యూకో బ్యాంక్‌లో గతంలో జరిగిన ఇమిడియట్ పేమెంట్ సిస్టమ్(ఐఎంపీఎస్) లావాదేవీల కుంభకోణంలో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ జరుపుతోంది. తాజాగా రాజస్థాన్, మహారాష్ట్రల్లోని 67 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలిసింది.
అసలేం జరిగిందంటే..
బ్యాంకులో గతేడాది నవంబరు 10-13 తేదీల మధ్య యూకో బ్యాంక్‌కు చెందిన 41 వేల మందికి పైగా ఖాతాదార్ల అకౌంట్‌ల్లోకి తప్పుగా డబ్బులు జమైనట్లు బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇలా జమ అయిన మొత్తం నిధుల విలువ రూ.820 కోట్లని తేల్చింది. 7 ప్రైవేటు బ్యాంకుల్లోని 14,600 ఖాతాదారుల నుంచి ఐఎంపీఎస్ లావాదేవీల ద్వారా యూకో బ్యాంకులోని 41,000కు పైగా ఖాతాదారులకు తప్పుగా నిధులు జమ అయినట్లు సీబీఐ గుర్తించింది. ఆసక్తికర విషయం ఏమిటంటే.. సంబంధిత బ్యాంకు ఖాతాల్లో మాత్రం డబ్బులు కట్ అవకుండానే, యూకో బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్లలోకి డబ్బు జమైనట్లు గుర్తించారు.
ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
బ్యాంకు ఖాతాల్లో పొరపాటున నగదు జమ అయిన తేదీల్లోనే, యూకో బ్యాంకులో వేల సంఖ్య లో కొత్త ఖాతాలు తెరుచుకోవడంపై ఆరా తీస్తున్నారు. తమ ఖాతాల్లో జమ అయిన డబ్బును చాలామంది విత్‌డ్రా చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవల నిర్వహించిన దాడుల్లో యూకో బ్యాంకు, ఐడీఎఫ్సీకి చెందిన 130 నేరారోపణ పత్రాలు, 40 మొబైల్ ఫోన్లు, రెండు హార్డ్ డిస్క్‌లు, ఇంటర్నెట్ డాంగుల్‌ను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం సీజ్ చేసినట్లు సీబీఐ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment