నిఖత్, శ్రీజ, వరుణిలకు కాంస్యాలు | Manav settles for silver at national TT | Sakshi
Sakshi News home page

నిఖత్, శ్రీజ, వరుణిలకు కాంస్యాలు

Published Thu, Nov 19 2015 1:55 AM | Last Updated on Sun, Sep 3 2017 12:40 PM

నిఖత్, శ్రీజ, వరుణిలకు కాంస్యాలు

నిఖత్, శ్రీజ, వరుణిలకు కాంస్యాలు

జాతీయ ర్యాంకింగ్ టీటీ టోర్నీ
గువహటి: జాతీయ సీనియర్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ-ఈస్ట్‌జోన్) టోర్నమెంట్‌లో తెలంగాణ అమ్మాయిలు నిఖత్ బాను, ఆకుల శ్రీజ, వరుణి జైస్వాల్ కాంస్య పతకాలు గెల్చుకున్నారు. బుధవారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో నిఖత్ 3-4 (11-9, 12-10, 3-11, 6-11, 15-13, 6-11, 8-11)తో షామిని (పీఎస్‌పీబీ) చేతిలో పోరాడి ఓడింది. మరో సెమీస్‌లో మౌమా దాస్ (పీఎస్‌పీబీ) 4-0తో పూజా సహస్రబుద్దే (పీఎస్‌పీబీ)పై గెలిచింది.

సెమీస్‌లో ఓడిన నిఖత్, పూజాలకు కాంస్యాలు లభించగా... ఫైనల్లో షామిని 4-3తో మౌమా దాస్‌ను ఓడించి విజేతగా నిలిచింది.
 యూత్, జూనియర్ బాలికల సింగిల్స్ విభాగంలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) జట్టు తరఫున బరిలోకి దిగిన తెలుగు అమ్మాయి ఆకుల శ్రీజకు కాంస్య పతకాలు దక్కాయి.

‘యూత్’ సెమీస్‌లో శ్రీజ 2-4తో రీత్ రిష్యా (పీఎస్‌పీబీ) చేతిలో... ‘జూనియర్’ సెమీస్‌లో 0-4తో హర్షవర్ధిని (తమిళనాడు) చేతిలో ఓడిపోయింది. జూనియర్ బాలికల సింగిల్స్ సెమీస్‌లో వరుణి 1-4తో మౌమితా దత్తా (బెంగాల్) చేతిలో పరాజయం పాలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement