కలిసి రాకున్నా కాంస్యాలు | Raku with bronze | Sakshi
Sakshi News home page

కలిసి రాకున్నా కాంస్యాలు

Published Mon, Sep 22 2014 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM

కలిసి రాకున్నా కాంస్యాలు

కలిసి రాకున్నా కాంస్యాలు

పురుషుల 10మీ. ఎయిర్ పిస్టల్ టీమ్‌కు పతకం
 
 ఆసియా క్రీడల రెండో రోజు భారత్‌కు ఆశించిన స్థాయిలో పతకాలు రాలేదు. అన్ని చోట్లా పతకాల పంట పండిస్తున్న షూటర్లు మాత్రం ఒక కాంస్యం సాధించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత షూటింగ్ త్రయం... చైనాతో సమానంగా పాయింట్లు సాధించినా దురదృష్టవశాత్తు రజతం దక్కలేదు. తొలిరోజు స్వర్ణం సాధించిన జీతూరాయ్... టీమ్ విభాగంలో పతకం సాధించినా, వ్యక్తిగత విభాగంలో నిరాశపరిచాడు. ఇక బ్యాడ్మింటన్‌లో భారత మహిళల జట్టు సెమీస్‌లో కొరియా చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది.
 
 ఇంచియాన్: భారత షూటర్లు మరోసారి దేశం గర్వపడేలా చేశారు. తొలిరోజు రెండు పతకాలు సాదించిన బుల్లెట్ వీరులు... రెండో రోజు భారత్ ఖాతాలో ఓ కాంస్యం చేర్చారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో జీతూ రాయ్, సమరేశ్ జంగ్, ప్రకాశ్ నంజప్ప త్రయం మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో దక్షిణ కొరియా 1744 పాయింట్లతో స్వర్ణం గెలవగా... చైనా, భారత్ 1743 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాయి. అయితే పతకం వర్గీకరణ కోసం బుల్స్ ఐ (పది పాయింట్ల సర్కిల్‌లో కొట్టిన బుల్లెట్లు) లెక్కించగా... చైనా షూటర్లు 65 సార్లు ఈ సర్కిల్‌లో బుల్లెట్లు కొడితే.. భారత త్రయం 64 సార్లు పది పాయింట్ల సర్కిల్‌లో బుల్లెట్లు కొట్టారు. దీంతో చైనాకు రజతం, భారత్‌కు కాంస్యం లభించాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో వ్యక్తిగత, టీమ్ ఈవెంట్ పోటీలు కలిసే జరుగుతాయి. వ్యక్తిగత ఫైనల్స్‌కు ముందు క్వాలిఫికేషన్ ఉంటుంది. ఇందులో అత్యధిక పాయింట్లు సాధించిన 8 మంది ఫైనల్‌కు చేరతారు. అదే విధంగా క్వాలిఫికేషన్‌లో ఒకే దేశానికి చెందిన ముగ్గురు షూటర్లు చేసిన స్కోర్లు కలిపి... అత్యధిక పాయింట్లు సాధించిన వారికి టీమ్ విభాగంలో పతకాలు దక్కుతాయి.
 క్వాలిఫికేషన్ లో భారత షూటర్లు  జీతూ రాయ్ (585 పాయింట్లు), సమరేశ్ జంగ్ (580 పాయింట్లు), ప్రకాశ్ నంజప్ప (578 పాయింట్లు) స్కోరు చేశారు. ఈ ముగ్గురి స్కోర్లు కలిపి భారత్‌కు 1743 పాయింట్లు లభించాయి. ప్రకాశ్ నంజప్ప కాలిగాయంతో బాధపడుతూ ఈవెంట్లో పాల్గొన్నాడు. వ్యక్తిగతంగా జీతూ రాయ్ 585 పాయింట్లతో క్వాలిఫయింగ్‌లో రెండో స్థానంతో ఫైనల్‌కు చేరాడు. సమరేశ్ 9, ప్రకాశ్ నింజప్ప 14వ స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు చేరలేదు.
 పోటీల తొలిరోజు 50 మీటర్ల పిస్టల్ విభాగంలో స్వర్ణం సాధించిన జీతూ రాయ్... 10 మీటర్ల విభాగం ఫైనల్‌లో ఐదో స్థానంతో సంతృప్తి చెందాడు.  ఫైనల్లో తొలి ఆరు షాట్ల వరకు అగ్రస్థానంలో ఉన్న రాయ్... తర్వాత క్రమంగా గురి తప్పాడు. 14వ షాట్ తర్వాత తను ఐదో స్థానంతో ఎలిమినేట్ అయ్యాడు. ఈ విభాగంలో కిమ్ (కొరియా) స్వర్ణం సాధించగా... పాంగ్ వీ (చైనా), జిన్ జోంగ్ (కొరియా) రజత, కాంస్యాలు సాధించారు.
 ఇక ట్రాప్ విభాగంలో మన్షేర్ సింగ్ (11వ స్థానం), మానవ్‌జిత్ సింగ్ (14వ), హైదరాబాద్ షూటర్ కైనన్ చెనాయ్ (36వ) ముగ్గురూ టాప్-10లో నిలవలేకపోయారు.
 
 నెల రోజుల పాటు అమ్మతో మాట్లాడకుండా...
 ఆసియా క్రీడల్లో భారత్‌కు రెండు పతకాలు సాధించి పెట్టిన జీతూ రాయ్ గత నెల రోజులుగా కనీసం తన తల్లితో మాట్లాడలేదట. ఏకాగ్రత కోసమో లేక సమయం కుదరకో... కారణం ఏదోగానీ తను మాత్రం తల్లితో మాట్లాడలేదట. ‘గత నెల్లో ప్రపంచ చాంపియున్‌షిప్ కోసం స్పెరుున్‌కు వెళ్లినప్పటి నుంచి అవ్ముతో వూట్లాడలేదు. నేను స్వర్ణం గెలిచిన విషయుం అవ్ముకు ఇంకా తెలియులేదు. ఇప్పుడు పతకం గెలిచాను కాబట్టి అవ్ముతో వూట్లాడతా. ఆమె ఇప్పుడు ఇటారి (నేపాల్)లో ఉంది’ అని జీతూ రాయ్ చెప్పాడు. ఆదివారం సాధించిన పతకంతో కలిపి ఈ ఏడాది జీతూ మొత్తం 7 పతకాలు సాధించడం విశేషం.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement