మెల్‌బోర్న్: టెన్నిస్‌లో ఆ్రస్టేలియా దిగ్గజం మార్గరెట్ కోర్ట్ పేరు మీదున్న ఆల్‌టైమ్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ రికార్డు (24)ను సమం చేయడానికి సెరెనా విలియమ్స్ ఒకవైపు... పురుషుల విభాగంలో ఫెడరర్ (20 టైటిల్స్) సరసన చేరడానికి ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ దూరంలో ఉన్న ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ మరోవైపు... నేటి నుంచి ఆరంభమయ్యే ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిలే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. డిఫెండింగ్ చాంపియన్, ఏడుసార్లు విజేత జొకోవిచ్ (సెర్బియా), 38 ఏళ్ల వయసులోనూ తన బ్యాక్ హ్యాండ్ పవర్ ఏమాత్రం తగ్గలేదంటూ రోజర్ ఫెడరర్ మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేశారు.
2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గని సెరెనాను మార్గరెట్ కోర్ట్ ఆల్‌టైమ్ రికార్డు ఊరిస్తోంది. తల్లి అయ్యాక... సెరెనా నాలుగు గ్రాండ్‌స్లామ్ (2018–వింబుల్డన్, యూఎస్; 2019–వింబుల్డన్, యూఎస్ ఓపెన్) టోరీ్నలలో ఫైనల్స్ చేరినా... టైటిల్‌ను గెలవడంలో మాత్రం విఫలమైంది. అయితే ఆక్లాండ్ ఓపెన్‌లో విజేతగా నిలిచి సెరెనా ఆత్మవిశ్వాసంతో ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో బరిలో దిగుతోంది. నేటి తొలి రౌండ్ మ్యాచ్‌లో పొటపోవా (రష్యా)తో సెరెనా ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment