రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష రాయనున్న 48,834 మంది అభ్యర్థులు
హైదరాబాద్: ఈ నెల 23న సివిల్స్ ప్రిలిమినరీ-2015 పరీక్షను నిర్వహించేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్సీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 9.5లక్షల మంది ఈ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో తెలంగాణ నుంచి 48,834 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఒక్క హైదరాబాద్‌లోనే 102 కేంతద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఉదయం 9:30 గంటలకు జనరల్‌స్టడీస్ పరీక్ష, మధ్యాహ్నం 2:30 గంటలకు సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్టు పరీక్ష ప్రారంభం కానుంది. పరీక్ష ప్రారంభం అయిన 10 నిమిషాల వరకు కూడా అభ్యర్థులను అనుమతిస్తారు.
బధిరులకు అదనంగా ఒక్కో పేపరుకు 20 నిమిషాల సమయం ఇస్తారు. తెలంగాణలో ఈ పరీక్షలకు పరిశీలకులుగా ఐదుగురు ఐఏఎస్ అధికారులు శర్మన్, గౌరవ్ ఉప్పల్, పాండదాస్, డి.వెంకటేశ్వరరావు, ప్రశాంతిలను నియమించారు. పరీక్షా కేంద్రాల పర్యవేక్షకులు(సూపర్‌వైజర్లు)గా 60 మంది జిల్లా స్థాయి అధికారులను నియమించారు. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష కో ఆర్డినేటర్‌గా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, అసిస్టెంట్ కోఆర్డినేటర్‌గా డీఆర్‌వో అశోక్‌కుమార్ వ్యవహారిస్తున్నారు.
నేడే సివిల్స్ ప్రిలిమ్స్
Published Sun, Aug 23 2015 12:35 AM | Last Updated on Mon, Aug 20 2018 3:09 PM
Advertisement