మెల్‌బోర్న్: మహిళల టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు సత్తా చాటింది. న్యూజిలాండ్‌తో జరిగిన హోరాహోరి మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే గ్రూప్ ‘ఎ’ నుంచి భారత్ సెమీస్ వెళ్లగా.. రెండో బెర్త్ కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు పోటీ పడ్డాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పోరాటం వృథా అయింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో ఓపెనర్ బీఎల్ మూనీ 50 బంతుల్లో 60 పరుగులు సాధించగా, బౌలింగ్‌లో వేర్‌హామ్, షుట్‌లు మూడేసి వికెట్లు తీసి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు గ్రూప్ ‘బి’ నుంచి దక్షిణాఫ్రికా, ఇంగ్లడ్ జట్లు సెమీస్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. (చదవండి : సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్)
Comments
Please login to add a commentAdd a comment