Rs1
-
రూపాయికే పెట్రోలు : ఎగబడిన జనం
సాక్షి,ముంబై: మండుతున్న పెట్రోలు ధరలు వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నసంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒక రూపాయికే పెట్రోలు లభించడం వారికి వరంలా మారింది. దీంతో జనం క్యూట్టారు. మహారాష్ట్రలోని, శివసేన పార్టీ వాహనదారులకు ఈ తీపి కబురు అందించారు. డోంబివలీలోని పెట్రోల్ బంకులో లీటరు పెట్రోలు రూపాయికే పంపిణీ చేశారు. సుమారు 1200 మందికి లీటరుకు ఒక రూపాయి చొప్పున పెట్రోలు అందించారు. మహారాష్ట్ర యువనేత, పర్యావరణ మంత్రి ఆదిత్యా థాక్రే పుట్టినరోజు సందర్బంగా ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన అభిమానులు లీటరు పెట్రోలు రూపాయికే విక్రయించారు. ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వాహనదారులకు బారులుతీరారు. డొంబివ్లీకి చెందిన శివసేన కార్పొరేటర్, దీపేశ్ మత్రే, పూజా మత్రే, కల్యాణ్ యువసేన నేత యోగేశ్ మత్రేతో సహా మరికొంతమంది నేతలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రెండు గంటలకు రూపాయికే లీటర్ పెట్రోల్‌ను పంపిణీ చేశారు. లాక్డౌన్ ఆంక్షలతో ప్రయాణికులు తమ సొంత వాహనాలను ఎంచుకోవాల్సి వస్తోంది. ఫలితంగా వీరిపై రోజుకు సుమారు 400 రూపాయల భారం పడుతోదని శివసేన స్థానిక దీపేశ్ మత్రే చెప్పారు. మొదటి 500 మందికి ఇవ్వాలనుకున్నాం. కానీ జనం భారీగా రావడంతో దీన్ని కొనసాగించామని తెలిపారు. కాగా ముంబైలో లీటరుకు రూ. 102.58, డీజిల్ రూ. 94.70 పలుకుతున్న సంగతి తెలిసిందే. చదవండి : ఎన్ఎస్డీఎల్: అదానీకి భారీ షాక్ Petrol diesel prices: పెట్రో రికార్డు పరుగు -
యాక్సిస్ బ్యాంక్ లాభం 16శాతం క్షీణత
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ నికరలాభం 2017 జూన్‌తో ముగిసిన క్వార్టర్లో 16 శాతం క్షీణించి రూ. 1,556 కోట్ల నుంచి రూ. 1,306 కోట్లకు తగ్గింది. అయితే బ్యాంకు ఆదాయం రూ. 13,852 కోట్ల నుంచి రూ. 14,052 కోట్లకు పెరిగింది. బ్యాంకు స్థూల ఎన్పీఏలు 2016 జూన్ క్వార్టర్‌తో పోలిస్తే తాజా త్రైమాసికంలో భారీగా 2.54 శాతం నుంచి 5.03 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు 1.06 శాతం నుంచి 2.30 శాతానికి ఎగిశాయి. విలువపరంగా స్థూల ఎన్పీఏలు రూ. 9,553 కోట్ల నుంచి రూ. 22,030 కోట్లకు, నికర ఎన్పీఏలు రూ.4,010 కోట్ల నుంచి రూ. 9,766 కోట్లకు చేరాయి. ముగిసిన త్రైమాసికంలో అదనంగా రూ. 3,519 కోట్ల స్థూల ఎన్పీఏలు ఏర్పడ్డాయని, రూ. 2,462 కోట్ల మేర రైటాఫ్‌లు చేసినట్లు బ్యాంకు విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ. 2,117 కోట్ల నుంచి రూ. 2,342 కోట్లకు పెరిగాయి. టెలికం, ఇన్ఫ్రా, ఇనుము, ఉక్కు, విద్యుత్ రంగాలకు ఇచ్చిన రుణాలపై కేటాయింపుల్ని 1 శాతం మేర పెంచినట్లు బ్యాంకు తెలిపింది. -
పెద్ద నోట్ల రద్దు: రూ.1500 కోట్లు మటాష్!
హైదరాబాద్ : పెద్ద నోట్లను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న హఠాత్తు నిర్ణయానికి తెలంగాణ రెవెన్యూలు భారీగానే తుడిచిపెట్టుకుపోనున్నాయట. నెలకు రూ.1000 నుంచి రూ.1500 కోట్ల రెవెన్యూలను ప్రభుత్వం కోల్పోవాల్సి వస్తుందని అంచనావేస్తున్నట్టు రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. అయితే ఎన్ని నెలలు ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదని వ్యాఖ్యానించారు. తక్కువ విలువైన కరెన్సీనోట్లు వచ్చినప్పటికీ, సమస్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ సంక్షోభం మూడు లేదా ఆరు నెలల వరకు ఉండొచ్చనని.. ఇదంతా కేంద్రప్రభుత్వం చేతులోనే ఉందని రాజేందర్ అసహనం వ్యక్తంచేశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్, మోటార్ వెహికిల్, కమర్షియల్ ట్యాక్స్ వసూలల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ప్రధాని నరేంద్రమోదీని కలిసి చర్చించారని, తమ సమస్యలకు పరిష్కారం కూడా కోరినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆదాయం తగ్గిపోతున్న నేపథ్యంలో కేంద్రానికి చెల్లించాల్సిన రుణాలను కొంతకాలం వాయిదా వేయాలని ప్రధానికి సీఎం విజ్ఞప్తి చేసినట్టు చెప్పాయి. అదేవిధంగా పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ప్రతిపక్షపార్టీలు సోమవారం చేస్తున్న ఆక్రోష దివస్‌లో టీఆర్ఎస్ పాల్గొనడం లేదని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత వెల్లడించారు. పెద్దనోట్ల రద్దు వెనుకాల ఉన్న ప్రధాని ఉద్దేశ్యాన్ని తాము అభినందిస్తున్నామని, కానీ అమలులోనే సంస్కరణలు చేయాల్సినవసరం ఉందన్నారు. -
కోటికి పైగా విలువైన పాతనోట్లు అపహరణ!
ఒడిశా : ప్రభుత్వం ఇటీవల పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో పాత కరెన్సీ నోట్లను తీసుకోవడానికే కాదు కనీసం చూడటానికే ఎవరూ మొగ్గుచూపడం లేదు. అలాంటిది ఓ బ్యాంకు నుంచి కోటికి పైగా పాత కరెన్సీ నోట్లను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. సోమవారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల వీకెండ్ సెలవు అనంతరం ఒడిశా గ్రామ్య బ్యాంకు శాఖను తెరిచిన అధికారులు బ్యాంకులో నగదు దొంగతనానికి గురైనట్టు గుర్తించినట్టు దెంకనల్ టౌన్ పోలీసు స్టేషన్ ఇన్ఛార్జ్ ఇన్పెస్టర్ అభినవ్ డాల్వ తెలిపారు. బ్యాంకులో మొత్తం రూ.8 కోట్ల పాత కరెన్సీ నోట్లు ఉన్నాయని, వాటిలో రూ.1.15 కోట్లు కలిగిఉన్న ఒక ఐరన్ బాక్స్ మిస్ అయినట్టు గుర్తించినట్టు ఆయన చెప్పారు. ఆ నగదంతా రద్దైన పాత కరెన్సీ నోట్లు రూ.500, రూ.1000లవేనని దెంకనల్ ఎస్పీ బసంత్ కుమాన్ పానిగ్రహి పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీలను తాము పరిశీలిస్తున్నామని, ఈ దొంగతనానికి బ్యాంకులోని వ్యక్తులే సహకరించినట్టు తాము అనుమానిస్తున్నట్టు చెప్పారు. రూ.7 కోట్ల కరెన్సీని మాత్రం ఓ పటిష్టమైన గదిలో దాచిఉంచడాన్ని చూసి తాము ఆశ్చర్యానికి గురయ్యామని పోలీసులు పేర్కొన్నారు. ఈ బ్యాంకు శాఖ దెంకనల్ టౌన్ పోలీసు స్టేషన్‌కు అడుగు దూరంలోనే ఉంటుందని, దొంగతనానికి పాల్పడిన నిందితుల కోసం స్పెషల్ టీమ్ తో వెతుకులాట ప్రారంభించినట్టు దెంకనల్ ఎస్పీ చెప్పారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో బ్యాంకుల్లో భారీగా పాత నోట్లు డిపాజిట్ అవుతున్న సంగతి తెలిసిందే. -
డీలా పడిన యూకో బ్యాంకు
ముంబై : యునైటెడ్ కమర్షియల్ బ్యాంకు(యూసీఓ) వరుసగా రెండో త్రైమాసికం కూడా నష్టాలనే నమోదుచేసింది. శుక్రవారం ప్రకటించిన మార్చి త్రైమాసిక ఫలితాల్లో రూ.1,715.16 కోట్ల నికర నష్టాలను బ్యాంకు ప్రకటించింది. రుణాల ఎగవేత పెరగడం, నికర వడ్డీల ఆదాయం తక్కువగా ఉండటంతో ఈ నష్టాలను నమోదుచేసినట్టు బ్యాంకు వెల్లడించింది. రుణాలు ఇవ్వడం ద్వారా వచ్చే నికర వడ్డీల ఆదాయం(ఎన్ఐఐ) 26.85శాతం పడిపోయి రూ.933.11కోట్లగా నమోదయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ ఆదాయాలు రూ. 1,275.67కోట్లగా ఉన్నాయి. వడ్డీల ద్వారా వచ్చే ఆదాయాల కాకుండా, ఇతరేతర ఆదాయాలు కూడా 41.47శాతం పడిపోయాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ ఆదాయాలు రూ.662.55 కోట్లు ఉంటే, ఈ ఏడాది ఈ క్వార్టర్లో రూ.387.80 కోట్లగానే ఉన్నాయని బ్యాంకు తెలిపింది. బ్యాంకుకు వసూలు కాని అప్పులు 142.44శాతం పెరిగి రూ.2,344.80 కోట్లగా ఉండటంతో వరుస నష్టాలను యూఎస్ఓ నమోదు చేస్తుందని బ్యాంకు తెలిపింది. డిసెంబర్ త్రైమాసికంలో వసూలు కాని రుణాలు రూ.2,360.84 కోట్లగా ఉన్నాయి. బ్యాంకుకు ఉన్న మొత్తం రుణశాతంలో, స్థూల మొండిబకాయిలు మార్చి త్రైమాసికంలో 15.43శాతం పెరిగాయి. కిందటి క్వార్టర్లో ఇవి 10.98శాతమే ఉన్నాయి. నికర మొండిబకాయిల 4.3శాతం నుంచి 9.09శాతం పెరిగినట్టు బ్యాంకు ప్రకటించింది. యూఎస్ఓ ఈ త్రైమాసికంలో నమోదుచేసిన నష్టాలతో, స్టాక్ మార్కెట్లో ఈ బ్యాంకు షేర్లు 5శాతం మేర పడిపోయాయి.