![Allahabad Bank hit by fraud of Rs 688 crore by SEL Manufacturing - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/19/ALLAHABAD-BANK.jpg.webp?itok=TXq0B-wG)
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అలహాబాద్ బ్యాంక్ కార్యకలాపాల తీరుపై సందేహాలు రేకెత్తించేలా తాజాగా మరో మోసం బైటపడింది. ఎస్‌ఈఎల్ మాన్యుఫాక్చరింగ్ (ఎస్‌ఈఎల్‌ఎం) రూ. 688.27 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు అలహాబాద్ బ్యాంకు వెల్లడించింది. దీనికి సంబంధించి ప్రొవిజనింగ్ చేసినట్లు, ఫ్రాడ్ గురించి ఆర్‌బీఐకి కూడా తెలియజేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఎస్‌ఈఎల్‌ఎం దివాలా పిటిషన్‌పై ఎన్‌సీఎల్‌టీలో విచారణ జరుగుతున్నట్లు వివరించింది. వారం రోజుల వ్యవధిలో అలహాబాద్ బ్యాంకులో ఇది రెండో ఫ్రాడ్ కేసు కావడం గమనార్హం. భూషణ్ పవర్ అండ్ స్టీల్ (బీపీఎస్‌ఎల్) రూ. 1,775 కోట్ల మోసానికి పాల్పడినట్లు గత శనివారమే బ్యాంకు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment