సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నిఖత్ బాను రజత పతకం సాధించింది. శనివారం పాట్నాలో జరిగిన ఈ పోటీల్లోని మహిళల డబుల్స్ విభాగంలో నిఖత్-కృత్విక సిన్హా రాయ్ జంట రన్నరప్‌గా నిలిచింది.
ఫైనల్లో అనందిత చక్రవర్తి-పల్లవి కుందు (రైల్వేస్) ద్వయం 9-11, 11-6, 12-10, 11-5తో నిఖత్-కృత్విక జంటపై గెలిచింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో నిఖత్-కృత్విక జోడి తో 3-1తో చార్వి కావ్లే-ప్రీతి జోడి (మహారాష్ట్ర బీ)పై గెలుపొందింది.ఈ పోటీల్లో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తరఫున బరిలోకి దిగిన నిఖత్ టీమ్ విభాగంలో కాంస్యం సాధించింది.
నిఖత్ జోడీకి రజతం
Published Sun, Jan 12 2014 1:11 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement