
సెమీస్‌లో సౌరవ్
చెన్నై: భారత అగ్రశ్రేణి స్క్వాష్ క్రీడాకారుడు సౌరవ్ ఘోషల్... మాంట్రియల్ ఓపెన్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. కెనడాలో జరుగుతున్న ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో సౌరవ్ 11–8, 9–11, 9–11, 11–4, 15–13తో అర్తురో సలాజర్ (మెక్సికో)పై గెలిచాడు. సెమీఫైనల్లో మూడో సీడ్ ఒమర్ ఆదిల్ (ఈజిప్ట్)తో తలపడతాడు.