varuni
-
వరుణి డబుల్ ధమాకా
టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో వరుణి జైశ్వాల్ సత్తా చాటింది. మలక్‌పేట్‌లోని స్టాగ్ టేబుల్ టెన్నిస్ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో జూనియర్, యూత్ బాలికల విభాగాల్లో విజేతగా నిలిచి టైటిల్స్‌ను కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన జూనియర్ బాలికల ఫైనల్లో వరుణి 6–11, 11–7, 11–9, 12–10, 8–11, 11–7తో లాస్యపై గెలుపొందింది. అంతకుముందు జరిగిన సెమీస్‌లో ఆమె 11–6, 11–7, 11–3, 11–5తో సస్యను ఓడించింది. యూత్ బాలికల ఫైనల్లో వరుణి 11–7, 11–4, 9–11, 11–7, 11–8తో లాస్యను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. సెమీస్‌లో ఆమె 11–8, 11–4, 11–8, 11–9తో సస్యపై గెలుపొందింది. పురుషుల విభాగంలో ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో స్నేహిత్ (జీటీటీఏ) 6–11, 11–6, 13–11, 11–8, 11–1తో చంద్రచూడ్ (జీఎస్ఎం)పై గెలుపొందాడు. -
నిఖత్, శ్రీజ, వరుణిలకు కాంస్యాలు
జాతీయ ర్యాంకింగ్ టీటీ టోర్నీ గువహటి: జాతీయ సీనియర్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ-ఈస్ట్‌జోన్) టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయిలు నిఖత్ బాను, ఆకుల శ్రీజ, వరుణి జైస్వాల్ కాంస్య పతకాలు గెల్చుకున్నారు. బుధవారం ముగిసిన ఈ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో నిఖత్ 3-4 (11-9, 12-10, 3-11, 6-11, 15-13, 6-11, 8-11)తో షామిని (పీఎస్‌పీబీ) చేతిలో పోరాడి ఓడింది. మరో సెమీస్‌లో మౌమా దాస్ (పీఎస్‌పీబీ) 4-0తో పూజా సహస్రబుద్దే (పీఎస్‌పీబీ)పై గెలిచింది. సెమీస్‌లో ఓడిన నిఖత్, పూజాలకు కాంస్యాలు లభించగా... ఫైనల్లో షామిని 4-3తో మౌమా దాస్‌ను ఓడించి విజేతగా నిలిచింది. యూత్, జూనియర్ బాలికల సింగిల్స్ విభాగంలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) జట్టు తరఫున బరిలోకి దిగిన తెలుగు అమ్మాయి ఆకుల శ్రీజకు కాంస్య పతకాలు దక్కాయి. ‘యూత్’ సెమీస్‌లో శ్రీజ 2-4తో రీత్ రిష్యా (పీఎస్‌పీబీ) చేతిలో... ‘జూనియర్’ సెమీస్‌లో 0-4తో హర్షవర్ధిని (తమిళనాడు) చేతిలో ఓడిపోయింది. జూనియర్ బాలికల సింగిల్స్ సెమీస్‌లో వరుణి 1-4తో మౌమితా దత్తా (బెంగాల్) చేతిలో పరాజయం పాలైంది.