క్వార్టర్స్‌లో ఓడిన నిఖత్‌ | After losing in the quarter-nikhat | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో ఓడిన నిఖత్‌

Published Sun, Feb 5 2017 11:51 PM | Last Updated on Tue, Sep 5 2017 2:58 AM

After losing in the quarter-nikhat

మనేసర్‌ (హరియాణా): జాతీయ సీనియర్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారిణి నిఖత్‌ బాను పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. మనేసర్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో మనికా 8–11, 11–7, 11–6, 10–12, 5–11, 11–8, 11–4తో నిఖత్‌ బాను (తెలంగాణ)పై విజయం సాధించింది. ఈ టోర్నీలో మధురిక పట్కర్‌ టైటిల్‌ను దక్కించుకోగా... పురుషుల విభాగంలో శరత్‌ కమల్‌ విజేతగా నిలిచాడు.

ఫైనల్లో మధురిక (4–0) 11–5, 11–9, 11–5, 12–10 తో ఆరుసార్లు జాతీయ చాంపియన్‌ అయిన పౌలోమి ఘటక్‌ను చిత్తుగా ఓడించి తొలిసారి చాంపియన్‌గా నిలిచింది. పురుషుల ఫైనల్లో అచంట శరత్‌ కమల్‌ 11–8, 6–11, 11–9, 3–11, 11–8, 11–5తో సౌమ్యజిత్‌ ఘోష్‌పై గెలిచి ఏడోసారి ఈ టైటిల్‌ను దక్కించుకున్నాడు. 2003లో అతను ఇక్కడే తొలి టైటిల్‌ను గెలుచుకోవడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement