నిఖత్‌ బానుకు టైటిల్ | nikhat banu gets table tennis title | Sakshi
Sakshi News home page

నిఖత్‌ బానుకు టైటిల్

Published Tue, Nov 22 2016 10:53 AM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM

నిఖత్‌ బానుకు టైటిల్

నిఖత్‌ బానుకు టైటిల్

సాక్షి, హైదరాబాద్: స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్‌లో నిఖత్ బాను విజేతగా నిలిచింది. తెలంగాణ టేబుల్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో స్టాగ్ అకాడమీ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో సోమవారం జరిగిన మహిళల ఫైనల్లో నిఖత్‌బాను (జీఎస్‌ఎం) 11-7, 11-7, 11-2, 11-4తో నైనా (ఎల్‌బీఎస్)పై గెలుపొంది టైటిల్‌ను కై వసం చేసుకుంది. క్యాడెట్ బాలుర ఫైనల్లో రిత్విక్ (స్టాగ్ అకాడమీ) 14-12, 11-7, 11-8తో రాజు (ఏడబ్ల్యూఏ)పై గెలిచి విజేతగా నిలిచాడు.

 

సబ్ జూనియర్ బాలికల ఫైనల్లో అంజలి (జీఎస్‌ఎం) 12-10, 2-11, 11-7, 11-9, 6-11, 11-8తో ఆయుషి (జీఎస్‌ఎం)పై... బాలుర ఫైనల్లో వరుణ్ శంకర్ (జీటీటీఏ) 11-8, 10-12, 11-5, 11-7, 11-7తో అద్వైత్ (ఏడబ్ల్యూఏ)పై విజయం సాధించారు. అంతర్ జిల్లా టీమ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో హైదరాబాద్ జిల్లా 3-0తో నల్గొండ జిల్లాపై గెలుపొంది టైటిల్‌ను గెలుచుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement