jeetu rai
-
పసిడి పట్టిన జీతూ
ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ప్రపంచకప్‌లో భారత షూటర్లు గగనమే హద్దుగా చెలరేగిపోతున్నారు. రెండు రోజుల కిందట హీనా సిద్దూ, జీతూ రాయ్‌లు మిక్స్డ్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించారు. తాజాగా బుధవారం 50 మీటర్ల విభాగంలో జీతూరాయ్ పసిడికి గురి పెట్టాడు. ఇదే ఈవెంట్లో మరో భారత షూటర్ అమన్‌ప్రీత్ సింగ్ సిల్వర్ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. -
కలిసి రాకున్నా కాంస్యాలు
పురుషుల 10మీ. ఎయిర్ పిస్టల్ టీమ్‌కు పతకం ఆసియా క్రీడల రెండో రోజు భారత్‌కు ఆశించిన స్థాయిలో పతకాలు రాలేదు. అన్ని చోట్లా పతకాల పంట పండిస్తున్న షూటర్లు మాత్రం ఒక కాంస్యం సాధించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటింగ్ త్రయం... చైనాతో సమానంగా పాయింట్లు సాధించినా దురదృష్టవశాత్తు రజతం దక్కలేదు. తొలిరోజు స్వర్ణం సాధించిన జీతూరాయ్... టీమ్ విభాగంలో పతకం సాధించినా, వ్యక్తిగత విభాగంలో నిరాశపరిచాడు. ఇక బ్యాడ్మింటన్‌లో భారత మహిళల జట్టు సెమీస్‌లో కొరియా చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇంచియాన్: భారత షూటర్లు మరోసారి దేశం గర్వపడేలా చేశారు. తొలిరోజు రెండు పతకాలు సాదించిన బుల్లెట్ వీరులు... రెండో రోజు భారత్ ఖాతాలో ఓ కాంస్యం చేర్చారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో జీతూ రాయ్, సమరేశ్ జంగ్, ప్రకాశ్ నంజప్ప త్రయం మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో దక్షిణ కొరియా 1744 పాయింట్లతో స్వర్ణం గెలవగా... చైనా, భారత్ 1743 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాయి. అయితే పతకం వర్గీకరణ కోసం బుల్స్ ఐ (పది పాయింట్ల సర్కిల్లో కొట్టిన బుల్లెట్లు) లెక్కించగా... చైనా షూటర్లు 65 సార్లు ఈ సర్కిల్లో బుల్లెట్లు కొడితే.. భారత త్రయం 64 సార్లు పది పాయింట్ల సర్కిల్లో బుల్లెట్లు కొట్టారు. దీంతో చైనాకు రజతం, భారత్‌కు కాంస్యం లభించాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో వ్యక్తిగత, టీమ్ ఈవెంట్ పోటీలు కలిసే జరుగుతాయి. వ్యక్తిగత ఫైనల్స్‌కు ముందు క్వాలిఫికేషన్ ఉంటుంది. ఇందులో అత్యధిక పాయింట్లు సాధించిన 8 మంది ఫైనల్‌కు చేరతారు. అదే విధంగా క్వాలిఫికేషన్లో ఒకే దేశానికి చెందిన ముగ్గురు షూటర్లు చేసిన స్కోర్లు కలిపి... అత్యధిక పాయింట్లు సాధించిన వారికి టీమ్ విభాగంలో పతకాలు దక్కుతాయి. క్వాలిఫికేషన్ లో భారత షూటర్లు జీతూ రాయ్ (585 పాయింట్లు), సమరేశ్ జంగ్ (580 పాయింట్లు), ప్రకాశ్ నంజప్ప (578 పాయింట్లు) స్కోరు చేశారు. ఈ ముగ్గురి స్కోర్లు కలిపి భారత్‌కు 1743 పాయింట్లు లభించాయి. ప్రకాశ్ నంజప్ప కాలిగాయంతో బాధపడుతూ ఈవెంట్లో పాల్గొన్నాడు. వ్యక్తిగతంగా జీతూ రాయ్ 585 పాయింట్లతో క్వాలిఫయింగ్‌లో రెండో స్థానంతో ఫైనల్‌కు చేరాడు. సమరేశ్ 9, ప్రకాశ్ నింజప్ప 14వ స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు చేరలేదు. పోటీల తొలిరోజు 50 మీటర్ల పిస్టల్ విభాగంలో స్వర్ణం సాధించిన జీతూ రాయ్... 10 మీటర్ల విభాగం ఫైనల్లో ఐదో స్థానంతో సంతృప్తి చెందాడు. ఫైనల్లో తొలి ఆరు షాట్ల వరకు అగ్రస్థానంలో ఉన్న రాయ్... తర్వాత క్రమంగా గురి తప్పాడు. 14వ షాట్ తర్వాత తను ఐదో స్థానంతో ఎలిమినేట్ అయ్యాడు. ఈ విభాగంలో కిమ్ (కొరియా) స్వర్ణం సాధించగా... పాంగ్ వీ (చైనా), జిన్ జోంగ్ (కొరియా) రజత, కాంస్యాలు సాధించారు. ఇక ట్రాప్ విభాగంలో మన్షేర్ సింగ్ (11వ స్థానం), మానవ్‌జిత్ సింగ్ (14వ), హైదరాబాద్ షూటర్ కైనన్ చెనాయ్ (36వ) ముగ్గురూ టాప్-10లో నిలవలేకపోయారు. నెల రోజుల పాటు అమ్మతో మాట్లాడకుండా... ఆసియా క్రీడల్లో భారత్‌కు రెండు పతకాలు సాధించి పెట్టిన జీతూ రాయ్ గత నెల రోజులుగా కనీసం తన తల్లితో మాట్లాడలేదట. ఏకాగ్రత కోసమో లేక సమయం కుదరకో... కారణం ఏదోగానీ తను మాత్రం తల్లితో మాట్లాడలేదట. ‘గత నెల్లో ప్రపంచ చాంపియున్‌షిప్ కోసం స్పెరుున్‌కు వెళ్లినప్పటి నుంచి అవ్ముతో వూట్లాడలేదు. నేను స్వర్ణం గెలిచిన విషయుం అవ్ముకు ఇంకా తెలియులేదు. ఇప్పుడు పతకం గెలిచాను కాబట్టి అవ్ముతో వూట్లాడతా. ఆమె ఇప్పుడు ఇటారి (నేపాల్)లో ఉంది’ అని జీతూ రాయ్ చెప్పాడు. ఆదివారం సాధించిన పతకంతో కలిపి ఈ ఏడాది జీతూ మొత్తం 7 పతకాలు సాధించడం విశేషం. -
బుల్లెటు దిగింది
ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా క్రీడలు... వేదిక ఏదైనా భారత్ పతకాల బోణీ చేసేది మాత్రం షూటింగ్‌లోనే. నిలకడ, కచ్చితత్వం, ఏకాగ్రత.. ఈ మూడింటినీ అద్భుతంగా సమన్వయం చేసుకుంటున్న ‘బుల్లెట్’ వీరులు ఇంచియాన్ ఏషియాడ్‌లో కూడా దుమ్మురేపారు. దీంతో తొలి రోజు భారత్‌కు ఓ స్వర్ణం, కాంస్యం లభించాయి.పిస్టల్ ఈవెంట్లో భారత్‌కు రెండు పతకాలు... - జీతూ రాయ్‌కి స్వర్ణం - కాంస్యంతో మెరిసిన శ్వేత ఇంచియాన్: ఒకే ఒక్క షాట్... ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించింది. అప్పటి వరకు రెండో స్థానం తప్పదనుకున్నా... చివరి షాట్‌కు సంధించిన బుల్లెట్.... ప్రత్యర్థి ఆధిక్యాన్ని వెనక్కి నెడుతూ ముందుకు దూసుకెళ్లింది. ఫలితంగా చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత మేటి షూటర్ జీతూ రాయ్ (186.2 పాయింట్లు) పసిడి కాంతులు పూయించాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో శ్వేతా చౌదురి 176.4 పాయింట్లతో కాంస్యంతో తళుక్కుమంది. ఓవరాల్‌గా శనివారం ప్రారంభమైన ఏషియాడ్‌లో భారత షూటర్ల బుల్లెట్ పదును పెరిగింది. సూపర్ షాట్ క్వాలిఫయింగ్‌లో 559 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచిన జీతూ రాయ్ ఫైనల్లో మరింత నిలకడను చూపెట్టాడు. ప్రత్యర్థుల నుంచి పోటీ తీవ్రంగా ఉన్నా తన ఏకాగ్రతను మాత్రం సడలనీయలేదు. ఒక్కో రౌండ్‌ను అధిగమిస్తూ ముందుకెళ్లాడు. అయితే వియత్నాం షూటర్ గుయాన్ హోయాంగ్ ఫౌంగ్ నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. ప్రతి రౌండ్లో ప్రత్యర్థి ఎక్కువ పాయింట్లు సాధించడంతో జీతూ రాయ్ రెండో స్థానానికే పరిమితమయ్యాడు. కానీ ఊహించని రీతిలో ఆఖరి షాట్‌ను సంధించిన భారత షూటర్ 8.4 పాయింట్లు గెలిస్త్తే, గుయాన్ 5.8 పాయింట్లతోనే సరిపెట్టుకున్నాడు. అంతే అప్పటి వరకు ఉన్న ఆధిక్యంలో ఉన్న గుయాన్ (183.4 పాయింట్లు) రెండో స్థానానికి పడిపోయి రజతంతో సరిపెట్టుకోగా.. జీతూ స్వర్ణం ఎగరేసుకుపోయాడు. వాంగ్ హీవీ (165.6 పాయింట్లతో) కాంస్యం దక్కించుకున్నాడు. మరోవైపు ఇతర భారత షూటర్లలో ఓం ప్రకాశ్ (555 పాయింట్లు), ఓంకార్ సింగ్ (551 పాయింట్లు)లు వరుసగా 10, 16వ స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు. టీమ్ విభాగంలో జీతూ, ఓంకార్, ఓం ప్రకాశ్ బృందం 1665 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. రెండో షూటర్: ఆసియా గేమ్స్ పిస్టల్ ఈవెంట్లో స్వర్ణం సాధించిన రెండో షూటర్‌గా 27 ఏళ్ల జీతూ రాయ్ రికార్డులకెక్కాడు. గతంలో జస్పాల్ రాణా ఈ ఘనత సాధించాడు. అయితే షాట్‌గన్ షూటర్లలో స్వర్ణం సాధించిన జాబితాలో మాత్రం జీతూ నాలుగో స్థానంలో ఉన్నాడు. జస్పాల్, రణ్‌ధీర్ సింగ్ (1978), రంజన్ సోధి (2010)లు గతంలో స్వర్ణాలు గెలిచారు. ఈ ఏడాది అంతర్జాతీయ పోటీల్లో జీతూకు ఇది వరుసగా ఆరో పతకం కావడం విశేషం. రాష్ట్రపతి అభినందనలు: జీతూ రాయ్, శ్వేతా చౌదురిలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందనలు తెలిపారు. ‘అంతర్జాతీయ యవనికపై భారత పతాకాన్ని రెపరెపలాడించినందుకు నా అభినందనలు. తర్వాతి పోటీల్లో పతకాల కోసం ప్రయత్నించేవారికి నా శుభాకాంక్షలు’ అని ప్రణబ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సొంత పిస్టల్ లేకపోయినా... మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో శ్వేతా చౌదురి మెరుపులు మెరిపించింది. తను రెగ్యులర్‌గా వాడే పిస్టల్ కొరియా కస్టమ్స్ అధికారుల దగ్గరే ఉండిపోయినా.. వేరే పిస్టల్‌తో ఫైనల్లోకి బరిలోకి దిగిన శ్వేత 176.4 పాయింట్లతో నేర్పుగా కాంస్య పతకాన్ని ఒడిసిపట్టుకుంది. ఆరంభంలో కాస్త తడబడిన భారత షూటర్ ఆరో స్థానం నుంచి నెమ్మదిగా పుంజుకుంది. షూటాఫ్‌లో జుహు క్వింగ్యాన్ (చైనా) 10 పాయింట్లు సాధిస్తే, శ్వేత 10.7 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. అంతకుముందు జరిగిన క్వాలిఫయింగ్‌లో శ్వేత 383 పాయింట్లు సాధించింది. సహచర క్రీడాకారిణులు హీనా సిద్ధూ (378 పాయింట్లు), మలైకా గోయల్ (373 పాయింట్లు) వరుసగా 13, 24వ స్థానాల్లో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు. అయితే టీమ్ విభాగంలో ఈ త్రయం (1134 పాయింట్లు) ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. -
జీతూ రాయ్‌కు రజతం
రియో ఒలింపిక్స్‌కు అర్హత ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్ గ్రనాడా (స్పెయిన్): ఈ ఏడాది నిలకడగా రాణిస్తున్న భారత పిస్టల్ షూటర్ జీతూ రాయ్ ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లోనూ మెరిశాడు. మంగళవారం జరిగిన పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో జీతూ రాయ్ రజతం సాధించాడు. తద్వారా 2016లో రియో డి జనీరోలో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించిన తొలి భారతీయ క్రీడాకారుడయ్యాడు. ఫైనల్లో జీతూ రాయ్ 191.1 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచాడు. భారత సైన్యంలో పనిచేసే 25 ఏళ్ల జీతూ రాయ్‌కు ఇది వరుసగా ఐదో అంతర్జాతీయ పతకం కావడం విశేషం. ఇక మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ అయోనిక పాల్ ఫైనల్‌కు చేరుకున్నా ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఓవరాల్‌గా ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కిది ఎనిమిదో పతకం. పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ‘ట్రిపుల్ ఒలింపిక్ చాంపియన్’ జిన్ జోంగో (దక్షిణ కొరియా) 192.3 పాయింట్లతో స్వర్ణ పతకం... వీ పాంగ్ (చైనా) 172.6 పాయింట్లతో కాంస్యం సాధించారు. క్వాలిఫయింగ్‌లో జిన్ జోంగో 583 పాయింట్లు స్కోరు చేసి 34 ఏళ్లుగా ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు 581 పాయింట్లతో అలెగ్జాండర్ మెలెంటియెవ్ (1980 మాస్కో ఒలింపిక్స్) పేరిట ఉండేది. -
భారత్ 'గురి' భళా!
►ఒకే రోజు స్వర్ణం, రెండు రజతాలు ►మెరిసిన జీతూ రాయ్, గుర్పాల్, గగన్ నారంగ్ అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ భారత షూటర్లు కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాల వేట కొనసాగిస్తున్నారు. ఆదివారం పసిడి పతకం నెగ్గకపోయినా... సోమవారం ఆ లోటును తీర్చారు. ఎదురులేని ‘గురి’తో స్వర్ణ పతకంతోపాటు మరో రెండు రజత పతకాలు సొంతం చేసుకున్నారు. 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో జీతూ రాయ్, గుర్పాల్ సింగ్ స్వర్ణ, రజత పతకాలు సాధించగా... 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో హైదరాబాదీ షూటర్ గగన్ నారంగ్ రజత పతకాన్ని దక్కించుకున్నాడు. మొత్తానికి ఇప్పటిదాకా షూటింగ్ ఈవెంట్లోనే భారత్‌కు డజను పతకాలు వచ్చాయి. గ్లాస్గో: ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లలో తాను సాధించిన పతకాలు గాలివాటం కాదని భారత రైజింగ్ షూటర్ జీతూ రాయ్ నిరూపించాడు. కామన్వెల్త్ గేమ్స్ అరంగేట్రంలోనే అదరగొడుతూ స్వర్ణ పతకంతో బోణీ చేశాడు. సోమవారం జరిగిన పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో జీతూ రాయ్ పసిడి పతకం సొంతం చేసుకోగా... భారత్‌కే చెందిన గుర్పాల్ సింగ్ రజత పతకాన్ని దక్కించుకున్నాడు. 26 ఏళ్ల జీతూ మొత్తం 194.1 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. పంజాబ్‌కు చెందిన 34 ఏళ్ల గుర్పాల్ సింగ్ 187.2 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. డానియల్ రెపాచోలి (ఆస్ట్రేలియా-166.6 పాయింట్లు) కాంస్య పతకాన్ని సాధించాడు. క్వాలిఫయింగ్‌లో 562 పాయింట్లు సాధించి నంబర్‌వన్ స్థానంలో నిలిచిన జీతూ ఫైనల్లోనూ అదే జోరును కనబరిచాడు. ఆర్మీలో చేరాక షూటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న జీతూ రాయ్ ఈ ఏడాది నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. రెండు వారాల వ్యవధిలో ఇటీవల జర్మనీ, స్లొవేనియాలలో జరిగిన ప్రపంచకప్‌లలో ఈ ఉత్తరప్రదేశ్ షూటర్ స్వర్ణంతోపాటు, రెండు రజత పతకాలు గెలిచాడు. అంతేకాకుండా ఒకే ప్రపంచకప్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ షూటర్‌గా చరిత్ర సృష్టించాడు. తొలిసారే రజతం... కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో బరిలోకి దిగిన తొలిసారే స్టార్ షూటర్ గగన్ నారంగ్ రజతం సాధించాడు. 20 షాట్లతో కూడిన ఫైనల్లో ఈ హైదరాబాదీ షూటర్ 203.6 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానాన్ని పొందాడు. వారెన్ పోటెంట్ (ఆస్ట్రేలియా-204.3 పాయింట్లు) స్వర్ణం సాధించగా... కెన్నెత్ పార్ (ఇంగ్లండ్-182 పాయింట్లు) కాంస్యం నెగ్గాడు. ఓవరాల్‌గా కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో గగన్‌కిది తొమ్మిదో పతకం కావడం విశేషం. 2006 మెల్బోర్న్ గేమ్స్‌లో... 2010 ఢిల్లీ గేమ్స్‌లో గగన్ నాలుగేసి చొప్పున స్వర్ణ పతకాలు గెలిచాడు. మంగళవారం జరిగే 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో గనుక గగన్ నారంగ్ స్వర్ణం గెలిస్తే... కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో తొమ్మిది స్వర్ణాలు నెగ్గిన మూడో షూటర్‌గా గుర్తింపు పొందుతాడు. గతంలో జస్పాల్ రాణా (భారత్), మైకేల్ గాల్ట్ (ఇంగ్లండ్) మాత్రమే ఈ ఘనత సాధించారు. మిగతా విభాగాల్లో నిరాశ సోమవారమే జరిగిన మిగతా షూటింగ్ ఈవెంట్స్‌లో భారత షూటర్లకు నిరాశ ఎదురైంది. మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో భారత షూటర్లు మీనా కుమారి (615.3 పాయింట్లు) ఆరో స్థానంలో... లజ్జా గోస్వామి (612.3 పాయింట్లు) 11వ స్థానంలో నిలిచారు. ఈ ఈవెంట్లో సాలీ జాన్స్టన్ (న్యూజిలాండ్-620.7); ఎస్మారీ రీనెన్ (దక్షిణాఫ్రికా-620.1); జెన్ మెకిన్‌టోష్ (స్కాట్లాండ్-619.5 పాయింట్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించారు. పురుషుల ట్రాప్ ఈవెంట్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో భారత వెటరన్ షూటర్లు మన్షేర్ సింగ్, మానవ్‌జిత్ సింగ్ సంధూ రాణించారు. మన్షేర్ 50 పాయింట్లతో అగ్రస్థానంలో... మానవ్‌జిత్ 49 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. మంగళవారం క్వాలిఫయింగ్ రెండో రౌండ్‌తోపాటు సెమీఫైనల్స్, ఫైనల్స్ జరుగుతాయి. మరోవైపు మహిళల ట్రాప్ ఈవెంట్లో భారత షూటర్లు శ్రేయాసి సింగ్, సీమా తోమర్ ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. మొత్తం 17 మంది పాల్గొన్న ఈ ఈవెంట్లో శ్రేయాసి ఏడో స్థానంలో, సీమా ఎనిమిదో స్థానంలో నిలిచారు. టాప్-6లో నిలిచిన వారు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. -
షూటర్ జీతూకు స్వర్ణం
న్యూఢిల్లీ: భారత షూటర్ జీతూ రాయ్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించాడు. స్లొవేనియాలోని మారిబోర్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్ ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్ రౌండ్లో 200.8 పాయింట్లతో స్వర్ణం దక్కించుకున్నాడు. ఈ పతకంతో పాటు ఇంతకుముందే ఫ్రీ పిస్టల్‌లో రజతం సాధించిన జీతూ ప్రపంచకప్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు. ఇదే ఈవెంట్లో పాల్గొన్న మరో భారత షూటర్ పీఎన్ ప్రకాశ్ ఐదో స్థానంలో నిలిచాడు. మరోవైపు మ్యూనిచ్‌లో జరిగిన చివరి ప్రపంచకప్‌లోనూ జీతూ ఎయిర్ పిస్టల్‌లో రజతం దక్కించుకున్నాడు.