సిడ్నీ: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఒక ఫైనల్ బెర్త్ ఖరారు కాగా మరో బెర్త్ కోసం ఆతిథ్య ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. గురువారం స్థానిక సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. నాలుగు సార్లు టీ20 ఛాంపియన్‌గా నిలిచిన ఆసీస్ జట్టు స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. కాగా, తొలి సారి ఫైనల్ చేరుకోవడంతో పాటు వరల్డ్ కప్‌తో దక్షిణాఫ్రికాకు వెళ్లాలని ఆ జట్టు ఆరాటపడుతోంది.
ఇదే వేదికగా టీమిండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన తొలి సెమీస్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. మ్యాచ్ సమయానికి ఔట్ పీల్డ్ చిత్తడి చిత్తడిగా ఉండటంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు తెలిపారు. అయితే గ్రూప్ దశలో అత్యధిక పాయింట్లతో ఉన్న టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. రెండో మ్యాచ్ ప్రారంభ సమయానికి సిబ్బంది మైదానాన్ని సిద్ధం చేశారు. దీంతో మరో సెమీస్ పోరులో పోటీపడుతున్న ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మ్యాచ్ విజేతతో ఫైనల్లో టీమిండియా తలపడనుంది.
చదవండి:
ఫైనల్‌కు టీమిండియా తొలిసారి
దక్షిణాఫ్రికా ఘనమైన ప్రతీకారం
Comments
Please login to add a commentAdd a comment