మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నిలబెట్టుకునే దిశగా రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) మరో అడుగు వేశాడు. ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అతను సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్‌లో మాజీ విజేత ఏంజెలిక్ కెర్బర్ (జర్మనీ), టాప్‌సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) సెమీస్ చేరారు. పురుషుల విభాగంలో ఫెడరర్‌తో పాటు దక్షిణ కొరియాకు చెందిన అన్‌సీడెడ్ హైన్ చుంగ్ కూడా సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత ఆటగాడు రోహన్ బోపన్న జోడీ సెమీఫైనల్ పోరుకు అర్హత సంపాదించింది.
రోజర్ 43వ సారి...
రెండో సీడ్ ఫెడరర్ తన గ్రాండ్‌స్లామ్ కెరీర్‌లో 43వ సారి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనే అతను సెమీస్ చేరడం ఇది 14వ సారి కావడం విశేషం. బుధవారం ఏకపక్షంగా సాగిన క్వార్టర్ ఫైనల్లో రోజర్ 7–6 (7/1), 6–3, 6–4తో థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)పై వరుస సెట్లలో విజయం సాధించాడు. మరో క్వార్టర్ ఫైనల్లో కొరియన్ సంచలనం హైన్ చుంగ్ 6–4, 7–6 (7/5), 6–3తో టినిస్ సాండ్‌గ్రెన్ (అమెరికా)పై గెలుపొందాడు. శుక్రవారం సెమీస్‌లో ఫెడరర్... హైన్ చుంగ్‌తో తలపడతాడు.
హలెప్ అలవోకగా..: మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ హలెప్, జర్మనీ స్టార్ కెర్బర్ అలవోక విజయాలతో సెమీఫైనల్ చేరుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ హలెప్ 6–3, 6–2తో ఆరో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందింది. మరో పోరులో 21వ సీడ్ కెర్బర్ ధాటికి అమెరికా క్రీడాకారిణి మాడిసన్ కీస్ చేతులేత్తేసింది. జర్మనీ స్టార్ వరుస సెట్లలో 6–1, 6–2తో 17వ సీడ్ కీస్ (అమెరికా)ను చిత్తు చేసింది. 2016 ఆస్టేలియన్ ఓపెన్ చాంపియన్ అయిన కెర్బర్ 51 నిమిషాల్లోనే ఈ మ్యాచ్‌ను ముగించింది. సెమీస్ మ్యాచ్‌ల్లో కెర్బర్‌తో హలెప్, ఎలైస్ మెర్టెన్స్ (బెల్జియం)తో వోజ్నియాకి (డెన్మార్క్) పోటీపడతారు.
సెమీస్‌లో బోపన్న జోడి
మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)–తిమియా బాబోస్ (హంగేరి) జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ భారత్–హంగేరి జోడీ 6–4, 7–6 (7/5)తో సెబాస్టియన్ కెబల్ (కొలంబియా)– అబిగెల్ స్పియర్స్ (అమెరికా) జంటను కంగుతినిపించింది.
ఫెడరర్ మరింత జోరుగా...
Published Thu, Jan 25 2018 12:38 AM | Last Updated on Thu, Jan 25 2018 12:38 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment