హైదరాబాద్ : ప్రధాని స్కిల్ ఇండియా నిధులను దిల్సుఖ్నగర్ యూకో బ్యాంక్ అధికారులు గోల్మాల్ చేశారు. నల్లగొండ జయం ఇన్స్టిట్యూట్తో చేతులు కలిపిన బ్యాంక్ అధికారులు స్కిల్ ఇండియా నిధులను స్వాహా చేశారు. విద్యార్థులు పేరుతో బ్యాంక్ ఖాతాలు తెరిచి అందినకాడికి దండుకున్నారు. స్కిల్ ఇండియా నిధుల గోల్మాల్పై సీబీఐ అధికారులు ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 180మంది జయం ఇనిస్టిట్యూట్ విద్యార్థులకు సీబీఐ నోటీసులు పంపింది.
సీబీఐ నోటీసులతో అవాక్కైన విద్యార్థులు తమకు తెలియకుండా బ్యాంక్ అకౌంట్స్ ఎలా ఓపెన్ చేస్తారంటూ దిల్సుఖ్నగర్ యూకో బ్యాంక్ ఎదుట బుధవారం ధర్నాకు దిగారు. స్కిల్ ఇండియా పేరుతో విద్యార్థి ఖాతాలో ప్రతినెల రూ.10వేలు జమ కాగా, దాదాపు రూ.కోటికి పైగా స్కిల్ ఇండియా నిధులు స్వాహా చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం ఘటనపై సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు.