మరిన్ని బ్యాంకులకు ఆర్బీఐ జరిమానా
న్యూఢిల్లీ: రిజర్వు బ్యాంక్(ఆర్‌బీఐ) తాజాగా అలహాబాద్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలపై జరిమానా విధించింది. ఆలహాబాద్ బ్యాంక్, యూకో బ్యాంకులపై వరుసగా రూ.2 కోట్ల చొప్పున, బ్యాంక్ ఆఫ్ ఇండియాపై రూ.కోటి జరిమానా వేసింది. కేవైసీ, యాంటీ-మనీ ల్యాండరింగ్ (ఏఎంఎల్) నిబంధనల అతిక్రమణ నేపథ్యంలో ఈ బ్యాంకులపై జరిమానా పడి ంది. కేవైసీ/ఏఎంఎల్ నియమావళిలో కొన్ని పొరపాట్లు ఉన్నాయనే కారణంగా ఆర్‌బీఐ తమపై పెనాల్టీ విధించిందని యూకో బ్యాంక్ బీఎస్‌ఈకి నివేదించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంకులు కూడా ఇదే విషయాన్ని బీఎస్‌ఈకి తెలియజేశాయి.