రుచులతో ప్రయాగాలు చేయడం కబితా సింగ్ అభిరుచి. అందులో ఆమెకు అపారమైన ప్రజ్ఞ ఉంది. కబితా గరిట పట్టిందంటే చాలు నలభీమ పాకం ఇలాగే ఉంటుందేమో అన్నంత టేస్టీగా ఘుమఘుమలాడిపోతుంది ఆ వంటకం. అలా తను చేసే డిఫరెంట్ వంటకాల గురించి లోకానికి చెప్పాలనుకుంది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయితే పర్‌ఫెక్ట్ అనుకుంది. అందుకే 2014లో Kabita's Kitchen పేరుతో యూట్యూబ్ చానెల్‌ను స్టార్ట్ చేసింది. అందులో ఆమె చేప్పే 10 మినిట్స్ ప్రెషర్ కుకర్ రెసిపీస్ నుంచి స్ట్రీట్ ఫుడ్ దాకా, నాన్ ఆయిలీ ఆలూ పాలక్ నుంచి పాస్తా, పిజ్జా, సాలిడ్స్, సూప్స్ దాకా అన్ని రకాల వంటలకు ఊహించని రీతిలో రెస్పాన్స్ మొదలైంది. 2017కల్లా మిలియన్ల వ్యూస్‌కి చేరుకుంది. ఇప్పుడు ఆమె చానెల్‌కి (2023 లెక్కల ప్రకారం) కోటీ 34 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు.
ఈ పాపులారిటీ వల్ల ఆమె చానెల్‌కి బ్రాండ్ ప్రమోషన్స్ పెరిగాయి. 2023 గణాంకాల ప్రకారం యాడ్స్ వల్ల ఆమె ఏడాదికి 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఆర్జిస్తోందని అంచనా. అకార్డింగ్ టు వేరియస్ వెబ్‌సైట్స్ Kabita's Kitchen వాల్యూ 5 నుంచి 6 కోట్లు ఉండొచ్చట. చూశారా.. తిరగమోతకూ తిరుగులేని విలువుంటుంది. అందుకే వంటలో నైపుణ్యాన్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి!
ఇవి చదవండి: Sharvari Wagh: అది సినిమానా? ఓటీటీనా? టీవీ సీరియలా అని చూడను..
Comments
Please login to add a commentAdd a comment