New Zealand All Rounder Anna Peterson Retires from International Cricket - Sakshi
Sakshi News home page

Anna Peterson: అంతర్జాతీయ క్రికెట్‌కు న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ గుడ్‌ బై!

Published Tue, Oct 5 2021 10:58 AM | Last Updated on Tue, Oct 5 2021 1:04 PM

New Zealand Cricketer Anna Peterson Retires From International Cricket - Sakshi

Anna Peterson retires from international cricket: న్యూజిలాండ్‌ మహిళా క్రికెటర్‌ అన్నా పీటర్సన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. అయితే, దేశవాళీ క్రికెట్‌లో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని న్యూజిలాండ్‌ క్రికెట్‌ మంగళవారం ధ్రువీకరించింది. రిటైర్మెంట్‌ నేపథ్యంలో అన్నా మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ.. వైట్‌ ఫెర్న్స్‌(మహిళా టీమ్‌) జట్టుకు ప్రాతినిథ్యం వహించిన నేను.. ఆటలో ప్రతీ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించాను. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన నా కుటుంబం, స్నేహితులు, కోచ్‌లు, సహచర క్రికెటర్లు, ఇతర సిబ్బంది.. అందరికీ ధన్యవాదాలు. 

వైట్‌ ఫెర్న్స్‌కు ఆడటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో క్రికెటర్లను కలుసుకునే అవకాశం దక్కింది. దేశవాళీ క్రికెట్‌లో ఇంకా ఆడగలననే నమ్మకం ఉంది. ఈ సీజన్‌లో అక్లాండ్‌ హర్ట్స్‌ తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్నా’’ అని పేర్కొంది. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా 2012లో వన్డేల్లో అడుగుపెట్టిన అన్నా పీటర్సన్‌...మొత్తంగా 32 వన్డేలు ఆడింది. ఇక 33 టీ20 మ్యాచ్‌లలో న్యూజిలాండ్‌ తరఫున ఆడిన ఈ ఆల్‌రౌండర్‌.. పరిమిత ఓవర్ల(వన్డే, టీ20) క్రికెట్‌లో మొత్తం 45 వికెట్లు తీసింది. ఇక 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో అన్నా.. హ్యాట్రిక్‌ నమోదు చేసింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి న్యూజిలాండ్‌ మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఇక 31 ఏళ్ల వయస్సులో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు అన్నా రిటైర్మెంట్‌ ప్రకటించింది.

చదవండి: MS Dhoni: బంతులన్నీ వృథా చేశావు.. అవుటైనా బాగుండేది.. కనీసం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement