Nikhat
-
ఇండియా ఓపెన్ బాక్సింగ్ టోర్నీకి నిఖత్, హుసాముద్దీన్, ప్రసాద్
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరిగే ఇండియా ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టులో తెలంగాణ బాక్సర్లు నిఖత్ జరీన్, మొహమ్మద్ హుసాముద్దీన్‌లతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పొలిపల్లి లలితా ప్రసాద్ ఎంపికయ్యారు. మే 20 నుంచి 24 వరకు గువాహటిలో ఈ టోర్నీ జరుగుతుంది. ఒలింపిక్ కేటగిరీ అయిన 51 కేజీల విభాగంలో నిఖత్ బరిలోకి దిగుతుంది. ఇదే విభాగంలో భారత మేటి బాక్సర్ మేరీకోమ్ కూడా పాల్గొంటుంది. హుసాముద్దీన్ 54 కేజీల విభాగంలో, ప్రసాద్ 52 కేజీల విభాగంలో ఉన్నారు. 70 వేల డాలర్ల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో భారత్ తరఫున పురుషుల విభాగంలో 35 మంది... మహిళల విభాగంలో 37 మంది పోటీపడతారు. ఈ టోర్నీలో 16 దేశాల నుంచి సుమారు 200 మంది బాక్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. -
ఆసియా బాక్సింగ్ పోటీలకు నిఖత్
న్యూఢిల్లీ: ఆసియా మహిళల బాక్సింగ్ పోటీల్లో పాల్గొనే భారత జట్టులో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ స్థానం సంపాదించింది. ఏప్రిల్ 16 నుంచి 27 వరకు బ్యాంకాక్‌లో జరిగే ఈ పోటీల్లో పాల్గొనే భారత జట్టు ఎంపిక కోసం శనివారం సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. 51 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ 4–1తో పింకీ రాణి (హరియాణా)పై నెగ్గి జాతీయ జట్టులోకి ఎంపికైంది. మరోవైపు దిగ్గజం మేరీకోమ్ ఆసియా చాంపియ¯Œ షిప్ పోటీలకు దూరమైంది. ఈ ఏడాది చివర్లో జరిగే ప్రపంచ చాంపియన్ షిప్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలనే ఉద్దేశంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. భారత జట్టు: నీతూ (హరియాణా–48 కేజీలు), నిఖత్ జరీన్ (తెలంగాణ–51 కేజీలు), మనీషా (హరియాణా–54 కేజీలు), సోనియా చహల్ (రైల్వేస్–57 కేజీలు), సరితా దేవి (ఆలిండియా పోలీస్–60 కేజీలు), సిమ్రన్ జిత్ కౌర్ (పంజాబ్–64 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (అస్సాం–69 కేజీలు), నుపుర్ (హరియాణా–75 కేజీలు), పూజా రాణి (హరియాణా–81 కేజీలు), సీమా పూనియా (రైల్వేస్–ప్లస్ 81 కేజీలు). -
బాక్సర్ నిఖత్‌కు కేటీఆర్ అభినందన
సాక్షి, హైదరాబాద్: స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ మహిళా బాక్సర్‌గా చరిత్ర సృష్టించిన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్‌ను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు (కేటీఆర్) అభినందించారు. సోమవారం హైదరాబాద్ చేరుకున్న నిఖత్ తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను కలిసింది. తాను గెలుచుకున్న స్వర్ణ పతకాన్ని ఆయనకు చూపించింది. నిఖత్ జరీన్ పోరాట స్ఫూర్తిని, పట్టుదలను ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణ నుంచి బాక్సింగ్‌లో అద్బుతమైన ప్రతిభాపాటవాలతో యువతకు ఒక మార్గదర్శిగా నిలుస్తున్నావని నిఖత్‌ను ప్రశంసించారు. నిఖత్ జరీన్‌కు అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున భవిష్యత్తులోనూ అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇన్ని రోజులుగా తనకు అందిస్తున్న సహకారం పట్ల ప్రభుత్వానికి, కేటీఆర్‌కు నిఖత్ ధన్యవాదాలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో క్రీడల మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. -
తీన్మార్ పంచ్
కొత్త సీజన్‌ను భారత బాక్సర్లు పతకాల పంటతో ప్రారంభించారు. స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో మొత్తం ఏడు పతకాలు సొంతం చేసుకుని అదరగొట్టారు. ఇందులో మూడు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలు ఉన్నాయి. భారత్ తరఫున తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్... మణిపూర్ అమ్మాయి మైస్నం మీనాకుమారి దేవి... హరియాణా బాక్సర్ అమిత్ పంగల్ ‘పసిడి పంచ్’లతో మెరిశారు. సోఫియా (బల్గేరియా): అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత బాక్సర్లు స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో మెరిపించారు. 70 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో తొలిసారి మహిళల విభాగంలో స్వర్ణ పతకాలు సాధించి కొత్త చరిత్ర సృష్టించారు. 51 కేజీల విభాగంలో ప్రపంచ జూనియర్ మాజీ చాంపియన్ నిఖత్ జరీన్... 54 కేజీల విభాగంలో మైస్నం మీనా కుమారి దేవి... పురుషుల 49 కేజీల విభాగంలో ఆసియా క్రీడల విజేత అమిత్ పంగల్ పసిడి పతకాలు గెలిచారు. మహిళల 48 కేజీల విభాగంలో మంజు రాణి రజతం నెగ్గగా... సెమీఫైనల్లో ఓడిపోయిన ప్విలావో బాసుమతారి (64 కేజీలు), నీరజ్ (60 కేజీలు), లవ్లీనా బొర్గొహైన్ (69 కేజీలు) కాంస్య పతకాలతో సంతృప్తి పడ్డారు. గతంలో మహిళల విభాగంలో భారత్ తరఫున మేరీకోమ్ (రజతం) ప్రదర్శనే అత్యుత్తమంగా ఉంది. మంగళవారం జరిగిన ఫైనల్స్‌లో నిజామాబాద్ జిల్లా అమ్మాయి నిఖత్ జరీన్ 5–0తో ఐరీష్ మాగ్నో (ఫిలిప్పీన్స్)పై... మీనా కుమారి 3–2తో ఐరా విలెగాస్ (ఫిలిప్పీన్స్)పై నెగ్గగా... మంజు రాణి 2–3తో జోసీ గబుకో (ఫిలిప్పీన్స్) చేతిలో ఓడిపోయింది. మరో టైటిల్ పోరులో అమిత్ పంగల్ 3–2తో తెమిర్తాస్ జుసుపోవ్ (కజకిస్తాన్)పై గెలిచాడు. ఐరీష్ మాగ్నోతో జరిగిన తుది పోరులో నిఖత్ ఆద్యంతం దూకుడుగా ఆడింది. అవకాశం వచ్చినపుడల్లా ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించింది. నిఖత్‌ను నిలువరించడానికి ఐరీష్ మాగ్నో రక్షణాత్మకంగా ఆడినా ఫలితం లేకపోయింది. అమర జవాన్లకు అంకితం... ఈ స్వర్ణం పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు అంకితం ఇస్తున్నాను. ఫైనల్లో ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకుండా పోరాడాను. ఆ అమ్మాయి తొలి రౌండ్లో భారత్‌కే చెందిన పింకీ జాంగ్రాను ఓడించింది. ఈ స్వర్ణం నా సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేసిన వారికి సమాధానం. –నిఖత్ జరీన్ -
క్వార్టర్స్‌లో ఓడిన నిఖత్
మనేసర్ (హరియాణా): జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారిణి నిఖత్ బాను పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. మనేసర్ స్పోర్ట్స్ క్లబ్లో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో మనికా 8–11, 11–7, 11–6, 10–12, 5–11, 11–8, 11–4తో నిఖత్ బాను (తెలంగాణ)పై విజయం సాధించింది. ఈ టోర్నీలో మధురిక పట్కర్ టైటిల్‌ను దక్కించుకోగా... పురుషుల విభాగంలో శరత్ కమల్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో మధురిక (4–0) 11–5, 11–9, 11–5, 12–10 తో ఆరుసార్లు జాతీయ చాంపియన్ అయిన పౌలోమి ఘటక్‌ను చిత్తుగా ఓడించి తొలిసారి చాంపియన్‌గా నిలిచింది. పురుషుల ఫైనల్లో అచంట శరత్ కమల్ 11–8, 6–11, 11–9, 3–11, 11–8, 11–5తో సౌమ్యజిత్ ఘోష్‌పై గెలిచి ఏడోసారి ఈ టైటిల్‌ను దక్కించుకున్నాడు. 2003లో అతను ఇక్కడే తొలి టైటిల్‌ను గెలుచుకోవడం విశేషం. -
నిఖత్‌కు పతకం ఖాయం
హరిద్వార్: జాతీయ సీనియర్ మహిళల ఎలైట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర బాక్సర్ నిఖత్ జరీన్ కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. 51 కేజీల విభాగంలో పోటీపడుతున్న నిఖత్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో నిఖత్ 3-0తో మంజు బసుమాతరె (అస్సాం)పై విజయం సాధించింది. సెమీస్‌లో నీరజ (హరియాణా)తో నిఖత్ తలపడుతుంది. ‘గత రెండు రౌండ్లలో నా ప్రదర్శనపట్ల సంతృప్తిగా లేను. కానీ క్వార్టర్ ఫైనల్లో పూర్తి ఆధిపత్యం చలారుుంచాను. తొలిసారి జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో పతకం ఖాయం చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. తదుపరి బౌట్లలోనూ ఇదే జోరును కొనసాగించి స్వర్ణం సాధించాలని అనుకుంటున్నాను’ అని ప్రపంచ జూనియర్ మాజీ చాంపియన్ నిఖత్ వ్యాఖ్యానించింది. మరోవైపు తెలంగాణకే చెందిన బాక్సర్ ప్రియ మాధురి 81 కేజీల విభాగంలో సెమీస్‌కు చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో ప్రియ మాధురి 3-0తో తృప్తి (మహారాష్ట్ర)పై గెలిచింది. -
నిఖత్ బానుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో నిఖత్ బాను విజేతగా నిలిచింది. తెలంగాణ టేబుల్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో స్టాగ్ అకాడమీ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో సోమవారం జరిగిన మహిళల ఫైనల్లో నిఖత్‌బాను (జీఎస్ఎం) 11-7, 11-7, 11-2, 11-4తో నైనా (ఎల్బీఎస్)పై గెలుపొంది టైటిల్‌ను కై వసం చేసుకుంది. క్యాడెట్ బాలుర ఫైనల్లో రిత్విక్ (స్టాగ్ అకాడమీ) 14-12, 11-7, 11-8తో రాజు (ఏడబ్ల్యూఏ)పై గెలిచి విజేతగా నిలిచాడు. సబ్ జూనియర్ బాలికల ఫైనల్లో అంజలి (జీఎస్ఎం) 12-10, 2-11, 11-7, 11-9, 6-11, 11-8తో ఆయుషి (జీఎస్ఎం)పై... బాలుర ఫైనల్లో వరుణ్ శంకర్ (జీటీటీఏ) 11-8, 10-12, 11-5, 11-7, 11-7తో అద్వైత్ (ఏడబ్ల్యూఏ)పై విజయం సాధించారు. అంతర్ జిల్లా టీమ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో హైదరాబాద్ జిల్లా 3-0తో నల్గొండ జిల్లాపై గెలుపొంది టైటిల్‌ను గెలుచుకుంది. -
నిఖత్, శ్రీజ, వరుణిలకు కాంస్యాలు
జాతీయ ర్యాంకింగ్ టీటీ టోర్నీ గువహటి: జాతీయ సీనియర్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ-ఈస్ట్‌జోన్) టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయిలు నిఖత్ బాను, ఆకుల శ్రీజ, వరుణి జైస్వాల్ కాంస్య పతకాలు గెల్చుకున్నారు. బుధవారం ముగిసిన ఈ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో నిఖత్ 3-4 (11-9, 12-10, 3-11, 6-11, 15-13, 6-11, 8-11)తో షామిని (పీఎస్‌పీబీ) చేతిలో పోరాడి ఓడింది. మరో సెమీస్‌లో మౌమా దాస్ (పీఎస్‌పీబీ) 4-0తో పూజా సహస్రబుద్దే (పీఎస్‌పీబీ)పై గెలిచింది. సెమీస్‌లో ఓడిన నిఖత్, పూజాలకు కాంస్యాలు లభించగా... ఫైనల్లో షామిని 4-3తో మౌమా దాస్‌ను ఓడించి విజేతగా నిలిచింది. యూత్, జూనియర్ బాలికల సింగిల్స్ విభాగంలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) జట్టు తరఫున బరిలోకి దిగిన తెలుగు అమ్మాయి ఆకుల శ్రీజకు కాంస్య పతకాలు దక్కాయి. ‘యూత్’ సెమీస్‌లో శ్రీజ 2-4తో రీత్ రిష్యా (పీఎస్‌పీబీ) చేతిలో... ‘జూనియర్’ సెమీస్‌లో 0-4తో హర్షవర్ధిని (తమిళనాడు) చేతిలో ఓడిపోయింది. జూనియర్ బాలికల సింగిల్స్ సెమీస్‌లో వరుణి 1-4తో మౌమితా దత్తా (బెంగాల్) చేతిలో పరాజయం పాలైంది. -
నిఖత్ శుభారంభం
ప్రపంచ యూత్ బాక్సింగ్ సోఫియా (బల్గేరియా): ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు శుభారంభం చేశారు. మహిళల 51 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నిఖత్ జరీన్ రెండో రౌండ్లోకి ప్రవేశించింది. పురుషుల విభాగంలో శ్యామ్ కకారా (49 కేజీలు), సతీశ్ కుమార్ (56 కేజీలు) కూడా ముందంజ వేశారు. గత చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన నిఖత్ తొలి రౌండ్ బౌట్లో 3-0తో ఇస్తిక్ నెరిమాన్ (టర్కీ)పై గెలిచింది. బుధవారం జరిగే రెండో రౌండ్లో లీ సుక్‌యోంగ్ (కొరియా)తో నిఖత్ తలపడుతుంది. పురుషుల విభాగంలో శ్యామ్ తన ప్రత్యర్థి అబ్దుల్లా అల్ముల్లా (యూఏఈ)ని ‘టెక్నికల్ నాకౌట్’ చేయగా... సతీశ్ 3-0తో నాందోర్ సోస్కా (హంగేరి)పై గెలిచారు. శ్యామ్ పంచ్‌ల ధాటికి అబ్దుల్లా రెండు రౌండ్ల తర్వాత బౌట్‌ను కొనసాగించలేని పరిస్థితిలోకి వెళ్లాడు. దాంతో రిఫరీ ‘టెక్నికల్ నాకౌట్’ పద్ధతిలో శ్యామ్‌ను విజేతగా ప్రకటించారు. గౌరవ్ సోలంకి (52 కేజీలు), నీల్ కమల్ సింగ్ (75 కేజీలు), మన్జీత్ (69 కేజీలు)... మహిళల విభాగంలో మంజూ బొంబారియా (75 కేజీలు) లకు తొలి రౌండ్ ‘బై’ లభించింది. భారత బాక్సింగ్ సమాఖ్యపై నిషేధం కొనసాగుతున్న కారణంగా ఈ మెగా ఈవెంట్లో భారత బాక్సర్లు అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) పతాకం కింద పోటీపడుతున్నారు. -
నిఖత్ జోడీకి రజతం
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నిఖత్ బాను రజత పతకం సాధించింది. శనివారం పాట్నాలో జరిగిన ఈ పోటీల్లోని మహిళల డబుల్స్ విభాగంలో నిఖత్-కృత్విక సిన్హా రాయ్ జంట రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో అనందిత చక్రవర్తి-పల్లవి కుందు (రైల్వేస్) ద్వయం 9-11, 11-6, 12-10, 11-5తో నిఖత్-కృత్విక జంటపై గెలిచింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో నిఖత్-కృత్విక జోడి తో 3-1తో చార్వి కావ్లే-ప్రీతి జోడి (మహారాష్ట్ర బీ)పై గెలుపొందింది.ఈ పోటీల్లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తరఫున బరిలోకి దిగిన నిఖత్ టీమ్ విభాగంలో కాంస్యం సాధించింది.