
ఆర్టిస్ట్. పదిహేడేళ్ల వయసులో Sourav Joshi Arts అట్టటపేరుతో యూట్యూబ్ చానెల్‌ని స్టార్ట్ చేశాడు. స్కెచెస్ ఎలా వేయాలో నేర్పుతూ తీసిన వీడియోలను అందులో పోస్ట్ చేసేవాడు. దానికి తక్కువ కాలంలోనే ఎక్కువ వ్యూస్, సబ్‌స్క్రైబర్స్ రావడంతో ఆ కుర్రాడికి సిల్వర్ ప్లే బటన్‌ను ప్రెజెంట్ చేసింది యూట్యూబ్.
నెక్స్ట్ ఇయరే అంటే 2019లో 'Sourav Joshi Vlogs'తో మరో యూట్యూబ్ చానెల్‌ని స్టార్ట్ చేశాడు. ఇందులో స్కెచింగ్స్‌తోపాటు తన స్వస్థలమైన అల్మోరా (ఉత్తరాఖండ్) గురించి, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, అందమైన ప్రకృతికి సంబంధించిన వీడియోలు తీసి పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు.
కరోనా లాక్‌డౌన్ టైమ్‌లో 365 రోజులు.. 365 వీడియోలు అనే టార్గెట్ పెట్టుకుని రీచ్ అయిన ఘనుడు. ‘ఫటీ జీన్స్’, ‘ఝూటా లగ్దా’, ‘తేరా హో రాహా హూ’, ‘భాయ్ మేరా భాయ్’, ‘మంజూరే నజర్’ వంటి మ్యూజిక్ వీడియోల్లోనూ నటించాడు సౌరవ్.