లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు ప్రణాళిక సిద్ధమైందన్న మనూ భాకర్
బుధవారం స్వదేశానికి వచ్చిన స్టార్ షూటర్
శనివారం ముగింపు వేడుకలకు మళ్లీ పారిస్ వెళ్లనున్న మనూ
న్యూఢిల్లీ: నాలుగేళ్ల తర్వాత జరగనున్న 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ కోసం ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని భారత స్టార్ షూటర్ మనూ భాకర్ వెల్లడించింది. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన మనూ బుధవారం స్వదేశానికి తిరిగి వచి్చంది. స్థానిక ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మనూ భాకర్, ఆమె కోచ్ జస్పాల్ రాణాకు ఘనస్వాగతం లభించింది.
22 ఏళ్ల మనూ భాకర్ పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంతో పాటు మిక్స్‌డ్ విభాగంలో కాంస్య పతకాలు గెలుచుకొని.. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి భారత మహిళగా రికార్డు నెలకొలి్పన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మనూ భాకర్ మాట్లాడుతూ. ‘పారిస్ ఒలింపిక్స్ ముగింపు దశకు చేరుకున్నాయి. నేనప్పుడే 2028 లాస్ ఏంజెలిస్ క్రీడల కోసం ప్రయాణం ప్రారంభించా.
కాస్త విరామం అనంతరం సాధన మొదలుపెడతాను. భవిష్యత్తులోనూ ఇదే నిలకడ చూపేందుకు ప్రయతి్నస్తా. అందుకోసం మరింత శ్రమిస్తా. కాకపోతే ఇప్పుడు కొంతకాలం కుటుంబ సభ్యులతో గడుపుతాను. మూడు నెలల తర్వాత తిరిగి షూటింగ్ ప్రాక్టీస్ ప్రారంభిస్తా’ అని ఆమె వెల్లడించింది. విశ్వక్రీడల్లో రెండు పతకాలు సాధించడంతో పాటు 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో త్రుటిలో పతకం చేజార్చుకున్న మనూ భాకర్.. శనివారం తిరిగి పారిస్ వెళ్లనుంది. ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో మనూ భారత బృందానికి పతాకధారిగా వ్యవహరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment