న్యూఢిల్లీ: 2017లో సివిల్స్‌కు ఎంపికైన వారి మార్కులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) ఆదివారం విడుదల చేసింది. అత్యంత కఠినంగా ఉండే సివిల్స్‌లో ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్ తెలుగు విద్యార్థి దురిశెట్టి అనుదీప్ 55.60 శాతం మార్కులు సాధించాడు. సివిల్స్ మెయిన్స్ 1,750 మార్కులు, ఇంటర్వ్యూ 275 కలిపి మొత్తం 2,025 మార్కులకు.. అనుదీప్ రాతపరీక్షలో 950, ఇంటర్వ్యూలో 176 మార్కులతో మొత్తం 1,126 మార్కులు సాధించాడు.
రెండో ర్యాంకు సాధించిన అను కుమారి 1,124 (రాత పరీక్షలో 937, ఇంటర్వ్యూలో 187) మార్కులతో 55.50%, మూడో ర్యాంకర్ సచిన్ గుప్తా 55.40 శాతం (946 రాతపరీక్ష, ఇంటర్వ్యూలో 176) మార్కులు సాధించారు. ఈ పరీక్షల్లో 750 మంది పురుష, 240 మహిళా అభ్యర్థులు మొత్తం 990 మంది కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు అర్హత సాధించినట్లు యూపీఎస్‌సీ పేర్కొంది. 990వ ర్యాంకు సాధించిన హిమాంక్షి భరద్వాజ్ 830 మార్కుల (687 రాతపరీక్ష, 143 ఇంటర్వ్యూ)తో 40.98శాతం సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment