‘భారీగా అనుకుంటే.. 133 పరుగులే కొట్టారు’ | ICC Womens T20 World Cup: india Set 134 Runs Target To New Zealand | Sakshi
Sakshi News home page

ఫస్టాఫ్‌ మనది.. సెకండాఫ్‌ వారిది

Published Thu, Feb 27 2020 11:12 AM | Last Updated on Thu, Feb 27 2020 11:16 AM

ICC Womens T20 World Cup: india Set 134 Runs Target To New Zealand - Sakshi

మెల్‌బోర్న్‌: పది ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు. క్రీజులో టీనేజర్‌ సంచలనం షఫాలీ వర్మ, నమ్మదగ్గ బ్యాటర్‌ రోడ్రిగ్స్‌. ఇంకా హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, వేదా కృష్ణమూర్తి, దీప్తి శర్మలు బ్యాటింగ్‌కు సిద్దంగా ఉన్నారు. దీంతో టీమిండియా అవలీలగా 150 పరుగులు దాటుతుందనుకున్నారు. కానీ చివరకి 8 వికెట్లు కోల్పోయి 133 పరుగులకే పరిమితమయ్యారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో షపాలీ(34 బంతుల్లో46; 4ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ముఖ్యంగా మిడిలార్డర్‌ కివీస్‌ బౌలింగ్‌కు తడబడి వెనుదిరిగారు. బౌలింగ్‌లో అమెలియా కెర్‌(2/21), రోజ్‌మెరీ మెయిర్‌(2/27) కీలక సమయంలో వరుసగా వికెట్లు పడగొట్టారు. 

ఫస్టాఫ్‌ మనది.. సెకండాఫ్‌ వారిది
టాస్‌ గెలిచిన కివీస్‌ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఐసీసీ టోర్నమెంట్లలలో తన ఫేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ స్మృతి మంధాన (11) వచ్చి వెళ్లగా.. అనూహ్యంగా క్రీజులోకి వచ్చిన తానియా భాటియా కాసేపు మెరుపులు మెరిపించారు. అయితే అదే ఊపులో రోజ్‌మెరి బౌలింగ్‌లో తానియా(23) క్యాచ్‌ ఔటాయ్యారు. అయితే మరోవైపు షఫాలీ తనదైన రీతిలో బ్యాటింగ్‌ చేస్తూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో పదిఓవర్లు ముగిసేసరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులతో పటిష్టస్థితిలో నిలిచింది. 

అయితే పదకొండో ఓవర్‌ నుంచి కివీస్‌ గేమ్‌ ప్లాన్‌ మార్చింది. భారత బ్యాటర్స్‌కు ఊరించే బౌలింగ్‌ వేస్తూ వికెట్లను పడగొట్టింది. అయితే కీవీస్‌ ప్లేయర్స్‌ అనే క్యాచ్‌లను జారవిడచడంతో టీమిండియా బ్యాటర్‌కు అనేక అవకాశాలు లభించాయి. కానీ వాటిని అందిపుచ్చుకోవడంలో విఫలమ్యారు. ఈ క్రమంలో రోడ్రిగ్స్‌(10) నుంచి ప్రారంభమైన వికెట్ల పతనం ఇన్నింగ్స్‌ చివరి బంతి వరకు సాగింది. హర్మన్‌(1), దీప్తి శర్మ(8), వేదా కృష్ణమూర్తి(6) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దీంతో స్కోర్‌ బోర్డు మందగించింది. ఓ క్రమంలో కనీసం వంద పరుగులైన టీమిండియా క్రాస్‌ చేస్తుందా అనే అనుమానం తలెత్తింది. కానీ చివర్లో రాధా యాదవ్‌(14), శిఖా పాండే(10 నాటౌట్‌)లు ధాటిగా ఆడటంతో టీమిండియా ఓ మోస్తారు స్కోర్‌ను సాధించింది. 

 


చదవండి:
రెండు అవకాశాలు.. నో యూజ్‌
‘డ్యాన్స్‌ బాగుంది.. ట్రోఫీ తెస్తే ఇంకా బాగుంటుంది’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement