సెమీస్‌లో సౌరభ్ | Saurabh enter to semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సౌరభ్

Published Sat, Oct 15 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM

సెమీస్‌లో సౌరభ్

సెమీస్‌లో సౌరభ్

తైపీ సిటీ: చైనీస్ తైపీ మాస్టర్స్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారుడు సౌరభ్ వర్మ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సౌరభ్ 7-11, 11-1, 11-3, 11-7తో కెంటో హొరియుచి (జపాన్)పై విజయం సాధించాడు.

శనివారం జరిగే సెమీఫైనల్లో సు జెన్ హావో (చైనీస్ తైపీ)తో సౌరభ్ ఆడతాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సౌరభ్ వరుసగా మూడో అంతర్జాతీయ టోర్నీలో ఫైనల్‌కు చేరుకుంటాడు. ఇప్పటికే బెల్జియం, పోలాండ్ ఓపెన్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరిన సౌరభ్ ఆ రెండింటిలోనూ రన్నరప్‌గా నిలిచాడు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement