సెమీస్‌లో బోపన్న జంట | Bopanna pair of semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో బోపన్న జంట

Published Sat, Oct 22 2016 4:34 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM

సెమీస్‌లో బోపన్న జంట

సెమీస్‌లో బోపన్న జంట

న్యూఢిల్లీ: స్టాక్‌హోమ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)-ట్రీట్ హుయె (ఫిలిప్పీన్స్) జంట సెమీఫైనల్లోకి ప్రవేశించింది. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్ నగరంలో జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న-హుయె ద్వయం 7-6 (9/7), 6-4తో యోహాన్ బ్రన్‌‌ట్రామ్-ఆండ్రీస్ సిల్‌జెస్‌‌ట్రామ్ (స్వీడన్) జోడీపై విజయం సాధించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో బోపన్న-హుయె జోడీ 7-6 (8/6), 6-3తో మార్కోస్ బగ్ధాటిస్ (సైప్రస్)-గైల్స్ ముల్లర్ (లక్సెంబర్గ్) జంటను ఓడించింది.

 
క్వార్టర్స్‌లో జోష్నా

న్యూయార్క్: కారోల్ వెముల్లర్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్‌లో భారత స్టార్ జోష్నా చినప్ప క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. క్వాలిఫయర్ సల్మా హనీ ఇబ్రహీమ్ (ఈజిప్టు)తో జరిగిన రెండో రౌండ్‌లో జోష్నా 12-10, 11-9, 11-8తో విజయం సాధించింది. క్వార్టర్స్‌లో ఏడో సీడ్ సారా జేన్ పెర్రీ (ఇంగ్లండ్)తో జోష్నా తలపడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement