే తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్ షఫాలీ వర్మ (25 బంతుల్లో 30; 4 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (20 బంతుల్లో 26; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా... కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (34 బంతుల్లో 42 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) చివరి వరకు నిలిచి గెలిపించింది. ఆఖరి 4 బంతుల్లో విజయానికి 4 పరుగులు కావాల్సి ఉండగా భారీ సిక్సర్‌తో హర్మన్ మ్యాచ్ ముగించింది. -
క్రికెట్లో సంచలనం: తొమ్మిది మంది డకౌట్!
సాక్షి, గుంటూరు: దేశీయ క్రికెట్లో సంచలనం చోటు చేసుకుంది. తొలి బంతికే ఓ జట్టు విజయం సాధించింది. శుక్రవారం గుంటూరులోని జేకేసీ కాలేజీ మైదానంలో జరిగిన మహిళల అండర్-19 క్రికెట్ వన్డే లీగ్, నాకౌట్ టోర్నమెంట్ మ్యాచ్‌లో ఈ అద్భుతం జరిగింది. నాగాలాండ్ జట్టుపై కేరళ టీమ్ మొదటి బంతికే విజయాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన నాగాలాండ్ జట్టు 17 ఓవర్లు ఆడి కేవలం 2 పరుగులకే ఆలౌటైంది. ఇందులో ఒక పరుగు వెడ్ ద్వారా రావడం విశేషం. ఓపెనర్ మేనక 18 బంతులు ఆడి మరొక పరుగు సాధించింది. తొమ్మిది మంది డకౌటయ్యారు. కేరళ కెప్టెన్ మిన్ను మణి నాలుగు ఓవర్లు వేసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 4 వికెట్లు పడగొట్టింది. మూడు పరుగుల లక్ష్యంతో తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కేరళ టీమ్ తొలి బంతికే ఫోర్ కొట్టి సంచలన విజయం సాధించింది. తమ జట్టు అద్భుత విజయం సాధించడం పట్ల కేరళ కోచ్ సుమన్ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. నాగాలాండ్ 40 పరుగుల వరకు చేస్తుందని అనుకున్నామని, కానీ ఊహించని విధంగా రెండు పరుగులకే కుప్పకూలిందన్నారు. ఈ ఘనత కెప్టెన్ మిన్ను, ఇతర క్రీడాకారిణులకు దక్కుతుందని వ్యాఖ్యానించారు. -
2021 ప్రపంచకప్ కూడా ఆడతానేమో!
న్యూఢిల్లీ: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ తన మనసు మార్చుకుంది. ప్రస్తుతమున్న ఫామ్‌లో ఉండి, ఫిట్నెస్ సహకరిస్తే 2021లో జరిగే వన్డే ప్రపంచకప్ కూడా ఆడతానని స్వయంగా మిథాలీరాజ్ చెప్పింది. జూలైలో ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ ముగిసిన అనంతరం ఇదే నా చివరి వరల్డ్ కప్ అని పేర్కొన్న మిథాలీ... తాజాగా ఫిట్‌గా ఉంటే తన కెరీర్లో ఆరో వరల్డ్ కప్‌లోనూ పాల్గొంటానని స్పష్టం చేసింది. రానున్న మూడేళ్ల కాలం తన భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని చెప్పింది. ప్రస్తుతానికి తన దృష్టంతా 2018లో జరిగే ఇతర టోర్నీలతో పాటు, టి20 ప్రపంచకప్‌పైనే ఉందని తెలిపింది. వన్డే ప్రపంచకప్ ముగిసినప్పటి నుంచి వచ్చే జనవరి వరకు భారత షెడ్యూల్ ఖాళీగా ఉంది. దక్షిణాఫ్రికా పర్యటన ఖరారు భారత మహిళల జట్టు 2018 ఫిబ్రవరిలో దక్షిణా ప్రికాలో పర్యటించనుంది. వన్డే వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్ తమ తొలి రౌండ్లో దక్షిణాఫ్రికాతో తలపడనుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం వెల్లడించింది. ఫిబ్రవరి 5నుంచి 10వరకు ఈ రెండు జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరుగుతుందని ఐసీసీ ప్రకటించింది. -
నాలుగో ర్యాంక్‌లోనే మహిళల క్రికెట్ జట్టు
దుబాయ్: ఐసీసీ మహిళల వన్డే జట్ల ర్యాంకింగ్స్‌లో భారత జట్టు తమ నాలుగో స్థానాన్ని నిలబెట్టుకుంది. ఐసీసీ తాజాగా వెల్లడించిన వార్షిక ర్యాంకింగ్స్‌లో భారత్ మూడు పాయింట్లను మెరుగుపర్చుకుని 116 పాయింట్లకు చేరింది. రెండు పాయింట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టు మూడో స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఇంగ్లండ్ జట్టు ఆసీస్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. టాప్–3లో ఉండటమే తమ లక్ష్యమని కెప్టెన్ మిథాలీ రాజ్ తెలిపింది. కివీస్‌కు తమకు చాలా స్వల్ప తేడా ఉందని, రాబోయే మ్యాచ్‌ల్లో మెరుగైన ఆటతీరును కనబరుస్తామని చెప్పింది. 2014–15, 2015–16 సీజన్లో ప్రదర్శన నుంచి 50 శాతం... 2016–17 సీజన్లో పూర్తి ఆటతీరును పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్స్‌ను వెలువరించారు. -
కేయూ మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు
విజయవాడ స్పోర్ట్స్ : చెన్నై సత్యభామ యూనివర్సిటీలో శనివారం ముగిసిన సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ మహిళా క్రికెట్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన కృష్ణా యూనివర్సిటీ జట్టును వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సుంకరి కృష్ణారావు అభినందించారు. ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ మహిళా క్రికెట్ టోర్నీకి ఎంపికైన సందర్భంగా కేయూ ఫిజికల్ డైరెక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యాన స్థానిక ఓ హోటల్లో ఆదివారం అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వీసీ మాట్లాడుతూ మహిళా క్రికెట్ జట్టు సౌత్ ఇండియా స్థాయిలో రన్నరప్‌గా నిలవడంపై హర్షం వ్యక్తంచేశారు. జట్టులోని ప్రతి క్రికెటర్‌కు రూ.3వేల నగదు ప్రోత్సాహక బహుమతిని ప్రకటించారు. జట్టును విజయపథంలో నడిపిన కోచ్ బి.ఉదయ్‌కుమార్, మేనేజర్ జి.సుధారాణిని వీసీ అభినందించారు. కేయూ పీజీ సెంటర్ ప్రత్యేక అధికారి మండవ బసవేశ్వరరావు మాట్లాడుతూ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ టోర్నీలో విజేతగా నిలిస్తే జట్టులోని ప్రతి సభ్యురాలికి రూ.5,116 చొప్పున అందజేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పీడీల అసోసియేష్ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.డేవిడ్, వర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.