
తొలి టి20లో కివీస్ విజయం
81 పరుగులతో ఓడిన వెస్టిండీస్
ఆక్లాండ్: టి20 ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్‌కు... న్యూజిలాండ్‌తో రెండు టి20ల సిరీస్ తొలి మ్యాచ్‌లో చుక్కెదురైంది. ఈడెన్ పార్క్‌లో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య కివీస్ జట్టు 81 పరుగుల తేడాతో కరీబియన్ జట్టుపై గెలిచింది. తొలుత న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోరు సాధించింది.
కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ (45 బంతుల్లో 60 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీతో రాణించాడు. కీపర్ లూక్ రాంచీ (25 బంతుల్లో 48 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 108 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. చివరిదైన రెండో టి20 బుధవారం జరుగుతుంది.