ఆగస్టు 24న సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ | Civil Services prelims examination on August 24 | Sakshi
Sakshi News home page

ఆగస్టు 24న సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్

Published Wed, May 7 2014 3:32 AM | Last Updated on Sat, Sep 22 2018 7:37 PM

ఆగస్టు 24న సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ - Sakshi

ఆగస్టు 24న సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్

న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆగస్టు 24న జరగనుంది. ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్ తదితర సర్వీసులకు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రతిష్టాత్మక పరీక్షకు పర్యవేక్షకులుగా ఆయా రాష్ట్రాల్లోని కొందరు అధికారులను కేటాయించాలని యూపీఎస్సీ విజ్ఞప్తి చేసింది. దేశ వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నట్టు పేర్కొంది. ఒక్క ఢిల్లీలోనే దాదాపు లక్ష మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నట్టు యూపీఎస్సీ తెలిపింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహార మంత్రిత్వ శాఖకు మంగళవారం యూపీఎస్సీ లేఖ రాసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement