హరిద్వార్: జాతీయ సీనియర్ మహిళల ఎలైట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర బాక్సర్ నిఖత్ జరీన్ కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. 51 కేజీల విభాగంలో పోటీపడుతున్న నిఖత్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో నిఖత్ 3-0తో మంజు బసుమాతరె (అస్సాం)పై విజయం సాధించింది. సెమీస్‌లో నీరజ (హరియాణా)తో నిఖత్ తలపడుతుంది. ‘గత రెండు రౌండ్‌లలో నా ప్రదర్శనపట్ల సంతృప్తిగా లేను.
కానీ క్వార్టర్ ఫైనల్లో పూర్తి ఆధిపత్యం చలారుుంచాను. తొలిసారి జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో పతకం ఖాయం చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. తదుపరి బౌట్‌లలోనూ ఇదే జోరును కొనసాగించి స్వర్ణం సాధించాలని అనుకుంటున్నాను’ అని ప్రపంచ జూనియర్ మాజీ చాంపియన్ నిఖత్ వ్యాఖ్యానించింది. మరోవైపు తెలంగాణకే చెందిన బాక్సర్ ప్రియ మాధురి 81 కేజీల విభాగంలో సెమీస్‌కు చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో ప్రియ మాధురి 3-0తో తృప్తి (మహారాష్ట్ర)పై గెలిచింది.
నిఖత్‌కు పతకం ఖాయం
Published Wed, Nov 23 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM
Advertisement