air pistol
-
రుబీనా అదుర్స్
పారిస్ పారాలింపిక్స్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు మన గన్ గర్జించడంతో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో భారత పారా షూటర్ రుబీనా ఫ్రాన్సిస్ కాంస్యంతో సత్తా చాటింది. చెదరని గురితో పోడియంపై చోటు దక్కించుకుంది. ఇతర క్రీడల్లోనూ శనివారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. బ్యాడ్మింటన్‌లో నితీశ్ కుమార్, సుకాంత్ కదమ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లి పతకాలకు చేరువయ్యారు. పారిస్: పారాలింపిక్స్‌లో భారత షూటర్లు పతకాలతో అదరగొడుతున్నారు. శుక్రవారం రైఫిల్ విభాగంలో అవనీ లేఖరా, మోనా అగర్వాల్ పతకాలతో సత్తా చాటితే... శనివారం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 విభాగంలో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతకంతో మెరిసింది. ఈ విభాగంలో పారాలింపిక్స్ పతకం నెగ్గిన తొలి భారత మహిళా షూటర్‌గా రికార్డుల్లోకెక్కింది. తుదిపోరులో 25 ఏళ్ల రుబీనా 211.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి పతకం ఖాతాలో వేసుకుంది. వైల్డ్‌కార్డ్ ద్వారా పారిస్ పారాలింపిక్స్ బెర్త్ దక్కించుకున్న రుబీనా... క్వాలిఫయింగ్ రౌండ్లో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్ చేరింది. ఇరాన్ షూటర్ జవాన్మార్డీ సారా 236.8 పాయింట్లతో స్వర్ణం చేజిక్కించుకుంది. సారాకు ఇది వరుసగా మూడో పారాలింపిక్ పసిడి కావడం విశేషం. అజ్గాన్ అయ్సెల్ (టర్కీ) 231.1 పాయింట్లతో రజత పతకం గెలుచుకుంది. స్థిరమైన గురితో సత్తాచాటిన రుబీనా... క్వాలిఫయింగ్ రౌండ్ కంటే ఎంతో మెరుగైన ప్రదర్శన చేసి పోడియంపై నిలిచింది. తుది పోరులో తొలి పది షాట్ల తర్వాత రుబీనా 97.6 పాయింట్లతో నిలిచింది. 14 షాట్ల తర్వాత నాలుగో స్థానంలో ఉన్న రుబీనా తదుపరి రెండు షాట్లలో మెరుగైన ప్రదర్శన చేసి మూడో స్థానానికి చేరింది. కాంస్యం గెలిచిన రుబీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఎక్స్’ వేదికగా అభినందించారు. గొప్ప సంకల్పం, అసాధారణమైన గురితో పతకం సాధించిన రుబీనా దేశాన్ని గర్వపడేలా చేసిందని పేర్కొన్నారు. గగన్ నారంగ్ స్ఫూర్తితో.. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్కు చెందిన మెకానిక్ కూతురైన రుబీనా... పుట్టుకతోనే కుడి కాలు లోపంతో జన్మించింది. తండ్రి స్నేహితుల ప్రోద్బలంతో షూటింగ్ కెరీర్ ప్రారంభించిన రుబీనా... ఆరంభంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. జబల్పూర్ అకాడమీలో షూటింగ్ ఓనమాలు నేర్చుకున్న ఫ్రాన్సిస్... ఒలింపిక్ పతక విజేత, హైదరాబాదీ షూటర్ గగన్ నారంగ్ ఘనతలు చూసి షూటింగ్‌పై మరింత ఆసక్తి పెంచుకుంది. కెరీర్ ఆరంభంలో షూటింగ్ రేంజ్‌కు వెళ్లేందుకు కూడా డబ్బులు లేని గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న రుబీనా... అకుంఠిత దీక్షతో ముందుకు సాగి 2017లో గగన్ నారంగ్ అకాడమీ ‘గన్ ఫర్ గ్లోరీ’లో అడుగుపెట్టిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా పతకాలు సాధించింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ప్రపంచ రికార్డు స్కోరుతో బరిలోకి దిగి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. బ్యాడ్మింటన్ సెమీస్‌లో నితీశ్, సుకాంత్ పారిస్ పారాలింపిక్స్‌లో భారత షట్లర్లు అదరగొట్టారు. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3లో నితీశ్ కుమార్, ఎస్ఎల్4లో సుకాంత్ కదమ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లి పతకానికి అడుగు దూరంలో నిలిచారు. శనివారం క్వార్టర్ ఫైనల్లో నితీశ్ 21–13, 21–14తో మాంగ్ఖాన్ బున్సన్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించి గ్రూప్ ‘ఎ’లో టాప్ ప్లేస్ దక్కించుకొని సెమీస్‌కు చేరాడు. గ్రూప్ నుంచి రెండో స్థానంలోనిలిచిన బున్సన్ కూడా సెమీస్‌కు చేరాడు. ఎస్ఎల్4 క్లాస్‌లో సుకాంత్ 21–12, 21–12తో టిమార్రోమ్ సిరిపాంగ్ (థాయ్‌లాండ్)పై గెలిచి సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. మిక్స్డ్ డబుల్స్ ఎస్ఎల్3లో సుహాస్ యతిరాజ్–పాలక్ కోహ్లీ జంట 11–21, 17–21తో హిక్మత్–లియాని రాట్రి (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడింది. మరో మ్యాచ్‌లో నితీశ్ కుమార్–తులసిమతి ద్వయం కూడా పరాజయం పాలైంది. క్వార్టర్ ఫైనల్లో సరిత ఓటమి భారత పారా ఆర్చర్ సరితా కుమారి క్వార్టర్ఫైనల్లో పరాజయం పాలైంది. శనివారం మహిళల కాంపౌండ్ క్వార్టర్స్‌లో సరిత 140–145తో టాప్ సీడ్ ఓజు్నర్ కూర్ గిర్డి (కొరియా) చేతిలో ఓటమి పాలైంది. అంతకుముందు ఎలిమినేషన్ రెండో రౌండ్లో సరిత 141–135తో ఎలెనోరా సార్టీ (ఇటలీ)పై గెలిచింది. తొలి రౌండ్లో సరిత 138–124తో నూర్ అబ్దుల్ జలీల్ (మలేసియా)పై గెలిచింది. మరోమ్యాచ్‌లో భారత ఆర్చర్, రెండో సీడ్ శీతల్ దేవి 137–138తోమిరియానా జునీగా (చిలీ)పై చేతిలో ఓడింది. రోయింగ్ రెపిచాజ్లో మూడో స్థానం రోయింగ్ మిక్స్డ్ పీఆర్3 డబుల్ స్కల్స్‌లో అనిత, నారాయణ కొంగనపల్లె జంట రెపిచాజ్ ఈవెంట్లో మూడో స్థానంలో నిలిచి ఫైనల్ ‘బి’లో అడుగుపెట్టింది. శనివారం పోటీలో ఈ జంట 7 నిమిషాల 54.33 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది. ఉక్రెయిన్ (7 నిమిషాల 29.24 సెకన్లు), బ్రిటన్ (7 నిమిషాల 20.53 సెకన్లు) జోడీలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఫైనల్ ‘బి’లోని రోవర్లు 7 నుంచి 12వ స్థానం కోసం పోటీపడనున్నారు. సైక్లింగ్‌లో నిరాశ పారిస్ పారాలింపిక్స్‌లో భారత సైక్లిస్ట్‌లకు నిరాశ ఎదురైంది. అర్షద్ షేక్, జ్యోతి గడేరియా తమతమ విభాగాల్లో ఫైనల్‌కు చేరకుండానే వెనుదిరిగారు. పురుషుల 1000 మీటర్ల టైమ్ ట్రయల్ సీ1–3 విభాగంలో బరిలోకి దిగిన అర్షద్ శనివారం క్వాలిఫయింగ్ రౌండ్లో చివరి స్థానంతో రేసును ముగించాడు. మొత్తం 17 మంది పాల్గొన్న ఈ పోటీలో అర్షద్ 1 నిమిషం 21.416 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. మహిళల 500 మీటర్ల టైమ్ ట్రయల్ సీ1–3 క్వాలిఫయింగ్ ఈవెంట్లో జ్యోతి గడేరియా 49.233 సెకన్లలో లక్ష్యాన్ని చేరి చివరి స్థానంలో నిలిచింది. -
‘మిషన్ 2028’ మొదలైంది...
న్యూఢిల్లీ: నాలుగేళ్ల తర్వాత జరగనున్న 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ కోసం ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని భారత స్టార్ షూటర్ మనూ భాకర్ వెల్లడించింది. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన మనూ బుధవారం స్వదేశానికి తిరిగి వచి్చంది. స్థానిక ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మనూ భాకర్, ఆమె కోచ్ జస్పాల్ రాణాకు ఘనస్వాగతం లభించింది. 22 ఏళ్ల మనూ భాకర్ పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంతో పాటు మిక్స్డ్ విభాగంలో కాంస్య పతకాలు గెలుచుకొని.. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి భారత మహిళగా రికార్డు నెలకొలి్పన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మనూ భాకర్ మాట్లాడుతూ. ‘పారిస్ ఒలింపిక్స్ ముగింపు దశకు చేరుకున్నాయి. నేనప్పుడే 2028 లాస్ ఏంజెలిస్ క్రీడల కోసం ప్రయాణం ప్రారంభించా. కాస్త విరామం అనంతరం సాధన మొదలుపెడతాను. భవిష్యత్తులోనూ ఇదే నిలకడ చూపేందుకు ప్రయతి్నస్తా. అందుకోసం మరింత శ్రమిస్తా. కాకపోతే ఇప్పుడు కొంతకాలం కుటుంబ సభ్యులతో గడుపుతాను. మూడు నెలల తర్వాత తిరిగి షూటింగ్ ప్రాక్టీస్ ప్రారంభిస్తా’ అని ఆమె వెల్లడించింది. విశ్వక్రీడల్లో రెండు పతకాలు సాధించడంతో పాటు 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో త్రుటిలో పతకం చేజార్చుకున్న మనూ భాకర్.. శనివారం తిరిగి పారిస్ వెళ్లనుంది. ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో మనూ భారత బృందానికి పతాకధారిగా వ్యవహరించనుంది. -
Olympics: ‘మను’సంతా పతకమే!
జూలై 25, 2021, టోక్యో... ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించకుండా తీవ్ర నిరాశ... పని చేయని తుపాకీతో వేదనగా నిష్క్రమించిన రోజు... జూలై 28, 2024, పారిస్... ఫైనల్స్‌లో సత్తా చాటి ఒలింపిక్ కాంస్యం గెలుచుకున్న క్షణం... గర్జించిన తుపాకీని గొప్పగా ప్రదర్శించిన రోజు... అవే ఒలింపిక్స్ క్రీడలు...అదే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్... అదే ప్లేయర్...కానీ తుది ఫలితం మాత్రం భిన్నం...విజయాలు కొత్త కాదు... మూడేళ్ల క్రితం మనూ భాకర్ టోక్యో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగింది. 19 ఏళ్ల ఒక అమ్మాయి మెగా ఈవెంట్లో మొదటిసారి... అదీ మూడు ఈవెంట్లలో పోటీ పడటం చిన్న విషయం కాదు. కానీ అసాధారణ ప్రతిభతో దూసుకొచి్చన ఈ షూటర్ అలాంటి అవకాశం సృష్టించుకుంది. నిజానికి అప్పటి వరకు ఆమె సాధించిన ఘనతలే భాకర్‌పై అంచనాలు భారీగా పెంచేశాయి. చివరకు అదే ఒత్తిడి ఆమెను చిత్తు చేసింది. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు వరకు పెద్ద సంఖ్యలో పతకాలు గెలుచుకుంది. జూనియర్ వరల్డ్ కప్‌లో రెండు స్వర్ణాలు, యూత్ ఒలింపిక్స్‌లో స్వర్ణం, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం, ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు, వరల్డ్ కప్‌లలో ఏకంగా తొమ్మిది స్వర్ణాలు... ఇలా ఈ జాబితా చాలా పెద్దది. దాంతో ఇదే జోరులో ఒలింపిక్ పతకం కూడా దక్కుతుందని అంతా ఆశించారు. కానీ అది సాధ్యం కాలేదు. ఇదేదో ఆటలో ఓటమిలా కాదు! క్వాలిఫయింగ్ పోటీల్లో కీలక సమయంలో భాకర్ పిస్టల్ సాంకేతిక సమస్యల కారణంగా పని చేయలేదు. దానిని సరిచేసుకొని వచ్చేసరికి ఆరు నిమిషాల కీలక సమయం వృథా అయింది. అయినా సరే 60 షాట్ల ద్వారా 575 పాయింట్లు సాధించడం విశేషం. చివరకు కేవలం రెండు పాయింట్ల తేడాతో ఫైనల్ అవకాశం కోల్పోయిన మను కన్నీళ్లపర్యంతమైంది. ఈ ప్రభావం మరో రెండు ఈవెంట్లపై పడి ఆమె కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయింది. మళ్లీ మొదలు... ఒలింపిక్ పతకం ప్రతిభ ఉంటేనే కాదు... ధైర్యవంతులకే దక్కుతుంది! శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటంతో పాటు ఓటమి భారంతో కుంగిపోయిన దశ నుంచి మళ్లీ పైకి లేవడం ఎంతో ధైర్యం ఉంటే తప్ప సాధ్యం కాదు. గొప్ప గొప్ప ఆటగాళ్లు కూడా ఇలాంటి పరాజయం తర్వాత కుప్పకూలిపోతారు. టోక్యో ఒలింపిక్స్ వైఫల్యం తర్వాత ఇతర షూటర్లు అపూర్వీ చండీలా, అభిషేక్ వర్మ, మిక్స్డ్ ఈవెంట్లో ఆమె సహచరుడు సౌరభ్ చౌదరీ మళ్లీ కెరీర్లో ముందుకు వెళ్లలేక దాదాపుగా షూటింగ్‌కు దూరమయ్యారు. ఒకదశలో మనూ కూడా అలాగే ఆలోచించింది. షూటింగ్ తనలో ఆసక్తి రేపడం లేదని, ఇక ఆటకు గుడ్‌బై చెప్పి సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమవ్వాలని నిర్ణయించుకుంది. కానీ సన్నిహితుల కారణంగా ‘చివరిసారిగా మళ్లీ ప్రయతి్నద్దాం’ అనే ఆలోచన మళ్లీ షూటింగ్లో కొనసాగేలా చేసింది. ఈసారి కూడా అంతే స్థాయిలో కఠోర సాధన చేసింది. ఏకాగ్రత చెదరకుండా ఒకే లక్ష్యానికి గురి పెట్టింది. దాంతో మళ్ళీ ఫలితాలు వచ్చాయి. జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నాలుగు స్వర్ణాలు, ఆసియా క్రీడల్లో స్వర్ణం, వరల్డ్ కప్‌లలో రెండు కాంస్యాలు, వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ, కాంస్యాలు దక్కాయి. అయితే పారిస్ క్రీడలకు ముందు గత రికార్డులను ఆమె పట్టించుకోలేదు. తనపై అంచనాలు లేకపోవడమే మంచిదని భావించి ప్రశాంతంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా మెగా ఈవెంట్లోకి అడుగు పెట్టి పతకంతో తన విలువను ప్రదర్శించింది. కానీ ఈ మూడు సంవత్సరాల మూడు రోజుల వ్యవధి ఒక చాంపియన్ ప్లేయర్ కెరీర్లో ఎన్నో మార్పులు తీసుకొచి్చంది... ఓటముల నుంచి పాఠాలు నేర్చుకొని గెలుపు వైపు ఎలా సాగాలో చూపించింది. 22 ఏళ్ల వయసులో మనూ భాకర్ ఇప్పుడు ఒలింపిక్ పతక విజేతగా తానేంటో నిరూపించుకుంది. గత ఒలింపిక్స్ చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ సగర్వంగా నిలిచింది. –సాక్షి క్రీడా విభాగంనాన్న అండతో... హరియాణాలోని ఝఝర్ జిల్లా గోరియా మనూ భాకర్ స్వస్థలం. తండ్రి రామ్‌కిషన్ భాకర్ మర్చంట్ నేవీలో చీఫ్ ఇంజినీర్. చిన్నప్పటి నుంచి ఆయన తన కూతురు ఆసక్తి కనబర్చిన ప్రతీ చోటా ప్రోత్సహించాడు. టెన్నిస్, స్కేటింగ్, మార్షల్ ఆర్ట్స్...ఇలా అన్నీ ఆడించాడు. ఒకదశలో బాక్సింగ్‌పై బాగా ఆసక్తి కనబర్చి ఎక్కువ సమయం ఈ గేమ్‌పై దృష్టి పెట్టింది. కానీ 14 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇదీ నచ్చలేదు. చివరకు తండ్రికి చెప్పి షూటింగ్ వైపు మరలగా... ఆయన ఇక్కడా వద్దనలేదు. కేవలం రెండేళ్ల శిక్షణ, సాధనతో షూటింగ్లో మనూ దూసుకుపోవడం విశేషం. 15 ఏళ్ల వయసులో జాతీయ సీనియర్ చాంపియన్íÙప్లో అగ్రశ్రేణి షూటర్ హీనా సిద్ధూను ఓడించి సంచలనం సృష్టించడంతో పాటు ఈ టోరీ్నలో ఏకంగా తొమ్మిది స్వర్ణాలు సాధించడంతో అందరి దృష్టి భాకర్‌పై పడింది. ఆ తర్వాత 16 ఏళ్ల వయసులో మెక్సికోలో జరిగిన వరల్డ్ కప్‌లో స్వర్ణం గెలుచుకొని పిన్న వయసులో ఈ ఘనత సాధించిన షూటర్‌గా నిలిచిన తర్వాత మనూ కెరీర్ బుల్లెట్లా దూసుకుపోయింది. –సాక్షి క్రీడా విభాగం -
మను మురిపించె...
గత రెండు ఒలింపిక్స్ క్రీడల్లో మూగబోయిన భారతీయ తుపాకీ ‘పారిస్’లో గర్జించింది. మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగి కనీసం ఫైనల్ చేరుకోకుండానే వెనుదిరిగిన మనూ భాకర్... ‘పారిస్’లో మాత్రం చిరస్మరణీయ ప్రదర్శనతో దేశం మొత్తాన్ని మురిపించింది. చెక్కు చెదరని ఏకాగ్రతతో... గురి తప్పని లక్ష్యంతో... ఒక్కో బుల్లెట్‌ను 10 మీటర్ల ముందున్న వృత్తంలోకి పంపిస్తూ... మూడో స్థానాన్ని సంపాదించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మనూ కొత్త చరిత్రను లిఖించింది. ఒలింపిక్స్ క్రీడల్లో పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా ఈ హరియాణా అమ్మాయి గుర్తింపు పొందింది. పారిస్: గత చేదు అనుభవాలను వెనక్కి నెట్టి పారిస్ వేదికగా భారత మహిళా షూటర్ మనూ భాకర్ కొత్త చరిత్రను లిఖించింది. ఒలింపిక్స్ క్రీడల్లో పతకం గెలిచిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా చరిత్రకెక్కింది. ఆదివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో 22 ఏళ్ల మనూ భాకర్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. మనూ భాకర్ 221.7 పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని సాధించింది. దక్షిణ కొరియాకు చెందిన జిన్ ఓయె (243.2 పాయింట్లు) స్వర్ణం నెగ్గగా... కిమ్ యెజీ (241.3 పాయింట్లు) రజతం గెలిచింది. ఫైనల్ సాగిందిలా... ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో ఫైనల్ జరిగింది. ముందుగా స్టేజ్–1లో ఎనిమిది మంది షూటర్లు 10 షాట్లు సంధించారు. 12వ షాట్ తర్వాత స్టేజ్–2లో ఎలిమినేషన్ మొదలైంది. 12 షాట్ల తర్వాత తక్కువ పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్న వెరోనికా మాయో (హంగేరి–114 పాయింట్లు) ని్రష్కమించింది. అప్పటికి మనూ 121.2 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. 14వ షాట్ తర్వాత తర్హాన్ (టర్కీ –135.6 పాయింట్లు), 16వ షాట్ తర్వాత రాన్‌జిన్ జియాంగ్ (చైనా–156.5 పాయింట్లు), 18వ షాట్ తర్వాత జుయ్ లీ (చైనా–178.3 పాయింట్లు) వెనుదిరిగారు. 20వ షాట్ తర్వాత త్రిన్ తు విన్ (వియత్నాం–198.6 పాయింట్లు) నాలుగో స్థానంతో ని్రష్కమించడంతో వరుసగా జిన్ ఓయె, కిమ్ యెజీ, మనూ భాకర్ పతకాల రేసులో నిలిచారు. 22వ షాట్ తర్వాత మనూ భాకర్ 221.7 పాయింట్లతో మూడో స్థానంలో... కిమ్ యెజీ 221.8 పాయింట్లతో రెండో స్థానంలో, జిన్ ఓయె 222.6 పాయింట్లతో తొలి స్థానంలో ఉన్నారు. 0.1 పాయింట్ తేడాతో కిమ్ యెజీకంటే మనూ వెనుకబడి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. చివరి రెండు షాట్లలో జిన్ ఓయె 10, 10.6 పాయింట్లు... కిమ్ యెజీ 9.7, 9.8 పాయింట్లు స్కోరు చేశారు. దాంతో జిన్ ఓయె 243.2 పాయింట్లతో స్వర్ణాన్ని ఖాయం చేసుకోగా, కిమ్ యెజీ 241.3 పాయింట్లతో రజతం నెగ్గింది. క్వాలిఫయింగ్‌లో మెరిసి...పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫయింగ్‌లో అర్జున్ బబూతా... మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫయింగ్‌లో రమితా జిందాల్ టాప్–8లో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించారు. 49 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో అర్జున్ బబూతా 630.1 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. టాప్–8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. 43 మంది షూటర్లు పోటీపడ్డ మహిళల క్వాలిఫయింగ్‌లో రమితా జిందాల్ 631.5 పాయింట్లు సాధించి ఐదో స్థానంలో నిలిచి ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఈ విభాగంలోనూ టాప్–8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. 7 ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు పతకం అందించిన ఏడో మహిళా క్రీడాకారిణిగా మనూ భాకర్ నిలిచింది. ఈ జాబితాలో కరణం మల్లీశ్వరి (వెయిట్‌లిఫ్టింగ్; కాంస్యం–2000 సిడ్నీ), సైనా నెహా్వల్ (బ్యాడ్మింటన్; కాంస్యం–2012 లండన్), మేరీకోమ్ (బాక్సింగ్; కాంస్యం–2012 లండన్), పీవీ సింధు (బ్యాడ్మింటన్; రజతం–2016 రియో, కాంస్యం–2020 టోక్యో), సాక్షి మలిక్ (రెజ్లింగ్; కాంస్యం–2016 రియో), లవ్లీనా బొర్గొహైన్ (బాక్సింగ్; కాంస్యం–2020 టోక్యో) ఉన్నారు. 5 ఒలింపిక్స్ క్రీడల్లో పతకం గెలిచిన ఐదో భారతీయ షూటర్‌గా, తొలి మహిళా షూటర్‌గా మనూ భాకర్ గుర్తింపు పొందింది. గతంలో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ (డబుల్ ట్రాప్; రజతం–2004 ఏథెన్స్), అభినవ్ బింద్రా (10 మీటర్ల ఎయిర్ రైఫిల్; స్వర్ణం–2008 బీజింగ్), విజయ్ కుమార్ (25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్; రజతం–2012 లండన్), గగన్ నారంగ్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్; కాంస్యం–2012 లండన్) ఈ ఘనత సాధించారు. టోక్యో ఒలింపిక్స్ తర్వాత నేను తీవ్రంగా నిరాశపడ్డాను. దాని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు కాంస్యం సాధించడం పట్ల సంతోషంగా ఉన్నా. దీనిని మాటల్లో చెప్పలేను. వచ్చే సారి ఇంతకంటే మెరుగైన పతకం గెలుస్తానేమో. చాలా కాలం తర్వాత భారత్‌కు షూటింగ్లో మెడల్ రావడం కూడా గొప్పగా అనిపిస్తోంది. ఫైనల్లో ఆఖరి షాట్లో కూడా ఎంతో ప్రయత్నించా. ఒక దశలో రజతం సాధించగలనని భావించా. నేను భగవద్గీత చదువుతాను. నేను చేయాల్సింది చేసి ఫలితాన్ని భగవంతునికే వదిలేస్తాను. మీకు ఏం రాసిపెట్టి ఉందో అదే జరుగుతుంది. జరగబోయేది మన చేతుల్లో ఉండదు. మన ప్రయత్నం చేస్తూ అత్యుత్తమ ప్రదర్శన మాత్రమే ఇవ్వగలం. ఈ పతకం కోసం మేం చాలా కష్టపడ్డాం. నాకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. –మనూ భాకర్ చారిత్రక విజయం! పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున తొలి పతకం గెలిచిన మనూ భాకర్‌కు అభినందనలు. షూటింగ్లో ఈ ఘనత సాధించిన తొలి మహిళ కావడం మరింత గర్వకారణం.–నరేంద్ర మోదీ, ప్రధానిభారత పతకాల బోణీ చేసిన భాకర్‌కు శుభాకాంక్షలు. ఈ విజయం మరింత మంది మహిళలకు స్ఫూర్తినిస్తుంది. మనూ మరిన్ని ఘనతలు సాధించాలి. –ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా రికార్డు సృష్టించావు. మనూ... నీ ప్రదర్శనతో దేశం మొత్తం గర్వించేలా చేశావు. –వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎంనీ అంకితభావం, శ్రమ ఫలించాయి. ప్రతీ షాట్‌తో భారత్ గర్వపడేలా చేశావు. నీ పట్టుదలకు ఈ పతకం ఉదాహరణ. –అభినవ్ బింద్రా -
సరబ్జోత్ ‘పసిడి’ గురి
మ్యూనిక్: ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్ పతకాల ఖాతా తెరిచింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ సరబ్జోత్ సింగ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. వరల్డ్ చాంపియన్, నాలుగుసార్లు ఒలింపియన్ తదితర మేటి షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో 22 ఏళ్ల సరబ్జోత్ 242.7 పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. బు షుహైహాంగ్ (చైనా; 242.5 పాయింట్లు) రజతం నెగ్గగా... రాబిన్ వాల్టర్ (జర్మనీ; 220 పాయింట్లు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. -
మను భాకర్‌కు రెండు స్వర్ణాలు
వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో భారత అగ్రశ్రేణి షూటర్ మనూ భాకర్ రెండు పసిడి పతకాలతో మెరిసింది. ఓవరాల్‌గా ఈ పోటీల్లో శనివారం భారత్ ఖాతాలో 3 స్వర్ణాలు, ఒక కాంస్యం చేరాయి. భారత్ ఖాతాలో చైనాలోని చెంగ్డూలో జరుగుతున్న క్రీడల్లో భాకర్ 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ వ్యక్తిగత, మహిళల టీమ్ విభాగాల్లో స్వర్ణాలు సాధించింది. టీమ్ ఈవెంట్లో ఆమెతో పాటు యశస్విని సింగ్ దేశ్వాల్, అభింద్య అశోక్ పాటిల్ సభ్యులుగా ఉన్నారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలోనూ భారత్‌కు చెందిన ఎలవెనిల్ వలరివన్ స్వర్ణ పతకం గెలుచుకుంది. మరో వైపు జూడో 57 కేజీల మహిళల విభాగంలో భారత్‌కు చెందిన యామిని మౌర్య కాంస్య పతకం సాధించింది. -
Junior World Cup: మనోళ్ల గురి అదిరింది
సాక్షి, హైదరాబాద్/విజయవాడ స్పోర్ట్స్: జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో శుక్రవారం టీమ్ ఈవెంట్స్‌లో భారత్‌కు నాలుగు స్వర్ణ పతకాలు లభించాయి. జర్మనీలో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ యువ షూటర్ మద్దినేని ఉమామహేశ్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో... తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో బంగారు పతకాలు గెల్చుకున్నారు. ఎయిర్ రైఫిల్ టీమ్ ఫైనల్లో ఉమామహేశ్, పార్థ్, రుద్రాం„Š లతో కూడిన భారత జట్టు 16–8తో స్పెయిన్ జట్టును ఓడించి విజేతగా నిలిచింది. విజయవాడకు చెందిన 17 ఏళ్ల ఉమామహేశ్ కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ తొలి సంవత్సరం చదువుతున్నాడు. ఎయిర్ పిస్టల్ టీమ్ ఫైనల్లో ఇషా సింగ్, పలక్, మనూ భాకర్‌లతో కూడిన భారత జట్టు 16–8తో జార్జియా జట్టుపై గెలిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఫైనల్లో రమిత, జీనా ఖిట్టా, ఆర్యా బోర్సెలతో కూడిన భారత జట్టు 17–9తో దక్షిణ కొరియా జట్టును ఓడించి స్వర్ణం సొంతం చేసుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో సౌరభ్ చౌదరీ, శివ, సరబ్జీత్లతో కూడిన భారత జట్టు 17–9తో ఉజ్బెకిస్తాన్ జట్టుపై గెలిచి నాలుగో పసిడి పతకాన్ని అందించింది. -
Tokyo Olympics: శుభవార్త వింటామా!
టోక్యో: విశ్వ క్రీడల ప్రారంభ వేడుకలు ముగిశాయి. నేటి నుంచి క్రీడాకారులు పతకాల వేటను మొదలుపెట్టనున్నారు. తొలి రోజు మొత్తం 7 క్రీడాంశాల్లో 11 స్వర్ణ పతకాల కోసం పోటీలు జరగనున్నాయి. ఈ ఏడు క్రీడాంశాల్లో నాలుగింటిలో భారత క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముందుగా మహిళల షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మెడల్ ఈవెంట్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు క్వాలిఫయింగ్ రౌండ్ మొదలవుతుంది. అనంతరం ఉదయం 7 గంటల 15 నిమిషాలకు ఫైనల్ జరుగుతుంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఎనిమిది గంటల వరకు భారత్‌కు పతకం ఖాయమైందో లేదో తేలిపోతుంది. షూటింగ్‌లోనే పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లోనూ మెడల్ ఈవెంట్ ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు ఫైనల్ ప్రారంభమవుతుంది. ఫైనల్లో భారత షూటర్లు ఉంటే అరగంటలోపు భారత షూటర్ల గురికి పతకం ఖాయమైందో లేదో తెలిసిపోతుంది. మహిళల 10 మీ. ఎయిర్‌రైఫిల్ క్వాలిఫయింగ్: ఉదయం గం. 5:00 నుంచి; ఫైనల్: ఉదయం గం. 7:15 నుంచి పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్ క్వాలిఫయింగ్: ఉదయం గం. 9:30 నుంచి; ఫైనల్: మధ్యాహ్నం గం. 12 నుంచి నాలుగు పతకాలపై షూటర్ల గురి... కొన్నేళ్లుగా అంతర్జాతీయ టోర్నీలలో భారత షూటర్లు నిలకడగా పతకాలు సాధిస్తున్నారు. ఒలింపిక్స్ కోసం క్రొయేషియాలో ప్రత్యేకంగా రెండు నెలలపాటు సాధన చేశారు. తొలి రోజు రెండు విభాగాల్లో భారత షూటర్లు బరిలో ఉన్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్ ఇలవేనిల్ వలారివన్, అపూర్వీ చండేలా పోటీపడనున్నారు. 48 మంది షూటర్లు పాల్గొనే క్వాలిఫయింగ్ రౌండ్లో టాప్–8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఇలవేనిల్, అపూర్వీ తొలి లక్ష్యం ఫైనల్ చేరడమే. అనంతరం ఎలిమినేషన్ పద్ధతిలో జరిగే ఫైనల్లో నిలకడగా పాయింట్లు స్కోరు చేస్తేనే ఇలవేనిల్, అపూర్వీ పతకాలను ఖాయం చేసుకుంటారు. పురుషుల 10 ఎయిర్ పిస్టల్ విభాగంలో సౌరభ్ చౌదరీ, అభిషేక్ వర్మ బరిలో ఉన్నారు. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సౌరభ్ రెండో స్థానంలో, అభిషేక్ వర్మ మూడో స్థానంలో ఉన్నారు. 36 మంది పాల్గొనే క్వాలిఫయింగ్‌లో రాణించి టాప్–8లో నిలిస్తే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఎలిమినేషన్ పద్ధతిలో జరిగే ఫైనల్లో నిలకడగా పాయింట్లు సాధిస్తే సౌరభ్, అభిషేక్‌ల నుంచి పతకాలు ఆశించవచ్చు. దీపిక–ప్రవీణ్ జోడీ అద్భుతం చేస్తేనే... ♦ మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్: ఉదయం గం. 6 నుంచి ♦ కాంస్య పతక మ్యాచ్: మధ్యాహ్నం గం. 12:55 నిమిషాల నుంచి ♦ స్వర్ణ–రజత పతక మ్యాచ్: మధ్యాహ్నం గం. 1:15 ని. నుంచి ఆర్చరీలో శుక్రవారం మహిళల, పురుషుల ర్యాంకింగ్ రౌండ్లు జరిగాయి. మహిళల వ్యక్తిగత విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ దీపిక కుమారి 663 పాయింట్లు స్కోరు చేసి తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచింది. పురుషుల వ్యక్తిగత విభాగంలో ప్రవీణ్ జాదవ్ 656 పాయింట్లు స్కోరు చేసి 31వ ర్యాంక్‌లో... అతాను దాస్ 653 పాయింట్లతో 35వ ర్యాంక్‌లో... తరుణ్‌దీప్ రాయ్ 652 పాయింట్లతో 37వ ర్యాంక్‌లో నిలిచారు. తొలిసారి ప్రవేశపెట్టిన మిక్స్డ్ విభాగంలో భారత్ తరఫున దీపిక కుమారి–ప్రవీణ్ జాదవ్ జోడీ బరిలోకి దిగనుంది. భార్యాభర్తలైన దీపిక, అతాను దాస్ జతగా ఈ విభాగంలో పోటీపడుతుందని ఆశించినా... ర్యాంకింగ్ రౌండ్లో అతాను దాస్ వెనుకంజలో ఉండటం... ప్రవీణ్ ఉత్తమ ప్రదర్శన కనబర్చడంతో... దీపికకు భాగస్వామిగా ప్రవీణ్‌నే ఎంపిక చేశామని భారత ఆర్చరీ సంఘం స్పష్టం చేసింది. నేడు మిక్స్డ్ డబుల్స్‌లో మెడల్ ఈవెంట్ జరగనుంది. దీపిక–ప్రవీణ్ సంయుక్త స్కోరు (1319) ఆధారంగా తొలి రౌండ్లో ఈ జంటకు తొమ్మిదో సీడ్ లభించింది. నాకౌట్ పద్ధతిలో జరిగే మిక్స్డ్ ఈవెంట్లో తొలి రౌండ్లో లిన్ చియా ఇన్–టాంగ్ చి చున్ (చైనీస్ తైపీ) ద్వయంతో దీపిక–ప్రవీణ్ జంట తలపడుతుంది. తొలి రౌండ్ దాటితే క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ ఆన్ సాన్–కిమ్ జె డియోక్ (దక్షిణ కొరియా)లతో దీపిక–ప్రవీణ్ తలపడే అవకాశముంది. కొరియా అడ్డంకిని అధిగమిస్తే దీపిక–ప్రవీణ్ సెమీఫైనల్ చేరతారు. మీరాబాయి మెరిసేనా... ప్రపంచ మాజీ చాంపియన్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను కూడా పతకంపై ఆశలు రేకెత్తిస్తోంది. 49 కేజీల విభాగంలో పోటీపడుతున్న మీరాబాయి తన అత్యుత్తమ ప్రదర్శన చేస్తే పతకం మోసుకొస్తుంది. ఎనిమిది మంది పోటీపడే ఫైనల్లో మీరాబాయికి చైనా లిప్టర్ జిహుయ్ హు, డెలాక్రుజ్ (అమెరికా), ఐసా విండీ కంతిక (ఇండోనేసియా) నుంచి గట్టిపోటీ లభించనుంది. గత ఏప్రిల్‌లో ఆసియా చాంపియన్‌షిప్‌లో క్లీన్ అండ్ జెర్క్‌లో 119 కేజీలతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన మీరాబాయి అదే ప్రదర్శనను పునరావృతం చేసి, స్నాచ్‌లోనూ రాణిస్తే ఆమెకు కనీసం కాంస్యం దక్కే అవకాశముంది. మహిళల 49 కేజీల విభాగం ఫైనల్: ఉదయం గం. 10.20 నిమిషాల నుంచి సుశీలా ‘పట్టు’ ప్రయత్నం మహిళల జూడో 48 కేజీల విభాగంలో భారత క్రీడాకారిణి సుశీలా దేవి పోటీపడనుంది. తొలి రౌండ్లో ఆమె ఇవా సెర్నోవిక్జీ (హంగేరి)తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫునా తొనాకి (జపాన్)తో సుశీలా తలపడుతుంది. ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సుశీలా 33వ ర్యాంక్‌లో... ఆసియా చాంపియన్‌షిప్‌లో ఆరో ర్యాంక్‌లో నిలిచింది. ఈ నేపథ్యంలో సుశీలా పతకం రేసులో నిలిస్తే అద్భుతమే అవుతుంది. తొలి రౌండ్: ఉదయం గం. 7: 30 తర్వాత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లీగ్ మ్యాచ్: సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ్ఠ యాంగ్ లీ–చి లిన్ వాంగ్ (చైనీస్ తైపీ); ఉదయం గం. 8:50 నుంచి. పురుషుల సింగిల్స్ లీగ్ మ్యాచ్: సాయిప్రణీత్ ్ఠ మిషా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్); ఉదయం గం. 9:30 నుంచి బాక్సింగ్ పురుషుల 69 కేజీల తొలి రౌండ్: వికాస్ కృషన్ ్ఠ మెన్సా ఒకజావా (జపాన్); మధ్యాహ్నం గం. 3:55 నుంచి. హాకీ పురుషుల విభాగం లీగ్ మ్యాచ్: భారత్ VS న్యూజిలాండ్ (ఉదయం గం. 6:30 నుంచి). మహిళల విభాగం లీగ్ మ్యాచ్: భారత్ VS నెదర్లాండ్స్ (ఉదయం గం. 5:15 నుంచి) రోయింగ్ లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ హీట్–2: అర్జున్ లాల్–అరవింద్ సింగ్ (ఉదయం గం. 7:30 నుంచి) టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్: శరత్ కమల్–మనిక బత్రా VS యున్ జు లిన్–చింగ్ చెంగ్ (చైనీస్ తైపీ) ఉదయం గం. 8:30 నుంచి మహిళల సింగిల్స్ తొలి రౌండ్: మనిక బత్రా VS టిన్ టిన్ హో (బ్రిటన్); మధ్యాహ్నం గం. 12:15 నుంచి; సుతీర్థ ముఖర్జీ ్ఠ లిండా బెర్గ్స్టోరెమ్ (స్వీడన్); మధ్యాహ్నం గం. 1:00 నుంచి టెన్నిస్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్: సుమిత్ నగాల్ ్ఠ ఇస్టోమిన్ (ఉజ్బెకిస్తాన్); ఉదయం గం. 7:30 నుంచి నేడు అందుబాటులో ఉన్న స్వర్ణాలు (11) ఆర్చరీ (1) రోడ్ సైక్లింగ్ (1) ఫెన్సింగ్ (2) జూడో (2) షూటింగ్ (2) తైక్వాండో (2) వెయిట్‌లిఫ్టింగ్ (1) అన్ని ఈవెంట్స్ ఉదయం గం. 6:00 నుంచి సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
2 డజన్లకు పైగా పతకాలు.. రోడ్డు పక్కన చిప్స్ అమ్ముతూ
డెహ్రడూన్: ఆమె ఒకప్పుడు అంతర్జాతీయ వేదికల మీద మన దేశ జాతీయ పతకాన్ని రెపరెపలాడించారు. భారతదేశపు మొదటి అంతర్జాతీయ స్థాయి పారా షూటర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పదుల సంఖ్యలో పతకాలు సాధించారు. దేశానికి అవసరమైనప్పుడు ఆమె నేను ఉన్నానంటూ ముందుకు వచ్చి.. దేశ కీర్తిని పెంచారు. కానీ ఇప్పుడు ఆమె కటిక పేదరికం అనుభవిస్తూ.. సాయం కోసం ఎదురు చూస్తుంటే ఒక్కరు కూడా ఆమెను పట్టించుకోవడం లేదు. ఇలాంటి కష్ట కాలంలో కుటుంబాన్ని పోషించుకోవడం కోసం రోడ్డు పక్కన ఓ చిన్న బండి మీద చిప్స్, బిస్కట్ ప్యాకెట్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు దిల్‌రాజ్ కౌర్. ఆ వివరాలు.. ఉత్తరాఖండ్‌కు చెందిన దిల్‌రాజ్ కౌర్ భారతదేశపు మొదటి అంతర్జాతీయ స్థాయి పారా షూటర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. 2005లో ఈ రంగంలో ప్రవేశించిన ఆమె 2015 వరకు విజయవంతంగా కొనసాగారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని రెండు డజన్లకు పైగా పతకాలు గెలుచుకున్నారు. అయితే ఆ పతకాలు ఆమె కష్టాలు తీర్చలేదు. ప్రభుత్వం ఆమెను పట్టించుకోలేదు. ఆర్థిక సాయం కానీ.. ఉద్యోగం ఇవ్వడం కానీ చేయలేదు. ఈ క్రమంలో కుటుంబాన్ని పోషించుకోవడం కోసం రోడ్డు పక్కన బండి పెట్టుకుని చిప్స్, బిస్కెట్ ప్యాకెట్స్ అమ్ముతున్నారు. ఒకప్పుడు దేశంలోనే గొప్ప పారా ఎయిర్ పిస్టల్ షూటర్‌గా నిలిచిన ఆమె.. ఇప్పుడు ఒక్క చిప్స్ ప్యాకెట్ ధర కేవలం పది రూపాయలు మాత్రమే అంటూ ఇలా రోడ్డు పక్కన చిరు వ్యాపారం చేస్తున్నారు. ఈ సందర్భంగా దిల్‌రాజ్ కౌర్ మాట్లాడుతూ.. ‘‘దేశానికి అవసరం ఉన్నప్పుడు నేను ముందుకు వచ్చాను.. ఎన్నో పతకాలు సాధించాను. కానీ నాకు అవసరం ఉన్నప్పుడు ఎవరు సాయం చేయడానికి ముందుకు రావడం లేదు. ఉత్తరఖండ్ ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి సాయం, మద్దతు లభించలేదు. నా విజయాల ఆధారంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగానికి అప్లై చేశాను. కానీ ప్రతిసారి తిరస్కరించారు. ప్రస్తుతం నేను మా అమ్మతో కలిసి ఓ అపార్ట్మెంట్లో రెంట్‌కు ఉంటున్నాను. ప్రస్తుతం మా ఆర్థిక పరిస్థితి ఏమంత బాగాలేదు. అద్దె కట్టడం, మిగతా ఖర్చుల కోసం ఇలా రోడ్డు పక్కన చిప్స్, బిస్కెట్లు అమ్ముతున్నాను’’ అని తెలిపారు. చదవండి: కరోనాతో ‘షూటర్ దాదీ’ మృతి.. మిమ్మల్ని మిస్సవుతున్నాం -
షూటింగ్లో భారత్‌కు మరో మెడల్
-
స్వర్ణం 'సౌరభం'...
ఒకవైపు ప్రత్యర్థులుగా మాజీ విశ్వవిజేతలు... మాజీ ఒలింపిక్ చాంపియన్లు... ప్రపంచకప్‌లో పతకాలు గెలిచినవారు.. మరోవైపు నూనుగు మీసాల కుర్రాడు... తన ప్రత్యర్థుల్లో కొందరి అనుభవమంత వయసు కూడా అతనికి లేదు... అసలే జట్టులో అతని ఎంపికపై విమర్శలు... షాట్ షాట్‌కు ఆధిక్యం తారుమారయ్యే పరిస్థితులు... ఇలాంటి స్థితిలో ఆ కుర్రాడు మాత్రం ఒక్కో బుల్లెట్‌ను లక్ష్యంలోకి దించాడు... ఒక్కోషాట్తో దిగ్గజాలను వెనక్కి నెట్టాడు... చివరకు అందర్నీ అబ్బురపరుస్తూ ‘పసిడి’ గురితో భళా అనిపించాడు. తన పిస్టల్‌తోనే అందరికీ సమాధానం ఇచ్చి ఆసియా క్రీడల వేదికపై మువ్వన్నెలను రెపరెపలాడించిన ఆ యువ షూటరే 16 ఏళ్ల సౌరభ్ చౌధరీ. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా కలీనా గ్రామానికి చెందిన సౌరభ్ మంగళవారం ఆసియా క్రీడల్లో అద్భుతమే చేశాడు. హేమాహేమీలు బరిలో నిలిచిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో క్వాలిఫయింగ్‌లో ‘టాప్’గా నిలిచి... అదే జోరును ఫైనల్లోనూ కొనసాగించి ఆసియా క్రీడల రికార్డు ప్రదర్శనతో స్వర్ణకాంతులు విరజిమ్మి ఈ క్రీడాంశంలో భారత్‌కు తొలి పసిడి పతకాన్ని అందించాడు. ఓవరాల్‌గా పోటీల నాలుగో రోజు భారత్‌కు స్వర్ణం, రజతం, మూడు కాంస్యాలు లభించాయి. ప్రస్తుతం భారత్ 10 పతకాలతో ఏడో స్థానంలో ఉంది. పాలెంబంగ్: విజయకాంక్ష ఉండాలేగానీ బరిలో ఏస్థాయి వారున్నా అనుకున్న ఫలితాన్ని సాధించవచ్చని భారత యువ పిస్టల్ షూటర్ సౌరభ్ చౌధరీ నిరూపించాడు. ఆసియా క్రీడల్లో భాగంగా మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 16 ఏళ్ల సౌరభ్ బంగారు పతకాన్ని సాధించాడు. 24 షాట్లతో కూడిన ఫైనల్లో సౌరభ్ 240.7 పాయింట్లు స్కోరు చేసి ఆసియా క్రీడల్లో కొత్త రికార్డు నెలకొల్పడంతోపాటు పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 2010 ప్రపంచ చాంపియన్, 42 ఏళ్ల తొమోయుకి మత్సుదా (జపాన్–239.7 పాయింట్లు) రజతం నెగ్గగా... భారత్‌కే చెందిన 29 ఏళ్ల అభిషేక్ వర్మ (219.3 పాయింట్లు) కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత... 2010, 2014 ఆసియా క్రీడల్లో ఈ విభాగంలో టీమ్ ఈవెంట్లో పసిడి పతకాలు నెగ్గిన 38 ఏళ్ల కొరియా దిగ్గజ షూటర్ జిన్ జొంగో ఐదో స్థానంతో... 35 ఏళ్ల కజకిస్తాన్ షూటర్ వ్లాదిమిర్ ఇసాచెంకో ఏడో స్థానంతో సరిపెట్టుకున్నారు. 40 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో సౌరభ్ అందరికంటే ఎక్కువగా 586 పాయింట్ల స్కోరుతో అగ్రస్థానాన్ని దక్కించుకోవడం విశేషం. న్యాయవాద వృత్తిలో ఉన్న అభిషేక్ వర్మ మూడేళ్ల క్రితమే ఈ క్రీడలో అడుగు పెట్టాడు. ఆసియా క్రీడల్లో పాల్గొన్న తొలి ప్రయత్నంలోనే కాంస్యాన్ని దక్కించుకున్నాడు. మిక్స్డ్ ట్రాప్ ఈవెంట్లో ఫైనల్‌కు అర్హత సాధించిన భారత జంట లక్షయ్ షెరాన్, శ్రేయసి సింగ్ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ఒక్క షాట్‌తో తారుమారు... ఫైనల్లో చివరి సిరీస్‌లోని రెండు షాట్లే సౌరభ్‌కు స్వర్ణాన్ని ఖాయం చేశాయి. 22 షాట్లు పూర్తయ్యాక మత్సుదా 220.4 పాయింట్లతో అగ్రస్థానంలో... సౌరభ్ 220.1 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. 23వ షాట్లో మత్సుదా 8.9 స్కోరు చేయగా... సౌరభ్ 10.2 కొట్టాడు. దాంతో సౌరభ్ 230.3తో తొలి స్థానంలోకి రాగా... మత్సుదా 229.3తో రెండో స్థానానికి పడిపోయాడు. చివరి షాట్లో మత్సుదా 10.3 కొట్టగా... సౌరభ్ 10.4 స్కోరు చేశాడు. దాంతో సౌరభ్ పాయింట్ తేడాతో పసిడి సొంతం చేసుకోగా.. మత్సుదా రజతంతో సరిపెట్టుకున్నాడు. మూడేళ్లలో పైపైకి... సరదా కోసం 2015లో షూటింగ్ క్రీడలో అడుగుపెట్టిన సౌరభ్ ఏడాది తిరిగేలోపు ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో పోటీపడి రజతం సాధించాడు. ఆ తర్వాతి సంవత్సరం ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచాడు. ఈ ఏడాది జూన్‌లో జర్మనీలో జరిగిన జూనియర్ ప్రపంచకప్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పి బంగారు పతకాన్ని సాధించాడు. పోటీలు లేని సమయంలో మీరట్‌లోని అమిత్ షెరాన్ అకాడమీలో... జాతీయ శిబిరాల సమయంలో భారత దిగ్గజ షూటర్ జస్పాల్ రాణా పర్యవేక్షణలో సౌరభ్ శిక్షణ తీసుకుంటాడు. సౌరభ్ తండ్రి జగ్మోహన్ సింగ్ చెరకు రైతు. ఖాళీగా ఉన్న సమయంలో సౌరభ్ పొలం పనుల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటాడు. ‘నేను ఎలాంటి ఒత్తిడికి లోను కాలేదు. ఒత్తిడితో ఎలాంటి ఉపయోగం కూడా లేదు. నా తదుపరి లక్ష్యం ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించి 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం’ అని సౌరభ్ అన్నాడు. ►ఆసియా క్రీడల చరిత్రలో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం నెగ్గిన ఐదో భారతీయ షూటర్ సౌరభ్. గతంలో రణ్‌ధీర్ సింగ్ (1978), జస్పాల్ రాణా (1994, 2006), రంజన్ సోధి (2010), జీతూ రాయ్ (2014) ఈ ఘనత సాధించారు. సెకనులో వందో వంతు తేడాతో... పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో భారత స్విమ్మర్ వీర్‌ధవల్ ఖడేను దురదృష్టం వెంటాడింది. కేవలం సెకనులో వందో వంతు తేడాతో అతడు కాంస్యం చేజార్చుకున్నాడు. ఫైనల్లో ఖడే 22.47 సెకన్ల టైమింగ్ నమోదు చేశాడు. అయితే, జపాన్‌కు చెందిన షునిచి నకావ్ (22.46)... అతడి కంటే .01 సెకన్ల ముందే లక్ష్యాన్ని చేరుకుని కాంస్య పతకం ఎగురేసుకుపోయాడు. పతకం కోల్పోయినా, 26 ఏళ్ల ఖడే ఎనిమిదేళ్లుగా తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు (22.52 సెకన్లు)ను సవరించాడు. ఇదే విభాగంలో అన్షుల్ కొఠారి (23.83 సెకన్లు)... 28వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. ఉద్యోగం వస్తుందని ఆశ... పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో భారత సీనియర్ షూటర్ సంజీవ్ రాజ్‌పుత్ తొలిసారి ఆసియా క్రీడల్లో వ్యక్తిగత పతకం సాధించాడు. ఫైనల్లో 37 ఏళ్ల సంజీవ్ 452.7 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలిచాడు. 18 ఏళ్లకే ఇండియన్ నేవీలో ఉద్యోగం పొందిన సంజీవ్ 2014లో హరియాణా ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడంతో అతను నేవీ ఆఫీసర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో సంజీవ్‌కు ఇచ్చిన హామీ నెరవేరలేదు. రెండేళ్లు ఖాళీగా ఉన్న అతను 2016లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో కోచ్‌గా విధుల్లోకి చేరాడు. అయితే గతేడాది అతనిపై అత్యాచార ఆరోపణలు రావడంతో ‘సాయ్’ అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించింది. ‘తాజా ప్రదర్శనతో మళ్లీ నాకు ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నాను. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే నా తర్వాతి లక్ష్యం’ అని సంజీవ్ అన్నాడు. సెపక్‌తక్రాలో తొలిసారి కాంస్యం... 1990 నుంచి ఆసియా క్రీడల్లో మెడల్ ఈవెంట్‌గా ఉన్న సెపక్‌తక్రాలో తొలిసారి భారత్ కాంస్య పతకం సాధించింది. పటిష్టమైన థాయ్‌లాండ్ జట్టుతో మంగళవారం జరిగిన రెగూ ఈవెంట్ సెమీఫైనల్లో భారత్ 0–2తో ఓడిపోయి కాంస్యం ఖాయం చేసుకుంది. 2006లో తొలిసారి ఈ క్రీడలో పోటీపడిన భారత్ నాలుగో ప్రయత్నంలో పతకం నెగ్గడం విశేషం. భారత్ 21 – 0 కజకిస్తాన్ మహిళల హాకీలో భారత జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. కజకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత అమ్మాయిలు గోల్స్ వర్షం కురిపించారు. పూల్ ‘బి’లో భాగంగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 21–0 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. భారత్ తరఫున నవనీత్ కౌర్ ఐదు, గుర్జీత్ కౌర్ నాలుగు, లల్రెమ్సియామి, వందనా కటారియా మూడేసి గోల్స్ కొట్టారు. భారత్ మరొక్క గోల్ చేసి ఉంటే... 1982 ఆసియా క్రీడల్లో హాంకాంగ్‌పై భారత్ సాధించిన 22–0 రికార్డు స్కోరును అందుకునేది. దివ్య పట్టుకు కాంస్యం రెజ్లింగ్‌లో భారత్‌కు మరోపతకం వచ్చింది. మహిళల ఫ్రీస్టయిల్ 68 కేజీల విభాగంలో దివ్య కక్రాన్ కాంస్య పతకాన్ని సాధించింది. చెన్ వెన్లింగ్ (చైనీస్ తైపీ)తో జరిగిన కాంస్య పతక బౌట్లో దివ్య ఒక నిమిషం 29 సెకన్లలో విజయాన్ని అందుకుంది. మరోవైపు 76 కేజీల విభాగంలో కిరణ్ క్వార్టర్ ఫైనల్లో 2–4తో ఐపెరి మెడిట్కిజి (కిర్గిస్తాన్) చేతిలో ఓడిపోయింది. పురుషుల గ్రీకో రోమన్ స్టయిల్ రెజ్లింగ్‌లో భారత్‌కు చెందిన జ్ఞానేందర్ (60 కేజీలు)... మనీశ్ (67 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో పరాజయం చవిచూశారు. వాల్ట్ ఫైనల్లో అరుణా రెడ్డి మహిళల జిమ్నాస్టిక్స్‌లో భారత క్రీడాకారిణులు ఆకట్టుకున్నారు. వాల్ట్‌లో ప్రణతి నాయక్ (13.425), హైదరాబాద్ అమ్మాయి అరుణారెడ్డి (13.350)లు ఆరు, ఏడు స్థానాల్లో నిలిచి ఫైనల్ రౌండ్‌కు వెళ్లారు. స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. వాల్ట్ విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయిన ఆమె...బీమ్‌లో మాత్రం ముందడుగేసింది. టీమ్ విభాగంలో దీపా, ప్రణతి, అరుణ, ప్రణతి దాస్లతో కూడిన భారత బృందం ఏడో స్థానంలో నిలిచింది. బుధవారం టీమ్ విభాగంలో ఫైనల్స్ ను నిర్వహిస్తారు. సెమీస్‌లో కబడ్డీ జట్లు కీలకమైన విజయాలతో భారత కబడ్డీ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. గ్రూప్ ‘ఎ’ చివరి మ్యాచ్‌లో పురుషుల జట్టు 49–30తో థాయ్‌లాండ్‌ను ఓడించింది. గ్రూప్‌లో భారత్... బంగ్లాదేశ్, శ్రీలంకపై గెలిచి, దక్షిణ కొరియా చేతిలో పరాజయం పాలైంది. కొరియా మ్యాచ్‌లు పూర్తయ్యాక.. గ్రూప్ టాపర్ ఎవరో తేలనుంది. మరోవైపు మహిళల జట్టు శ్రీలంకను 38–12తో, ఇండోనేసియాను 54–22తో ఓడించింది. అంతకుముందు జపాన్, థాయ్లాండ్లపైనా విజయం సాధించడంతో గ్రూప్ ‘ఎ’లో అజేయంగా నిలిచినట్లైంది. సెమీఫైనల్స్ గురువారం జరుగనున్నాయి. -
మను మళ్లీ మెరిసె...
గ్వాడలహారా (మెక్సికో): సీనియర్‌స్థాయిలో తాను పాల్గొంటున్న తొలి ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో టీనేజ్ సంచలనం మనూ భాకర్ మళ్లీ అదుర్స్ అనిపించింది. 16 ఏళ్ల ఈ హరియాణా అమ్మాయి వరుసగా రెండో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్లో పసిడి పతకం నెగ్గిన మనూ... 24 గంటల్లోపే మరో స్వర్ణం సాధించింది. ఈసారి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో భారత్‌కే చెందిన ఓంప్రకాశ్‌తో కలిసి మనూ విజేతగా నిలిచింది. ఐదు జోడీలు పాల్గొన్న ఫైనల్లో మనూ–ఓంప్రకాశ్ ద్వయం 476.1 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. సాండ్రా రీట్జ్–క్రిస్టియన్ రీట్జ్ (జర్మనీ–475.2 పాయింట్లు) జంట రజతం... సెలైన్ గొబెర్‌విలె–ఫ్లోరియన్ ఫౌక్వెట్ (ఫ్రాన్స్–415.1 పాయింట్లు) జోడీకి కాంస్యం లభించాయి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో భారత్‌కే చెందిన మెహులీ ఘోష్–దీపక్ కుమార్ ద్వయం కాంస్యం సాధించింది. ఫైనల్లో మెహులీ–దీపక్ జంట 435.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత్ మూడు స్వర్ణాలు, నాలుగు కాంస్యాలతో కలిపి ఏడు పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
ఏ 'మను' వర్ణించను!
గ్వాడలహారా (మెక్సికో): ప్రపంచ కప్ షూటింగ్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్ పోరు... భారత్‌కు చెందిన 16 ఏళ్ల మను భాకర్ ఒకవైపు... సొంతగడ్డపై ఆడుతున్న 32 ఏళ్ల సీనియర్ అలెజాండ్రా జవాలా మరోవైపు... ఇద్దరి గత రికార్డు చూస్తే అసలు జవాలాకు మనూ పోటీనే కాదు. ఇంత పెద్ద టోర్నీలో తొలిసారి భారత షూటర్ బరిలోకి దిగితే, ఇప్పటికే రెండు ప్రపంచ కప్‌లలో స్వర్ణాలు గెలిచి, రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన ఘనత జవాలా సొంతం! 24 షాట్ల ఫైనల్లో 23 షాట్లు ముగిసేసరికి 1.3 పాయింట్ ముందంజలో ఉన్న మెక్సికో క్రీడాకారిణి దాదాపు విజయాన్ని ఖాయం చేసుకుంది. అయితే ఆఖరి షాట్లో తీవ్రమైన ఒత్తిడిని అధిగమించి మను 10.6 స్కోరు సాధిస్తే... జవాలా తడబడి 8.8 పాయింట్లకే పరిమితమైంది. ఫలితంగా ప్రపంచ కప్ షూటింగ్లో స్వర్ణం సాధించిన అతి పిన్న వయస్కురాలిగా మను భాకర్ నిలిచింది. మొత్తం 237.5 పాయింట్లతో ఆమె అగ్రస్థానం సాధించగా... జవాలా (237.1 పాయింట్లు) రజతం, సెలిన్ గోబర్‌విలే (ఫ్రాన్స్–217 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు. ఇదే విభాగంలో భారత్‌కే చెందిన యశస్విని సింగ్ (196.1 పాయింట్లు) నాలుగో స్థానంలో నిలిచింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత షూటర్ రవికుమార్ కాంస్య పతకం సాధించాడు. ప్రపంచకప్‌లో అతనికి ఇదే తొలి పతకం కావడం విశేషం. ఈ పోటీలో రవికుమార్ 226.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ప్రపంచ నంబర్‌వన్ ఇస్త్వాన్ పెనీ (హంగేరీ– 249.5 పాయింట్లు) స్వర్ణం సాధించగా, అలెగ్జాండర్ షిర్ల్ (ఆస్ట్రియా–248.7 పాయింట్లు) రజత పతకం గెలుచుకున్నాడు. భారత్‌కు చెందిన దీపక్ కుమార్ నాలుగో స్థానంలో నిలిచి నిరాశగా వెనుదిరిగాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో జరిగిన నాలుగు ఈవెంట్స్‌లోనూ భారత్‌కు పతకాలు రావడం విశేషం. ఆరేళ్ల వయసులో బాక్సింగ్ సాధన, ఆరు నెలలు తిరిగే సరికి హరియాణా సబ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం... స్కేటింగ్‌లో రాష్ట్ర చాంపియన్, అథ్లెటిక్స్‌లోనూ పతకాలు... టాంగ్ టా మణిపూర్ మార్షల్ ఆర్ట్స్‌లో జాతీయ స్థాయిలో స్వర్ణం, ఆపై కరాటేలో కూడా మరో పతకం... ఇంతే కాదు, క్రికెట్, కబడ్డీ, టెన్నిస్, స్విమ్మింగ్... ఒక్కటేమిటి ఆ అమ్మాయి ఆడని ఆట లేదు. 16 ఏళ్ల వయసుకే మను భాకర్ స్పోర్ట్స్ రికార్డు ఇది. షూటింగ్‌ను ప్రారంభించింది ఏప్రిల్ 2016లో... జూన్ 2017కు వచ్చేసరికి జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పోటీల బరిలో... ఏడాది కూడా కాక ముందే సీనియర్ ప్రపంచకప్‌లో స్వర్ణ పతకం... మను అనూహ్య ప్రస్థానమిది. మెరైన్ ఇంజినీర్ అయిన తండ్రి ప్రోత్సాహంతో అన్ని ఆటలు ఆడేసి సత్తా చాటిన ఈ అమ్మాయి ఇప్పుడు షూటింగ్లో అంతర్జాతీయ యవనికపై మెరిసి శిఖరాన నిలిచింది. హరియాణాలోని ఝజ్జర్ జిల్లా గోరియా గ్రామం మను స్వస్థలం. వేర్వేరు ఆటల్లో సత్తా చాటుతూ పోయిన ఈ అమ్మాయి బాక్సింగ్ ఆడే సమయంలో కంటికి స్వల్ప గాయమైంది. దాంతో ఆందోళన చెందిన ఆమె తల్లి ఇలాంటి ప్రమాదకరమైన ఆటలు ఇక చాలు అని గట్టిగా చెప్పడంతో షూటింగ్ వైపు మళ్లింది. ఝజ్జర్‌లోని యూనివర్సల్ సీనియర్ సెకండరీ స్కూల్లో ఆమె షూటింగ్లో శిక్షణ పొందింది. సహజ ప్రతిభ, ఎక్కడ అడుగు పెట్టినా గెలవాలనే పట్టుదల వెరసి మను ఒక్కసారిగా దూసుకుపోయింది. 2017 సంవత్సరం మను కెరీర్‌కు సంబంధించి తొలి ఏడాది మాత్రమే. అయితేనేం ఆమె అన్ని విధాలా తన ముద్ర చూపించింది. జాతీయ స్థాయి జూనియర్ అండ్ యూత్ కేటగిరిలో తొలి స్వర్ణంతో ఆమె ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత జపాన్‌లో జరిగిన ఆసియా ఎయిర్‌గన్ చాంపియన్ షిప్లో రజతం సాధించింది. ఇక డిసెంబర్లో జరిగిన సీనియర్ నేషనల్స్లోనైతే వరుసగా రికార్డులు బద్దలు కొట్టి పతకాల వెల్లువతో సంచలనం సృష్టించింది. గత నెలలో జరిగిన ‘ఖేలో ఇండియా’ పోటీల్లో రెండు జూనియర్ జాతీయ రికార్డులు బద్దలు కొట్టిన మను... కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే 27 మంది సభ్యుల భారత జట్టులోకి ఎంపికైంది. ఇప్పుడు తాజా ప్రదర్శన ఆమె స్థాయిని మరింత పెంచింది. ‘మా అమ్మాయి ఏ ఆట ఆడినా ఏనాడూ వద్దనలేదు. తనపై మాకు అంత గట్టి నమ్మకం ఉండేది. రూ.1 లక్ష 40 వేలతో ఆమెకు తొలిసారి గన్ కొనిచ్చిన రోజు నాకు బాగా గుర్తుంది. ఈ రోజు ఆమె సాధించిన ఘనత ముందు ఆ విలువ ఏమాత్రం ఎక్కువగా అనిపించడం లేదు’ అని ఆమె తండ్రి రామ్ కిషన్ గర్వంగా అన్నారు. చదువులోనూ ఎక్కడగా తగ్గని మను పదో తరగతి పరీక్షల్లో 10 సీజీపీఏ సాధించడం విశేషం. క్రీడల్లో ఉండేవారు సాధారణంగా ఎంచుకునే సులువైన సబ్జెక్ట్‌లకు భిన్నంగా మెడిసిస్ పూర్తి చేయాలనేది ఆమె లక్ష్యం. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో తమ కూతురు సత్తా చాటుతుందని ఆమె తల్లి సుమేధ ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. సంచలన షూటర్... మను భాకర్ సత్తా ఏమిటో గత డిసెంబర్లో తిరువనంతపురంలో జరిగిన సీనియర్ నేషనల్స్ చాంపియన్‌షిప్‌లోనే అందరికీ తెలిసింది. ఈ ఈవెంట్లో మను ఏకంగా 9 స్వర్ణాలు సహా మొత్తం 15 పతకాలు సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సీనియర్ హీనా సిద్ధును ఓడించిన మను... ఈ క్రమంలో హీనా పేరిట సుదీర్ఘ కాలంగా ఉన్న అత్యధిక పాయింట్ల (240.6 పాయింట్లు) జాతీయ రికార్డును కూడా బద్దలు కొట్టి స్వర్ణం నెగ్గింది. తొలి ప్రపంచకప్‌లోనే స్వర్ణం గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో వివిధ పోటీల్లో నా ప్రదర్శన మరింత మెరుగ్గా ఉండేలా ప్రయత్నిస్తా – మను భాకర్ -
కలిసి రాకున్నా కాంస్యాలు
పురుషుల 10మీ. ఎయిర్ పిస్టల్ టీమ్‌కు పతకం ఆసియా క్రీడల రెండో రోజు భారత్‌కు ఆశించిన స్థాయిలో పతకాలు రాలేదు. అన్ని చోట్లా పతకాల పంట పండిస్తున్న షూటర్లు మాత్రం ఒక కాంస్యం సాధించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటింగ్ త్రయం... చైనాతో సమానంగా పాయింట్లు సాధించినా దురదృష్టవశాత్తు రజతం దక్కలేదు. తొలిరోజు స్వర్ణం సాధించిన జీతూరాయ్... టీమ్ విభాగంలో పతకం సాధించినా, వ్యక్తిగత విభాగంలో నిరాశపరిచాడు. ఇక బ్యాడ్మింటన్‌లో భారత మహిళల జట్టు సెమీస్‌లో కొరియా చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇంచియాన్: భారత షూటర్లు మరోసారి దేశం గర్వపడేలా చేశారు. తొలిరోజు రెండు పతకాలు సాదించిన బుల్లెట్ వీరులు... రెండో రోజు భారత్ ఖాతాలో ఓ కాంస్యం చేర్చారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో జీతూ రాయ్, సమరేశ్ జంగ్, ప్రకాశ్ నంజప్ప త్రయం మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో దక్షిణ కొరియా 1744 పాయింట్లతో స్వర్ణం గెలవగా... చైనా, భారత్ 1743 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాయి. అయితే పతకం వర్గీకరణ కోసం బుల్స్ ఐ (పది పాయింట్ల సర్కిల్లో కొట్టిన బుల్లెట్లు) లెక్కించగా... చైనా షూటర్లు 65 సార్లు ఈ సర్కిల్లో బుల్లెట్లు కొడితే.. భారత త్రయం 64 సార్లు పది పాయింట్ల సర్కిల్లో బుల్లెట్లు కొట్టారు. దీంతో చైనాకు రజతం, భారత్‌కు కాంస్యం లభించాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో వ్యక్తిగత, టీమ్ ఈవెంట్ పోటీలు కలిసే జరుగుతాయి. వ్యక్తిగత ఫైనల్స్‌కు ముందు క్వాలిఫికేషన్ ఉంటుంది. ఇందులో అత్యధిక పాయింట్లు సాధించిన 8 మంది ఫైనల్‌కు చేరతారు. అదే విధంగా క్వాలిఫికేషన్లో ఒకే దేశానికి చెందిన ముగ్గురు షూటర్లు చేసిన స్కోర్లు కలిపి... అత్యధిక పాయింట్లు సాధించిన వారికి టీమ్ విభాగంలో పతకాలు దక్కుతాయి. క్వాలిఫికేషన్ లో భారత షూటర్లు జీతూ రాయ్ (585 పాయింట్లు), సమరేశ్ జంగ్ (580 పాయింట్లు), ప్రకాశ్ నంజప్ప (578 పాయింట్లు) స్కోరు చేశారు. ఈ ముగ్గురి స్కోర్లు కలిపి భారత్‌కు 1743 పాయింట్లు లభించాయి. ప్రకాశ్ నంజప్ప కాలిగాయంతో బాధపడుతూ ఈవెంట్లో పాల్గొన్నాడు. వ్యక్తిగతంగా జీతూ రాయ్ 585 పాయింట్లతో క్వాలిఫయింగ్‌లో రెండో స్థానంతో ఫైనల్‌కు చేరాడు. సమరేశ్ 9, ప్రకాశ్ నింజప్ప 14వ స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు చేరలేదు. పోటీల తొలిరోజు 50 మీటర్ల పిస్టల్ విభాగంలో స్వర్ణం సాధించిన జీతూ రాయ్... 10 మీటర్ల విభాగం ఫైనల్లో ఐదో స్థానంతో సంతృప్తి చెందాడు. ఫైనల్లో తొలి ఆరు షాట్ల వరకు అగ్రస్థానంలో ఉన్న రాయ్... తర్వాత క్రమంగా గురి తప్పాడు. 14వ షాట్ తర్వాత తను ఐదో స్థానంతో ఎలిమినేట్ అయ్యాడు. ఈ విభాగంలో కిమ్ (కొరియా) స్వర్ణం సాధించగా... పాంగ్ వీ (చైనా), జిన్ జోంగ్ (కొరియా) రజత, కాంస్యాలు సాధించారు. ఇక ట్రాప్ విభాగంలో మన్షేర్ సింగ్ (11వ స్థానం), మానవ్‌జిత్ సింగ్ (14వ), హైదరాబాద్ షూటర్ కైనన్ చెనాయ్ (36వ) ముగ్గురూ టాప్-10లో నిలవలేకపోయారు. నెల రోజుల పాటు అమ్మతో మాట్లాడకుండా... ఆసియా క్రీడల్లో భారత్‌కు రెండు పతకాలు సాధించి పెట్టిన జీతూ రాయ్ గత నెల రోజులుగా కనీసం తన తల్లితో మాట్లాడలేదట. ఏకాగ్రత కోసమో లేక సమయం కుదరకో... కారణం ఏదోగానీ తను మాత్రం తల్లితో మాట్లాడలేదట. ‘గత నెల్లో ప్రపంచ చాంపియున్‌షిప్ కోసం స్పెరుున్‌కు వెళ్లినప్పటి నుంచి అవ్ముతో వూట్లాడలేదు. నేను స్వర్ణం గెలిచిన విషయుం అవ్ముకు ఇంకా తెలియులేదు. ఇప్పుడు పతకం గెలిచాను కాబట్టి అవ్ముతో వూట్లాడతా. ఆమె ఇప్పుడు ఇటారి (నేపాల్)లో ఉంది’ అని జీతూ రాయ్ చెప్పాడు. ఆదివారం సాధించిన పతకంతో కలిపి ఈ ఏడాది జీతూ మొత్తం 7 పతకాలు సాధించడం విశేషం.