Sourav
-
Sourav Joshi: పదిహేడేళ్ల వయసులోనే.. గొప్ప యూట్యూబర్‌గా
ఆర్టిస్ట్. పదిహేడేళ్ల వయసులో Sourav Joshi Arts అట్టటపేరుతో యూట్యూబ్ చానెల్ని స్టార్ట్ చేశాడు. స్కెచెస్ ఎలా వేయాలో నేర్పుతూ తీసిన వీడియోలను అందులో పోస్ట్ చేసేవాడు. దానికి తక్కువ కాలంలోనే ఎక్కువ వ్యూస్, సబ్స్క్రైబర్స్ రావడంతో ఆ కుర్రాడికి సిల్వర్ ప్లే బటన్‌ను ప్రెజెంట్ చేసింది యూట్యూబ్.నెక్స్ట్ ఇయరే అంటే 2019లో 'Sourav Joshi Vlogs'తో మరో యూట్యూబ్ చానెల్ని స్టార్ట్ చేశాడు. ఇందులో స్కెచింగ్స్తోపాటు తన స్వస్థలమైన అల్మోరా (ఉత్తరాఖండ్) గురించి, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, అందమైన ప్రకృతికి సంబంధించిన వీడియోలు తీసి పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు.కరోనా లాక్డౌన్ టైమ్‌లో 365 రోజులు.. 365 వీడియోలు అనే టార్గెట్ పెట్టుకుని రీచ్ అయిన ఘనుడు. ‘ఫటీ జీన్స్’, ‘ఝూటా లగ్దా’, ‘తేరా హో రాహా హూ’, ‘భాయ్ మేరా భాయ్’, ‘మంజూరే నజర్’ వంటి మ్యూజిక్ వీడియోల్లోనూ నటించాడు సౌరవ్. -
సూపర్ సౌరవ్...
భారత స్క్వాష్ స్టార్ సౌరవ్ ఘోషాల్ వరుసగా ఐదో ఆసియా క్రీడల్లోనూ పతకంతో మెరిశాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 37 ఏళ్ల సౌరవ్ 11–9, 9–11, 5–11, 7–11తో ఇఐన్ యో ఎన్జీ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయి రజత పతకం దక్కించుకున్నాడు. 2006 దోహా ఆసియా క్రీడల్లో అరంగేట్రం చేసి కాంస్యం నెగ్గిన సౌరవ్.. ఆ తర్వాత 2010లో కాంస్యం, 2014లో రజతం, 2018లో కాంస్యం సాధించాడు. తొలిసారి ప్రవేశపెట్టిన మిక్స్డ్ డబుల్స్‌లో దీపిక పల్లికల్–హరీందర్‌పాల్ జోడీ (భారత్) స్వర్ణ పతకం గెలిచింది. ఫైనల్లో దీపిక–హరీందర్‌పాల్ ద్వయం 11–10, 11–10తో ఐఫా బింతి అజ్మన్–కమాల్ (మలేసియా) జంటపై నెగ్గింది. రెజ్లర్ అంతిమ్‌కు కాంస్యం మహిళల రెజ్లింగ్‌లో భారత రైజింగ్ స్టార్ అంతిమ్ పంఘాల్ కాంస్య పతకం గెలిచింది. 53 కేజీల విభాగం కాంస్య పతక బౌట్లో 19 ఏళ్ల అంతిమ్ 3–1తో టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బొలోర్‌తుయా బత్ఒచిర్ (మంగోలియా)పై సంచలన విజయం సాధించింది. భారత్‌కే చెందిన పూజా గెహ్లోత్ (50 కేజీలు) కాంస్య పతక బౌట్లో 2–9తో కెయునిమ్జేవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో... మాన్సి అహ్లావత్ కాంస్య పతక బౌట్లో 70 సెకన్లలో సొబిరోవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. మరోవైపు భారత మహిళల హాకీ జట్టు సెమీఫైనల్లో 0–4 గోల్స్ తేడాతో చైనా జట్టు చేతిలో ఓడిపోయింది. శనివారం జరిగే కాంస్య పతక మ్యాచ్‌లో జపాన్‌తో భారత్ ఆడుతుంది. పురుషుల మారథాన్ రేసులో (42.195 కిలోమీటర్లు) భారత అథ్లెట్లు మాన్ సింగ్ ఎనిమిదో స్థానంలో (2గం:16ని:59 సెకన్లు), అప్పచంగడ బెలియప్ప (2గం:20ని:52 సెకన్లు) 12వ స్థానంలో నిలిచారు. -
క్వార్టర్స్‌లో సౌరవ్ ఓటమి
షికాగో (అమెరికా): ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ బరిలో మిగిలిన సౌరవ్ ఘోషాల్ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. ఏకపక్షంగా సాగిన క్వార్టర్ ఫైనల్లో 11వ సీడ్ సౌరవ్ 8–11, 6–11, 7–11తో మూడో సీడ్ సైమన్ రోస్నర్ (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్‌లో 6–2తో ఆధిక్యంలో నిలిచిన సౌరవ్ ఆ తర్వాత తడబడి తేరుకోలేకపోయాడు. ఈ గెలుపుతో ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్‌కు చేరిన తొలి జర్మనీ ప్లేయర్‌గా రోస్నర్ నిలిచాడు. -
ఆటల్లోనూ సగం... సమం...
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ పోటీలకు ముందు వర్ధమాన అథ్లెట్లు తమ సత్తా చాటేందుకు అవకాశం కల్పిస్తున్న యూత్ ఒలింపిక్స్‌కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో మూడో యూత్ ఒలింపిక్స్ పోటీలు జరగనున్నాయి. 2010లో తొలిసారి జరిగిన పోటీలకు సిం గపూర్, 2014లో చైనాలోని నాన్జింగ్ ఆతిథ్యమిచ్చాయి. నేటి నుంచి ఈ నెల 18 వరకు 2018 పోటీలు జరుగుతాయి. మొత్తం 32 క్రీడాంశాల్లో 4000 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఒలింపిక్ చరిత్రలో తొలి సారి ‘లింగ సమానత్వం’ అనే నేపథ్యాన్ని ఈ క్రీడల్లో చేర్చారు. దీని ప్రకారం పోటీల్లో పాల్గొనే ఆటగాళ్లలో పురుషులు, మహిళల సంఖ్య సరిగ్గా సమానంగా ఉంటుంది. తాజా నిర్ణయంతో కొత్త తరహా ఒలింపిక్ స్ఫూర్తికి శ్రీకారం చుట్టినట్లవుతుం దని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ అన్నారు. ‘ఇక్కడ మొదలు పెట్టే కొత్త మార్పులు ఒక్క యూత్ గేమ్స్‌కే పరిమితం కావు. అందరి కోసం ఆటలు అనే విధంగా మొత్తం ఒలింపిక్ ఉద్యమం గొప్పతనం చాటేలా నిర్ణయాలు తీసుకుంటాం’ అని ఆయన అన్నారు. బ్యూనస్ ఎయిర్స్ క్రీడలతోనే అనేక కొత్త అంశాలు ఈ పోటీల్లో ప్రవేశ పెడుతున్నారు. బ్రేక్‌డ్యాన్సింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, రోలర్ స్పోర్ట్స్ అండ్ కరాటే, బీఎం ఎక్స్ ఫ్రీస్టయిల్, కైట్ బోర్డింగ్, బీచ్ హ్యాండ్‌బాల్, ఫుట్సల్, అక్రోబటిక్ జిమ్నాస్టిక్స్ తదితర అంశాలు ఇందులో ఉన్నాయి. 47 మందితో భారత్: భారత్ తరఫున యూత్ ఒలింపిక్స్‌లో 13 క్రీడాంశాల్లో కలిపి మొత్తం 47 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. భారత్ మొదటిసారి ఫీల్డ్ హాకీ ఫైవ్స్, స్పోర్ట్ క్లైంబిం గ్లో పాల్గొంటోంది. షూటర్ మను భాకర్ ప్రారంభ వేడుకల్లో పతాకధారి కాగా... బ్యాడ్మింటన్‌లో సంచలన ఆటగాడు లక్ష్య సేన్‌తోపాటు తెలుగమ్మాయి జక్కా వైష్ణవి రెడ్డి కూడా పోటీ పడుతోంది. 2010 యూత్ ఒలింపిక్స్‌లో భారత్ ఆరు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు గెలిచి 58వ స్థానంలో నిలిచింది. 2014 యూత్ ఒలింపిక్స్‌లో ఒక రజతం, ఒక కాంస్యం నెగ్గి రెండు పతకాలతో 64వ స్థానంలో నిలిచింది. అయితే ఈసారి షూటర్లు మను భాకర్, సౌరభ్ చౌదరి, మెహులీ ఘోష్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో భారత్ ఈసారి పసిడి బోణీ చేసే అవకాశాలున్నాయి. బాక్సింగ్‌లో జ్యోతి గులియా (51 కేజీలు), టేబుల్ టెన్నిస్‌లో మానవ్ ఠక్కర్, బ్యాడ్మింటన్‌లో లక్ష్య సేన్, రెజ్లింగ్‌లో మాన్సి పతకాలు గెలిచే అవకాశముంది. -
సెమీస్‌లో సౌరవ్
చెన్నై: భారత అగ్రశ్రేణి స్క్వాష్ క్రీడాకారుడు సౌరవ్ ఘోషల్... మాంట్రియల్ ఓపెన్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. కెనడాలో జరుగుతున్న ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో సౌరవ్ 11–8, 9–11, 9–11, 11–4, 15–13తో అర్తురో సలాజర్ (మెక్సికో)పై గెలిచాడు. సెమీఫైనల్లో మూడో సీడ్ ఒమర్ ఆదిల్ (ఈజిప్ట్)తో తలపడతాడు. -
రన్నరప్ కొఠారి
బెంగళూరు: ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ లాంగ్ అప్ ఫార్మాట్లో భారత ప్లేయర్ సౌరవ్ కొఠారి రన్నరప్‌గా నిలిచాడు. గురువారం జరిగిన ఫైనల్లో సౌరవ్ 617-1500 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్ పీటర్ గిల్‌క్రిస్ట్ (సింగపూర్) చేతిలో ఓడిపోయాడు. సెమీఫైనల్స్‌లో సౌరవ్ 1250-816తో ధ్వజ్ హరియా (భారత్)పై, గిల్‌క్రిస్ట్ 1250-958తో రూపేశ్ షా (భారత్)పై గెలిచారు.