
విశాఖపట్నం: మహిళల సీనియర్ టీ20 మ్యాచ్‌లు ముగించుకుని వెళ్తున్న బరోడా క్రికెటర్లు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు.. ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో దానిని ఢీకొంది. ఈ ఘటనలో నలుగురికి గాయాలైనట్లు సమాచారం. విశాఖపట్నంలోని తాటిచెట్లపాలెం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా విశాఖ వేదికగా మహిళా సీనియర్ టీ20 మ్యాచ్‌లు జరుగుతున్నాయి.
చదవండి: West Indies: 'హెట్‌మైర్ శాపం తగిలింది.. అందుకే విండీస్‌కు ఈ దుస్థితి'