
గతంలోకి ప్రయాణించడం సాధ్యమా? సినిమాల్లో సాధ్యమే. కానీ శామ్ స్వీనే అనే యు.ఎస్. జర్నలిస్టు నిజంగానే వెనక్కి ప్రయాణించాడు! ప్రయాణించిన ప్రూఫ్‌లను కూడా ట్విట్టర్‌లో పెట్టాడు! నిజమే. అతడు గతంలోకి ప్రయాణించాడు. ఎలా? ఎక్కడ దొరికింది అతడికి ఆ.. కాలయంత్రం?! కాలయంత్రం కాదది. హవాయి ఎయిర్‌ౖలñ న్స్ ఫ్లైట్. అందులో కూర్చొని అతడు 2018 నుంచి 2017లోకి జర్నీ చేశాడు. ఇది ఎలా జరిగిందో చూడండి. ఆక్లాండ్‌లో ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాడు శామ్. అతడు వెళ్లవలసింది ‘హొనొలులు’కు.
రెండు ప్రాంతాల మధ్య దూరం ఏడు వేల కిలోమీటర్లు. ఆక్లాండ్‌లో టేకాఫ్ టైమ్ డిసెంబర్ 31 రాత్రి 11.55 గం. ఆ సమయానికి బయల్దేరితే తెల్లారి 9.45 కి ఫ్లైట్ హొనొలులు చేరుతుంది. అయితే ఫ్లైట్ 10 నిమిషాలు ఆలస్యమై, 12.05కి గాల్లోకి లేచింది. అంటే 2018లో బయల్దేరింది. అక్కడి నుంచి ప్రయాణించి ఉదయం 10.16 గంటలకు హొనొలులు చేరుకుంది. ఆ ప్రాంత కాలమానం ప్రకారం అప్పటికింకా అక్కడ 2017 డిసెంబర్ ముప్పై ఒకటే నడుస్తోంది. అలా శామ్ గతంలోకి ప్రయాణించాడు! న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ యు.ఎస్.లోని హొనొలులు కన్నా 23 గంటలు ముందుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment