ఆసీస్ మహిళా బ్యాటర్లు- ప్రస్తుత టీమిండియాలోని కొంతమంది సభ్యులు
Women World Cup 2022- వెల్లింగ్టన్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో వరుసగా ఆరో విజయం నమోదు చేసిన ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ రికార్డు సాధించింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో నెగ్గిన మెగ్ లానింగ్ బృందం ఛేజింగ్‌లో భారత పురుషుల జట్టు పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.
కాగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 45.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (130 బంతుల్లో 135 నాటౌట్; 15 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్‌లో 15 సెంచరీ సాధించి ఆసీస్‌ను విజయతీరానికి చేర్చింది. ఈ గెలుపుతో ఛేజింగ్‌లో 17 వరుస విజయాలతో టీమిండియా(భారత పురుషుల జట్టు) పేరిట ఉన్న రికార్డును ఆస్ట్రేలియా జట్టు తిరగరాసింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. అంతకుముందు దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 5 వికెట్లకు 271 పరుగులు చేసింది. లౌరా (90; 6 ఫోర్లు), సునె లుస్ (52; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. కాగా ప్రపంచకప్-2022 టోర్నీలో ఇప్పటికే సెమీస్ చేరిన ఆసీస్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
చదవండి: క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు..
Comments
Please login to add a commentAdd a comment