ఈ నెల 10వ తేదీన ఎల్బీ స్టేడియంలో అంధుల టి20 వరల్డ్‌కప్ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహక కమిటీ అధ్యక్షురాలు జహారా బేగం శనివారం తెలిపారు.
హైదరాబాద్: ఈ నెల 10వ తేదీన ఎల్బీ స్టేడియంలో అంధుల టి20 వరల్డ్‌కప్ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహక కమిటీ అధ్యక్షురాలు జహారా బేగం శనివారం తెలిపారు. తెలంగాణలో తొలిసారిగా తొలి అంతర్జాతీయ అంధుల క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించడం జరుగుతుందన్నారు. భారత జట్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు క్రీడాకారులు ఎంపిక కాగా, గుంటూరుకు చెందిన అజయ్‌కుమార్ రెడ్డి కెప్టెన్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నాడు.
నగరంలో జరిగే ఈ మ్యాచ్ ప్రారంభోత్సవంలో క్రీడా శాఖమంత్రి టి.పద్మారావు, క్రీడా ప్రాధికారిక సంస్థ ఉపాధ్యక్షులు ఎస్.నిరంజన్‌రెడ్డి, వికలాంగుల శాఖ కార్యదర్శి ఎస్.జగదీశ్వర్‌లు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.