నిషామధులిక.. లీడింగ్ యూట్యూబ్ షెఫ్. వెజిటేరియన్ రెసిపీస్‌కి ఫేమస్. యూట్యూబ్ చానెల్ పెట్టేకంటే ముందు ఆమె తన భర్త కంపెనీలో అకౌంట్స్ చూసేవారు. తొలి నుంచి రకరకాల వంటకాలు చేయడమంటే ఆమెకు ఆసక్తి. సెలవు రోజు వచ్చిందంటే చాలు వెరైటీ వంటల ప్రయోగాలకు పోపు పెట్టేవారు.
ఓసారి ఇలాగే కొత్త వంటకాన్ని వండుతూ ‘ఈ రెసిపీని తనలా కుకింగ్ హాబీ ఉన్నవాళ్లకు షేర్ చేస్తే’ అనే ఆలోచన కలిగింది ఆమెకు. వాళ్లబ్బాయితో చెప్పింది. వెబ్‌సైట్ ఒకటి రూపొందించి ఇచ్చాడు తల్లికి కానుకగా. ఇక్క అక్కడి నుంచి ఆమె అభిరుచి ప్రయాణం మొదలైంది.
తనకు తెలిసిన, తను ఎక్స్‌పరిమెంట్ చేసిన వంటకాల రెసిపీలతో బ్లాగింగ్ స్టార్ట్ చేశారామె. ఆ తర్వాత మూడేళ్లకే అంటే 2011లో ఆమె పేరు మీదే యూట్యూబ్‌లో వంటల చానెల్‌నూ ప్రారంభించారు. షార్ట్ టైమ్‌లోనే మిలియన్ల సబ్‌స్క్రైబర్స్‌ని సాధించారు. ఈ యేడు ఫిబ్రవరి నాటికి ఆమె చానెల్‌కి ఉన్న సబ్‌స్కైబర్స్ సంఖ్య దాదాపు కోటీ 41 లక్షలు (జాగరణ్ వెబ్‌సైట్ ప్రకారం).
దేశంలోకెల్లా ఫిఫ్త్ రిచెస్ట్ యూట్యూబర్. జాగరణ్ వెబ్‌సైట్ ప్రకారం ఆమె యూట్యూబ్ చానెల్ నెట్ వర్త్ 43 కోట్లు. సబ్జెక్ట్ ఏదైనా సరే.. ఇంట్రెస్ట్ ఉంటే టెక్నో యుగం బారియర్ కాదని.. సెకండ్ యూత్ కూడా ఆన్ పార్ విత్ యూత్ ఉండొచ్చని ప్రూవ్ చేశారు నిషామధులిక.
ఇవి చదవండి: Namita Dubey: నిజమైన యాక్టర్స్.. తమ పాత్ర గురించే ఆలోచిస్తారు!
Comments
Please login to add a commentAdd a comment