ముంబై : యునైటెడ్ కమర్షియల్ బ్యాంకు(యూసీఓ) వరుసగా రెండో త్రైమాసికం కూడా నష్టాలనే నమోదుచేసింది. శుక్రవారం ప్రకటించిన మార్చి త్రైమాసిక ఫలితాల్లో రూ.1,715.16 కోట్ల నికర నష్టాలను బ్యాంకు ప్రకటించింది. రుణాల ఎగవేత పెరగడం, నికర వడ్డీల ఆదాయం తక్కువగా ఉండటంతో ఈ నష్టాలను నమోదుచేసినట్టు బ్యాంకు వెల్లడించింది. రుణాలు ఇవ్వడం ద్వారా వచ్చే నికర వడ్డీల ఆదాయం(ఎన్ఐఐ) 26.85శాతం పడిపోయి రూ.933.11కోట్లగా నమోదయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ ఆదాయాలు రూ. 1,275.67కోట్లగా ఉన్నాయి. వడ్డీల ద్వారా వచ్చే ఆదాయాల కాకుండా, ఇతరేతర ఆదాయాలు కూడా 41.47శాతం పడిపోయాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ ఆదాయాలు రూ.662.55 కోట్లు ఉంటే, ఈ ఏడాది ఈ క్వార్టర్లో రూ.387.80 కోట్లగానే ఉన్నాయని బ్యాంకు తెలిపింది.
బ్యాంకుకు వసూలు కాని అప్పులు 142.44శాతం పెరిగి రూ.2,344.80 కోట్లగా ఉండటంతో వరుస నష్టాలను యూఎస్ఓ నమోదు చేస్తుందని బ్యాంకు తెలిపింది. డిసెంబర్ త్రైమాసికంలో వసూలు కాని రుణాలు రూ.2,360.84 కోట్లగా ఉన్నాయి. బ్యాంకుకు ఉన్న మొత్తం రుణశాతంలో, స్థూల మొండిబకాయిలు మార్చి త్రైమాసికంలో 15.43శాతం పెరిగాయి. కిందటి క్వార్టర్లో ఇవి 10.98శాతమే ఉన్నాయి. నికర మొండిబకాయిల 4.3శాతం నుంచి 9.09శాతం పెరిగినట్టు బ్యాంకు ప్రకటించింది. యూఎస్ఓ ఈ త్రైమాసికంలో నమోదుచేసిన నష్టాలతో, స్టాక్ మార్కెట్లో ఈ బ్యాంకు షేర్లు 5శాతం మేర పడిపోయాయి.
డీలా పడిన యూకో బ్యాంకు
Published Fri, May 13 2016 4:03 PM | Last Updated on Mon, Oct 8 2018 7:36 PM
Advertisement
Advertisement