
న్యూఢిల్లీ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. 2020 సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షల షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేసింది. అక్టోబర్ 4వ తేదీన రెండు పరీక్షలు జరుగుతాయని ప్రకటించింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరీక్షలు, ఇంటర్వ్యూలు ఇప్పట్లో నిర్వహించటం కుదరదని యూపీఎస్సీ పేర్కొంది. ఈ మేరకు సివిల్స్‌తో సహా వివిధ పరీక్షల సవరించిన షెడ్యూల్ వివరాలను ప్రకటించింది. కాగా, మే 31న జరగాల్సిన ప్రిలిమినరీ పరీక్షలు కరోనా నేపథ్యంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే.
పరీక్షల షెడ్యూల్ :
Comments
Please login to add a commentAdd a comment