గుప్టిల్‌కు మొండిచెయ్యి | ODI century not enough for Guptill to make Test cut | Sakshi
Sakshi News home page

గుప్టిల్‌కు మొండిచెయ్యి

Published Mon, Jan 27 2014 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM

మూడో వన్డేలో సెంచరీతో చెలరేగిన న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్‌కు... టెస్టు జట్టులో మాత్రం చోటు దక్కలేదు. వచ్చే నెల 6 నుంచి భారత్‌తో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌కు కివీస్ జట్టును ఆదివారం ప్రకటించారు.

ఆక్లాండ్: మూడో వన్డేలో సెంచరీతో చెలరేగిన న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్‌కు... టెస్టు జట్టులో మాత్రం చోటు దక్కలేదు. వచ్చే నెల 6 నుంచి భారత్‌తో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌కు కివీస్ జట్టును ఆదివారం ప్రకటించారు. డిసెంబర్‌లో విండీస్‌తో ఆడిన జట్టునే యథావిధిగా కొనసాగించారు.
 
 కుటుంబ కారణాలతో సిరీస్ మధ్యలో రాస్ టేలర్ ఇంటికి వెళ్లే అవకాశం ఉండటంతో రైడర్‌ను కూడా ఎంపిక చేశారు. పీటర్ ఫుల్టన్, రూథర్‌ఫోర్డ్‌పై సెలక్టర్లు నమ్మకం పెట్టారు. భారత సంతతికి చెందిన స్పిన్నర్ సోధికి అవకాశం లభించింది. టెస్టు సిరీస్‌కు ముందు భారత్... కివీస్ ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఫుల్టన్, రూథర్‌ఫోర్డ్ ఈ మ్యాచ్‌లోనూ ఆడనున్నారు.
 
 టెస్టు జట్టు: మెకల్లమ్ (కెప్టెన్), అండర్సన్, బౌల్ట్, బ్రాస్‌వెల్, ఫుల్టన్, రూథర్‌ఫోర్డ్, సోధి, సౌతీ, టేలర్, వాగ్నేర్, వాట్లింగ్, విలియమ్సన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement