న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో కూడా టీమిండియా పరాజయం పాలై సిరీస్‌ను అతిథ్య జట్టుకు సమర్పించేసుకుంది. శనివారం ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో జరిగిన రెండో వన్డేలో 274 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా విజయానికి 22 పరుగుల దూరంలో నిలిచి ఓటమిపాలయ్యింది. కాగా మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ 2-0 తేడాతో ఆధిక్యంలో నిలవడంతో పాటు సిరీస్‌ను కైవసం చేసుకుంది.