ఉద్యోగంలో ఎదుగుదలకు ’కెరీర్ ప్లాన్’ | Career plan helps to be grown in job | Sakshi
Sakshi News home page

ఉద్యోగంలో ఎదుగుదలకు ’కెరీర్ ప్లాన్’

Published Sat, Sep 13 2014 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 1:16 PM

ఉద్యోగంలో ఎదుగుదలకు ’కెరీర్ ప్లాన్’

ఉద్యోగంలో ఎదుగుదలకు ’కెరీర్ ప్లాన్’

కొందరు ఉద్యోగులు కార్యాలయంలో కష్టపడి పనిచేస్తుంటారు. అయినా, కెరీర్‌లో ఆశించినంతగా ఎదగలేకపోతుంటారు. చేరినప్పుడు ఏ దశలో ఉన్నారో తర్వాత కూడా అదే దశలో కొనసాగుతుంటారు. తమ స్థానాన్ని మెరుగుపర్చుకోలేక నిరాశ నిస్పృహ లకు లోనవుతుంటారు. చాలా సంస్థలు తమ ఉద్యోగుల కోసం కెరీర్ ప్లాన్‌ను రూపొంది స్తాయి. ఆ ప్రణాళికను సక్రమంగా అనుసరిం చే వారు ఉద్యోగంలో ఉన్నతస్థాయికి చేరుకుం టారు. అయితే, ఇలాంటి ప్లాన్ కంపెనీలో లేకపోతే ఉద్యోగులు తామే సొంతంగా తయారు చేసుకొని, నిజాయతీగా అమలు చేయాలి.   
 
 కెరీర్ లక్ష్యాలు
 మీరు ఇప్పటివరకు సాధించిన విజయాలు, మీకు ఆసక్తి ఉన్న అంశాలను గుర్తించండి. వాటితో ఒక జాబితాను తయారు చేసుకోండి. మీ రంగంలో, మీ విభాగంలో విజయవంతమైన వ్యక్తులు తమ కెరీర్‌ను మలచుకున్న విధానాన్ని అధ్యయనం చేయండి. సక్సెస్ సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు, అర్హతలు, అనుభవాలను గుర్తించి, అర్థం చేసుకోండి. ఉద్యోగంలో మరో స్థాయికి చేరడానికి తక్కువ సమయంలో నేర్చుకోవాల్సిన అంశాలేమిటో తెలుసుకోండి.
 
 మేనేజర్‌తో చర్చించాలి
 మీరు తయారు చేసుకున్న భవిష్యత్తు ప్రణాళికపై కంపెనీ మేనేజర్‌తో చర్చించండి. ప్రస్తుతం మీరు నిర్వర్తిస్తున్న బాధ్యతలు, మీ పనితీరుపై వారి అభిప్రాయం ఏమిటో తెలుసుకోండి. పనితీరును మెరుగుపర్చుకోవడానికి ఏం చేయాలో అడగండి. సంస్థలో పైకి ఎదగడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? అందుకోసం ఏం చేయాలి? అనేదానిపై మేనేజర్‌తో సంప్రదింపులు జరపాలి.
 
 అర్హతలు పెంచుకోవాలి
 సంస్థలో ఉద్యోగులు తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవాలంటే.. అర్హతలు, నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకోవాలి. ఇందుకోసం అవసరమైతే ఏదైనా ప్రొఫెషనల్ ఇన్‌స్టిట్యూట్ లో సంబంధిత కోర్సులో చేరాలి. తగిన శిక్షణ పొందాలి. పనితీరు మెరుగైతే గుర్తింపు తప్పనిసరిగా లభిస్తుంది.
 
 కెరీర్ గ్రోత్ విధానం లేకపోతే
 కంపెనీలో కెరీర్ గ్రోత్ కల్పించేందుకు ఒక విధానమం టూ లేకపోతే.. దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవా ల్సిన పనిలేదు. ఈ సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. వారి నుంచి స్పందన లేకపోతే మానవ వనరుల విభాగం మేనేజర్ తో మాట్లాడాలి. అవసరమైతే యాజమాన్యం దృష్టికి కూడా తీసుకెళ్లాలి. ఉద్యోగంలో ఎదుగుదలకు వీలు కల్పించాలని అభ్యర్థించాలి.  
 
 సమీక్షించుకోండి
 మీ పనితీరు, వ్యవహారశైలి సక్రమంగా ఉన్నప్పటికీ అవకాశాలు లభించకపోతే పరిస్థితిని సమీక్షించుకోండి. మీకు జరుగుతున్న అన్యాయాన్ని పై అధికారులకు తెలియజేయండి.
 
 జాబ్స్, అడ్మిషన్‌‌స అలర్‌‌ట్స
 యూపీఎస్సీ
 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) కింది పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.
 
 పోస్టుల వివరాలు
     అసిస్టెంట్ ఇంజనీర్
 అర్హతలు: సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం అవసరం.
     డిప్యూటీ సూపరింటెండింగ్ ఎపిగ్రఫిస్ట్
 అర్హతలు: తెలుగు/కన్నడం/తమిళం/మలయాళంలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో ఐదేళ్ల అనుభవం ఉండాలి.
     స్పెషలిస్ట్(గ్రేడ్-3)
 అర్హతలు: ఎంబీబీఎస్, సంబంధిత విభాగంలో ఎండీ/డీఎన్‌బీ డిగ్రీ ఉండాలి. మూడేళ్ల క్లినికల్ అనుభవం అవసరం.
     జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్
     అర్హతలు: ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ/ఆర్గానిక్ కెమిస్ట్రీలో             
 మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. కనీసం రెండేళ్ల అనుభవం అవసరం.
     అడిషనల్ గవర్నమెంట్ అడ్వొకేట్
 అర్హతలు: బీఎల్/ఎల్‌ఎల్‌బీ ఉండాలి. సంబంధిత విభాగంలో పదమూడేళ్ల అనుభవం ఉండాలి.
     డిప్యూటీ గవర్నమెంట్ అడ్వొకేట్  
 అర్హతలు: బీఎల్/ఎల్‌ఎల్‌బీ ఉండాలి. సంబంధిత విభాగంలో పదేళ్ల అనుభవం ఉండాలి.
     అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్
 అర్హతలు: ఏదైనా డిగ్రీ లేదా బీఎల్/ఎల్‌ఎల్‌బీ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం ఏడేళ్ల అనుభవం ఉండాలి.
     సీనియర్ వెటర్నరీ ఆఫీసర్
 అర్హతలు: వెటర్నరీ సైన్స్ డిగ్రీ ఉండాలి. కనీసం రెండేళ్ల అనుభవం అవసరం.
     మెడికల్ ఆఫీసర్
 అర్హతలు: ఆయుర్వేద మెడిసిన్‌లో డిగ్రీ ఉండాలి.
 పై అన్ని పోస్టులకు నిర్దేశిత వయోపరిమితి తప్పనిసరిగా ఉండాలి.
 ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా..
 దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా..
 చివరి తేది: అక్టోబర్ 2
 వెబ్‌సైట్: http://upsconline.nic.in/
 
 నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్
 హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (నిమ్స్) సూపర్ స్పెషాలిటీ పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
     ఎంసీహెచ్ (కార్డియోథోరాసిక్ సర్జరీ)
 సీట్ల సంఖ్య: 4, వ్యవధి: మూడేళ్లు.
 అర్హత: జనరల్ సర్జరీలో ఎమ్మెస్/ ఎండీ డిగ్రీ ఉండాలి.
     డీఎం (క్లినికల్ ఫార్మకాలజీ)
 సీట్ల సంఖ్య: 1. వ్యవధి: మూడేళ్లు.
 అర్హత: ఫార్మకాలజీలో ఎండీ/ డీఎన్‌బీ డిగ్రీ ఉండాలి.
 ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా.
 దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: సెప్టెంబరు 20
 వెబ్‌సైట్: http://nims.edu.in
 
 ఐఐటీ-హైదరాబాద్‌లో బిజినెస్ అనలిటిక్స్ ప్రోగ్రాం
 ఐఐటీ-హైదరాబాద్ అడ్వాన్స్‌డ్ బిజినెస్ అనలిటిక్స్ సర్టిఫికెట్ కోర్సులో శిక్షణ ఇవ్వనుంది. సీఎస్‌ఈ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో డిసెంబ రు 24 నుంచి 28వ వరకు ఈ శిక్షణ కార్య క్రమం నిర్వహించనున్నారు. అనలిటిక్స్‌పై అప్‌గ్రేడ్ నాలెడ్జ్‌ను కోర్సులో బోధిస్తారు. బిజినెస్ అనలిటిక్స్‌కు ప్రస్తుతం ఇన్సూరెన్స్, మెడికల్, క్రెడిట్ ఇండస్ట్రీస్, ఆన్‌లైన్ షాపింగ్, రిటైల్ ఇండస్ట్రీలో డిమాండ్ ఉంది. కోర్సులో భాగంగా ఫ్రీ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్, స్టాటిస్టికల్ కంప్యూటింగ్, గ్రాఫిక్స్ వంటి అంశాలపై శిక్షణనిస్తామని నిర్వాహకులు తెలిపారు.  
  వెబ్‌సైట్: www.iith.ac.in/BA2014Dec/
 
 పోటీ పరీక్షల్లో పాలిటీలో అత్యధిక స్కోర్ సాధించడం ఎలా?
 - ఎస్.సుధీర్‌కుమార్, తార్నాక
 ప్రతి పోటీ పరీక్షలో పాలిటీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. అభ్యర్థి విజయాన్ని నిర్దేశించడం లో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. ఇండియన్ పాలిటీపై అవగాహన పెంచుకోవాలంటే సబ్జెక్ట్‌ను విశ్లేషణాత్మకంగా, లోతుగా అధ్యయనం చేయాలి. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రపై అవగాహన పెంచుకోవాలి. ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని చదువుతున్నప్పుడు వర్తమాన అంశాలకు అన్వయిస్తూ, తులనాత్మకంగా చదవాలి.
 
 ఉదాహరణకు పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు మంత్రి మండలి సలహా మేరకు అధికరణం 123 ప్రకారం రాష్ర్టపతి ఆర్డినెన్‌‌స జారీ చేస్తారు. ఇటీవల ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే విషయంలో ఈ విధానాన్ని అనుసరించారు. ఈ నేపథ్యంలో రాష్ర్టపతి  ఆర్డినెన్‌‌స ఏవిధంగా జారీచేశారు? దీంట్లో మంత్రి మండలి పాత్ర ఏమిటి? అది తర్వాత  చట్టంగా ఎలా మారింది? పార్లమెంట్ పాత్ర ఏమిటి? ఆర్డినెన్‌‌స గరిష్ఠ కాలపరిమితి ఎంత? తదితర అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఇండియన్ పాలిటీకి సంబంధించి రాజ్యాంగ రూపకల్పన, లక్షణాలు; ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు; కేంద్ర కార్యనిర్వాహక, శాసన నిర్మాణ, న్యాయ వ్యవస్థలు; రాష్ర్ట ప్ర భుత్వం; కేంద్ర, రాష్ర్ట సంబంధాలు; స్థానిక ప్రభుత్వాలు; రాజకీయ పార్టీలు; ఎన్నికల సంస్కరణలు; వివిధ సంస్థలు మొదలైన అంశాలపై అవగాహన ఉండటం తప్పనిసరి. సబ్జెక్ట్‌ను క్రమ పద్ధతిలో, లోతుగా  అధ్యయనం చేస్తే పోటీ పరీక్షల్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు.
 ఇన్‌పుట్స్: కె. కాంతారెడ్డి,
  సీనియర్ ఫ్యాకల్టీ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement